సెన్’సెక్స్’ – కోతి’గీతలు’

ఈ మనస్సుంది చూసారూ! ఇది కోతి లాంటిదిట! 
ఉత్త కోతి కాదు! – పిచ్చి కోతి!
అహా! చిత్తుగా తాగిన పిచ్చి కోతి ట.
సారీ! చిత్తుగా తాగి తోకకి నిప్పంటించుకున్న పిచ్చి కోతి లాంటిదట – ఈ మనసు!
అలా అని మన వేదాంతంలో చెప్తార్లెండి.

నా మనసు ఈ పోలికకి ఎపిటోమ్ అనుకోండి – నేను ఇలా టైపు చేసేటప్పుడు కుడా, ఓ విషయంలోంచి ఇంకో విషయంలోకి వెళ్ళిపోయి, బోళ్డు టైపు చేశాక, మళ్ళా మెదటి విషయానికొచ్చి – ఇలా చిందర వందరగా ఉంటుంది.

బ్లాగ్ స్టాట్స్ బట్టి చూస్తే కొద్దిగా జనాలు చదువుతున్నారుగా అనిపించి – కొంచెం కంట్రోళ్డ్ గా ఉండి, మళ్ళా అవసరం అయ్యిన మేరకు కొంచెం ఎడిట్ చేస్తా కానీ! లేక పోతే నా తలా – తోకలేని ఆలోచనలు కానీ మీరు చదివితే! పిచ్చాసుపత్రే గతి!

కానీ నా మెయిన్ పోస్ట్లకు, వ్యాఖ్యలకు, పునాదులు – మొదళ్ళు – మొలకలు – వేర్లండి అవి!!

ఇలా ఓ కొమ్మ మీదనించి మరో కొమ్మ మీదకి వెళ్ళే ఆలోచన – రాతల్ని – ముళ్ళపూడి వెంకట రమణగారు – కొద్దిగా కంట్రోళ్డ్ గానే జంప్ చేస్తూ “స్వాతి” లో రాస్తుంటారు. దానికి ఆయన  “కోతి కొమ్మచ్చి” అని పేరెట్టారు.

“ఛ – భలే టైటిల్ కొట్టేశారు” అని నాకు కుళ్ళు! ఇక ఏం పేరు పెడదాం ఇలాంటి పేజీకి లేక పోస్టుకి – (page యా లేక post అనేది డిసైడ్ చెయ్యలేదు లేక సపరేట్ బ్లాగా!) అని ఎంత ఆలోచించినా ఆ “కోతికొమ్మచ్చి” నచ్చుతోంది! మీకు తెలీదు కానీ, దీన్ని వ్యక్తీకరిస్తూ 1995 లోనే అనుకుంటా – ఆ ఆగస్టు 15 కే ఇంటర్నెట్ పబ్లిక్ కి వచ్చింది ఈ దేశంలో  – జియోసిటీస్ లో ఓ పేజీ కూడా చేసుకొని అందులో జస్ట్ ఓ కోతి బొమ్మ పెట్టానండి!!!! ఇప్పుడది లేదనుకోండి.

మొన్న సౌమ్య గారు  “నిశ్యాలోచనాపథం”   అంటూ ఓ పదం తయారు చేశారని చూశా గానీ – అది “టట్టాడాయ్” అన్నంత ఈజీగా లేదు (- ఇది నిఘంటువులో ఉండాల్సిన పదమే!) ; మరీ కరకు గ్రాంధీకంలా ఉంది. పైగా- ఇది జస్ట్ ఒక్క రాత్రిరోగం కాదే!

ఏది చెబ్దామన్నా అలా బోళ్డు బోళ్డు ఆలోచనలు క్రాస్ కనెక్ష్జన్స్ లో వచ్చేస్తాయే! అవన్నీ ఇలా ఎంత సేపని ఎక్స్ ప్లైన్ చేస్తాం. నా మిత్రులు ఉంటే ” అదే రా ఆ జుట్టుదుంది చూశావ్” అంటూ చెప్పుకెళ్ళి పోతే – అది వేరే కాంటెక్స్ట్లో ఐనా ఏ జుట్టుదో ఠపీమని అర్ధంచేసేసుకుంటారు; కొత్తవాళ్ళెవరన్నా పక్కనుంటే, పేరు చెప్పేసి నా వాక్ప్రవాహంలో అలా తేలిపోయాలా చేస్తారు! వారికి దూరంలో ఉండటం వల్ల కదూ ఈ బోడి బ్లాగింగ్! లేక పోతే ఎందుకొచ్చిన తంటా!

కాపి కొట్టలేము!…పోనీ  “మనోవేగంలో”  అని పెడదామా అనుకున్నా …..నిజంగా మనో వేగం అంటే ఎంత స్పీ……….డో….తెలుసా! లైట్ కంటే పాస్ట్ ….సట్ సట్ మని సీను మారుపోతుఉంటుండి …..సందర్భం , కాలం అన్నీ మారిపోతాయి……కానీ కోతిలాంటి మనసు చెప్పేవి కోతిగానే ఉండాలి….కోతిరాతలు. ప్చిచ్చిగీతలు….ఆ……..కోతిగీతలు – రేప్పొద్దున్న బొమ్మలేస్తే!!!! పైగా మనం చెప్పేవి ’గీత’ సమానమోయ్! ఇదేంటి! రేరాజీయిం – తెలుసా!

రైట్! – కోతిగీతలు.

అంచేత చెప్పేదేంటంటే! ఇక నించి రాండం థాంట్స్  -అంటే నిజంగా అస్సలు క్రమంలో లేనివి కూడా కలిపి-  ఇష్టమొచ్చినట్టు కొన్ని కోతిగీతలు కెలుకుతూనే ఉంటా – దాని టాగు “కోతిగీతలు” అని ఉంటుంది.

అదేంటీ! ఇదేంటీ! అని అడగొద్దు! ఏదన్న చెబ్దాం అనిపిస్తే కామెంట్లైతే వేసెయ్యచ్చు. ఎదన్నా ఉంటే మెయిన్ పోస్ట్ లలో మళ్ళా వివరంగా వస్తునే ఉంటుంది!

బైదవే!   మీకు తెలుసా! ఆడవాళ్ళు తక్కువ దుస్తుల్లో కనబడితే , మగవాళ్ళకి ఓ ఆనంద  “వస్తువు” ని చూసిన భావనే వస్తుంది కానీ,  ఆడది అన్న వ్యక్తిని చూసిన భావన రాదుట! ఇదిగో లింక్!

నాకు తెలుసు మీ కోతి మనసు – కోతిగీతల్లో అన్నీ ఇలాంటి ఆలోచనలుంటాయా అని కదా! కాదమ్మా! నా మనసులో అలాంటివాటికి స్పేస్ ఉన్నా. అవి నేను రాయనమ్మా!

ఊరికే చెప్తున్నా! పెళ్ళాలకు, పిల్లలకు చూపించి, “ఇందుకమ్మా తక్కువ దుస్తులు వద్దన్నదీ! ఇది సైంటిఫిక్ గా ప్రూవ్డ్”  అని చెప్పుకుంటారేమో అని!…మ్ మ్ నాకు తెలుసు మీ ఆలోచన్లు.

ఇప్పుడె  “స్త్రీలలో పొగతాగే అలవాటు”  చదివి అక్కడ్నించి అబ్రకద్రబ్ర మహిళా తాగుడు   దగ్గరికి వెళ్ళి – అక్కడ సోమరసం తీసుకుని వచ్చా!

ఈ “మధ్య తరగతి విలువలు” అనేవుంటాయే! ఇవి ఇప్పుడు మెల్లిగా పోతున్నాయి! ఎందుకూ!?మధ్య తరగతి రూపం మారింది ; క్రింది వర్గం మధ్య తరగతి విలువలని కాస్త పట్టుకుంది; మధ్య తరగతి, “హై క్లాస్”  ని ఫాలో ఔతోంది – విచ్ ఈజ్ ఇన్ లైన్ రైట్!

నా చిన్నప్పుడు నేనార్గ్యూ చేసా! 

హై క్లాస్ సొసైటీ లోనూ స్త్రీ సిగరెట్ తాగచ్చు.మందు తాగచ్చు;

లోక్లాస్ లో కూలీలుగా ఉన్న స్త్రీలు హ్యపీ గా చుట్ట కొట్టచ్చు, వారుణీ వాహినీ ని, కల్లు ని తాగి తిరగొచ్చు

– ఎటొచ్చి  – అదేంటో తెలుసుకో కూడనంతా రిజిడ్ సాంప్రదాయంలో,  ’విలువలం’టూ ఫాలో అయ్యేది మధ్య తరగతి మహిళ! ఆమెకి కదా స్వేచ్చ కావాలి అని!

ఈ పాయింట్ మొన్న “పడగ నీడ”   మీద కామెంటేయ బోయి – మరీ ఎక్కువ వద్దని వదిలేశా!

బావుందండి. ఆవిడ చాలా బాగా ఒక్కొక్కొ పాత్రగా రాశారు; కాకపోతే ఆవిడ కొంచెం బైయాస్డ్ గా “లిఫ్ట్ బాయ్” ని చివరి క్రిమినల్ గా వాడారు;

నాకు గానీ బాగా డబ్బులిచ్చే ప్రొడక్షన్ కంపెనీ దొరికితే, ఓ 35 ఏళ్ళ పెళ్ళికానీ యువకుడు, అన్ని చదువులు ఉన్నా జీవితంలో “సెటిల్” కాని ఓ పాత్ర ని రేపిస్ట్ చేస్తాను. లిఫ్ట్ బాయ్ డబ్బు కోసం జైలు కెళ్ళినట్టు కూడా తీస్తాను!

నాకు ప్రొడక్షన్ కంపెనీ దొతికితే  🙂  లెండి!

ఎందుకంటే, మధ్యలో  మరో మగ జనరేషన్ “స్త్రీ” ని చాలా “గౌరవించింది” అనుకుంటా!  ఐ థింక్ ఇది డెమోగ్రాఫిక్స్ లో ఉన్న ప్రాబ్లెం. “రంగీల” లో అమీర్ ఖాన్ పాత్ర చెప్పే “లైఫ్ లో సెటిల్” కాని మగ భారత జాతి ఎక్కువైపోతోందని నా ఫీలింగ్. ఎవరన్నా లెఖ్ఖ రాస్తే తెలిసేది; అయినా ఇక అయిపోయింది లెండి.ఆ జనరేషన్ కూడా అయిపోయింది.  బిపిఓ లొచ్చాకా ఇది వేరే రూపం దాల్చింది.

అయ్యా బాబు – విలువలు అంటే మధ్య తరగతి లోనే ఉంటాయి అని నమ్మాను. కానీ, నా జీవితంలోనే ఇంతలేసి మార్పును చూస్తాననుకోలేదు! మధ్య తరగతి విలువలంటే నాకెంతో ఇష్టం!  ఇంకా ఎన్ని చూడాలో!

బైదవే ఇది చూసారా! ;  బ్లాగ్లోకంలో ఏదోదో రాసుకున్నారుగానీ, అసలు విషయం వేరేనండి. మూడు నిమిషాల్లో జరిగిన విషయానికి ఎంత రాద్దాంతాం! అసలైన మీడియాకి అక్కడ అలా జరగబోతున్నన్నట్టు ఎలా తెలిసిందీ, లేతే ఎవరన్నా మొబైల్ కాప్చరా!?

నిన్న అమలా పురంలో ఓ సంఘటనని mms లో  పంచుకుంటున్నారట! మీరు చూసే ఉంటారు.టివి వాళ్ళు న్యూస్ లో సెక్స్ ని ఎలా ఇరికించాలో తెలీక నాలుగైదు పాయింట్స్ కనుక్కున్నారు:

1.సినిమాలో పెరుగుతున్న సెక్స్ – ఓ చర్చా కార్యక్రమం – అని చెప్పి,  మీరు కూడా గుర్తించని కొన్ని బెస్ట్ బిట్లని ఆటో మోడ్ లో అలా ఓ అరగంట / గంటా చూపిస్తారు – అంతకుముందు “కమింగ్ అప్”  అని ఓ రెండు గంటలు!

2.ఇంటర్నెట్ కేఫ్ లో శృంగారాలు – అని ఓ 2×2 క్యాబిన్లో తలుపేసుకుని ఉన్న జంటల బిట్లు!నిజానికి ఆ జంట అంత తక్కువ స్పేస్ ఎందుకు ఎంచుకుంది!

౩. పార్కుల్లో మితిమీరుతున్నది అని

4. రెగ్యులర్ గా సినిమా న్యూస్ మీద ఓ ప్రోగ్రాం – అందులో కొన్ని పాటలు ;
సో మీరు డై హార్డ్ న్యూస్ చానెల్ వ్యూయర్ అయినా మీకు మసాలా పుష్కలం అన్నమాటా! ఈ మధ్య న్యూస్ రీడర్స్ కూడా – మ్ మ్

5. ఇది లేటస్ట్ : ” ’సెన్’ సెక్స్’  తగ్గినా పెరిగుతున్న సెక్స్”  – “రిసెషన్ లో యాంటీ డిప్రెసెంట్ – సెక్స్”  – “పెరుగుతున్న కాండోమ్ సేల్స్ ” అని! నిజం అనుకుంటున్నారా!

ఈ పాయింట్ మీద ఈ గంట చర్చా కార్యక్రమం సాగుతుంది ! ఒకావిడ ఫోన్ చేసి అసలు సెన్’సెక్స’  అనే పేరుతోనే  కోడిగుడ్డు మీద  ఈకలు ఏరుతుంది!

( “ఛానెల్ చేంజ్ చేసుకోవచ్చుగా! దురదకాబోతే” అంటారా! నిజమే! కానీ చేస్తున్న పని వదిలేసి, రిమోట్ ఎవరు వెతకాలన్న పాయింట్ మీద పారలల్ గా ప్రజాస్వామ్య చర్చ జరుగుతోందిలెండి)

సరే మొత్తానికి మార్చబోయే ముందు – ఓ కాలర్ ఫోన్ చేశాడు – సరిగ్గా విన్లేక పోయాను గానీ -బంగ్లాదేశ్ కో ఎక్కడికో కాండోమ్స్ ఎగుమతి అవుతున్నందుకు – అక్కడ ఎదో పర్టిక్యులర్ కారణంగా డిమాండ్ ఉన్నట్టు – “మీకు తెలుసా!? అందుకని కాండోమ్ సేల్స్ కి కారణం కామ వాంఛ కాదేమో ఓ సారి చూసుకోమని” ఆ కాలర్ చెప్తే –

 – సో కాళ్డ్ ఎక్స్ పర్ట్ పానెల్ కి,  ఆ న్యూస్ యాంకర్ కి కొన్ని సెకన్లు సౌండ్ లేదు – నోట మాట రాలేదు – కాకపోతే కొంచెం ముందే సర్దుకున్న యాంకర్ – “దట్స్ ఇంటరెస్టింగ్” అనేసి – తన విధి నిర్వర్తించాలిగా! మళ్ళా సెక్స్ గురించి చర్చ చేసుకుంటూ వెళ్ళిపోయారు! అదీ సంగతి!

వాడు చూపించే ఫూటేజ్ నిజమే, దానికి రీజన్స్ వేరు! తరువత ఎప్పుడన్నా టైపు చేస్తా.

ప్రకటనలు
Explore posts in the same categories: Uncategorized

ట్యాగులు:

You can comment below, or link to this permanent URL from your own site.

5 వ్యాఖ్యలు పై “సెన్’సెక్స్’ – కోతి’గీతలు’”


 1. ఎక్కణ్ణించి ఎక్కడీకి లాక్కొచ్చారు మహానుభావా!
  సెన్సెక్సు రూపాన్ని రోలరు కోస్టరుగా మారిస్తే దాని మీద స్వారీ చేసి దిగినట్టుంది మీ టపా చదివితే.

  నా మనసు ఈ పోలికకి ఎపిటమీ అన్న వాడుక బావుంది.
  నిజంకదా, ఈ ముళ్ళపూడి వెంకట్రవణొహడు, కూల్ గా ఉండే పదబంధాలన్నిట్నీ ముందే వాడేస్సి, తూచ్ అనేశ్శాడు!


 2. కోతిగీతలు.. శీర్షిక బాగుంది.. ర్యాండమ్ ఆలోచనలు పంచుకోవడానికి.
  కోతికొమ్మచ్చి చూసి నేనూ కుళ్లుకున్నా…
  మీడియా మీద పరిశీలన.. కొండొకచో ఆవేదన.. అర్థం చేసుకోదగ్గదే.

 3. అబ్రకదబ్ర Says:

  లైన్లెక్కువైపోయి చదవటం కష్టమైపోతుంది. కుంచెం పొడుగు తగ్గించటమో, విడి విడి లైన్లని పేరాగ్రాఫులు చేసెయ్యటమో చెయ్యొచ్చుగా.

 4. srikaaram Says:

  Both-the post and the comments are interesting!

  Sripati


 5. హ్మ్ ఇది మిస్సయ్యానే!


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: