Waiting for Mahatma -కథ చెబుతా కథ చెబుతా

కథ చెబుతా కథ చెబుతా…..అని కమల్ హాసన్ మైఖేల్ మదన కామ రాజు సినిమాలో స్టాటింగ్ పాట.
నేను సింగీతం రేంజిలో ఫీలయ్యి కథల చెబ్దామనుకున్నా…
ఏమి చెప్పాలి అని తెగ ఆలోచిస్తున్నా…. గత కొద్ది రోజుల్నించి…….
నాకే ఇంత ఇదిగే ఉంటే, నిజంగా సినిమా తీద్దాం అనేవాడికి ఏ కథ తీద్దాం అని డిసైడ్ చేసుకోవటం ఇంకెంత కష్టమో కదా!

నాకు నిజానికి హీరోయి(ని)జం లేని సినిమాలు వ్యక్తిగతంగా నచ్చవు. అలా అని, అది లేకుండా సినిమాలు తీయలేమా? – అంటే తీయొచ్చు. కానీ, నిలబడి పోరాడి గెలిచే పాత్ర లేని కథలు నాకు నచ్చవు. దీన్ని షార్ట్ గా “ఓ! యాక్షన్ సినిమాలిష్టమా! ” అనేయొచ్చు. నిజమే కానీ, దానికింకా చాలా తోక ఉంది. ఇప్పుడు ఆ థ్రెడ్ వద్దుకానీ, చివరికి ఈ కథని ఎందుకు ఎంచుకున్నానో ఓ మూడు కారణాలు చెబ్తా.

ఏ కథా అంటారా…..”Waiting For Mahatma”…అనే R K Narayan నవల. ఇది ఆయన రోజుల్లో బానే హిట్టుట కూడా లెండి.

ఎందుకు ఈ కథ:
1. నేను ఈ కథ “అసలు” అర్ధం విడమర్చి చెబితే, సో కాళ్డ్ ఇంటలెక్త్యుయల్స్ నోళ్ళెళ్ళ బెట్టారు.అప్పుడే నాకు తెలిసింది – నేను “అసలు” ఇంటలెక్ట్యుయల్ మెటీరియల్ అని. 🙂 అంటే నేనొక్కడ్నే అర్ధం చేసుకున్నానని కాదు, ఆ రోజుకి నా సర్కిల్లో నేనొక్కడినేనని. ఈ కథ చెప్పడానికి – ఈ స్వోత్కర్ష ఒక కారణం.
2. ముందు లోకేషన్ బేస్డ్ సినిమాలతో చెప్పు కుందామూ, మనకందులో “మాస్టారీ” కదా అనుకున్నా. కానీ, ఎందుకో ఈ కథయితే కాస్త లొకేషనల్ ఛాలెంజ్ తో పాటు – ఇది “పిరియడ్ మూవీ” – అలాగూ ఛాలెంజింగ్ గా కూడా ఉంటుంది – అనుకున్నా.
౩.నవల్లో హీరో ఏదో సోమరిగా, “విధి”బలంలో కొట్టుకుపోతున్న వాడిలా అనిపించినా – మనం సినిమాలో మాంచి ఎనర్జిటిక్ హీరో తో లైవ్లీ గా తీసి, మంచి కమర్షియల్ గా మార్చటానికి కావల్సిన ఛాలెంజ్ కూడా ఇందులో ఉంది కాబట్టి. అంటే – ఇందులోనూ – హీరో – హీరోలా కనిపించేలా చేయటం అన్నమాట.

కథ కొస్తే – మామూలుగా చూస్తే చాలా సింపుల్ స్టోరీ :
కథ జరిగే సమయం ప్రీ ఇండిపెండెన్స్ – క్విట్ ఇండియా మూవ్ మెంట్ కాలం అనమాట.

శ్రీరామ్ అనే ఓ యువకుడు మన మాల్గుడిలో ఉంటాడు. వాడప్పుడే మేజర్ ఔతున్నాడు. అంతకాలం – వాళ్ళ అమ్మమ్మ వాడిని పెంచుతుంది.(లేక నానమ్మ కూడా అయ్యొండొచ్చేమో). బాల్యం అంతా అమ్మమ్మ అధీనంలోనే జరిగిపోయింది. వాళ్ళ ఇల్లు కూడా బానే పెద్దగా ఉంటుంది. ఇప్పుడు తను మేజర్ అయ్యాడుకాబట్టి తను బోళ్డు చేసుకోవచ్చు. ఆవిడ ప్రతిరోజు ఈ మనవడిని వీధి చివర బ్యాంకు దగ్గర తీసికెళ్ళి, డబ్బు ఉందోలేదో లెక్క చూసుకొని, పాస్ బుక్ లో ఎంట్రీలు వేసుకొని, మళ్ళా వస్తూండేది. మేజర్ అయ్యిన మనవడిని ఆ రోజు బ్యాంకు కు తీసుకెళ్ళి, ఆ డబ్బు అంతా ఇక శ్రీరాం దే అని చెప్పి పాస్ బుక్ అప్పగిస్తుంది.

ఆనందంలో మనవాడు రోడ్డెక్కుతాడు. ఎప్పటినించో చేద్దాం అనుకొన్నవి మొదలెడదామని బయలు దేరతాడు. కానీ, అలా వెళ్తుంటే, రోడ్డు మీద ఓ అందమైన అమ్మాయి కనబడుతుంది.మన వాడు పూర్తి “ప్రేమ” లో పడి పోతాడు – లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకోండి. ఆ అమ్మాయి దగ్గరగా వస్తుంది. ఆ అమ్మాయి ఓ ఊరేగింపు కి లీడర్!; దగ్గర కొచ్చి, చందా వసూలు చేసుకొని మరీ వెళ్తుంది. మన వాడు సగం కల్లో ఉన్నట్టే ఉంటాడు. అంతే, ఇహ ఆ అమ్మాయి వెంటే వెళ్ళిపోతాడు. మాట్లాడతాడు. పెళ్ళి చేసుకుందాం అంటాడు.ఆ అమ్మాయి నవ్వేసి, “సరే నా కెవరూ లేరు. గాంధీ గారే నాకన్నీ. ఆయనొప్పుకుంటే ఓకే” అంటుంది.

గాంధీగారు చాలా బిజీ నాయే! అసలు ఆ ఊళ్ళో ఉన్నాడుగాపట్టి సరిపోయింది గానీ!లేకపోతే! సరే మొత్తానికి అర్ధరాత్రి , ఆయన విశ్రాంతి టెంట్ లో మన హీరో, ఆ అమ్మాయి గాంధీని కలుస్తారు. ఆ అమ్మాయి పేరు – “భారతి”.

గాంధీ గారు బానే మాట్లాడతారు; అదీ ఇదీ అన్నీ – అసలు విషయం తేల్చడు. సరే చివరకి, అలా ఇద్దరిని నడిపిస్తూ, తిరుగుతూ – “నాక్కొంచెం సమయం కావాలి. అప్పటి వరకు నువ్వు మన కార్యక్రమాల్లో పనిచేయి.భారతి నీకు అన్నీ నేర్పిస్తుంది, గైడ్ చేస్తుంది” – అన్చెప్తాడు. ఎలాగైనా ప్రేమ దక్కించుకోవాలన్న మన హీరో ఒప్పేసుకుంటాడు.

కానీ, అప్పుట్లో కార్యక్రమాలు ఎప్పుడూ ఉన్న ఊళ్ళోనే ఉండేవి కావు. అన్నీ గ్రామాలు తిరుగుతూ వెళ్ళాలి. అందుకని మనవాడు భారతి కి దూరంగా వేరే ఊరికి వెళ్ళి పోవాల్సి వస్తుంది. భారతి కుడా, ’విరహమైనా తప్పుదు కదా, ఇది గాంధీ గారు చెప్పిందని’ నచ్చ చెప్పి పంపిస్తుంది.

ఈ ఎడబాటులో మనవాడికి కొంత మంది తీవ్రవాదులతో స్నేహం ఏర్పడి – ఓ రకమైన పరిస్థితులలో మనవాడు కూడా ట్రైన్లో బాంబులు పెట్టడాలు గట్రా తీవ్రవాద చర్యల్లో ఇరుక్కుంటాడు. పోలీస్ లు వెతుకుతుంటారు. అజ్ఞాతంలో తిరుగుతూ, పిచ్చాడైపోయి గడ్డాలు, జుట్టూ అన్ని పెరిగి పోతాయి. అసలు “భారతి” ఎక్కడో ఉంటే నేనింటీ ఇక్కడ అని, చివరికి మళ్ళా ఓ రోజు మాల్గుడి కి వస్తాడు. కానీ పోలిసుల నించి తప్పించుకుంటూ ఉండాలాయే! అప్పుడు తెలుస్తుంది, అమ్మమ్మ చచ్చిపోయింది, సంస్కారం చేస్తున్నారని! అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి చూస్కోలేడు! మళ్ళా వెళ్ళి తన డబ్బు, దస్కం, ఆస్తీ పాస్తీ అన్నీ తెచ్చుకోలేడు; అన్నీ వదులుకొని, దిగాలుగా దేశం మీద పడతాడు.

మళ్ళా ఓ సారి భారతి కనపడుతుంది. ఎక్కడికి పోయావని, ఏమై పోయావని బాధ పడుతుంది. కాకపోతే, ఇంతకాలం ఆమె గాంధీ కార్యక్రమాల్లో బిజీగానే ఉంది .శ్రీరామ్ ఎప్పటికైనా వస్తాడని, ఆమె నమ్మకం అనుకుంటా! ’”ఇక ఈ సారి ఆగద్దు, పెళ్ళి చేసేసుకుందా” అంటాడు. కానీ, గాంధీ గారొప్పుకోవాలి అని మళ్ళీ మొదటి పాట! చేసేదేమి లేక ఒప్పుకుంటాడు.మళ్ళీ గాంధీని కలుస్తారిద్దరు. కానీ, అయన మరింత బిజీ అయిపోయాడు. “ఇంకొంత కాలం ఆగండి, వచ్చి చెబ్తా”నంటాడు.

సరే వీళ్ళు ఏదో ఆ సేవ – ఈ సేవ కార్యక్రమాల్లొ ఇంకొన్ని రోజులు కాలం గడిపినా, ఇక లాభం లేదు, ఇవ్వాళ తేల్చేయాలని డిల్లీ వెళ్తారు. కిటికి దగ్గర నిలబడే ఉన్నారు. గాంధీ గారు గమనించినట్టుగానే సూచించినా, ముఖ్య విషయాలలో పటేల్ తో ఏదో మాట్లడుతున్నారు.పటేల్ కొంచెం మొహం అదోలా పెట్టుకొనే వెళ్ళిపోయారు. తర్వాత, వీళ్ళిద్దరినీ పిలిచి….”చాలా రోజులైపోయింది కదూ! ఔను లేటయిపోతోంది. ఇంక మీ గురించి నిర్ణయించేస్తానులే!…ఇప్పుడు ప్రార్ధన కి సమయం అయ్యింది. ఉండండి వెళ్ళొస్తా ” అని చెప్పి మనమరాళ్ళ మీద చేతులేసుకొని ప్రార్ధన స్థలం వైపు వెళ్ళి పోయాడు.

వీళ్ళు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకొని, కొంచెం బాధలో , కొంచెం ఆశలో మౌనంగా మాట్లాడుకుంటుంటే, ప్రార్ధనా స్థలం దగ్గర ఎదో కల కలం…….గాం….ధీ…..ని ఎ….వ…..రో కా…..ల్చే…..శా…….రు………

వీళ్ళు షాక్! ఇక వీళ్ళని కలిపేదెవరు!? వీళ్ళింకా గాంధీ కోసం వేచి చూస్తునే ఉన్నారు!!!!!

ఇది కధ. కానీ ఇందులో అసలు మర్మం ఏంటటే…ఇది చాలా ఎలిగరికల్ స్టోరీ….మెటపరికల్ స్టోరీ,…వాటెవర్…పండితులకొదిలేస్తున్నానది.

శ్రీరామ్ – ఆనాటి భారతీయ యువత
భారతి – గాంధీ కలలుగా యువత కు చూపిన అందమైన భారత దేశం
అందుకే “శ్రీరామ్” పరిణితి చెందగానే “పెళ్ళి” చేద్దాం అనుకున్నాడు. కానీ విధి కధ వేరోలా ఉంది.
మధ్యలో యువత తీవ్రవాదం లోకి వెళ్ళింది. మళ్ళీ వచ్చింది. ఈ మధ్యలో మనకి సంప్రదాయ సిద్ధంగా ఉన్నా ఆస్తి పాస్తులూ, మన “యాన్సిస్ట్రీ” అంతా ఎవడి పాలో అయిపోయింది. అసలు వారసత్వంగా రావల్సిన సంపద,విద్య గంగలో కలిసిపోయింది. – అదే అమ్మమ్మ, ఆవిడ మనుమడి కోసం జాగ్రత్తగా దాచిన బ్యాంకులో డబ్బు.
గాంధీ తేల్చుకోలేకపోయాడు – ఈ యువత తన యువభారతి కి తగ్గదో కాదో నని!
ఆ యువత – పేరుకేదో ఇండిపెండెన్స్ వచ్చినా – ఇంకా ఆ భారతిని పొందలేదు. వేచి చూస్తినే ఉన్నారు.

చెప్పండి – ఈ సినిమా తీయాలంటే – ఎన్ని గట్స్ కావాలి!
పిరియడ్ ఫిల్మ్ ఇది – ఓ మాయబజార్ కధలా అసలు మూలాన్ని ఎక్కడ తప్పించకూడదు – గాంధీ పాత్ర పరెఫెక్టుగా ఉండాలి – ఆ రోజులు గడుస్తున్నప్పుడు మీ బ్యాక్ డ్రాప్ లు అప్పటి పొలిటికల్ మూవ్మెంట్స్ ని, సాంఘిక స్థితిగతుల్నీ, అదీ వేరు వేరు ప్రాంతల్లో వేరు వేరు గా చూపించాలి!! – ఎంత పని చేయొచ్చు!?- సినిమా డిపార్ట్మెంట్స్ లో ఉండే ప్రతి ఒక్కడికి తన టాలెంట్ చూపుకోగల సత్తా ఉన్న సినిమా – పైకి ప్రేమ సినిమా – అంతర్లీనంగా ఉన్నభావం – రెండు చూపించడంలో కృతుక్త్యులవ్వడానికి దర్శకులకు ఎంత టాలెంట్ ఉండాలి!?

ఇలా తీస్తే, కాపీ కొట్టినట్టెందుకవుతుంది? వాడండి – నేర్చుకున్న స్కిల్ సెట్స్ అన్నీ వాడండి! ఓ ఆస్కర్ అవార్డ్ సినిమా కి ఎంత గ్రిప్ అవసరమో అంత గ్రిప్ తో సినిమా తీయండి.

పైగా “గాంధీ” ఈజ్ ఏ గ్లోబల్ సబ్జెక్ట్ -మన భూ భాగం నించి మనం ఎగుమతి చేసుకున్న సబ్జెక్టే – తీసే విధానంలో “ప్రేమ” అనే ఎమోషన్, అంతర్లీనంగా ఉన్న భారత యువత చరిత్ర చెప్ప గలిగితే – ఖచ్చితంగా – ఇది గ్లోబల్ మూవీ యే! మీరు గ్లోబల్ మార్కెట్ లోనే ఆలోచించండి!

ఫుల్ స్కేల్ కమర్షియల్ సినిమా ఇందులో ఉంది – మీకూ కనిపించిందా!!??

ఈ కధ ఇలా అని చాలా మందికి తెలుసు. అరుంధతి రాయ్ “గాడ్ ఆఫ్ స్మాల్ ధింగ్స్” ఇలాగే రాసుకున్నా- ఆ ప్లాట్ నాకంతగా నచ్చలేదు.కాకపోతే ఆవిడే ఓ సారి ఎక్కడో చెప్పింది. దాని భావం నాకిలా గుర్తుంది – “ఇంగ్లీష్ లో రాయడం ఎలా అనేది మనకు మార్గం చూపిన RK Narayan తరువాత మళ్ళా అందరం గజిబిజి ఔతుంటే, సాల్మన్ రష్దీ దారి చూపెట్టాడు. అదే స్తైల్లో నేనూ” అని ; సాల్మన్ రష్దీ “మిడ్ నైట్స్ చిల్డ్రన్” చదివాను. అది ఇండిపెండెన్స్ నించి చరిత్రని – ఇలా గే ఇంకో  మెటాఫరికల్ స్టోరీ లో చెబ్తుంది – కానీ అది చాలా కాంప్లెక్స్ – పైపైన కనబడే కధ కూడా పైన చెప్పినంత సరళంగా ఓ స్టోరీలా చెప్పుకోలేం – కానీ అందులోనూ మంచి మెటఫారికల్ స్టోరీలున్నాయి. అదైతే మనం – ఓ సీరియల్ గానూ లేకపోతే మూడు సీక్వల్ సినిమాలుగానో తీయొచ్చు. బట్ ఇట్స్ మోర్ కాంప్లెక్స్ అన్డ్ కాంట్రవర్షియల్.

Waiting for Mahatma నవల చదివి చాలా కాలమయ్యింది. చదివిన వాళ్ళు తప్పులు చెప్తానంటే, నేన్రెడీ!! నాకు తగిలిన భావాన్ని, నాకోవలో చెప్పాను.నిజానికి ఇంకా చాలా ఉంది.
( P.S. సినిమా వాళ్ళనుద్దేసించినట్టు రాశాను. ఊరికే “కుతి” అంతే! నిజంగా చదువుతున్న వాళ్ళలో సినిమా వాళ్ళున్నారో లెదో! నాకు తెలీదు 🙂 )

ప్రకటనలు
Explore posts in the same categories: సినిమా రివ్యూలు

ట్యాగులు: , ,

You can comment below, or link to this permanent URL from your own site.

3 వ్యాఖ్యలు పై “Waiting for Mahatma -కథ చెబుతా కథ చెబుతా”

 1. venkat Says:

  ఈ నవల నాకూ బాగా నచ్చింది. శ్రీనివాస్ కృష్ణన్ అనుకుంటా ఈ నవలను సినిమాగా తీశాడు. రెండు మూడేళ్ళ క్రితం. శ్రీనివాస్ కృష్ణన్ ఎవరంటే మసాలా సినిమా తీసినాయన. ఇక మసాలా సినిమా ఏంటంటే ఒక విధంగా ఇది ఫస్ట్ క్రాస్ ఓవర్ సినిమా…..

 2. aswinisri Says:

  good! but I feel they would definitely miss your track. area bhaiyyaa! what about five or six songs? where to insert those!

 3. rayraj Says:

  @venkat: చాలా ముఖ్య సమాచరమే అది. కొద్ది గూగుల్ చేసినా పెద్దగా ఇన్ఫో లేదు. ఈ కెనడియన్ డైరెక్టర్ కి – ఓ కెనడియన్ ఇన్వెస్టెమెంట్ పర్మ్ ఈ ప్రాజెక్ట్ కి ఫండింగ్ ఇస్తున్నట్టు దొరికింది అంతే. కానీ సినిమా రిలీజ్ అయ్యిందో లేదు తెలీలేదు.
  పైగా స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు – గాంధీని హత్య గావించే వాడిని, ఓ గాంధేయిరాలు(హీరోయిన్) ట్రైన్లో కలిసినట్టు రాసుకున్నట్టు కూడా అర్ధమవ్వుతోంది. వాళ్ళు RK Narayan ని అంతకుముందే కలిసి మార్చుకొంటే, నేను నో కామెంట్; కానీ నా దృష్టిలో అది అసలు స్టోరీలో స్పిరిట్ కి కొంచెం తేడాగానే ఉన్నట్టు. నా ఇంటర్ ప్రెటేషన్ లో హీరో ఇస్ ది యూత్ విచ్ హాస్ సీన్ ది డ్రీమ్ ఆఫ్ గాంధీ అండ్ ఆస్పైర్డ్ ఫర్ ఇట్.
  వాళ్ళది వేరే మూవి మేకింగ్ స్టైల్.ఐనా ఇంకొన్ని వివరాలు చెప్పగలిగితే కృతఙ్ఞుడను.

  @Aswinisri and venkat:
  నాకు లోకల్ ఇండియన్ సెన్సిబిలిటీస్ తోనే అద్బుతమైన సినిమా తీయచ్చునని ఫీలింగ్. కాంట్రవర్సీ తో సక్సస్ సాధించే ఉద్దేశ్యం కాదు.
  సో, పాటలు కూడ అందులో ఉండాలి.అది సాధ్యమే, రాసుకునే స్క్రిప్ట్ బట్టి ఉంటుంది, కానీ ఉదా:
  1.మొట్టమెదటి సారి భారతి ని చూసి బోళ్డ్ ఓవర్ అయినప్పుడు.
  2.తీవ్రవాద అఙ్ఞాత వాసంలో భారతిని తలచుకొని బాధ పడే సమయంలో ఓ సాడ్ సాంగ్ మెదలెట్టి – బ్రేక్ ఇచ్చి – అమ్మమ్మ చచ్చిపోయిందని తెలిసినప్పుడు -హై నోట్ నుంచి మళ్ళా మొదలెట్టి దేశమ్మీద కెళ్ళి పోయేటప్పుడు ముగించడం.
  3. సేవా కార్యక్రమాల్లో భారతితో పాల్గొన్నప్పుడు మొదలెయ్యే దేశభక్తి పాట – బ్రేక్ ఇచ్చి – తీవ్రవాదులకు రూపాంతరం చెంది వాళ్ళు దేశభక్తితో పాడుకోవటంలో వచ్చి – భారతిని రెండో సారి కలసిన తరువాత మళ్ళా వచ్చి ముగిసిపోవటం(స్టోరీ ప్రకారం almost అప్పటికి స్వాతంత్ర్యం వచ్చేసిందేమో, ఐనా అది నోఖాలిలోనో
  ఏదో అలా పెట్టుకోవచ్చు)

  ఐ యామ్ ష్యూర్ ఐ కెన్ మేక్ సిక్స్ సాంగ్స్ ఇన్ దిస్ మూవీ – సరిగ్గా అన్నీ కలసివస్తే ప్రతి పాట సూపర్ హిట్ అవుతుంది.కలసి రావటం అనేది మాత్రం సినిమాలు తీసేవాళ్ళుకు బాగా తెలుసు. ప్రతిది మనం అనుకున్నట్టే రాకపోయినా, ఒకో సారి ఎఫ్ఫక్ట్ బావుంటుంది.ఓకోసారి కంపు అవుతుంది. అది మాత్రం చాలా విషయాలమీద ఆధారపడి ఉండే విషయం – విజులైజేషన్ ప్రకారం ఖచ్చితంగా అన్నీ మంచి విషయాలే – హిట్ చేయగలిగిన విషయాలే!


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: