జోధా అక్బర్ – జ్యోతిష్యం

ఓ సారీ ఖ్వాజా మేర్ ఖ్వాజా పాట అర్ధం వెతుక్కుంటూ నెట్ లో తిరుగుతున్నప్పుడు “యాదృచ్చికంగా” ఓ బ్లాగుకి వెళ్ళాను; జోధా అక్బర్ మీద రాసిన ఈ రివ్యూ చాలా బావుంది.

కానీ ఆ లింకు నేను దగ్గరుంచుకోలేదు. బ్లాగు పేరు గుర్తులేదు. సరే, తెలీనవాళ్ళెవరైనా చదువుకుంటారని ఇవ్వాళ్ళ వెతికి తెచ్చాను.ఇతని మిగిలిన పోస్టులు నేను చదవలేదు.సో వాటి గురించి నాకు తెలీదు.ఈ సినిమా రివ్యూ బలం మీద, అవి కూడా బావుంటాయేమో, మీ టైమును బట్టి మీరు చూడండి. ఇంకెవరన్నా చదివి చెప్పితే నాకు సమయం కలిసొస్తుందేమో!

ఓ సారి నాకు ఎవరో చెప్పారు:

యాదృచ్చికం : అంటే యద్  కి  ఇచ్చికం అని  – యద్ అనేది  మరి విష్ణు సహస్ర నామాల్లోనూ వస్తుంది. అందుకని యద్ అనేది భగవంతుడి పేరే ఔతుందిట! అలా యాదృచ్చికం గా జరగటం అంటే భగవంతుడు తలచినట్టు జరగటం అట!మంధర యాదృచ్చికంగా కైకేయి దగ్గరకి రావటమో,రాముడ్ని పట్టాభిషేకం చెయ్యనున్న విషయం తెలుసుకున్నట్టుగానో  ఉంటుందిటలెండి.

అలాగే అదృష్టం ని మనం లూజుగా లక్ అంటాం; విధిని ఫేట్ అంటాం – వీటికి పాజిటివ్ మీనింగ్స్ ఉన్నాయిట.

దృష్టం – అంటే చూసింది అనుకోండి, అదృష్టం అంటే “చూడనిది” ఔతుంది. సో అదృష్టం కలసిరావటం అంటే మనం చూడని కారణమేదో మనకు కలసి రావటం అన్నమాట!

ఓ విషయం మీద ఎన్ని విషయాలు ప్రభావితం చేస్తున్నాయో మనం ఎలా చెప్పగలం! ఎలా చూడగలం!? చెప్పలేం. చూసినంత వరకే, గ్రహించి నంత వరకే పరిగణించి, మనం ఏదో నిర్ణయించుకోవడమో , పని చేసేయ్యటమో  ఏదో చేస్తాం. అవి కాక వేరేదేదో కలసి రావటం వల్ల, అదృష్టం కలసి వచ్చింది అంటాం!

మానవ చరిత్ర మొత్తం ఇలాంటి అదృష్టాలతోనే నిండిపోయింది! దీన్ని సెరెండిపిటీ అంటారు (దీని ఎటిమాలజీ నాకు తెలీదు)

ఖగోళ శాస్త్రము – జ్యోతీష్యము వేరు వేరు – ఒకటి యాస్ట్రానమీ, ఇంకోటి యాస్ట్రాలజీ.

ఈ యాస్ట్రాలజీ ని నమ్మేవారు – అదృష్టాన్ని నమ్ముతారు - అలా జనాల్లో “అదృష్టం” కి ఉన్న భావనే వేరు!

ఓ శాస్త్రం యొక్క ” ప్రిడిక్టబిలిటీ”  అనేది ఎప్పుడు పైయిల్ ఔతుంది? – తెలీని కారణాల ప్రభావం చేత ధియరీ పైయిల్ ఐనప్పుడు. ఇవే చూడని కారణాలు – అదృష్టం ; జ్యోతిష్యంలో – ఇలాంటి చూడలేని కారణాలెన్నో!? ఓ పోర్టుఫోలియో థియరీ వేసుకుని ప్రజల డబ్బుల్ని ఫండ్ మ్యానేజర్లు ఎలా మ్యానేజ్ చేస్తున్నారు!? వాళ్ళకి ఎన్నో తెలీన విషయాల వల్ల – అదృష్టం వల్ల – కొన్ని కరెక్టౌతాయి. మరి కొన్ని మరీ నష్ట పరుస్తాయి.

జ్యోతీష్యం లో చెప్పిన రాహుకేతువులని “ఛాయాగ్రహాలు” అంటారు. అంటే అవి ఇమాజినరీ -ఊహాజనిత గ్రహాలు అని ఇవ్వాళ్టికి మనం అన్వయించుకో గలిగాంట.

అలా అవి  ఓ “ఇమాజినరీ ప్లానటరీ పాత్స్”  అన్నమాట.  టివిలో ఎవరో ఖగోళం (జ్యోతీష్యం కాదు) చెప్పేటప్పుడు చెప్పారు; ఎప్పుడూ ఎవరో ఒకరు ఏదో ఓటి చెబ్తారు! మనం ఇష్టం ఐతే నమ్ముతాం, లేక పోతే లేదు . అసలు న్యూటన్ , ఐన్ స్టీన్ లు ఏం చెప్పారో మనకి ఏం తెలుసు? మనం చదివినా అర్ధం ఔతాయా!? ఎవడో నాకర్ధమైంది అని చెప్తే నమ్ముతాం గానీ!

అంత ఎందుకండీ! “సత్యం” లో డబ్బే లేదు అని ఒక్కసారన్నా మీరు అనుమానించారా! మీరు కాదు – దాని మీద సైన్ చేసిన డైరెక్టర్లు అనుమానించారా!? ఎవడికి వాడు – నిజమేనేమో, నిజమేనేమో అని నమ్ముతాం కానీ, ఎవడికి తెలిసింది “సత్యం” !? ఓటెయ్యరా మంచి జరుగుద్ది అని చెప్తున్నారు – నమ్మాలా వద్దా!? చదువుకున్న నాకే తెలీటల్లే! మరి అసలు ప్రజాస్వామ్యం అంటే ఏమిటో, మన రాజ్యాంగం అంటే ఏమిటో తెలీని వ్యక్తి ఎలా ఓటేస్తాడు. ఏదో ఓటి నమ్మి ఓటేస్తాడు.

నమ్మకం నమ్మకం నమ్మకం - నమ్మకమే లేకుంటే బ్రతుకేది! (జెమినీ లో ఏదో పాత సీరియల్ పాట!)

సరే ఆ టివీలో ఏం చెప్పారంటే : (ఏమర్ధమైనా, ఇప్పుడు గుర్తుకైతే ఇలా వస్తోంది) :

ఒక వేళ మీరు భూమిని , సూర్యుడిని కలిపే లైను గీసారనుకోండి – ఈ లైను కూడా గుండ్రంగా ఓ సైకిల్ చక్రం పుల్లలాగా తిరుగుతుంటుంది కదా (కాసేపు సూర్యుడు స్థిరంగా ఉన్నాట్టె అర్ధం చేసుకుంటే తప్పులేదు.). ఇప్పుడు భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు కదా - అలాగే సూర్యుడి చుట్టూ తిరుగుతాడు కదా. ఇప్పుడు, భూమి చుట్టూ తిరిగే చంద్రడు – ఈ లైను మీదకి ఒక సారి  “భూమి – చంద్రుడు- సూర్యుడు” గాను , మరోసారి “చంద్రుడు – భూమి -సూర్యుడు” గాను వస్తుంది కదా – అప్పుడేగా గ్రహణాలు వచ్చేవి. అలా భూమికి చుట్టూ చంద్రుని కక్ష్య ఈ లైనుని ఇంటర్సెక్ట్ చేసే పాయింట్లని కలిపితే వచ్చే “పాత్స్” ఆ ఇమాజినరీ ప్లానటరీ పాత్స్ అన్నమాట! తప్పయితే తెలుపండి. మళ్ళీ తెలుసుకుందాం!

విషయాలను ఓవర్ సింప్లిపై చేసి చూసినప్పుడు నాకు వాటిని స్త్రీ, పురుష, నపుంసకాలుగా వర్గీకరించటంలో తప్పు కనపట్టలేదు. మన పురుషాధిక్య సమాజంలో – పురుష లక్షణాలకే ప్రాధాన్యమిచ్చే మనస్తత్వంతో ఆలోచిస్తే – ఆ వర్గీకరణలోనూ అదే భావాన్ని చూస్తారు. అసలు ఏదీ దేనికీ తక్కువ ఎక్కువలు కావు,  సమస్తం సమానమనే  ఓ ఆదర్శ దృక్పదంలో ఆలోచిస్తే - నాకు ప్రపంచంలో విషయాలను ఈ మూడుగా విభజించటంలో తప్పులేదు అనిపిస్తుంది.అలాగే గ్రహాలు స్త్రీ, పురుష, నపుంసకలుగా వర్గీకరించడం – జ్యోతిష్యంలో చెప్పబోయే లక్షణాలకి ఓ  వర్గీకరణకింద అర్ధం చేసుకోవాలేమో! అలాగే వాటిని సరి, బేసి అని, శతృ, మితృలుగానో కూడా వర్గీకరించుకుంటారు. మిగిలిన వర్గీకరణాలు కూడా – అవి ఎలా పుట్టాయో, వాటి ఆంతర్యమేమిటో తెలుసుకొని చూస్తే ఏ గొడవ ఉండదు. అసలు వర్గీకరణ సౌలభ్యం కోసం కానీ, “వర్గీకరణం” ఉంటుందా! అదే “రూల్” ఔతుందా! అసలు వర్గీకరణలేని వర్గీకరణ వ్యవస్థలు ఉన్నాయా, ఉంటే అవి ఎలా ఉపయోగపడ్డాయి. ఈ వర్గీకరణల వల్ల ఎలా ఉపయోగ పడ్డాయి? ఇలా ఓ బోళ్డు ఆలోచన్లు.

అసలు ఈ పురుష, స్త్రీ , నపుంసకాల అర్ధం – మగవాడిలో స్త్రీ లక్షణాలు ఉండవని కాదు; ఆడదానిలో పురుష లక్షణం ఉండదని కాదు. ఖచ్చితంగా ఉంటాయి. (అలా ఉంటాయికాబట్టే – ఓ మగ రాయుడు ఓ ఆడంగితో హాయిగా ఉంటుంది! :) :)   ఈ విషయాన్ని అంగీకరించక పోవడం వల్ల, మితిమీరిని విప్లవ భావాలతో మనుష్యులిప్పుడు హోమో సెక్సుయాలిటీకి వెళ్తున్నారేమో అనిపిస్తుంది నాకు. ఇవి ప్రాథమికంగా ఓ లక్షణాల వర్గీకరణగా తెలుసుకోవాలి అంటాను. (చైనీయులు, దీన్నే -యిన్ యాంగో, డింగ్ డాంగో :) అంటారుటలెండి.)

పురుషుడు – స్త్రీ అనే రెండు వైరుధ్యాల మధ్య జరిగే  “ఆలోచన చర్య” ల వల్ల కొత్త ఆలోచనలు పుడుతాయి -సృష్టించ బడతాయి.(ఇది నా ధియరీ లెండీ!)

కవిత్వాత్మకంగా చంద్రడు పురుషుడు – రేరాజ్ పురుషుడు, సో గొడవలేదు :) ; ఆ చంద్రుని వెన్నలలో జరిగేదే,ఈ వైరుధ్యాల మధ్య ఓ రొమాంటిక్ యుద్దం, పోటీ. ఇందులో చివరికి గెలిచేది రెండూ! పుట్టేది ఓ కొత్త ఆలోచన!

కొత్తదేదో పుట్టడం కోసం మర్డర్లు చేయక్కర్లేదు! రక్తాలు ఏరులై పారక్కర్లేదు. మండే సూరీడు అక్కర్లేదు! :)

జోధా అక్బర్ లో జరిగింది అదే! సినిమా చివర లైన్లు వినమని ఇదివరకు కూడా చెప్పాను.

Explore posts in the same categories: బ్లాగుల గురించి

టాగులు:

You can comment below, or link to this permanent URL from your own site.

ఒక కామెంటు పై “జోధా అక్బర్ – జ్యోతిష్యం”

  1. srikaaram అంటున్నారు:

    Astrology is Aster (Star) + Study. It was originally the study of light and life. Ancient Indian texts talked about Jyoti- Light. Jyotisham is NOT about luck and predictions. Since that section of study within Jyotisham had popular and commercial connotations, it went on to become popular as a predictive science. per se, the Vedanga (from 6 vedangas) known as Jyotisha Sastra is about the study of time, its origin and relationship with light and their influence on human life. It is an encompassing subject. The subject of Astrophysics which is of a recent origin is a part of it!
    Sripati


ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )


Follow

Get every new post delivered to your Inbox.