మరుపు

మరువకురా మరుపన్నది మనిషికున్న వరం
మరచిపోరా మనసుకైన మాయని గాయం                          “మ”

పరుషమైన పరులమాట
పరువు తీసెనంటునువ్వు
పగలు రేయి వగచి విలచి
విసిగి కసరి కసిగ విసిరి
కలను కాల్చి ఇలను మాడ్చి మసిచేయకురా                      “మ”

పొరపాటున వరియించిన విలువలేని విజయం
వలవేసే వలపించే పడతిలోని పరువం
తెలియలేరు ప్రజలందరు కృషిలో కలదానందం
తెలుసునాకు లేదు నీకు ఓటమిలో విషాదం
గెలిచినోడి కొంటెచూపు గుండెకోసి చేసె గాయం
ప్రేమించిన దాశించిన దందలేక  విచారం                             “మ”

విధివంచన తగిలించిన అడియాశల భారం
మోయలేక సాగలేవు మరి ముందుకు దూరం
చూసినంతకన్న మిన్న కలదు మనకు లోకం
నవమన్మధ రూపమొందు మరుపులోన మరుజన్మం
నవజీన శైలిలోన సృజియించును నవ స్వర్గం                     “మ”

ప్రకటనలు
Explore posts in the same categories: నా కవితలు/పాటలు

ట్యాగులు: , , , , , ,

You can comment below, or link to this permanent URL from your own site.

స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s


%d bloggers like this: