నేనూ,మీరూ కూడా పరాన్నజీవులమేనే!

“అట్లాస్ ష్రగ్‍డ్”  మీద రవిశంకర్ రాసిన బ్లాగు మీద ఓ కామెంటేయ బోయి, అది పొడుగయిపోయి బ్లాగు చేస్తున్నాను.

ఈ పుస్తకం నేను చదవలేదు. మీ రాసినదాన్ని చదివిన తరువాత కూడా నేను చదవలేను. ఈ స్టోరీలైన్ అల్రెడీ విన్నాను.

కానీ:
1.హై పెర్‍ఫార్మర్స్ కి నచ్చుతుందేమో; నేను కాదు గాబట్టి, నేనూ చాలా అలాంటి వాళ్ళ చలువ వల్ల జీవించగలుగుతున్నానని తెలుసు కాబట్టీ, వాళ్ళ స్వార్ధానికే/ సంతోషానికే  వాళ్ళు బతికేస్తామంటే నేనొప్పుకోను.అసలా అయిడియా నాకు అపీలింగ్‍గా లేదు.

2.అసలు అబ్సల్యూట్ హై పెర్ఫార్మెన్స్ అనేది ఏదీ లేదు కాబట్టీ; ఎవడైనా మంచి పెర్ఫార్మర్ ఎందుకవుతాడూ!?  వాడి చేసే పని వల్ల చాలా మందికి న్యాయం, ధనం,ఆనందం, (ఇంకా లేదా  కూడూ, గుడ్డా, గూడూ లాంటి బేసిక్ విషయాలు) అందుతాయి కాబట్టి వీళ్ళందరూ ఆ వ్యక్తిని హై పెర్‍ఫార్మర్ గా గుర్తిస్తారు కాబట్టి.లేకపోతే ఆ సో కాల్డ్ హైపెర్ఫార్మర్ కి కూడా,  ఈ బేసిక్ విషయాలు సైతం ఈ సంఘంలో దొరకవు.అన్యోన్యాశ్రయానికి సంబంధించిన ఇంత చిన్న విషయం ఎలా మిస్స్ అవుతాం!

౩. కాగా హై పెర్ఫార్మర్‍లు అందరూ ఎప్పుడూ కలవరు. ఎందుకో తెలుసా! అసలు ఒకొళ్ళకొకళ్ళకి ప్రతి బంధకాలు సృష్టించుకునేది వాళ్ళే కాబట్టి.దానికి సాధారణ జనాలని వాడుకుంటారు గాబట్టి.ఎవరి ఎజండా వాళ్ళు నెరవేర్చుకోవడంలోనే అసలు ప్రతిబంధకాలు తయారవుతాయి.

చివరగా కానీ చాలా ముఖ్యంగా, భగవద్గీత లో ఏదో శ్లోకముంది :

” యద్యదాచరతీ శ్రేష్ఠః తత్ దేవేతరో జన:
స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ” అని.

(అరే భలే గుర్తొచ్చేసిందే ! మనకి సంస్కృతం రాదు లెండి. ఏదో ఇంటర్‍లో మార్కులకోసం తీసుకొన్న సబ్జెక్టు. ఎగ్జామ్స్ లో కోట్ చేస్తే మార్కులిచ్చేవారు. అలా సంస్కృత శ్లోకాలు కోట్ చేయడానికే వాడుకోవటం అలవాటయింది. పైగా అలా కోట్ చెస్తే,(అది ఇంగ్లీష్ అయినా, మరేదో భాషైనా) , ఓహో ” హీ ఈజ్ లెరన్డ్” అనుకుంటారు మామూలు జనాలు)

ఈ శ్లోకాన్నిఇలా చెప్పొచ్చు :
“ఉత్తముడైన వాడు దేనినాచరిస్తారో సాధారణ జనులూ దాన్ని అనుకరిస్తూ, అనుసరిస్తూ జీవిస్తారు”  అని.

పైగా దీన్ని ఏ సందర్భంలో చెప్పారు అంటే(గుర్తున్నంత వరకూ) :
ఆత్మ రతుడూ, ఆత్మానందం కలవాడికీ ఏ కర్మలూ ఆచరించవలసిన అవసరం లేదు. వాడికి నిజానికి ఫుణ్య పాపాలతో పనుండదు. నిజంగానే మనం మాట్లాడే ఈ నైతిక విలువలకి  ఒక స్థాయి తరువాత అర్ధం ఉండదు. పూర్తి  స్వేఛ్చఅప్పుడేగా!  అయినా అలాంటివాడు కూడా కర్మలనాచరిస్తాడు, ఎందుకూ అంటే పైన చెప్పినందుకూ అని. (ప్లీజ్! వాడికి  వీళ్ళకి మార్గ దర్శకంగా ఉండాల్సిన అవసరం లేదు గాబట్టి. ఈ తలనొప్పి కూడా పెట్టుకో అక్కర్లేదు.మార్గదర్శకంగా లేనందువల్ల వాడికీ ఏ పాపమూ అంటదు.)

హై పెర్‍పార్మెన్స్ , సమజానికి ఉపయోగపడే మేధస్సు (ఈ ఫ్రేజ్ లోనే ఉంది తిరకాసు. అది సమాజానికి ఉపయోగపడేది అనేది ఎలా తేలుస్తారు? ఎవరు తేలుస్తారు!?మీ రాం గోపాల్ వర్మ తన లేటస్టు బ్లాగులో తనకిది మిస్టరీయే అని చెప్పాడు.) సరే , ఇలాంటి వాటికంటే కూడా మహోన్నతమైన స్థితి, స్వేఛ్ఛాయుత స్థితి, సంతోషకరమైన స్థితి, ఏ బాదరబందీ లేని స్థితి, నిన్ను దేవుడుగా ప్రజలు కొలిచే నిజమైన దేవుడి స్థితిలో కూడా  నువ్వు పని చేస్తావు. ఎందుకో  తెలుసా! మామూలు జనాలు నిన్ను చూసి అనుసరిస్తారు కాబట్టి  అని. అంటే సమాజం కోసమనే!!!!!!

ఈ కామెంట్ / బ్లాగు  ఎందుకంటే :
look Mr.Shankar, మీరు ఇంకో బ్లాగు రాయమని నా అభ్యర్ధన. అందులో try to instill some interest in her philosophy!? narrate it; take some more time; explain the story!? why should i take the pain?

మీరే చాలా సార్లు మూసి తెరిచి చదవానన్నారు. ఆ మూసి తెరిచే సందర్భాలే కావాలి!? ఎక్కడ మీ ఆలోచన ఆమె ఆలోచనా స్రవంతిని ఆపింది. ఎందుకు మళ్ళీ ముందుకెళ్ళింది. అది కావాలి. అప్పుడు మీరు చెప్పేదేదో కాస్త మాలాంటివారికర్ధమవుతుంది.)

ప్రకటనలు
Explore posts in the same categories: బ్లాగుల గురించి

2 వ్యాఖ్యలు పై “నేనూ,మీరూ కూడా పరాన్నజీవులమేనే!”

 1. uravishankar Says:

  Hello Raj Garu…Sorry for late reply.. Here is my reply..
  Meeru naaku book chadive feeling e raadu annaru.. Ayn rand feelings toa kaadu.. reason toa aalochinchamantundi..
  Nenu Materialistic values peragaali ani anatledu.. Art and moral values vaddu ani anatledu..Pakka vaadi gurinchi aalochinchavaddu anee anatledu..but there should be a healthy competetion in every thing and a moralism should be supported by reason and logic..

  There is a line still i remember.. this comes when someone goes to help to the protagonist of the novel.. ‘I don’t want to protect the weakness of someone I love but I would like to protect the strengths’…

  ‘sadharana manushulu’ ani oka padam vaadaaru… kaanee andaroo asaadharana manushule.. there is unfulfilled potential in all of us.. I will write again when i get some ideas..

 2. rayraj Says:

  ఆ మాత్రం ఉంటే చాలు. నాకానందమే. రాసి, చెప్పండి ; పింగేసినా పర్లేదు. ఇవ్వాళ చంపడం తప్పా? అన్నా బ్లాగులో మీ పేరు వాడాను. పెద్ద సీరియస్ గా తీసుకోకండి. అది వేరే విషయం గురించి. మీర్రాసిన తరువాత దీని గురించి చెప్పుకోవచ్చు.


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: