పల్లెకు పోదాం చలో చలో

ముచ్చటగా మూడోది… కవిత. భరించక తప్పదు… ”  అంటూ బాగా రాశారు దుప్పల రవికుమార్!  

కవిత పేరు ” పల్లెకు పోదాం చలోచలో…”

ఎత్తుగడలోకన్నా, ముందుకెళ్ళిన కొద్ది కవిత్వం కనబడింది.
ఇందులో కవిత్వం కంటే,  నా మనసులో భావాలకి చాలా అనుగుణంగా ఉండి ఎంతగానో నచ్చింది.

ఇందులో :

బాధ్యత మరువని రైతు గురించి చెబ్తూ :
“……… మట్టిబంధమంటూ
   పల్లెపట్టునున్నవాడి –
 నోట మట్టికొట్టాం
   అతడొట్టిపోయేలా చేశాం. ” అన్నది చాలా కరెక్టు.

“…………………………గాంధీని విగ్రహం చేసేశాం
ఆయన ఎన్నడూ తొడగని గాంధీటోపీని నెత్తినెట్టుకున్నాం
                                          గాంధేయవాదాన్ని 
                                          గాలికొదిలేశాం.”   – ఇంత చిన్న సత్యం ఎరుగలేకపోయనా సత్యాన్వేషి!!!!

“పల్లెకు పోదాం చలోచలో నినాదం
కావాలి అందరికీ ఆచరణప్రాయం ” – ఇది చాలా అభిలషణీయం – కానీ దీని కోసం కావాలి నాయకత్వం.

“అన్నింటికంటే ముందుగా మన చూపు మారాలని కోరుకో
సంస్కృతి చిహ్నాలు పట్టణాలు కావని పల్లెలని తెలుసుకో
విద్యార్థీ ఉద్యోగీ…………………… …………………..
……………………………………………………………
విధిగా ప్రతిఏటా కొంతకాలం
కర్షకుడితో కరచాలనం చేయాలని ప్రతినబూనుకో…………….”

నిజమే! చూపు మారాలి ఒప్పుకుంటా కానీ, అంతకుముందు స్టాంజా / చరణం లో –  దేశభక్తుడూ, మానవుడూ కోరుకున్నది సరియైనదే!

ప్రతి ఏటా కొంత కాలం ఎందుకూ!? కొన్ని ఏళ్ళు పల్లెల్లో ఉండేలే చేయాలన్నది నా ఉద్దేశ్యం – అన్ని పల్లెల్లోనూ ఓ రకమైన జీవన ప్రమాణ స్థాయిని తీసుకొస్తే, పల్లెల మీద మరీ ఇంత నిరాసక్తత ఉండదు కదా అన్నది నా ఉద్దేశ్యం.

రోడ్లు, సమాచార అనుసంధానం , నీళ్ళు, విద్య , ఆరోగ్యం, ఆహారం అన్నీ ఉండాలి. ఉంటే,  “మెక్ డొనాళ్డ్స్” లేదని కొందరు రారేమో గానీ, అందరూ ఆగిపోరు.

అసలు విషయం తెలుసా – అవన్నీ ఉండి ప్రజలంటూ పల్లెకి వలసెళ్తే , మెక్డ్ డొనాళ్డ్ దానిలాంటి ఇతరాలు వలస వస్తాయి. కాబట్టి ప్రజలను అక్కడికి తీసుకెళ్ళడమే ముఖ్యం.

పల్లెలో ఉన్నదే సంస్కృతి అన్నది ఓ విధంగా నిజమే అయినా, మార్పులతో సంస్కృతిలోనూ  మార్పువస్తుంది – “నిత్యావసరాలు” దొరకని పల్లెల్లో పెప్సీ, కోక్ లు దొరుకుతున్నాయె!!!!

సో సంస్కృతిలో మార్పన్నది  “మెక్ డొనాళ్డ్”  కాకపోవచ్చు, అది ఏ దేశీ కంపెనీ యో అవ్వచ్చు. కాదు అవ్వాలి – ఉడిపిలూ, దర్శినీల్లాగేనా పిలుద్దాం, ఇరానీ కేఫ్, టీ కొట్టు అనే అందాం! కాని మార్పు రావాలి – ప్రజల జీవన ప్రమాణాలు పల్లెల్లో పెరగాలి.అంతే.

నేను ఎక్కువ జీవిత భాగం నగరాల్లోనే గడిపాను. నగరాలను విడచి పల్లెల్లో జీవించే స్థైర్యం ఇప్పుడు నాలో లేదు. అక్కడ నిజానికి ఏమీ దొరకదని నాకు తెలుసు.

గాంధీ మహాత్ముడు దేశ యువతను పల్లె పల్లె కీ పొమ్మన్నాడు; కానీ ఏం లాభం!అందరూ ఇంకా అమెరికాకో మరో విదేశానికో వెళ్దా మనుకుంటున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లే అవుదామనుకుంటున్నారు.

ఇలాంటప్పుడే నాయకులు అవసరం;

అందరినీ గ్రామలకి తీసుకెళ్ళి, పల్లెల్లో ప్రజల /  రైతుల జీవన ప్రమాణాన్ని పెంచుతూ ఆర్ధిక అభివృద్ధి పొందే మార్గం అత్యంత ఉన్నతమైన జీవనం అన్న భావన కలిగించాలి .గుంపులు గుంపులుగా  ప్రజల్లో “ఔనౌను! నేనే పల్లెకు వెళ్ళాలి” అని కోరిక పుట్టేలా చేయాలి.

కానీ మన నాయకులూ!  –

ఉన్నాడో లేడో తెలియని రాముడి గుడి – మస్జీద్ అంటూ చలో చలో అని నడిపించగలరు!
 (నేను నాస్తికుడని కాదు గాని, దేవుని కంటే ముందు ఆకలి మంట “నిజంగా ఉన్నద” ని అనుభవ పుర్వకంగా తెలుసుకున్నానని నా ఉద్దేశ్యం.)

ఎన్నిటికో  డబ్బు కావాలి. కానీ దానికి పరిమితి ఉన్నది కదా! ఐనా ఎన్ని ఏళ్ళు గడిచినా సబ్సిడీలకై పోరాడదాం చలో చలో అన్నవాళ్ళే కానీ, “సరుకు ధర కాదోయ్, కొనగలిగే సత్తా నీకుండలోయ్, సంపాదించే మార్గం సృష్టిద్దాం చలో చలో” అనలేదవరు.

వడ్డీలకు వడ్డీలు కట్టలేక రైతన్న ఛస్తుంటే, మరో చోట అప్పు చేసి మాఫీ చేసామంటునే,  మళ్ళీ వడ్డీ మరో రూపంలో నడ్డి విరుస్తుందని  తెలిజేయని మోసగాళ్ళు మన నాయకులు.

“సామాజిక న్యాయం”, “వ్యవస్థ లో మార్పు” అనే వాళ్ళేగానీ, నిజంగా రైతుని/పేదవాడిని ఉద్దరించే ఆలోచన ఎవరికీ లేదు.

నేను రాజకీయ నాయకుల కోసం చూడటం లేదు. నేను “నాయకుల” కోసం చూస్తున్నాను. వాళ్ళ వల్ల ప్రజలు “పల్లెకు పోదాం చలో చలో” మని వెళ్ళాలి.అందరితో నేను వెళ్ళాలి. వారందరితో పోటీ పడాలి.అదన్నమాట!ఎందుకంటె నేను సగటు మనిషినే! నేనే గాంధీ వెనుక వెళ్ళిన మనిషిని. నేనే సుభాష్ వెనుకవెళ్ళిన మనిషిని!నేనే NTR, చిరంజీవుల వెనుక వెళ్ళిన మనిషిని. నేను సగటు మనిషిని.

చాలా మంది అంటూంటారు – “ఇవి గాంధీ రోజులు కావు – ఓ చెంప కొడితే ఇంకో చెంప చూపించడానికి” లాంటి మాటలు.

కానీ “గాంధీరోజులు” అని “స్పెషల్”  గా “కొన్ని రోజులు హింస తగ్గించేసి”  మీకలా “రెండో చెంప” చూపించే “ఫెసిలిటీ  ఇస్తున్నాం”  అని ఎవరూ అన లేదండి, ఆ రోజునైనా, ఈ రోజునైనా హింసిచే వాడు, చంపడానికైనా వెనుదీయని వాడు “విలన్” గా ఉన్నాడండి. కాక పోతే గాంధీ “నాయకత్వం” లో తెగించిన యువత, హింసలేకుండా – ’మీరు చంపినా మేమూ వినుదీయం’ అని నిలబడ్డారండి.అందుకని వాళ్ళు హీరోలు. సో గాంధీని పొగిడితే ఆ హీరోలని పరోక్షంగా పొగడినట్టు. అలాంటి హీరోల రోజులు “గాంధీరోజులు”

అలాగే, సుభాష్ చంద్ర బోస్ ఐనా !

ఇంకో విధంగా చెప్పనా!

మనిషిలో ఉండే జాతి దురంహంకారాన్ని నిద్ర లేపి, జనాన్ని ఒక తాటిపై తీసుకొచ్చినవాడు హిట్లర్. ఆయనా  మంచి నాయకుడే! అంతే గాని, ఇవ్వాళ్ళ జాత్యహంకారం చచ్చి పోయిందను కుంటే మాత్రం పొరపాటండి.

అలాగే మధ్యతరగతిలో సెక్యులరిజమ్ ఉన్నంత కాలం ఉంది – కానీ ఓ రోజుకి, ఎన్నేళ్ళ నుంచో ఉన్న హిందూత్వ – హిందూ ఫండమెంటలిజమ్ – ఒక్క సారి గా ఉబికి బయటకొచ్చింది – అద్వాని నాయకత్వంలో నండి. ఆయన నాయకుడే – ఒక్క రధయాత్ర తో దేశ చరిత్ర దిశే మారిపోయింది.

నాయకులు ప్రజల్లో నిద్రాణంగా ఉన్న ఏదో ఒక భావనని తట్టి, లేపి ” చలో చలో” మని తీసుకెళ్ళగలరు.దానికి ఈ భావం ఆ భావం అని ఉండదు.సగటు మనిషికి ఉండే అన్ని భావాల్లోనూ ఇది సాధ్యమే.

అందుకని నాయకులు అనే వారు “దీనికైతే జనాన్ని పోగేయొచ్చు”  అని పోగేయ్యరు. అది ఓ మార్కెటింగ్ అలోచనవ్వచ్చేమో కాని, నాయకత్వం కాదు. నమ్మిన ఓ విషయానికి తెగించి నిలబడి, తన వెనుక ఓ వంద మందిని తెచ్చుకోగలిగిన వాళ్ళు నాయకులు.

(అలాంటి వాళ్ళలో కొంతమందే నిజానికి చరిత్ర కెక్కుతారు. అది అదృష్టం లెండి – ఇది వేరే విషయం – ఒకానొక పుస్తకం రివ్యూ రాయాలని చాలా రోజుల్నుంచి అనుకుంటున్నాను – అందులో వివరిస్తా! కాకపొతే ఆ పుస్తకం చదివాకే నేను “అఙ్ఞాతి ప్రార్ధన” అనే కవిత రాసాను.”హే యువ! ఓ మాట! లో దాన్ని పెట్టి ,  ఇంకొంచెం వివరించాను.)

మీరు “జగడం” సినిమా చూసారా! అందులో ఓ సీను నాకు చాలా నచ్చింది……దేవీశ్రీ మ్యూజిక్ అనుకుంటా

మన హీరో రాం ఓ జట్టులో కలుస్తాడు. అప్పటికి వాడికింకా హీరో స్టేటస్ ఉండదు.జస్ట్ వాళ్ళ జట్టులో కొత్త మెంబర్ అంతే! వీళ్ళ జట్టు ఇంకో జట్టుతో కొట్లాటలో ఉంటుంది. అందులో ఒకడిని తరుముకుంటూ వెళ్తారు. వాడు పరుగెట్టి కెళ్ళి, ఒక ప్రదేశంలో తన మిగిలిన జట్టువాళ్ళతో కలుస్తాడు.

తరుముకొస్తున్న హీరో జుట్టు వాళ్ళు ఈ ప్రతి దాడికి సిద్ధంగా లేకపోవడంతో, ఒక్కొక్కటిగా వెనుకడుగులు వేస్తుంటే, హీరో తన స్థానంలో నిలబడతాడు. జట్టంతా వెనుకకు వెళ్ళి పోతే మన వాడు అందరి ముందు “హీరో” లా ఉంటాడు.

సీన్లో ఎఫక్ట్ సినిమా చూస్తే తెలుస్తుంది.(ఇది ఆ సినిమా గురించి రివ్యూ కాదండోయ్! ఆ సీను సంగతి చెప్పానంతే! ఆ సీన్ నచ్చింది అంతే! )

సో నేను చెప్పేదేంటటే, ఓ నాయకుడు కావాలి అని. ఎవ్వడైనా ఉన్నాడా!!??

ప్రకటనలు
Explore posts in the same categories: బ్లాగుల గురించి

One Comment పై “పల్లెకు పోదాం చలో చలో”

  1. meeruchadivaaraa Says:

    రాజ్ గారూ, మరీ మిమ్మల్ని నా కవిత ఇబ్బంది పెట్టినట్టందే. మహాశ్వేతాదేవి, అరుణా రాయ్, వర్ఘీస్ కురియన్ నగర జీవనాన్ని విడిచిపెట్టి పల్లెల్లో గడిపి భారత దేశ ముఖచిత్రాన్ని మార్చినవారే. ఇప్పుడు కొత్తగా ఐఐటి, ఐఐఎం విద్యార్థులు కూడా కొన్నాళ్ల ఉద్యోగం తర్వాత పల్లెలకు వలస పోతున్నారు – ఏమైనా చేద్దామని. చూద్దాం … ఇదొక ఉద్యమంగా, మీరన్నట్టు, మారాలి. థాంక్యూ వెరీ మచ్…

    -రవికుమార్


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: