హిందీలో “గజిని”

నిన్న హిందీలో “గజిని” ప్రీమియర్ చూశాను.

ముఖ్యంగా నాకు అర్ధంగానిదేంటంటే, ఫ్రేం టు ఫ్రేం మళ్ళా దాన్నే తీసే ఓపిక డైరెక్టర్‌కి ఎలా ఉంటుంది అని! ( ఇదే ఇన్స్‌పిరేషన్‌తో నా బ్లాగ్‌లో కూడా నా కవితలు / ఫాటల సెక్షన్‌ని అప్డేట్ చేశా, దాన్ని కూడా చూడండి. ప్లీజ్! )
 
సినిమా అయితే బానే ఉంది. తెలుగు, తమిళంలలో  చూసిన సౌత్ ఇండియన్స్ కి, మళ్ళా పాత గజినిని చూసినట్టే  ఉంటుంది. అఫ్కోర్స్ , క్లైమాక్స్‌లో మార్పులు బావున్నాయి.అయినా ఓ సారి చూసేసిన జనానికి కొంచం సాచివేతగా ఉంటుందేమో అని.

నా ఉద్దేశ్యం తెలుగు తమిళంలలో కూడా ఇదే క్లైమాక్స్ తీసేస్తే అయిపోయేది.తెలుగు వెర్షన్‌లో , చివర్లో ‘డబల్ ఫోజు – గజినీ”  రావటాం  కొంచెం చిరాగ్గా, అతిగానే ఉంటుంది. హిందీలో అలా కాకుండా, విలన్ “రీ ప్లే” చేస్తుంటే, ఈ సారీ హీరో కక్ష్య సాధించుకున్న వాడవుతాడు.
కాభాట్టి ఓవరాల్‌గా విషయం ఏంటంటే, హిందీలో మొదటిసారిగా చూసే జనానికి ఖచ్చితంగా బావుంటుంది. ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అంతంగా అకట్టుకోలేదు. బాలేదు అని చెప్పలేం. కానీ, తెలుగు తమిళంలలోని పాటలు ఇంకా బావున్నాయి. మరి వాటిని మించినట్టుగా అనిపించవు గదా!;  బాక్ గ్రౌండ్ స్కోర్ విషయమైనా అంతే! సో ప్రత్యేకంగా పొగడలేం. (నేను ఏ ఆర్ రెహ్మాన్ ఫ్యాన్ అయినా కూడా)

తీసిన విధానంలో కొన్ని మార్పులతో, డైరెక్టర్ మళ్ళా సేం టు సేం అదే తీసినా, ఇంకా మెరుగైన విధంగా తీసానన్న తృప్తి పొందటానికి, మెరుగైన  ప్రాడక్టని చెప్పుకోటానికి,తగ్గ కారణాలున్నాయి.సెకండ్ హాఫ్‌లోని  శాడ్‌సాంగ్  చిత్రీకరణలో  అది కొట్టొచ్చినట్టు కనబడుతుంది.

మరో విధంగా చెప్పాలంటే,  “శివ”ని మళ్ళా తీసిన రాం గోపాల్ వర్మలాగా చెడదొబ్బలేదుగా! అలా చేసినప్పుడు దానికి హాయిగా  వేరే టైటిల్ పెడితే ఇంకో సినిమా అనుకొని కొద్దిగానైనా చూడ గలుగుతాం. “క్షణ క్ష ణం”  బాగా హిట్టైయినా కూడా, “అనగనగా ఒక రోజు”,”దౌడ్”,”జంగిల్” , అంటూ తీస్తే జనాలు చూడ్లేదు! గాడ్ ఫాదర్ స్టోరీ తెలిసినా , “గాయం”,”సర్కార్”,”సర్కార్ రాజ్” అంటూ జనాలు చూడలేదు!అలా అనమాట.
 సీక్వెల్‌కి, రీమేక్‌కి ఏంటి లక్ష్యం అంటే “టు హ్యావ్ ది ఫన్ ఎగైన్” అనో , లేక “టు కంటిన్యూ ది ఫన్ ఫర్ లాంగర్ టైం” అనో అన్నాడు రాము వాడి భ్లాగులో. ఆ యాంగిల్‌లో అయితే “గజినీ” విజయం సాధించినట్టే!

పోతే అమిర్ ఖాన్ భాగా చేసినా,పై చెప్పినా “ఫన్” అంతా ఇచ్చినా, సూర్యని మరిపించాడు అనలేం. మన అసలు విలన్ గజిని కూడా తెలుగులోనే బెటరు అనిపించింది, వాడు హిందీ వాడయినా.

జియా ఖాన్ మాత్రం నయనతారని మరిపించేస్తుంది.(ఆ సినిమాలో నయనతారకూడా మరీ బండగా ఉందిగా!).

మళ్ళా ఛూసినా “ఆసిన్” రిఫ్రెషింగ్ గా ఉంది. కథ నిజానికి రంజుగా సాగాటానికి ఫస్ట్ హాఫ్‌లో రక్తి కట్టిన ప్రేమ కథేనని మురుగదాసన్ బాగా గుర్తించినట్టున్నాడు. ఆ బిగువు జారనివ్వలేదు. ఎంత టెక్నికల్‌గా బాగా తీసినా ఎమోషన్ అండ్ లవ్ ని జాగ్రత్తగా కాపాడుతూ సినిమా తీస్తేనే జనాదరణని పొందుతాయి అనటానికి నా దగ్గర కొన్ని సాక్ష్యాలున్నాయి. దీని వల్ల కూడా ఈ సినిమా హిట్టే.

కాక మార్కేటింగ్లో కాకలు తీరిన అల్లు స్ట్రటజీలు  పంజేస్తున్నాయి. నెక్స్ట్ లెవల్ కి ఎదుగుతున్నట్టే ఉంది. మరి రాజకీయం, సినిమా నిర్మాణం రెండూ ఎలా నెట్టుకొస్తారో, లేక  మున్ముందు ఒకటి వదిలేస్తారో తెలీదు కానీ, “గజనీ” మాత్రం మళ్ళా హిట్టే.

ప్రకటనలు
Explore posts in the same categories: సినిమా రివ్యూలు

ట్యాగులు: , , , , , , , , , ,

You can comment below, or link to this permanent URL from your own site.

స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s


%d bloggers like this: