క్షణమైనా

క్షణమైనా కనులు కలవనీ
క్షణమైనా  దరికి చేరనీ
క్షణమైనా నిరీక్షణలో యుగములే
క్షణమైనా……

నినుచేరిన ఇన్నాళ్ళకి తెలిసె
నేనెళ్ళో ఊహించిన చెలివె
పరిచయమపుడే నీకిది తెలుసె
చేరువనుంచిక ఊరించకులే
తెలియకనే ప్రేమించానని
తెలియగనే పిలిచా వేచి చూడక
క్షణమైనా…..

క్షణమైనా కనులు కలవనీ
క్షణమైనా  దరికి చేరనీ
క్షణమైనా నిరీక్షణలో యుగములే
క్షణమైనా…..

పున్నమి జాబిలి చల్లని వెన్నెల
చలిగిలిగింతలు చెలికౌగిలిలూ
కవులెందరినో కవ్వించెనులే
విరహముతో దహించెడి ప్రేమను
నాతరమా సహించుటలే
క్షణమైనా …….

క్షణమైనా కనులు కలవనీ
క్షణమైనా  దరికి చేరనీ
క్షణమైనా నిరీక్షణలో యుగములే
క్షణమైనా…….

Explore posts in the same categories: నా కవితలు/పాటలు

ట్యాగులు:

You can comment below, or link to this permanent URL from your own site.

వ్యాఖ్యానించండి