తెలుగు-మన సినిమా

సంస్కృతి, భాషా అనేవి ఏ ఒక్క సాహిత్యం వల్లో నిలబడవు. ఏ సంస్కృతిలో నుంచి నూతన ఆవిష్కారాలు జరగవో , ఆ సంస్కృతి ఛాందసవాదంలోకో , బానిసత్వంలోకో వెళ్టున్నట్టేనని, అది వెలిగిపోతున్నట్టు కాదని, నా అభిప్రాయాన్ని చెప్పాను.

అదే విధంగా  తెలుగు సినిమానే “మన సినిమా” అని చెప్తూ రాస్తున్న నేను, తెలుగు క్షీణించిపోతే  “మన సినిమా” కూడా ఎందుకు క్షీణించి పోతుందని భయపడుతున్నానో వివరిస్తాను.

నా కోణాల కంటే ముందు, ఓ చిన్న విషయం చెప్పడం అవసరం. తెలుగు సినిమా / ఇండియన్ సినిమా నిజానికి దేదేప్యమానంగా వెలిగి పోతోంది అని కూడా భావించే వాళ్ళు ఉన్నారు; వాళ్ళతో కలసి కూర్చున్నప్పుడు, నాకూ అంతే అనిపిస్తుంది! మనం మంచి సినిమాలు నిజానికి తీస్తున్నాము. కానీ, అది సరిపోదు. మంచి సినిమాల్లో ఎక్కువగా కాపీ సినిమాలే ఉంటున్నాయి. కాపీ సినిమాలు తీయకూడదు అని కాదు, అలాగే అన్నీ ఒరిజినల్ సినిమాలే తీయాలని చెప్పటం లేదు. ఒరిజినాలిటీ ఎలా వస్తుంది? ఎలా కాపీ కొట్టొచ్చు? ఇలాంటివి మరెప్పుడన్నా మాట్లాడుకుందాము. ఇక విషయం లోకి:

ఈ మధ్య ఓ ప్రయాణంలో నేను చూసిన ఓ “టెర్రైన్” చాలా అందంగా అనిపించింది. అన్నీ రాళ్ళూ రప్పలే! చిన్న చిన్న గుట్టలూ, లోయలూ! నేను ట్రైన్లోంచి చూస్తున్నాను. అలాంటి టెర్రైన్లో ఈ మధ్యే వేసిన ఓ నల్ల రోడ్డు – ఎంత దూరం వెళ్ళినా సాగిపోతోంది. చాలా జిగ్ జాగ్ గా, కొండలని చుట్టుకుంటూ, లోయలోకి వెళ్తూ, మళ్ళీ పైకి లేస్తూ సాగిపోతోంది. ఐదు గంటల వేళ ఎండ -    ఎర్ర లైటింగ్, ఎర్ర మట్టిని మరింత అందంగా చూపిస్తోంది. ఎక్కడినించో దూరంలో  సుమో వస్తోంది. నా కిటికిలోంచి దగ్గరగా ఓ ఇన్నోవా వెళ్తోంది. ఇప్పుడు, నాకో విజుయల్ తట్టింది.

దానిలో – ఓ చిన్న రెక్కి విమానంలో ఉన్న నా “కళ్ళ కెమారా” – గాల్లో వెళ్తూ, ఆ టెర్రైన్ ఎత్తుపల్లాల్ని కాప్చర్ చేస్తూ దూరంగా ఉన్న సుమోను చేరింది.

ఇంగ్లీషు సినిమాలు చూసేవారికి ఇదేమంత కొత్త విషయం కాదు. నేను చూసింది చూస్తే గానీ మీకు తెలీదేమో కానీ, ఓ డైరెక్టరు దాన్ని చూసినిప్పుడు ఖచ్చితంగా “తీద్దాం” అనుకుంటాడు. తియ్యడానికి  మార్గం ఏంటి అని ఆలోచిస్తాడు.

నా మనసులో ఉన్న విజుయల్ కి మీరు దగ్గరగా రావడం కోసం ఓ పోలిక చెబ్తాను. “బ్రోకన్‍యారో” లో గ్రాండ్ కాన్యాన్ లో కెమారా తిప్పినట్టుగా నన్నమాట. కానీ నేను చూసిన టెర్రైన్ వేరు, నా మనసులో ఉన్న విజుయల్ వేరు కాబట్టి, ఇది కాపీ కాదు. ఆ టెర్రైన్ చూడంగానే వచ్చిన ఓ ఆలోచన. ఊరికే పోలిక కోసం చెప్పాను.

ఏది ఏమైనా, నా విజుయల్ సాధించడానికి ఓ రెండు / మూడు ఆలోచనలొచ్చాయి నాకు.

1.ఏ డిఫెన్స్ టెక్నాలిజీ వాళ్ళ దగ్గరికో వెళ్ళి, అలాంటి రెక్కి విమానాన్ని తెచ్చుకొని ఈ షాట్ తీయడం.

2.డైరెక్టుగా ఏ అమెరికా నుంచో  ఆ కెమరా- కమ్ -క్రాఫ్ట్ లాంటి పరికరాన్ని దిగుమతి చేసుకోవటం

౩.ఈ టెర్రైన్ని తోచిన విధంగా షూట్ చేసుకొని, ఏ కంప్యూటర్ గ్రాఫిక్స్ తోనో ఆ ఎఫ్ఫెక్ట్ తీసుకురావడం  – దానికి అలాంటి సాఫ్ట్ వేర్లు ఎక్కడ్నుంచో కొనుక్కోవడం – లేక వాటిని కొనుక్కొని ఆ పని చేసి పెట్టే దేశీ, విదేశి కంపెనీలకి ఆ పనిని ఇచ్చేయడం.

బహుశా మనం ఆ రెండో లేక మూడో ఉపాయాలని చేస్తామేమో గానీ, మెదటిది చేయలేమేమో!

నిజానికి మన యూనివర్సిటీల్లోనే ఆటవిడుపుగానో, ఎక్స్ పరిమెంటల్ గానో అలాంటి కెమారా ఫిట్టడ్ రిమోట్ కంట్రోళ్డ్ క్రాఫ్ట్ మన విద్యార్ధులే చేసుంటే, కొంచెం చీప్ గా ఐనా ఈ ఎఫెక్టు సాధించవచ్చునేమో! కానీ మన యూనివర్సిటీ పిల్లలు అలాంటి పనులు చేయరు. మరి మూవీ మేకింగ్ లో ఎక్స్ పరిమెంట్స్ ఎక్కడ్నించీ వస్తాయి?

నిజానికి అది పిల్లల తప్పుగాదు. మన చదువులుగానీ, మన విద్యా సంస్థలుగానీ అలా లేవు. కొంతమందిని అమెరికా పంపించడానికి మాత్రమే మన యూనివర్సిటీలు పనిచేస్తాయి.

ఇలా వెళ్ళే యూత్ అంతా కూడా, ఇక్కడున్నప్పుడు ఇంగ్లీషు సినిమాలు చూద్దాం అని ఎగబడతారు – క్వాలిటీ మూవీస్ కోసం! “తెలుగు” లో ఏమున్నాయి? అంతా చెత్త సినిమాలేగా అనుకుంటారు. అమెరికాకి వెళ్ళాక, కాస్త నాస్టాల్జియా అనిపిచ్చినప్పుడు  మాత్రం ఏ  “బాపు” సినిమాలో, , “విశ్వనాధ్” సినిమాలో చూస్తే సరి! అదీ అక్కడికి వెళ్ళాకే సుమా! ఇప్పుడు  ట్రెండ్ వేరు లెండి. ఈ మార్కెట్ కి మనం సినిమాలు  తీసి పంపిస్తున్నాం. అది కూడా ఇంకా ఆ నాస్టాల్జియా భర్తీ చేయడానికే!! ఇదువరకు లాగా కేవలం తెలివైన వాళ్ళు, మేధావులు మాత్రమే అమెరికాకి వెళ్ళటం లేదు కాబట్టి, ఇప్పుడు సో కాళ్డ్ “మాస్” మూవీస్ కూడా ఎగుమతి చేస్తున్నాం – (దీని వల్లే వెలిగిపోతున్నాం అని కొంతమందికి అనిపిస్తుంది)

మరి ఇక్కడున్న తెలుగువాడికి క్వాలిటీ సినిమాలు వద్దా!!? కావాలి! అందుకేగా – “సీతారామాంజనేయులు ప్రెజెంట్స్ ” భూతాల దీవి” – ఎప్పుడు చూడని గ్రాఫిక్స్ తో, ఒళ్ళు గగుర్పొడిచేలా! “  లేకపోతే “నార్నియా” , లేకపోతే “గాడ్జిల్లా” ! అదేమంటే – మంచి “క్లాస్” ఇంగ్లీషు సినిమాలైతే, క్లాస్ ఆడియన్స్ ఇంగ్లీషులోనే చూసేస్తారు;”మాస్” ఆడియన్స్ కి ఐతే, ఇలాంటి సినిమాలే నచ్చుతాయి – అంటూ ఓ కారణం చెప్తారు; ఎక్జాక్ట్ గా ఇలాంటి కారణాలతోనే, ది సో కాళ్డ్ పేషనేట్ ప్రొడ్యూసర్ అండ్ గ్రేట్ డైరెక్టర్స్ తమ మూడు గ్రాఫిక్స్ సినిమాలని ఇలాంటి కోవలోనే తీసారు. – కావాలంటే మీరే ఆలోచించుకోండి. మేరే నిర్ణయించుకోండి. ఇలా తెలుగువాడి ఇంటలెక్ట్యుయాలిటీ ఇంతేనని నిర్ణయించేసే అధికారం వీళ్ళకెవరిచ్చారు!? ఎన్ని రోజులు తెలుగువాడు ఇలాంటి సినిమాలని చూస్తాడు!?

నిజమే! ఓ పక్కనుంచి క్లాస్ ఆడియన్స్ అందరం, క్వాలిటీ ఇంగ్లీషు సినిమాలు చూద్దాము. తెలుగు వాళ్ళకి మాత్రం ఇలాంటి సినిమాలే చూపిద్దాం – దిస్ ఐ కాల్ అప్ప్రెషన్ – కిల్లింగ్ ది ఇంటలెక్ట్యుయల్ ఇన్స్టింక్ట్ ఇన్ “తెలుగు” ! దీని వల్ల జరిగే నష్టం అవగతమౌతోందా!!!

నా బాధ ఇలాంటి సినిమాలు తీస్తున్నందుకు కాదు – “కేవలం ఇలాంటి సినిమాలే” తీస్తున్నందుకు.

( మరి ఇవన్ని చూస్తున్నప్పుడు సంస్కృతి మారిపోదా!? మన సాహిత్యం చచ్చిపోదా!? మన సంస్కృతిలో పుట్టిన పాత్రలు చచ్చిపోవా!? ఒక వేళ ఏ విదేశీ వాడో మన సాహిత్య పాత్రలతో సినిమా తీస్తే, అది మనం సృష్టించునట్టుగా ఎందుకు తీస్తాడు!? “10,000 బిసి” అన్న సినిమాలాగా తీస్తాడు – అది చూసి, అది రామాయణం బేస్ గా తయారైంది అని చూసి, ఔనౌను అప్పుడు మనం అలాగే ట్రైబెల్స్ మి అని కూడా జనాలు నమ్మేస్తారు  :) ! ఇది కామెడీ కి లెండి – ఆ సినిమా చచ్చేబోరు కొట్టి మొత్తం అసలు ఇంకా చూడలేదు)

మనం “వారి” సినిమాల భౌతికతను తెచ్చుకున్నాము అని సత్యజిత్ రే అంటే, అర్ధం ఏంటో ఈ రేరాజ్ చెబ్తున్నారు. వినండి :

ట్రూ లైజ్ అనే ఇంగ్లీషు సినిమా నిజానికి హిందీలోనూ ఇంగ్లీషులోనూ కూడా ఇండియాలో రిలీజైంది. క్లాస్ ఆడియన్స్, మాస్ ఆడియన్స్ కూడా అర్ధమైనా కాకపోయినా చూసారు. అందులో హీరో దేశం కోసం పోరాడే హీరో! ప్రేమ, కుటుంబం కోసం పరితపిస్తూ, తన సీక్రెట్ సర్వీసెస్ ని భార్యతో కూడా పంచుకోలేక బాధ పడుతుంటాడు; ఇలాంటి హీరో ఓ సందర్భంలో – రన్నింగ్ హెలీ కాఫ్టర్ లోంచి వేళ్ళాడుతూ, రన్నింగ్ ఓపెన్ టాప్ కారులో నుంచి తన భార్యని కాపాడతాడు.

ఆ సీన్ ని మన ఇవివి సత్తిగాడు “అల్లుడా మజాకా” అన్న చిత్రంలో పెట్టుకున్నారు. అందులో హీరో గారు, “అత్తో అత్తమ్మ కూతరో ” అని పాడతారు – ఇంకా చాలా చేస్తారు – నేటివిటీ కోసం, తెలుగు ఆడియన్స్ కోసం, అలాగే వారి కోసమే తమ చెల్లలినో, ఎవరినో, హెలికాఫ్టర్ నుంచి కాపాడతారు!!!!  ఎంత వైవిధ్యం!?!??? ఎంత ఒరిజినాలిటీ!!!

( కాబోయే సీయమ్మేమో – చిరు ఫాన్స్ అంతా నన్ను కొట్టడానికి వస్తారేమో! ముందే చెబ్తున్నాను- నేను చిరంజీవి ఫ్యాన్ నే! నేనూ మీ అందరితో పాటూ చిరంజీవీ గుమ్మడికాయను రుద్దుతూ చేసిన యాక్టింగ్ కి పగలబడి నవ్వి ఎంజాయ్ చేసిన వాడినే! – కానీ నా ఇంటలెక్ట్యుయాలిటీ లెవల్ అంతే నని నిర్ధారించినందుకు మాత్రం నా కోపం చల్లారదు. ఆ రోజుల్లో ఇది తప్పు అని పత్రికలు రాస్తే – “నేను మెసేజ్ లివ్వటానికి సినిమాలు చేయట్లేదు, జనాలని ఎంటర్ టైన్ చేయడానికే తీస్తున్నానని” చెప్పిన పెద్ద మనిషి – నేను కేవలం “అలా” చేస్తేనే ఎంటర్ టైన్ అవ్వగలను అని నిర్ధారించుకున్నందుకు నాకు వచ్చిన కోపం చల్లారలేదు – అని మనవి. పక్కన ట్రూ లైజ్ సినిమాని ఎలా ఎంజాయ్ చేశాం మరి!!!!??; ఆ మాత్రం సినిమాలు తీయడానికి చిన్న యాక్టర్లు, చిన్న బడ్జట్ సినిమాలుకూడా సరిపోవాలిగా!? అందుకే ఇవ్వాళ్ళ నేను రియల్ స్టార్ శ్రీహరి సినిమాలు కూడా ఎంజాయ్ చేస్తాను. దాన్ని ఎవరన్నా చీప్ అంటే చీల్చి చెండాడేస్తాను.)

ఇంకో విషయం చెప్తాను : పవన్ కళ్యాణ్ సొంత కధను పూరి జగన్నాధ్ కి చెప్పి తీయించాడంటారు  – “బద్రి” ; అందులో క్లైమాక్స్ లో ప్రకాష్ రాజ్ పరిగెట్టుకొచ్చి పవన్ కి “తనెళ్ళిపోతోంది” అని చెప్పే సీను  , టూంబ్స్ లోనో ఎక్కడో తీసునట్టుంది…..ఆ సీన్లో  పక్షులు ఎగురుకుంటూ వెళ్తాయి….నిజమైనవి కావు – గ్రాఫిక్స్! మీరెప్పుడైనా గమనించరా! ఎందుకు చేసారు? – ఎఫెక్టు కోసం.  అలాగే సినిమాకి నిజానికి ఆయువు పట్టైన ఇంకో సీను – యాక్టర్ల వల్ల, డైలాగులవల్ల దొబ్బింది అనుకుంటాను – హీరో,  ఇద్దరి హీరోయిన్ల మధ్యన,  ఒక  ఓపెన్ ఫీళ్డ్ లో నిలబడ్డప్పుడ్డు తీస్తారు. బ్యాగ్ గ్రౌండ్ లో మేఘాలు కమ్ముకొస్తున్నట్టుగా ఉంటుంది; ఎలా తీసారు – గ్రాఫిక్స్. ఎందుకు తీసారు?- ఎఫెక్టు కోసం. అలాంటివి ఎక్సపరిమెంటల్ గా చేసుకోవాలన్నా చాలా ఖర్చే! అందుకనే ,  బోళ్డు ఇన్నోవేషన్స్ (నూతన ఆవిష్కారాలు ) తెలుగు జాతిలోనే జరుగుతూ ఉంటే, అలాంటి ప్రయోగాలు చేస్తూ ఉండవచ్చు. దానిలోనించి మరిన్ని కొత్తవి పుడుతాయి. “వారి” సినిమాల్లో తీసిందే తీద్దాం అనే ఆలోచనలోంచి బయట పడి, మనదైన ఐడియా లతో సినిమాలు తీయవచ్చు. మనం ఇంత బానిసల్లాగా ఉండక్కర్లేదేమో!

Explore posts in the same categories: సినిమా రివ్యూలు

Tags:

You can comment below, or link to this permanent URL from your own site.

6 Comments on “తెలుగు-మన సినిమా”

  1. అబ్రకదబ్ర Says:

    కాస్త తీరిగ్గా వ్యాఖ్య రాయాలి. మళ్లీ వస్తా.


  2. వామ్మో, వాయ్యో.. రేరాజా ?(!)?.. కిందకి వచ్ఛి కామెంటేద్దామనుకున్నా.. ఈ లోపు నేను చెప్పాల్సింది అబ్రకదబ్ర కాపీ గొట్టాడు. వీకెండ్ 3 బీర్స్ అనుకుంటూ అలోచించాల్సిందే !!!

  3. అబ్రకదబ్ర Says:

    మన జాతీయ జెండానే కాపీ ఐడియా (నిలువు చారల్ని అడ్డ చారలుగా మార్చటం, ఎరుపుని కాషాయంగా మార్చటం, ఆ మూడు రంగులకీ మనవైన అర్ధాలు చెప్పుకోటం మాత్రం పింగళి వెంకయ్య గారి సృజనాత్మకతే). ఇక కాపీలు కొట్టే దర్శక నిర్మాతల గురించేం చెబుతాం? ప్రేరణ పొందటానికీ, మక్కీకి మక్కీ దించెయ్యటానికీ బోలెడు తేడా ఉంది. కాపీ కొట్టినా, ఆ సంగతి ఒప్పుకుని ఒరిజినల్ కధకుడు/దర్శకుడికి ఇవ్వాల్సిన క్రెడిట్ ఇచ్చేస్తే ఇంతగా ఆక్షేపించనవసరం లేదు. కాపీలు కొట్టి సినిమాలు తీస్తూ పైరసీ గురించి గుండెలు బాదుకునే వీళ్లని చూస్తే నవ్వాలో ఏడవాలో తెలీదు నాకు. సరే, అది వేరే కత.

    మనోళ్లలోనూ మంచి సినిమాలు తీసేవాళ్లు లేకపోలేదు. దురదృష్టవశాత్తూ వీళ్లు మైనారిటీలు. ఆ మధ్యొచ్చిన ‘రాగం’ సినిమాలో ఓ అద్భుతమైన షాట్ చూశాను. అందులో కధానాయకుడికి సంగీతకారుడిగా పేరు తెచ్చుకోవాలనే కోరిక. అతని తండ్రి పల్లెటూర్లో ఓ మోతుబరి రైతు. తండ్రికి కొడుకు ఆలోచనలు నచ్చవు. కొడుకు కూడా తనలాగే వ్యవసాయం చేసుకుంటే బాగుంటుందని తండ్రి అభిప్రాయం. ఈ విషయమై వీళ్లిద్దరికీ సంవాదం జరిగే సన్నివేశం ఒకటొస్తుంది సినిమాలో. పొలంలో జరుగుతుందిది. కొంత వాదన తర్వాత ‘నా దారి నాదే’ అని చెప్పి కొడుకు వెళ్లిపోతాడు. తండ్రేమో కోపంగా ట్రాక్టరెక్కి పొలం దున్నటం మొదలు పెడతాడు. ఆ షాట్ bird’s eye angleలో తీశారు. ఫ్రేమ్‌లో నుండి వెళ్లిపోతున్న కొడుకు, ఫ్రేమ్ మధ్యలో వృత్తాకారంలో తిరుగుతూ పొలం దున్నుతన్న ట్రాక్టర్‌లో తండ్రి. How thoughtful! ఓ చట్రంలో ఇరుక్కుపోయి అందులోనే తిరుగుతున్న తండ్రి, ఆ చట్రంలోనుండి బయటికెళ్లిపోతున్న కొడుకు. రెండే సెకండ్ల షాట్‌లో రెండు పేజీల డైలాగులు సైతం చెప్పలేని భావం.

    సమస్యేమిటంటే – చాలా మంది నవ యువ దర్శకులకి ఇంతగా ఆలోచించగలిగే సృజనాత్మకత లేదు. తెలుగు సినిమాలకే వస్తే – యువ దర్శకులకి తెలిసింది రెండే రెండు ఫార్ములాలు. కధానాయకుడెవడనేదాన్ని బట్టి కధల్లుకుంటారు వీళ్లు. ఛోటా మోటా హీరో ఐతే లవ్ స్టోరీ, బడా హీరో ఐతే ఫ్యాక్షన్ పగల కథ. ఇంతే. ఓ బేస్ స్టోరీ అనుకున్నాక, ఇక అందులో అరగంటకో పాటనెలా పొదగాలి, ఫైట్లెక్కడ పెట్టాలి, ఇంటర్వల్ బ్యాంగ్ ఎలా ఉండాలి, కామెడీ ట్రాక్ ఎలా ఉండాలి, హీరో ఇంట్రడక్షన్ సీన్ ఎంత భీభత్సకరంగా ఉండాలి, సూమోల ఫైట్ ఎక్కడ పెట్టాలి .. ఇవి – వాళ్లు ‘కధ మీద కూర్చుని’ వండే విషయాలు. మన సినీ వనంలో అప్పుడప్పుడూ ఏలేటి చంద్రశేఖర్ లాంటి తులసి మొక్కలూ మొలకెత్తుతుంటాయి కానీ మొత్తమ్మీద కొత్త దర్శకుల ఆలోచన్లెక్కువగా ఇలాగే అఘోరిస్తుంటాయి.

    తెలుగు సినీ దర్శకులెవరన్నా పై రెండు పేరాలూ చదివితే ఒకటే మాటంటారు: ‘విమర్శలు చెయ్యటం ఈజీయే. అంత గొప్పగా shot by shot ఆలోచించి తీసిన రాగం బతుకు బాక్సాఫీసు దగ్గరేమయింది? నీ లాంటి ఒకరిద్దరి మాత్రం అర్ధమయ్యే సినిమా తీసి చేతులు కాల్చుకోవాలా, లేక మాస్ కి నచ్చే సినిమా తీసి నాలుగు డబ్బులు వెనకేసుకోవా?’

    చెత్త ప్రశ్న. ‘మాస్‌కి అర్ధమయ్యేది’ అని వాళ్లనుకుని తీస్తున్న సినిమాల్లో ఎన్ని ఆడుతున్నాయి? క్లాస్ సినిమాలుగా సినీవాలాలు ముద్రేసేసినవెన్ని బ్రహ్మాండమైన మాస్ హిట్స్ కాలేదు? ‘మాస్, మాస్’ అంటూ ఓ వర్గం ప్రేక్షకుల తెలివితేటల్ని తక్కువ చేసి చూసే వీళ్ల తెలివితేటల్నేమనాలి?

    సరే. మాస్ కధా, క్లాస్ కధా అన్న సంగతి పక్కన పెడదాం. ఎటువంటి కధాంశమైనా సరిగా తీస్తే ఎందుకు ఆడదు? ‘అతడు’ పెద్ద ఉదాహరణ. అది క్లాస్ సినిమా కాదే. అలాగని మాస్ సినిమా కూడా కాదు. అసలు సిసలు వాణిజ్య దృష్టితో తీసిన వినోదాత్మక సినిమా – entertainer. సమస్యేమిటంటే, అందరు దర్శకులూ త్రివిక్రమ్ శ్రీనివాస్‌లు కారు. అసలు – మన దర్శకుల్లో జూమ్ ఎక్కడ వాడాలో, ఎలా వాడాలో తెలిసినోళ్లెందరు? ఉందికదా అని ఊరికే జూమ్ కుమ్మెయ్యటమే కానీ డాలీ వెయ్యాల్సిన షాట్లేవో, పాన్ చెయ్యాల్సిన షాట్లేవో కూడా తెలీనోళ్లు దర్శకులు!

    ఇక ఎడిటింగ్ దగ్గరకొద్దాం. ఎడిటింగ్ అంటే కధని ఓ పద్ధతిగా అతకటం మాత్రమే అనేది ఇప్పటికీ చాలామంది దర్శకుల అభిప్రాయం అని నాకనిపిస్తుంది. దర్శకులే పనిలో పనిగా ఎడిటింగ్ కూడా చేసి పారెయ్యటం ఎన్ని సార్లు చూడలేదు? ఎడిటింగ్ అనేదో ప్రత్యేక స్కిల్ అనేది వీళ్లకి తెలుసా? (మార్తాండ్ కె. వెంకటేష్ అనబడే ప్రసిద్ధ ఎడిటర్ గారున్నారు. నిమిషం నిడివున్న సీన్లో రెండొందల యాభై షాట్లు ముక్కలు చెక్కలుగా అతకటమే ఎడిటింగ్ అనుకుంటాడీయన)

    ఇక, నటీ నటుల ప్రతిభ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కారక్టర్ ఆర్టిస్టులు, ఉన్నంతలో కమెడియన్లని ఎత్తేస్తే – కధానాయకులు, నాయికలకి నటనలో ఓనమాలే రావు. కొందరికి భాష కూడా రాదు.

    రాసుకుంటూ పోతే మీ టపాని మించి పోయేటట్లుంది నా వ్యాఖ్య నిడివి. ఇక ఇంతటితో ఆపేస్తున్నా.


  4. ఇప్పుడర్జంటుగా రాగం సినిమా ఎక్కడ దొరుకుతుందో పట్టుకోవాలి.

    ప్రసాదం

  5. rayraj Says:

    @అబ్రకదబ్ర : కరెక్ట్! అందుకే నా బ్లాగు అలా నడుస్తూనే ఉంది. కానీ మీ వల్ల నా ఆలోచనలని ఇక్కడ సంక్షిప్తంగా రాయగలగుతున్నాను.

    1. ‘మాస్‌కి అర్ధమయ్యేది’ ఇదే అని నిర్ధారిస్తున్న వాళ్ళే నిజానికి సృజనాత్మకత లేని వాళ్ళు!

    2. ఫైయూల్యూర్ ఎలాగైనా రావచ్చు కాబట్టి,దానికి భయపడి ప్రయోగాత్మకంగా ఉండటం మానేయ కూడదు.

    ౩. సృజనాత్మకత అన్ని రంగాల్లోనూ వస్తేనే, మొత్తం వాతావరణంలోనో మార్పు వస్తుంది – తద్వారా జాతి మరింత పురోగమిస్తుంది.

    We need a cultural change – that does not mean we don’t have a culture. That Does not mean we have to copy everything from some other culture. We need to be creative; Find creative and innovative solutions to our own problems and thus create opportunities!

    అబ్రకదబ్ర గారూ! మీ నానో వ్యాసం మీద నేను అడిగింది అదే! మీ విమర్శ అద్భుతం. కానీ సమస్యకు పరిష్కారాలు సృజనాత్మకంగా రావాలి అని చెప్పాలి అన్నదే నా భావం. దాని గురించి, ప్రతి జాతికి మార్గ నిర్దేశనం చేసిన వ్యక్తి ఈ సృజనాత్మకత కోసం “యువత నడుం బిగించాలి” అంటూ పిలుపునిచ్చారు. సెల్ఫ్ బాషింగ్ ఈజ్ నో యూజ్! అందుకే మీరిచ్చిన సమస్యలలో ఒక సమస్య కొత్తగా వచ్చేదని, మిగిలిన సమస్యలకి నానోని ఓ సమాధానంగా ప్రయత్నించ వచ్చని చెప్పాను.

    ఒబమా ఏం చెప్తున్నాడు – “యస్ వి కాన్” అంటున్నాడు – కాపీ కొట్టాల్సి వస్తే, ఆ స్పిరిట్ ని కొట్టాలి కానీ, ఆ వాక్యాన్ని కాదు.

    @మహేష్ :
    “ఐతే ఇప్పుడు ఎలా!?! ” – అదీ సరియైన ప్రశ్న. కానీ దీనికి సమాధానం నేను చెప్పలేను. ఇందుకే చెప్పాను – “ఇట్ ఈజ్ నాట్ నోన్ యట్! ది ఎంక్వైరీ మస్ట్ గో ఆన్!” అని.

    అదే నిరంతర శోధన – మీ బ్లాగు కాప్షన్ నాకు నచ్చింది!

    ఇన్నోవేషన్స్ ఎలా వస్తాయి అంటే దానికి ఓ సమాధానం ఇంత వరకు ఎవరూ చెప్పలేదు ; బహుశా చెప్పలేరు. ప్రయత్నిస్తూ ఉంటే, ప్రయోగాత్మకంగా ఉంటే వస్తాయి అన్నంత వరకు చెప్పగలం.

    దాని కోసమే, ముందు తెలుగువాడు “తెలుగు” భాషని తన ఐడెంటిటీ అని అంగీకరస్తే, ప్రతి తెలుగువాడిని ఒక సాంస్కృతిక మార్పు కోసం కాంట్రీబ్యూట్ చేయమని చెప్పవచ్చు. వాడి గుర్తింపు కోసం వాడినుండే పుట్టే ప్రతి ఆలోచన ( అన్ని రంగాల్లోనూ) తెలుగులో చెప్పాలి అని నిర్ణయించుకోవాలి. దానికి కావాల్సిందే ఓ “అంగీకారాత్మక దృక్పదం” ;
    (ఇక్కడ తెలుగుజాతికి తెలుగు భాషే ఐడెంటిటీ అని నా అబిప్రాయం. తెలుగు సినిమా అన్నప్పుడు మరి అది తెలుగుజాతి దేగా! కానీ నిజానికి మనకున్న మళ్టిపుల్ ఐడెంటిటీస్ లో , దేన్నించైనా ఈ ఏకత్వాన్ని సాధించవచ్చు అని కూడా నా అభిప్రాయం.)


Comment: