స్వాతిముత్యం – ఫారెస్ట్ గంప్

దుమ్మూ ధూళీ అంటని “స్వాతిముత్యం” లాంటి ఒక మనిషి గురించిన కధ.మిగిలిన సామాజిక విలువలు ఏమీ తెలీవుకానీ, మనిషికి  మనిషి మంచి చేసుకోవాలని మాత్రమే తెలుసంతే! హఠాత్తుగా ఓ విధవరాలిని పెళ్ళాడతాడు. ఎందుకూ  – అప్పుడు ఆమెకి మంచి జరుగుతుందని, తోడుగా నీడగా నిలవాలని.

ఆమె నిర్ఘాంతపోతుంది.ఆ తరువాత అమాయకత్వానికి ఆశ్చర్యపొతుంది.జాలి పడుతుంది. చివరికి ప్రేమించి కాపురం చేస్తుంది.వాళ్ళకు పిల్లలు కూడా పుడతారు.ఆమె పోయిన తరువాత కూడా, అతను ఆమె స్మృతులతోనే చివరి వరకూ జీవించేస్తాడు.

విశ్వనాథ్ ఇలా అనుకున్నాడో లేదో కానీ, ఇది నేను “స్వాతిముత్యం” స్టోరీలైన్ అనుకుంటా.

అలాగే భూగోలోనికి అవతలి పక్క, ఇంకో కథ. ఇతనూ అమాయకుడే. కల్మషం తెలీన వ్యక్తి.ఈతనూ ఓ అమ్మాయిని ఇష్టపడతాడు.విధి ఆడిన వింత నాటకంలో  అతను  ఎన్నో చారిత్రక సంఘటనల్లో సాక్షి. కాదు పాత్ర ధారి.ఓ పెద్ద వ్యాపార వేత్త కూడా అయిపోతాడనుకుంటా.కానీ, అదే జీవితంలో తను ఇష్టపడ్డా అమ్మాయి డ్రగ్ ఆడిక్ట్ అయినా, పలువురితో తిరిగి చెడిపోయినా, ఆమెనే ఇష్టపడతాడు.తోడుగా,నీడగా నిలబడతానంటాడు.ఆ అమ్మాయి ఒకే ఒక్క రాత్రి అతనితో గడిపి వెళ్ళిపోతుంది. అయినా అతడు ఆమె కోసం వెతుకుతూ జీవిస్తాడు. చివరికి ఆమెను కలుసుకుంటాడు. తన వల్ల కలిగిన బిడ్డతో సహా.ఆమె ముందే చనిపోయినా ఆమె స్మృతులతో పిల్లాడిని పెంచుతుంటాడు.

అరడజను ఆస్కార్ అవార్డ్స్ గెలుచుక్న్న “ఫారెస్ట్ గంప్” స్టోరీ లైన్ – మళ్ళీ నేననుకునేదే ఇది. ఓ.కె

ముందే వ్యత్యాసాలు వెతక్కండి. సామీప్యత ఏంటో అర్ధం చేసుకోండి. రెండిట్లోనూ ఉన్న “స్వాతిముత్యం” లాంటి మనిషిని, కథని గుర్తించండి.

వెయిట్! స్వాతిముత్యం  – ఫారెస్ట్ గంప్ కన్నా ఓ పదేళ్ళన్నా ముందుది.సో తెలుగు సినిమా కాపీది కాదు. అలా ని ఫారెస్ట్ గంప్  మన తెలుగు సినిమాకి కాపీ కాదు. అది పి హెచ్ డీ  వర్క్ కి వదిలేద్దాం.ఎందుకంటే  అమాయక హీరో చిత్రాలు “స్వాతి ముత్యం”  తో మెదలు కాలేదు. రాజ్ కపూర్  చేసి, ఆ సినిమాలని ఎగుమతి కూడా చేశాడు.   మరి రాజ్ కఫూర్ కి  ఎక్కడ్నించి వచ్చింది!? ఇంకాపాత  ఇంగ్లీషు సినిమాలు, ఫ్రెంచ్ సినిమాలా !  అహ – ఇది కాదు నే చెప్పాలనుకున్న పాయింట్.

ఓ సారి సామీప్యతని అర్ధం చేసుకున్నాక, ఇప్పుడు  వ్యత్యాసాలుగా  గమనించాల్సినవి : సినిమా బ్యాక్ డ్రాప్స్, దానితో కథాగమనం, దాని వల్ల సినిమాటిక్ గా ఎంత టెక్నాలిజీ వాడుకోవచ్చు, ఏది ఏ మార్కెట్ కి అమ్ముడుపోతోంది, ఆయా మార్కెట్లలో వచ్చే డబ్బు.

అంటే ఓకే కథ – మనుష్యులందరిదీ మామూలుగా అయితే ఒకటే కధ
కదా!  – మనకున్న తెలివి తేటలు బట్టీ, లోకఙ్ఞానం బట్టి, బ్యాక్ డ్రాప్  మార్చుకోవడం ద్వారా, చాలా వరకూ వేరుగా తీయచ్చు.

ఇదేం గొప్ప విషయం! రాజమౌళి ప్రతి ఇంటర్వ్యూ లోనూ చెబ్తున్నాడు.నా దగ్గర పాత కథలే. అందుకే ఒక సినిమా తమిళనాడు బ్యాక్ గ్రౌండ్, ఇంకో సినిమాలో బీహారు, ఇంకో దాంట్లో కేరళ బ్యాక్ డ్రాప్‌లుగా వాడుకున్నానని!

(సశేషం)

ప్రకటనలు
Explore posts in the same categories: సినిమా రివ్యూలు

ట్యాగులు:

You can comment below, or link to this permanent URL from your own site.

One Comment పై “స్వాతిముత్యం – ఫారెస్ట్ గంప్”


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: