నీ అందం

నీ అందం తడిసిన తెల్ల గులాబీల వాన
నీ చూపే గరిక రేకుల అంచు
నీ నవ్వే విరిసిన గోరింట పువ్వులె
నీ తోడుంటే పూదోటే ఈ జీవితం
 
నీకు తెలుసు ఆ పని చేస్తే
నేను ఏమౌతానో
నీకు తెలుసు ఆ పని చేస్తే
నేను ఏమౌతానో
తెలిసే చెప్పావు
నీ కోసమే చేశాను
తెలిసే నువు చెప్పావు
నీ కోసమే చేశాను
కరిగిపోయనులే
ఆ పాపం నీ ప్రేమలో                               ||నీ అందం||
 
నా తోటంత రేగు పొదలు
నా చేతులు ఎండిన తాటి రేకులు
నా కళ్ళు గట్టుదాటిన కోనేళ్ళు
నా కళ్ళు గట్టుదాటిన కోనేళ్ళు
నీ పాదాలు చేరేందుకె పరవళ్ళూ              
నీ పాదాలు చేరేందుకె పరవళ్ళూ            ||నీ అందం|| 

 
నా నోటి నుండి రాలు ఈ మందారాలు
నా ఒళ్ళంత విరబూసె మోదుగ పూలు
ఎరుపెక్కినీ కాగితం పూలూ
ఎరుపెక్కినీ కాగితం పూలూ
ఇవె నీ కోసం నే నివ్వ గలిగే పూలూ
ఇవె నీ కోసం నే నివ్వ గలిగే పూలు                      ||నీ అందం||

ప్రకటనలు
Explore posts in the same categories: నా కవితలు/పాటలు

ట్యాగులు: , , , , , ,

You can comment below, or link to this permanent URL from your own site.

స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: