చంపడం తప్పా?

చంపడం తప్పా!? –  ఎవ్వడైనా దీనికి సమాధానం తణుక్కోకుండా – “తప్పే” – అని చెప్తాడు.

కానీ యుద్ధంలో శతృవును చంపడం తప్పా!? -అంటే-  “కాక, పారిపోయెస్తావా?” అని అడుగుతారు హేళనగా!

కాబట్టి ఒకే చర్య యొక్క భావం , సందర్భానుసారంగా  మారుతుంది. తెలియందేముంది!?
“యుద్దంలో చంపినా నిజానికి తప్పే  – అందుకే అసలు యుద్ధమే ఉండ కూడదు” అని వెంటెనే ఎవరన్నా చెబ్తారా!? ఒకవేళ చెప్పినా యుద్దాలు జరగకుండా, ఒకరినొకరు చంపకోవటాలు ఆగుతాయా!? – ఆగవు.

సరే – “వక్రీకరణ తీవ్రవాదం కంటే ప్రమాదం” అన్న a2zdreams  శీర్షిక చూసి – “ఔనౌను” అనకుంటు వెళ్దునుగదా, చివరికి తన కాపీరైటు థియరీ మీద మళ్ళా తన గోడు చెప్పేసి – కామెంట్లు కూడ పీకేశానన్నాడు. ” ఇదీ వక్రీకరణంటే! అమ్మా! ”  అనుకున్న! మన అసలు సబ్జెక్ట్ కు వెళ్ళే ముందు, నా కర్ధమైన అతని బాధ – దాన్నినేనెందుకు పట్టికుంచుకుంటున్నానో అనే నా బాధ  చెప్పేస్తాను.

కాపీ కొడితే తప్పా అన్నాడు – ముమ్మాటికే తప్పే అన్నాను – అని, అక్కడికీ, –  కాపీ కి , ఇంస్పిరేషన్ కి కొంచెం తేడా ఉంది – ఆ ఫైన్ లైన్ చెరిపేసి కాపి చేయడం తప్పేనని చెప్పా ; వేరే సినిమాలు చూడని తనలాంటి తెలుగువాళ్ళ కోసం కాపీ చేస్తే తప్పేంటి అని అతని గొడవ.

నిజానికి ఏం తప్పు – ఏమీ లేదు. పాపం ఒక్క “తెలుగు” సినిమా చూసేవాళ్ళకైతే తప్పే లేదు. ఎందుకంటే – ఓ మంచి సినిమా చూసాం, ఆనందించాం కాబట్టి.
 
కానీ, హిందీలోనో, ఇంగ్లీషులోనో మరో ఇతర భాషలోనో  “అసలు” సినిమాలు చూసే వాళ్ళకి – మాతృభాషలో సినిమా చూడాలి అని కోరుకుంటే – అన్నీ కాపీ సినిమాలే కనబడ్డాయనుకోండి – మరి వాడేంచేయాలి!? వాడికి మాతృభాషలో ఆనందం వెతుక్కోవటం తప్పు కాదు గదా!?మంచిగా ఉన్న ఒరిజినల్ ని “బావుంది బావుంది” అని ఓ అరడజను సార్లు చూసేసి, మళ్ళా సబ్ స్టాండర్డ్ లో తీయబడ్డ ఓ తెలుగు సినిమాగా చూడాలంటే ఎలా చూడగలడు!?

వాడు చూడలేడు – సరి కదా! దీంతో ఓ కొత్త సమస్య మొదలౌతుంది – “ఆ…… తెలుగులో అన్నీ చెత్త సినిమాల్రా, ఏం చూస్తాం – మన వాళ్ళు ఆ రేంజికి ఎదగాలంటే ఎప్పుడెదగాలి !!?? ” అని చులకన మెదలౌతుంది. అలా అలా, కొన్ని రోజులకి నిజంగానే తెలుగు సినిమా ఆధునికులకి కాకుండా  – ఆటవికులకేమిగులుతుంది.

తెలుగు వాడిగా నేను ఆటవికుడిగా గుర్తించ బడతానన్న మాట!!!!!

(ఈ మాట అనంగానేనే – “ఆటవికు”లంటే అంత చిన్న చూపా!! మా కున్న సంస్కృతి మీకసలు తెలుసా అనే మరో వర్గం మరుగుతున్న రక్తంతో ఉడికిపోతూ ఉంటుంది. – అయ్యా ! నాకు తెలుసు! సర్వ జనులూ ఆ దేవుని బిడ్డలే – కాదు, కాదు నా సాంప్రదాయంలో సమస్తమూ ఆ దైవత్వమే! – పైగా “సాధారణ జనులు” అనేవారు లేరు – అయన్ రాండ్ కూడా అదే విషయం చెప్పింది – ఏం రవి శంకర్  అంతే కదా!!!! – కాకపోతే నేను చెబుతున్న విషయం అలా ఆల్రెడీ పేరుకు పోయిన ఓ “ఎక్కువ – తక్కువ” ల ఫ్రేం వర్క్ లో అన్నమాట – ఆ ఫ్రేం వర్కులో నేను కూడా మరో వర్గం కంటే తక్కువ వాడినే నన్నమాట – అర్ధంచేసుకోండి.)

అంచేత, నేనుగానీ, నా లాంటివారు గానీ – ఇది కాపీ, అది కాపీ అనొచ్చు. దాని వెనకాల ఉద్దేశ్యం వాళ్ళకున్న వేరే అనుభవాల వల్ల వచ్చిందన్న మాట.  (నిజానికి కాపీ కొట్టడం మీద నా అభిప్రాయం వేరు – ప్రపంచంలో ఏ ఒక్క ఆలోచన ఏ ఒక్కరిదో నిజానికి సొంతం కాదు – నా ఈ అభిప్రాయంతో సహా ; సినిమాల్లొ ఇది “ఎలా” అనేది ఎలాగూ “మన సినిమా”  టాగుతో రాస్తున్న పోస్టుల్లో మెల్లిగా చెప్పుకుందాం. ఆల్రెడి చెప్పాను కూడా!).

అందుకని, ఓ తెలుగు వాడిగా నన్నెవరైనా గుర్తిస్తే  – దానికి నేను గర్వపడే విధంగా నా తెలుగు “సినిమా” / (నిజానికి నా తెలుగంతా) ఉండాలి అని నేను కోరుకుంటాను.
అందుకని – ఉత్త తెలుగువాళ్ళకి నేను “కాపీ” తప్పు అని చెప్పేవాడిగాను , అన్నీ చూసే వాళ్ళకి ఒరిజానిలిటీ ని పట్టించుకోకుండా అన్నీ ఓవర్ – జనరలైజ్ చేసేవాడిగానూ కనబడతానేమో!!!

అసలు విషయానికొస్తే,  గాంధీ గురించి ఎంత చదివినా, ఆయన కొన్ని కొన్ని వాక్యాలు ఎక్కడ ఎప్పుడన్నాడన్న విషయం తెలీక కాస్త తికమక గా ఉంటుంది. స్వయంగా ఆయన ” మై ఎక్స్ పరిమెంట్స్ విత్ ట్రూత్ ”  పుస్తకం వెనక కవర్ పేజీ పై – “మతం – రాజకీయాలు” కలసి ఉండేవే అన్న భావంలో ఓ కోటేషన్ ఉంటుంది. ఆ కొటేషన్ కోసం కొంచెం గూగుల్ చేసినా – అది తప్పితే అన్నీ దొరికాయ్. అందుకని దాన్ని వెర్బాటిమ్ కోట్ చేయలేను ; అదొక్కటే కాదు, ఆయన మాటలు అలాంటివే ఇంకా ఉన్నాయి. కానీ ఆయా సందర్బాల్లో ఆయన ” మతం అంటే ఏమని భావించాడు – రాజకీయం అంటే ఏమని బావించాడు”  అనేది తెలుసుకోకుండా, నోటి కొచ్చినట్టు కోట్ చేసేసి – గాంధీని ఎవడిష్టమొచ్చినట్టు వాడు వక్రీకరించేసి  వాడేసికుంటున్నారన్న భావన ఈ వ్యాసం  లో వివరిస్తూ రాశారు. నాకెందుకో బావుంది అనిపిచ్చింది – నేను అవి తెలుగులో చెబ్దామనుకున్నాను. ఇక ఓపిక లేదు – తరువాత ఎప్పుడన్నా చూస్తాను – మంచి శీర్షిక – “వక్రీకరణ తీవ్రవాదం కంటే ప్రమాదం” – దీన్ని నేను కాపీ కొడతాను అని ముందే చెప్తున్నా.

అలాగే, నిన్నో- మెన్నో  కూడా NDTV  న్యూస్ రీడర్ మళ్ళా అంతే అసహానాన్ని ప్రదర్శిస్తూ – చర్చలో ఉన్న ఓ మహిళ పీక నొక్కేసింది . ఛానెల్ సర్ఫ్ చేస్తూ, ఆ ఛానెల్ పై వాలే సరికి – ఓ ముగ్గురు ఫొటోలు  – వాళ్ళంతా రామసేనకి వ్యతిరేకంగా ( నేను రామసేన కి వ్యతిరేకినే – కానీ ఈ ముగ్గురితో నేను ఏకీభవించట్లేదు) ; మధ్య మధ్యలో డిల్లీనించి మరో మహిళ – మరి ఆవిడ రామసేన మనిషో కాదో నాకు తెలీదు  – కానీ ఆవిడ మధ్యస్తంగా చెప్పాలని చూస్తోంది, ఆవిడ నా భావాన్ని చెబ్తుందేమో అని నేను వేచి చూస్తున్నాను .సరిగ్గా మిగిలిన ముగ్గురికీ భిన్న మైన వాదనేదో ఆమె చెప్పబోయేంతలో – మొహంలో ప్రస్ఫుటంగా చిరాకును ప్రదిర్శించి ఆ న్యూస్ యాంకర్ ఆమెను కట్ చేసేస్తోంది. ఆమెను సగంలో ఆపడమే కాకుండా , ఆపిన చోట నుంచి ఓ వక్రభాష్యం తీసి మిగిలిన ముగ్గిరికీ చెరో ఛాన్స్ ఇస్తుంటే – ఆడవాళ్ళే అయినా ఆ డిల్లీ మహిళ ని రేప్ చేసినట్టుగా ఉంది.( ఈ ముగ్గురిలో ఓ స్క్రిప్ట్ రైటర్ కూడా నా మనసు కు నచ్చే “స్త్రీ” రూపంలో లేదు.చూస్తే లెస్బియన్స్ లో మగ పాత్రధారిగా  ఉంటుంది గావచ్చనిపిచ్చింది.) ఆ డిల్లీ మహిళ ని అలా ఓ సారి గాలి తీసుకునిచ్చి, వెంటేనే పీకనొక్కేస్తున్నారు . చావలేము. బ్రతకలేము. అలా ఉంది నా పరిస్థితి. నిజానికి మధ్యే మార్గంగానే వస్త్రధారణ చేసుకొని, చక్కటి ఇంగ్లీషులో మాట్లాడుతున్న ఆ మహిళ తన కంపోజర్ పోగుట్టుకోలేదనే నా కనిపించింది.

ఇలా చంపేయండం తప్పుకాదా!!!???

రాను రాను నేను కూడా ప్రనోయ్ రాయ్ CIA ఏజెంట్ అనేస్తానేమో అని భయంగా ఉంది . పై పెచ్చు ప్రనోయ్ రాయ్ ఎకనామిక్ అడ్వైజర్ గా పనిచేసాడన్నది నాకు తెలీదు!  నా కంతగా నచ్చని “గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్”  – అరుంధతిరాయ్ కి ఈన అంకులు. బ్రందా కరత్, రాధిక రాయ్ (ప్రనయ్ రాయ్ భార్య – NDTV డైరెక్టర్ ) అక్కచెళ్ళళ్ళు; ( తెలీన వారికి ఫుల్లు మెదడు కి మేత  🙂  ) –  నా భయానికి తోడు,  దానిలో ఓ స్పానిష్ మిషనరీ కి స్టేక్ ఉంది అని ఎవరో అంటే NDTV సైట్ కెళ్ళి చూసేశా! అపారెంట్గా ఏమీ లేదు.

వివిధ పేర్లలో 60% రాయ్ ఫామిలీ దే!  అదే విషయం చెప్తే  – ఆ 60% ఆ మిషనీరీ నించే వచ్చాయేమో అన్నారు. వామ్మో!

ఏది ఏమైనా, ఇలా పీక నొక్కేసి చంపేయడం తప్పు కాదా!!!????

ప్రకటనలు
Explore posts in the same categories: బ్లాగుల గురించి

4 వ్యాఖ్యలు పై “చంపడం తప్పా?”

 1. ajnatha Says:

  వేరే బ్లాగుల నుంచి పాకీ టొక్కడం, స్పూర్తి దొంపడం .. తప్పా ?
  మనకు కావలసింది ఒక మంచి బ్లాగు. కామెడీ కావొచ్చు. బూతు కావొచ్చు. శృంగారం కావొచ్చు. ఇంకేదో అవ్వొచ్చు. డ్రాఫ్ట్ స్టేటస్ లో ఉన్న బ్లాగు ను కాపీ చేస్తేనో ఎవరో వ్రాసుకున్న కథను దొంగలించి మన బ్లాగులో పెడితేనో తప్పుకానీ, general public కి రిలీజయిన బ్లాగ్స్ నుంచి స్పూర్తి పొందుతూ తమకు అనుగుణంగా అన్వయించుకుంటే తప్పు ఏమిటీ? నా ఉద్దేశం, నాకు జావా రాకపోతే ఇంకెక్కడినుంచీ కాపీ చేస్తాను. బ్లాగు రాయడం రాకపోతే ఇలా పాకీ కొడ్తుంటాను. అందరూ నాలాగే తింగరోళ్ళుగా ఎందుకుండరో అర్థం కావటం లేదు.
  రీమే పెచ్చండి రేవే గ్లాబుల నుంచి పాకీ టొక్కడం పత్తా?

 2. a2zdreams Says:

  good write up ..

  in my opinion – as long as we don’t degrade any thing and don’t hurt some one, nothing is wrong

  I strictly follow that. i don’t really care one.

 3. rayraj Says:

  hurting others is not in your hands. it is in their hearts.

 4. rayraj Says:

  🙂 పుత్త లేదు నాకీ, నీ పాకీ టొక్కడం వల్ల ఎవడికిన్నా ఆర్ధికంగా నష్టం వచ్చినా, వాడికి రావాల్సిన పేరో, మరింకేదో నీకొచ్చేసిన, నీ పుచ్చె గేరుతుంది. 🙂
  మీరు రాసిన జావా కోడ్ మీద కాపీ రైట్ మీది కాదు – మీ కంపెనీది. నాన్ – కంపీట్ అగ్రిమెంట్ సైన్ చేసారా లేదా…ఇంకేదైనా చేసారా లేదా!? అందుకని సందర్భానుసారంగా చూసుకోవాలమ్మా…ఎలా పాకీ టొక్కడం వల్ల నిన్ను కొట్టరో!


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: