మంటనక్క-వాలెంటైన్-మన సంస్కృతి

ప్రేమికుల రోజు గా పిలవబడుతున్న ఈ రోజు అసలు ప్రేమికుల రోజు కానే కాదు.
ఆ విషయమే  మీరు గూగుల్ చేసి చదువుకోండి. ఇంగ్లీషులో….

తెలుగులో కొట్టా , షరా మామూలే …అంత రామసేన గొడవే…….
మళ్ళా NDTV అన్నానని చిరాకు పడకండీ…..వదిలిపెట్టకుండా పెద్దది చేసింది మీడియానే!
ఆ పింక్ పాంటీస్ లో ఏమి ఫన్నీ కనపడలేదు నాకు… రామసేన ని లాఫింగ్ స్టాక్ చేస్తాం అంటూ దానికి అనవసరంగా సీనిచ్చారు…అంతకు ముందు ఎవరకు తెలుసు…!? మీకు ఫ్రీ మ్యాసన్స్ తెలుసా?

తెలుగులో కొట్టినందుకు నాకో ఇంకో విషయం బోధపడింది : కొంత మంది మంచి బ్లాగురలు కూడా మరుగున పడిపోతారని.ఎందుకంటే, వాళ్ళని మనం ఎప్పుడూ టాప్ పోస్ట్స్ లోకి తీసుకురాం…అందుకని

ఈ బ్లాగు లోని పోస్టు కాస్త  లైటర్ వీన్లో ఉంది…నవ్వుకోండి….తెలుగు -ఓంగోలు – గుజరాతి; ఇలాంటి వాళ్ళనే తెలుగులోకం బయటికి తెస్తే, తెలుగు మరింత ఇనుమడిస్తు. ఒక్క  తెలుగువాడి తెలుగే అయితే, అతి తొందర్లోనే మన భాషగా మిగలదు.

ఒకే ఒక్క చోట  అసలు వాలెంటైన్స్ డే మీద ఒక చిన్న పీస్! ఇక్కడ. ఇది కూడా సెర్చ్ లో ఎక్కడో ఉంటుంది లెండి.

తెలుగు భాష పదాల మీద వీరు రాసిన మరో బ్లాగు. (వీరు ఫేమస్సే ననుకుంటా) ఇవ్వాళ నాకు నచ్చింది – పాత డామాజ్ కంట్రోల్ కూడా ఒక సారి  చదవండి.

తెలుగు మీద అభిమానంతో ఉన్న వారు దృక్పదాలలో తెచ్చుకోవలసిన కొన్ని మార్పులు:
౧.ఇంగ్లీషులో ఉన్న పదాలకి తెలుగులో పదం పనకి తెలియక పోతే, వెంటనే పదాలు పుట్టించడం కాదు.కొన్ని ఉన్న పదాలని వాడుకలోకి తెచ్చుకోవడం
౨.వద్దన్నా వేరే భాషా పదాలు మనకి వచ్చేశాయి. అలాంటివి మనం కలిపేసుకోవటం – ఇంటర్నెట్ , వెబ్, లాంటివి

మంట నక్క నవ్వుకోవుడానికి బావుంది గాని, దాన్ని అలా అన కూడదు : అది చేసిన వాళ్ళు దానికి ఫైర్ ఫాక్స్ అని పేరు పెట్టారు కాబట్టి దాన్ని అలాగే పిలవాలి.  మైసూర్ సాండల్ సోప్ ని మైసూర్ చందన…..వాటెవర్ అనకూడదు.అది దాని బ్రాండ్. చార్మినార్ ని నాలుగు స్థంభాలు అనకూడదు. కుతుబ్ మినార్ ని కుతుబ్ స్థూపం అనకూడదు…..(రివర్స్ లో ఇడ్లీని “వైట్ రైస్ కేక్”  అని కూడా చెప్పకూడదు, సాంబార్ ని “స్పైసీ టామిరిండ్ జ్యూస్”  అనకూడదు)

ఇలా టైం వేస్ట్ చేసుకోవడం కంటే, పరుగెట్టి కెళ్ళి పోతున్న ప్రపంచంలో అందుకోవటానికి ఆల్రెడీ తెలుగు వారు ప్రతి సమాచారాన్ని తెలుగులో వ్రాసుకోవాల్సిన పరిస్ధితి…….

సమాచారంలో ఆలస్యం చాలా సార్లు సమాచారానికి విలువ లేకుండా చేస్తుంది.
లేక పోతే ఒక్క సాహిత్యాన్ని, వేదాంతాన్ని తెలుగులో చదువుకోగలగుతాం అంతే!  సిన్మాలు, సెక్స్ భాష లేకుండా కుడా ఆనందించచ్చు.

ఎప్పుడో ఫోటో క్విజ్ ఒకటే నా – శ్రీపతి గారి ఇతర వ్యాసాలు చదివి  కామెంటేసే ఇంటరెస్టు ఉన్న ఒక్క “తెలుగు” వ్యక్తి కూడా లేడా!!!!!??????

కోట్ ఫ్రం తిలక్ “మన సంస్కృతి” అగైన్ ( ఎవరో “నాగొడవ” బ్లాగ్ స్పాట్ లో అమృతం కురిసిన రాత్రి కి ఫస్ట్ వచ్చుంది సెర్చ్ రిజల్ట్స్ లో ;  వెళ్తే బ్లాగు లేదు 😦 )

                 ……..     కాలానికి నిలబడ గలిగినదీ వద్దన్నా పోదు

                                        మరణించిన అవ్వ నగలు

                     మన కాలేజీ అమ్మాయి ఎంత పోరినా పెట్టుకోదు

                     యుగయుగానికీ స్వభావం మారుతుంది

                    అగుపించని ప్రభావానికి లొంగుతుంది

          అంతమాత్రాన మనని మనం చిన్నబుచ్చుకున్నట్లు ఊహించకు

         సంతత సమన్వయావిష్కృత వినూత్న వేషం ధరించడానికి జంకకు

         మాధుర్యం, సౌందర్యం, కవితా

         మాధ్వీక చషకంలో రంగరించి పంచిపెట్టిన

        ప్రాచేతస కాళిదాస కవిసమ్రాటులనీ

        ఊహా వ్యూహోత్కర భేదనచణ

         ఉపనిషదర్ధ మహోదధినిహిత మహిత రత్నరాసుల్నీ

         పోగొట్టుకునే బుద్ధిహీనుడెవరు?

         ఎటొచ్చీ విధవలకీ వ్యాకరణానికీ మనుశిక్షాస్మృతికీ గౌరవంలేదని

          వీరికి లోపల దిగులు

          వర్తమానావర్త ఝంఝావీచికలికి కాళ్ళు తేలిపోయే వీళ్ళేం చెప్పగలరు?

           అందరూ లోకంలో శప్తులూ పాపులూ

           మనం మాత్రం భగవదంశ సంభూతులమని వీరి నమ్మిక…..

…………….

ఏ దేశ సంస్కృతి అయినా ఏనాడు కాదొక స్థిరబిందువు

నైక నదీనదాలు అదృశ్యంగా కలిసిన అంతస్సింధువు.

 

ప్రకటనలు
Explore posts in the same categories: బ్లాగుల గురించి

5 వ్యాఖ్యలు పై “మంటనక్క-వాలెంటైన్-మన సంస్కృతి”

 1. Marthanda Says:

  ఆ టపా ఒక జోక్ కాకపోతే మరేమిటి? ఫిబ్రవరి 14న చనిపోయిన సెయింట్ వాలెంటిన్ పేరు మీద వాలెంటిన్స్ డే వచ్చింది. దానికి గుజరాతీయులకి సంబంధం లేదు.


 2. ఎక్కడో మొదలెట్టి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు.

 3. aswinisri Says:

  మీరు ఎక్కడ మొదలెట్టినా తుది మాత్రం బాగుంది. నాకు తిలక్ కవితలంటే ఇష్టం! Aptly quoted here.”అంతమాత్రాన మనని మనం చిన్నబుచ్చుకున్నట్లు ఊహించకు

  సంతత సమన్వయావిష్కృత వినూత్న వేషం ధరించడానికి జంకకు”

 4. rayraj Says:

  @ మార్తాండ : అది జోకనే చెప్పాను . పింక్ పాంటీస్ లో ఫన్నీ గా ఏమీ లేదు( టివి లో వాళ్ళు అది ఫన్నీ అన్నారు), ఈ టపా చూడండి ఫన్నీ గా ఉంది అని 🙂 నవ్వుకోండన్నానా, ఆ పొస్ట్ హాస్యం లో వర్గీకరించబడింది కదా!

  @ మహేశ్,అశ్వినిశ్రీ – ఇంకొంచెం క్లియర్ గా ఉండొచ్చేమో.నిజమే. కానీ ఎక్కడో మొదలెట్టడం కాదండి – కొన్ని మార్పులు తప్పవు. వాటికి ఎక్స్ ట్రీం సొల్యూషన్స్ వెతకటం కాదు, “అస్సిమిలేట్” అని చెప్పడం నా ఉద్దేశ్యం.
  రామసేన కి వాలెంటైన్ నచ్చకపోవటం ఒక చివర నుంటే , పింక్ పాంటీలు వాళ్ళకు పంపించడం ఇంకో చివరన్న మాట. అలాగే తెలుగు భాష అసలు వెబ్ ప్రపంచంలో లేకపోవటం ఒక చివరైతే, ఫైర్ ఫాక్స్ ని మంటనక్క,ఇంటర్నెట్ ని అంతర్జాలం అనటం ఇంకో చివరన్నమాట.”అసిమిలేట్” చేసుకోక పోతే కష్టం.
  చేసుకుంటేనే నిలబడతాం.”అసిమిలేట్” కి తెలుగు పదం ఉంది, తట్టటం లేదు -సారీ.

  అలాగే తెలుగు లో కొత్తవి పుడుతేనే అది అభివృద్ధి చెందుతుంది . లేకపోతే జీవితకాలం తర్జుమా చేస్తుంటాం, అంతే. కొత్తగా పుట్టడం అంటే, రేసు లో అందుకోవటానికి ప్రయత్నించడం కాదు — రేసె రూల్స్ ని నిర్ణయించి శక్తిగా ఎదగటం.

  ఓ ప్రభంజనం, అలాంటి మార్పుదోహద పరిచే స్థాయిలో మన దగ్గర పుడితే – తెలుగు నుంచి/లోకి తర్జుమా చేసుకొనే పరిస్థితి మిగితాభాషలకి పుడుతుంది.

  అలాంటి ఐడియా ఎలాపుడుతుంది – మనం ప్రపంచాన్ని అందుకోవటానికి తర్జుమాలొ గడిపేస్తుంటే!? ఇంగ్లీషు చదువుల్లున్న ఒక్క వ్యక్తులనించే ఇప్పుడు ఆలోచనలు ప్రపంచానికి పంచ బడుతున్నాయి.అందుకనే మనం తెలుసుకోవాల్సిన ప్రపంచం గురించి శ్రీపతి గారిని ఉదహరించాను. దురదృష్టవశాత్తు ఆ పోస్ట్ ఎందుకో ఇప్పుడు లేదు

  @అశ్వినిశ్రీ , తుది మాత్రం బాగుంది – “వినూత్న వేషం ధరించడానికి జంకకు” – that’s it. thank you.

 5. bhavani Says:

  వావ్! తిలక్ గారి పద్యం చాలా బాగుంది.
  పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
  మీరు మహేష్ గారికిచ్చిన సమాధానం కూడా.


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: