ముంబై మెమొరీ

( భా… రీ…… టోన్లో)           ముంబై !           (వెంటనే డాక్ యార్డ్ లో ఓ హారన్ పా…మ్……..పా..మ్………)

ముంబై మహా నగరం!  ఇక్కడికి  రోజూ  కొన్ని వేల మంది ప్రజలు వలస వస్తుంటారు.
(జనాలు……. జనాలు………….ఎక్కడ చూసిన జనాలు…నేల ఈదుతున్నట్టు అంటే అర్ధమయ్యే విధంగా……..హడావిడిగా ఎటో వెళ్ళిపోతూ ఉంటారు………… )

ఇక్కడ ఓ పక్కన దరిద్రం తాండివిస్తుంటే , మరో పక్క లక్ష్మీదేవి ఇంట కొలువుంచుకొని, సరస్వతి పాడుతుండగా, పార్వతి నాట్యమాడుతుంటింది . ముగ్గురమ్మలతో ఒంటరిగా పోటీ పడుతున్నా , “దరిద్ర తాండవ” మే ఎప్పుడూ గెలుస్తుంది ……

*************************
లైన్ అంతగా నప్పలేదా ! పర్లేదు. సబ్జెక్టు మాటెర్ ఎక్జాక్ట్ గా అది కాదు.

ముంబై అనంగానే నా మెదడులో వచ్చే ఇంట్రడక్షన్ అది. ఏం చేద్దాం! సినిమా ప్రభావం!! నే మొట్టమొదట ముంబై వెళ్ళినప్పుడు, ట్రైన్ కాస్త లేటుగా వెళ్ళింది. వర్షం లేదు. మాములు వెలుతురుగా ఉంది. మధ్య మధ్యలో మబ్బులొచ్చి పోతున్నాయి, (అది కూడా ఇప్పుడనుకుంటున్న! , కొన్ని మెమరీ సీన్లలో లైట్ ఫేడ్ అయినట్టుగా ఉంటే! )

దాదర్ లో దించేసి, బయటికి రాంగానే ఓ టాక్సీ మాట్లాడి అందులో కూర్చోబెట్టేశాడు – నేను పనిచేయ బోతున్న కంపెనీ సహ/సీనియర్ ఉద్యోగి. బై ద వే, దట్ వజ్ మై ఫస్ట్ జాబ్!

కొద్దిగా స్లమ్స్ లా అనిపిస్తే ’ధారవిలోంచి వెళ్తామా’ అని అనుకున్నాను మనసులో…..కానీ తరువాత బాంద్రా కుర్లా కాంప్లెక్స్ మీదుగా కలీనా కెళ్ళి, CST  రోడ్డు మీద మా కంపెనీ అపార్ట్ మెంట్ బిళ్డింగ్ కి చేరుకున్నాం. ఆ రోజుల్లో అదొక్కటే ఐశ్వర్య భవనం ఆ రోడ్డుకి, అంటే అటు యూనిర్సిటీ కి అవతల కుంచెం ముందు నుంచి ఇటు కుర్లా స్టేషన్ వరకు. టాక్సీ  దిగుతున్నప్పటి సీను చాలా స్పిసిఫిక్ గా లైట్ ఫేడ్ అయినట్టు గా గుర్తు – అందుకే మబ్బులున్నాయనిపిస్తోంది. అలా నా మనసులో ముంబైకి , దీనికి పెద్దగా పొంతన కుదర్లేదు.

మర్నాడు బాంద్రా నించి చర్చ్ గేట్ కి ట్రైన్ ఎక్కించాడు ! అప్పుడు మొదలయ్యింది నా “ముంబై జీవితం”.
నిజానికి ముంబై జీవితం ట్రైన్ లోనే ఉంటుంది. ముంబై ట్రైన్ కి అలవాటు పడని వాడు, ముంబైలో బతకలేడు.

నాతో పాటూ కొత్తగా  జాయిన్ అయ్యిన మరో ఫ్రెషర్ నా కంటే ముందే నన్నో ” జాలి ” చూపు చూసి వెనెక్కి వెళ్ళి పోయాడు – తర్వాత సీన్లలో! నేను ఓటమిని అంగీకరించలేక పోయాను. అలా అని ఆనందంగా కూడా గడపలేకుండా ఉన్నాను.

కొన్ని రోజులకీ , కంపెనీ నష్టాల్లోకి వెళ్తోందేమో అని (అప్పుడూ కొద్దిగా మార్కెట్ ఇవ్వాళ్ళ లాగానే డల్ అయిపోయింది లెండి)  మా కంపెనీ అపార్ట్ మెంట్ ని బేలాపూర్ కి మార్చాం. అక్కడ కాస్త చౌకలో దొరక బట్టాడు…అక్కడే ఉండే మరో సహోద్యోగి. బేలా పూర్ నించి స్టార్ట్ అయ్యే ట్రైన్స్ పుణ్ణ్యమా అని కాస్తా ఇక్కడ జీవితం కొద్దిగా బానే ఉండేది. కానీ ముందే చెప్పాగా! జీవితం అంటే “ట్రైన్ జర్నీ” అయి పోయింది.

ఒక్కసారి ఏదో పని మీద 7.30 కల్లా బోరివిలీ వెళ్లాను.  మళ్ళా 8.30 – 9.00 మధ్యలో ట్రైన్ ఎక్కేసి నారిమన్ పాయింట్ వెళ్ళి పోదామని.

స్టేషన్ కి వచ్చాను.

ఇటు ప్లాట్ ఫారమ్ చివర, ప్లాట్ పార్మ్ కి కిందుగా ఉంది నా కళ్ళ – కెమారా. మెల్లిగా అది ప్లాట్ ఫారమ్ లెవల్ కి వెళ్తుంది. అపైన్ నా హైట్ కి. ( నాచ్యురల్లీ)

ఈ కెమారా మూవెమెంట్ లో నాకు కనపడుతున్న దృశ్యం –  ప్లాట్ పార్మ్ అంచునుంచి “అడుగు” దూరంలో నిలబడి ఉన్న జనాలు, పాత కాలం యుద్ధానికి ముందు నిలబడ్డ సైనికుల్లా కిక్కిరిసి పోయి నిలబడ్డారు.

చర్చ్ గేట్ వైపు నుంచి వచ్చే ట్రైన్ అటు వైపు నుంచీ వస్తోంది. (ఇక్కడినుంచి అది తిరిగి వెళ్తుంది – ఆ ట్రైన్ లో ఎక్కాలని నేను వెళ్తున్నాను.)

ట్రైన్ దూసుకుంటూ వస్తుంటే, దాని శబ్దాన్ని మింగేసేలా జనాల హాహా కారాలు  – నాకు బ్యాక్ గ్రౌండ్ లో “య……ల్…..గా……ర్ “ అని అరిచినట్టు వినిపించింది.

ట్రైను ప్లాట్ పార్మ్ ఆ చివర నించి ముందుకొస్తున్న కొద్దీ,  ట్రైనుకీ , జనాలకీ మద్ధ్య లో ఉన్న  అడుగుమందం ఖాళీ చకచకా  మూసుకుపోతోంది. ట్రైన్ వచ్చి నా కళ్ళ ముందు ఆగింది. అప్పటికీ ప్లాట్ పారమ్ ఇంకా జనాలతోనే ఉంది. ఇక ఖాళీ కనపట్టంలేదు. జనాల తొక్కిసలాటలోకి కెమారా వెళ్ళలేదు…మెల్లిగా పక్కకు వెళ్తూ, పక్కన మెట్ల మీదకి వెళ్ళి కొంచె “టాపు వ్యూ” లో  –  నిండిపోయిన ట్రైన్ లోకి ఇంకా ప్లాట్ పార్మ్ మెత్తం నిండి ఉన్న జనం తోసుకుంటూ దూరటానికి ప్రయత్నిస్తుండటాన్ని తీసింది.

అప్పట్నించి నుంచి  “ముంబై”  అంటే నాకు –  ”  య……. ల్……గా……..ర్ “ అని ఫ్లాష్ అవుతుంటుంది.

అక్కడ రెండున్నరేళ్ళు ఎలాగో గడిపాక ముంబై వదిలేశాను. ఓటమి అనటం కంటే – విజయం సాధించలేదు అనుకుంటాను.
మరో అవకాశం మంచిదొచ్చింది కాబట్టే వదిలేశాను. కానీ ముంబై వాసులొప్పుకోలేదు. అంత కంటే మంచి అవకాశాలు ఇక్కడుంటే వస్తాయి – ఇంకొంచెం ప్రయత్నించ మన్నారు. వేరే ఊళ్ళో ఏముంటుంది అని ఎద్దేవ చేశారు. అయినా నే వదిలేశాను.

చివరి రోజుల్లో నా బాస్ అన్నాడు : ” బాంబే లో ఎదుగుతూనే ఉండాలి. అప్పుడే దాని అందం తెలుస్తుంది. కొంచెమన్నా బావుంటుంది.  ఒకవేళ “స్టాగ్నేట్”  అయిపోయినా చాలా కష్టం. దిగిపోతున్నట్టే  ఉంటుంది ” అని.

ఇప్పటికీ వెళ్ళే దైర్యం లేదు. నా మదిలో “……య…ల్….గా…..ర్…….” అని ఫ్లాష్ వస్తుంది. అందుకని.

(నిన్న టి.వి.లో చూపించారు – బోరివిలీలో ఆగి వెళ్ళాల్సిన ట్రైన్ ఆగకుండా వెళ్ళిపోతే సహించ లేక పట్టాల మీదకు  గుంపులుగా వచ్చేసి రైళ్ళ రాక పోకలు ఆపేశారు. పోలీసులు వచ్చి లాఠీ చార్చి చేసి, చెదర గొట్టారు )

ప్రకటనలు
Explore posts in the same categories: Uncategorized

One Comment పై “ముంబై మెమొరీ”

  1. Vamsi Says:

    Life in mumbai rox:D….so sad that you dint njoy it….


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: