బ్యాలెన్స్ లేని కృష్ణవంశీ

శశి రేఖా పరిణాయం review  రాయలని!
బావుంది – బాగోలేదు. ఓకె ఓవరాల్‌గా బానేఉంది. దాదాపు అన్ని కృష్ణవంశీ సినిమాల మీద నాకు ఇదే భావన. మరేం రాయాలి!!

“మంచిగా నడిచే సినిమాలో చాలా బ్యాలెన్స్ ఔట్ అయిపోతాడు.వాడి పాత్రలు కూడా అంతే!” అన్నాన్నేను.
“అదేంటి! వాడి  స్ట్రాంగ్ పాయింటే క్యారెక్టరైజేషన్ కదా!” అన్నాడు నా మిత్రుడొకడు.”టేకింగ్ లో వాడిని మించిన వాళ్ళున్నారు.అంత గొప్పగా తీసిందేంటో! ” అంటాడు.

” రాం గోపాల్ వర్మ కంటే కూడా వీడే గ్రేట్! వీడు టచ్ చేసినన్ని సబ్జెక్ట్లు వాడికేవిరా! !” చాలా రోజుల క్రితమే అన్నాడు మరొక మిత్రుడు.

రెండూ నిజమే ననిపించింది. కానీ నాకు ఇంకా అసంతృప్తిగానే ఉంది.

రాం  కంటే వివిధ కధా వస్తువులెంచుకోవటంలో కృష్ణవంశీ ఖచ్చితంగా గొప్పే!కానీ కొన్ని మంచి స్నేహాలు దీనికి కారణమేమోనని నాకనిపిస్తుంది. (రాం తన లిమిటేడ్ సబ్జెక్ట్స్‌ని ఆల్రెడీ తన బ్లాగులో ఏకరువు పెట్టాడు ఎలాగూ!?)

విషయానికొస్తే, ఈ సినిమా కధానయిక “శశిరేఖ” (జెనీలియా), తన ప్రమేయం లేకుండానే పెళ్ళి నిశ్చయం అయితే, ఇష్టంలేని పెళ్ళిచేసుకోలేక, నిలబడి ఎదిరించలేక, ఇంటి నుంచి పారిపోతుంది.కనీసం పెళ్ళికొడుకును కూడా చూడదు.చూపించే ప్రయత్నం పెద్దగా జరగదు. అందుకని, పారిపోతుంటే దారి పొడువునా కాపాడుతూ వస్తున్న హీరో తరుణ్ యే ఆ అసలు పెళ్ళికొడుకు అని తెలుసుకోలేదు.దారిలో ఆ అమ్మాయి వ్యక్తిత్వం చూసిన హీరో, నిజం చెప్పలేడు.హీరో వ్యక్తిత్వాన్ని దారి పొడవునా చూసి, మెచ్చి, తనకి నిజం తెలియక ముందే, తను ఇక బతకనేమోనని, తన ఇష్టాన్ని తెలియబరుస్తుంది. క్లైమాక్సులో కధ సుఖాంతం అవుతుంది. వెరైటీగా ఒక పాటతో!

“స్వాతి”లో ఈ స్టోరీలైన్‌కి,  “రన్ అవే బ్రైడ్”, “జబ్ వి మెట్” అంటూ ప్రేరక చిత్రాలు గుర్తుచేశారు. తెలుగుదనం నేటివిటీతో  బావుందనొచ్చన్నారు.

నిజమవ్వచ్చు. అలా నేటివిటీ సృష్టించడంలోనే కంపవుతుండొచ్చు.(కొందరికి ఏదన్నా నచ్చితే, అది కాపీ అయ్యుంటుందని నిర్ధారించుకుంటారుట!.కోతి కొమ్మొచ్చిలో ముళ్ళపూడి రమణ గారు రాశారు.)

కానీ  నాకు ఇంకా చాలా అనిపించాయి.
ఉదా: “ఈమాట.కాం” లో పోయిన సంచికలో ప్రచురితమైన ” కుతంత్రం” కధ.
లేదా కొన్ని నవలల్లో యద్దనపూడి హీరోయిన్‌లా!
లేదా ప్రైడ్ అండ్ ప్రెజ్యుడీస్ లో లా!
లేదా బ్రైడ్ అండ్ ప్రెజ్యుడిస్ లో ఐస్వర్య రాయ్ లా!

కాకపోతే  పెంకితనమూ, ఆత్మాభిమానమూ కలిసుండాలి. ఇది కృష్ణవంశీ అనుకున్న శశిరేఖ పాత్ర అని నేననుకోవడాం.

ఇహ బ్యాలెన్స్ ఔట్  అవ్వడం అంటే ఏమిటో చెప్పడానికి ట్రై చేస్తా :

1 .ఇష్టంలేకుండా పెళ్ళి చేయబోయే తండ్రి పాత్ర చాలా ఛండాలంగా బూతులు మాట్లాడుతూ, బండ బూతులు తిడుతూ, పెళ్ళాంని కాలితో తంతూ, కొట్టే పాత్ర.. కానీ  అదేమిటో ఈ పాత్ర “కూతురు”ని ఎప్పుడూ “కొట్ట” ని పాత్ర! ఇలాంటి వాతావరణంలోంచి వచ్చిన హీరోయిన్‌కి, ఇన్నాక చెప్పిన కధల్లోలాంటి హీరోయిన్ పాత్ర రంగు పులమటం నాకు చాలా “ప్యాచీ వర్క్” లా ఉంటుంది.

I know I have failed to exlain, Perhaps, I felt ఆహుతి ప్రసాద్ పాత్ర కేవలం ఓ రకమైన మాస్ అప్పీల్ కోసమే కానీ. ఈ కధకు ఇమడదు. లేదా “శశిరేఖ” పాత్రని వేరుగా మలచాలి.

2 .హీరోయిన్ ని చూడంగానే ( కధా ప్రకారంగా రెండోసారీ, స్క్రీన్ ప్లే లో మొదటి సారి), హీరో ఓ పాటేసుకుంటాడు. ఫైన్! ఓకె!కానీ, దాని ముందు, రోడ్డుమీద ఉన్న ఓ వెధవ(ఏమనాలి! గంజాయి ఎడిక్ట్!) దగ్గర ఓ దమ్ము లాగుతాడు.అది అవసరమా!

వాడికి అంతలా కిక్కెక్కిందని సింబాలిక్‌గా ప్రయత్నించాడని నా ఉద్దేశ్యం. కానీ, అది ఓ రకమైన పాత్రని సృష్టిస్తుంది.

(అలాగే హీరోయిన్ చేత పురుషహంకార సమాజాన్ని తిట్టించడానికి తాగించాలా!!)

3.ఒంటరి ఆడదానికి మన భారతీయ దర్శకులందరూ దర్శింఛే ఏకైక సమస్య  – “రేప్”. దాన్నించి హీరోయిన్‌ని రక్షించి, హీరో కోపంతో చాచి లెంపకాయొకటిస్తాడు.(అఫ్‌కోర్స్, తెలుగు సినిమా సౌండ్ ఇంజనీర్లంతే! హీరోయిన్‌ని కొట్టిన, విలన్‌ని కొట్టినా, చివరికి కమడియన్‌ని కొట్టినా, ఒకే రేంజ్లో బాక్స్ బద్దలయిన సౌండిస్తారు.)

దీనికి శశిరేఖ ” శీలం రక్షించినంత మాత్రాన, నన్ను కొట్టే అధికారం నీకు లేదు. మంచో చేడో నా “మానాన” నా జీవితాన్ని నేననుభవిస్తాను.నన్ను రక్షించమని నిన్ను రమ్మనలేదు. నువ్వే నా వెంటా తిరుగుతున్నావు” అనాలి. సీను మీరు చూశారుగా! లేక చూస్తారుగా! ఏ రేంజ్లో ఉంటుందో!

దాంతో అహం దెబ్బ తిన్న హీరో ” అయితే నీ చావు నువ్ చావు” అన్నా, తరువాత కలిసిపోతారనుకోండి. కానీ బ్యాలెన్స్ ఔట్ అయ్యిందని నా ఉద్దేశ్యం. ఈ క్యారెక్టర్ ఎశ్టాబ్లిష్మెంట్స్ ఇంకొంచెం సున్నితంగా హ్యాండిల్ చేసుకోవచ్చు.అసలు ఆ రేపు సీను లాంటి క్రిమినల్ థింకింగ్ అవసరం ఏంటి!!??

ఒక వేళ ఇలాంటి “శీల పరిరక్షణ” కంటే కూడా “స్వేచ్చ” ముఖ్యం అని చెప్పడం ఉద్దేశ్యం అయినా, అది ఖచ్చితంగా “ఎస్టాబ్లిష్ కాలేదు” అని నా ఫిలింగ్.

అసలైనా కట్నం ఇచ్చిపుచ్చుకున్నా, దాని గురించే నీచంగా ప్రవర్తించే తండ్రులెంతమంది!!?? అదీ కొడుకు ఇష్ట పడ్డ అమ్మాయికి!!. కట్న దురాచారం ఇంకా ఉంది. అనుమానమే లేదు. కానీ దాని మిద పీడించే విధానంలో చాలా  “ఫినేశ్” వచ్చేసింది ఇప్పుడు. మరి సినిమా లో ఎందుకు అలా నీచంగా చుపించాలి.అంటె నర్మ గర్భంగా చెప్పించినా సమస్య తీవ్రత తగలాలి.
పైగా దానికీ మధ్యలో హీరొయిన్ చేత హీరో తండ్రినే తిట్టించడం! అదో ఉదాత్త హీరో లక్షణం!!?? ఎన్ని తప్పుల్ని తల్లిదండ్రులు క్షమిస్తే సంతానం పెద్దదవుతుందో తెలుసా! లేక కట్నం తప్పని కేవలం ఈ జెనరేషన్కే కొత్తగా తెలిసొచ్చిందా!. కాదు. ఇప్పటి సమస్య రూపం వేరు మాష్టారూ!!!

అసలైన పిల్ల కి తెలియకుండా పెళ్ళిళ్ళెవరు చేస్తున్నారిప్పుడు. సరే అది సినిమాటిక్‌గా ఉండాలని అలా తీసారని వదిలేద్దాం.  

చూసేటప్పుడు, నిజానికి నాకు సెకండ్ హాఫ్ కొద్దిగా కరెక్టుగా కపించింది.కానీ “స్వాతి” రివ్యూయర్‌కి, మొదటి హాఫ్ బావుంది.( బహుశా జబ్ వి మెట్, రన్ అవే బ్రైడ్ పోలికలేమో!).

ఆల్ థ్రూ ఔట్, తెలుగు నేటివిటీకి ప్రధాన్యమిచ్చాడు అనుకుంటే, ” ఐ థింక్ యూ లవ్ హిం ; యూ విల్ రియలైజ్ సూన్” అని ఆంగ్లంలో పట్నం అమ్మాయి, ఊరమ్మాయికి చెప్పినట్టు చూపించాలా!!??. ఆ వాలిడేషన్ అవసరమా!. మరోలా ఎవరన్నా నేటివిటీ లో చెబితే నాటుగా ఉంటుందనా! (  ఈ  తప్పు అంత పెద్ద తప్పుకాదుగాని, ఈ పాయింట్ కి వేరే కనెక్షన్స్ ఉన్నాయి నా మనసులో. అంటే మన ప్రతి అభిప్రాయానికి, ప్రవర్తనకి “వెస్టెర్న్ ఇంఫ్లుయంస్” లో వాలిడేషన్ ఎతుక్కోటం అనిపిస్తుంది. అది నాకు నచ్చదు. ప్రేమకి, పెళ్ళికి కుడా వాళ్ళనించే తెలుసుకోవాలా! అందరికి ఫైల్డ్ లవ్స్, ఫైల్డ్ మ్యారేజెస్ ఉంటాయి!!, అది వేరే సబ్జెక్టు. సో ఇది వదిలేద్దాం. ఇప్పటికే బాగా  పొడుగయ్యిపోయింది  😛 )

అంచేత ఈ మాత్రం కధాబలం, పాత్ర ఔచిత్యం అంటూ విమర్శించుకోగల సినిమాలు లేవు కాబట్టి, ఈ సినిమా మంచి సినిమాయే. చూడొచ్చు.

కానీ, నాకు ఇంకా బ్యాలెన్స్ కావాలి! దాని మీద మళ్ళా ఎప్పుడన్న రాయాల్సిందే.అయినా ఇలాంటి “బ్యాలెన్స్ ఔట్” అనేది బాపూ సినిమాల్లోనూ ఉంటుంది. అంటే అంత తెలుసా అనకండి. బ్యాలెన్సుగా తీస్తాడనుకునే విశ్వనాధ్ సినిమాలోనూ ఉంటుంది.ఆ మంచి ఉదాహరణ : శుభసంకల్పంలో  హీరో హీరోయిన్లు పాటేసుకుంటూ, అతి సుతారంగా రంపంతో  ఇంత పెద్ద దుంగని కోస్తుంటారు.ఆ పని పాడుకుంటూ సుతారంగా చేసేది కాదు, ఆ పాత్రలకి అది నప్పే సందర్భమూ కాదు సార్!

ప్రకటనలు
Explore posts in the same categories: సినిమా రివ్యూలు

ట్యాగులు: ,

You can comment below, or link to this permanent URL from your own site.

6 వ్యాఖ్యలు పై “బ్యాలెన్స్ లేని కృష్ణవంశీ”

 1. mahendra Says:

  good picture SHASHIREKHA PARINAYAM

 2. gangabhavani Says:

  “అంచేత ఈ మాత్రం కధాబలం, పాత్ర ఔచిత్యం అంటూ విమర్శించుకోగల సినిమాలు లేవు కాబట్టి, ఈ సినిమా మంచి సినిమాయే. చూడొచ్చు”
  ముమ్మాటికీ నిజం.

  మీ రివ్యూ చాలా బాగుంది.
  క్రిష్ణవంశీ చూస్తే బావుంటుంది.

 3. anveshi Says:

  మీరు నవతరంగం చూశారా?
  navatarangam.com
  మీరు కూడా సినిమాల గురించి అందులో రాయండి

 4. chandramouli Says:

  మీకు నచ్చిన పది సినిమాలు గురించి ఒక టపారాస్తే చూడాలని ఉంది…..

 5. rayraj Says:

  నాకు అన్ని సినిమాలూ ఇష్టమే చంద్రమౌళీ! కాకపోతే ఒక్కొక్క టోన్లో మొదలెటిదే అందులోనే ఉండాలి. తరువాత, అన్నీ లౌడ్ సినిమాలుగానో, అన్నీ సైలెంట్ సినిమాలుగానో కుడా ఉండకూడదు. చెప్పదల్చుకున్న ఆడియన్స్ ని బట్టి, విషయాన్ని బట్టి, ఎంచుకొనే టోన్ ఉంటుందేమో కదా!లెట్స్ సీ! రాస్తానేమో!


 6. ఈ సినిమాలో మెచ్చుకోవడానికీ ఏమీ లేదు, తిట్టుకోవడానికీ ఏమీ లేదు. అందుకే నేను సమీక్ష రాయడం మానేసాను. మీ విశ్లేషణ ఆసక్తికరంగా ఉంది.


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: