ఇది మాయే అన్నది నిజమైతే

ఇది మాయే అన్నది నిజమైతే
ఇది అంతా నాలో భ్రమ అయితే
ఇవి అన్నీ నాలో కలలైతే
 
నేనెన్నడు నిద్దుర లేస్తానో
నేనన్నది ఎన్నడు చూస్తానో              ||ఇది మాయే అన్నది నిజమైతే||
 
నాలోనె నీవున్నావో
నీలోనే నేనున్నానో
నీవే నేనై ఉన్నావో
నేనే నీవై ఉన్నానో
 
ఇది ఎన్నటికీ తరగని తర్కం
అది ఎందరికో అందని తత్వం
ఇందేదైనాగానీ సత్యం
మారక ఉంటుందది నిత్యం            ||ఇది మాయే అన్నది నిజమైతే||

ఎట్టఎదుటదీ ప్రపంచం
కట్టకడపటిది కైవల్యం
అనేశాడే అన్నమయ
మరి దానికెందుకీ తిప్పలయా
 
చెబుతానోయ్ నీకోవిషయం
నువ్వినుకోవోయ్ సరిగా ఓ రామం
 
నీవులేక నేనూ లేనూ
నేను లేక నీవూ లేవు
అనిఅన్నాడే ఓ సినిమా కవి
అదిగదిగో అదే నా మనవి                 ||ఇది మాయే అన్నది నిజమైతే||

ప్రకటనలు
Explore posts in the same categories: నా కవితలు/పాటలు

స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: