తల్లిదండ్రులే కసాయి వారయ్యారే

నిన్న బ్లాగులో  “పాట” తప్పుగా ఉంది.పొరబాటున అది పబ్లిష్ అయిపోయింది.అలా వదిలేశాను.ధన్యవాదాలు తెలియజేయాలని.

నా వేయి విజిటర్స్కి వేయిదండాలు మరోసారి సమర్పించుకుంటూ  –
మళ్ళా కరెక్టు కవిత – పారడీ సాంగ్ చదివించాలన్న కసితోనూ 🙂 
గుర్తుందిగా  – “ఆకలిరాజ్యం” లో    “కన్నులున్నవని” ట్యూన్‌లో  –

పాడుకోండి.

మామయ్య  (చుట్టూ తల్లి దండ్రులు, పిల్లలు ఉంటారు) :

చిన్నపిల్లలకి చిట్టి పాపలకి తల్లిదండ్రులే కసాయి వారయ్యారే
ఆటలంటె వద్దు పాటలంటె వద్దు రోజూ బళ్ళోకెళ్ళి చదువుచాలునన్నారే

చిన్నపిల్లలకి చిట్టి పాపలకి తల్లిదండ్రులే కసాయి వారయ్యారే
చిన్నతనంలోన కన్నకలలే పెద్దయ్యే సరికి నిజమౌనని మరిచారే
మా బాల్యం మాకిచ్చి మాకలలే పండించి
         మాబాల్యం మా కిచ్చి పెద్దరికం చూపండి     ||చి||

చదువంటూనే ఉదయాన్నే లేపేస్తారు ఇంట్లో
చదవండంటూనే దండిస్తారు కాలిడగానే బళ్ళో

రా……లే…..దేం….టి………..ర్యాం…..కు………
అంటూనే ఆడించేనీ లోకం

గెలుపుకోసం కాదూ…. జీవితం ఆడేందుకునమ్మా
గెలుపుకోసం కాదూ………జీవితం ……………

పిల్లాడు: ఆటలాడేందుకె మమ్మీ     ||చి||

రవీంద్రుని బాల్యంలోనే భావుకత ఎంతో నిండి ఉంది
           శ్రీకృష్ణుని బాల్యక్రీడ వింటుటే మనిషికి ముక్తీ ఉంది    ||2||

ఏ…దీ….. మా…..కా…… భాగ్యం
         వద్దమ్మా వద్దూ తీరని  కోరిక మాపై రుద్దొద్దు    ||2||

భవితకోసమే అంటూ భయమే పెట్టొద్దు
      భవిత కోసమే…… అంటూ….. భయమే పడకు  ||చి||

ప్రకటనలు
Explore posts in the same categories: నా కవితలు/పాటలు, Uncategorized

One Comment పై “తల్లిదండ్రులే కసాయి వారయ్యారే”


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: