పర్వ – ధర్మకధలు – కధ చెబుతా కధ చెబుతా

“ఇన్ బ్రూగ్” అని ఓ సినిమా – ట! ఆ కధలో పాయింట్ తో మొదలెడుతున్నాను.

ఆ పురాతన బెల్జియం నగారానికి ఇద్దరు హిట్ మెన్ వచ్చారు; ఒకడు కొద్దిగా ముసలాయన; మరొకడు కుర్రవాడు. ఓ పూటకూళ్ళమ్మ ఇంట్లో బస చేస్తున్నారు; వాళ్ళ లాస్ట్ అసైన్మెంట్ లో, హత్యగావించబడాల్సిన వాడే కాకుండా ఓ చిన్నపిల్లాడు కూడా చచ్చిపోయాడు; ఆ విషయం గుర్తున్నా దాని గురించి వీళ్ళు మాట్లోడుకోవట్లేదు; పైగా వీళ్ళకి అసైన్మెంట్ ఇచ్చిన బిగ్‍బాస్ వీళ్ళని ఈ నగరానికే ఎందుకు “తప్పించాడు”రా బాబు అని ఫీల్ ఔతున్నారు; ఏదో ఓ కారణం ఉండే ఉంటుందని ముసలాయన చెప్తాడు.

ఓ రోజు బిగ్‍బాస్ ముసలాడికి ఫోన్ చేసి చెప్తాడు; ” నేను పని అప్పగించింది నీకైతే, ఈ కుర్రవాడిని తోడుగా పన్లోకి తెచ్చుకుంది నువ్వే! కాని వాడి వల్ల ఆ చిన్నపిల్లాడు చచ్చిపోయాడు. అందుకని నువ్వే కుర్రవాడిని చంపెయ్యాలి. అందుకే మీ ఇద్దరిని అక్కడికి పంపించాను. నాకు వాడిని చంపడం సరదా కాదు; ఇట్స్ ఎ ఫ్రొఫేషన్ – ప్రొఫెషనల్ కిల్లింగ్ లో తప్పు చేసినందుకే ఈ శిక్ష కాదు;  వాడు కుర్రవాడు. చిన్నపిల్లవాడిని చంపేసిన బాధలోనో, పశ్చాత్తాపంలోనో వాడు పోలీసులకి చెప్తే, అందరం బుక్ ఔతాం. కాబట్టికూడా వాడు ఉండకూడదు. ఈ పని నువ్వే చేయాలి. నువ్వు చేయకపొతే మీ ఇద్దరిని లేపేయడానికి నేనే రావాల్సి ఉంటుంది.అక్కడికే ఎందుకూ పంపించానో తెలుసా – ఆ ప్రదేశంలో ఓ పవిత్రత ఉంది; ఓ ప్రశాంతతని అక్కడ అనుభవించాను. చివరగా ఆ కుర్రాడిని ఆ ప్రశాంతతని అనుభవించని” అని చెబ్తాడు.

ముసలాడికి ఇప్పుడు “ధర్మసంకంటం” : కుర్రాడ్ని చూస్తేనా చాలా చెలాకిగా ఫ్ల్రెండ్లీగా ఉన్నాడు; వాడిని తీసుకొచ్చి ఏదో చేద్దాం అనుకుంటే, మరేదో ఔతోంది; మరోవైపు బిగ్‍బాస్ – తనకి అసలు లైఫ్ ఇచ్చిందే వాడు; ఇప్పుడేంటి చేయటం!?

“హిట్‍మాన్” కి “ధర్మసంకటం ” ఏంటి అంటారా!? మరీ “అతి” కాకపోతే  అంటారా! తప్పు – వాళ్ళాకీ ఓ కోడ్ ఉంటుందిట!ఇట్స్ ఎ మాటర్ ఆఫ్ ప్రిన్సిపుల్! యూ సీ!

మరీ అతిగా ఉందా! సరే! మీరు ఓ సంస్థలో పని చేస్తున్నారు; ఓ కుర్రోడిని ఇప్పుడే మీరు చేరదీసారు. ఓ మంచి వ్యవహరంలో  సమర్ధత చూపించినా, ఓ చిన్న విషయంలో ఏదో తప్పు చేశాడు. నిజానికి కలిసి చేసిన పనిలో భాగస్వామ్యం ఇద్దరిదీ. ఇప్పుడు ఆ తప్పుకి ఎవరో ఒకళ్ళు బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి. తీసుకున్న వాళ్ళ ఉద్యోగం పోతుంది. సమర్ధుడే అయినా తప్పు జరిగిపోయింది కాబట్టి – ’వాడిని తీసేయ్’ అంటున్నాడు మీ బాస్! ఉద్యోగంలో నుంచి తేసెయ్యాలా వద్దా  – ఇప్పుడిది ధర్మసంకటం అనవచ్చా! బహుశా అనిపిస్తుందేమో! లేదా  మీ పలుకబడిలో ఇంకో చోట ఉద్యోగం ఇప్పించేస్తానని సర్దిచెప్పేసుకోవచ్చేమో! కానీ – ఆ ఉద్యోగమార్పు అనే “సమస్య తీవ్రత” అనుభవించే కుర్రవాడికి “హత్య”కి గురైనట్టే ఉండొచ్చు. తిరిగి బాస్‍నే చంపేయ్యాలన్నంత కోపం రావచ్చు?  “నా ఉద్యోగమూ / సుఖమూ ఎందుకు పోవాలి – ఆ బాధలేవో వాడినే పడనీ”అనుకోవచ్చు – అప్పుడు కుర్రాడిని చంపబోతే వాడే ముసలాడిని వేసేసినట్టన్నమాట!

ఉద్యోగాలుగా చెపితే అంత డ్రమెటిక్ గానో / సినిమా గానో లేదు! అదే హిట్ మాన్ – జాబ్ – ఫ్రొఫెషనల్ కిల్లర్ అంటే ఓ రకమైనా “ఆరా” వచ్చేస్తుంది; నిజానికి రెండిటికీ భేధం లేదు. ఒక్క విషయంలో తప్పితే – ఉద్యోగం అనేసరికి చాలా రకాల ఇతర సమాధానాలు వస్తాయి.దాన్ని హత్యగా మారిస్తే కథ రంజుగా ఉంటుంది; ఇలాగే అనుకోనుండచ్చు ఆ కధకుడు/దర్శకుడు.  (అసలు సినిమా అంతా వేరులెండి – మనకి కావల్సిన వరకే వాడుకుంటున్నాను)

ఇలా కధలుగా / నవలలుగా రాసిన వాటిని  “చదువుకున్న” పాశ్చాత్యులు కూడా చాలా సీరియస్ గా తీసుకుని నిజంగా ఆ పాత్రలు ఉన్నట్టుగానే  నమ్మి బతికేస్తారు. వాటినుంచి నిజ జీవతాలకీ స్పూర్తిని పొందుతారు. “ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్” అనే సినిమా – నవల పరంపరని రాసినప్పుడు – కొన్ని జాతులు / తెగలు ఉన్నట్టు – వాళ్ళ భూబాగాల మ్యాపులతో సహా తయారు చేసాడు ఆ ఆథర్! అలా అని ఆ జాతులు ఉన్నాయనుకోవటం ఎంత మూర్ఖత్వం! కాని ఆ కధ/సినిమా అంత గొప్పదే!

ఇక్కడ ఓ చిన్న పాయింట్. చదువుకి – మూఢవిశ్వాసలకి/నమ్మకాలకి ఎలాంటి సంబంధమూ లేదనిపిస్తుంది.ఇదేదో మానవ నైజానికి సంబంధించిన విషయమేమో – ఆలోచించుకోవాలి గదా!

అలాగే, భారత రామాయణాలు చరిత్ర కాకపోయినా  – ఒట్టి కధలే ఐనా – నిజంగా జరిగినట్టే ఈ దేశప్రజలు లెక్కకడతారు.అయోధ్యే లేక పోయినా. రామసేతువే లేక పోయినా రాముడికి – రాముడిని నమ్ముకున్న వాడికి ఢోకాయే లేదు!

కురుక్షేత్రమే లేకున్నా – ఆ రోజుల్లో ఆ సైన్యం అక్షౌహిణికాల లెక్కల్లో చెప్పినంత  – పాపులేషన్ లో సగం  కూడా –  ఆరోజు ఉన్నా లేకున్నా ఎవడిక్కావాలి!? కురుక్షేత్రం- మహాభారతం కావాలి. అంతే!

( “ది లాస్ట్ టెంప్టేషన్”  లో క్రీస్తు బతికుంటే ఎవడిక్కావాలి, శిలువ మీద చచ్చాడన్నదే కావాల్సిన చరిత్ర/నిజం అని అనుకుంటారని – శిలువ మీదే క్రీస్తు ఉండిపోవడానికి నిశ్చయించుకున్నట్టుగా తీశారుట. అలాగన్నమాట. “నేను చచ్చిపోవటమే కరెక్టు” అని సోక్రటీసు చచ్చిపోయాడని, అలా అని “డైలాగ్” గా రాసేసుకున్నారు; వాడిని మరో క్రిటో బతికించేశాడులే, వాడేమీ చావలేదని ఎవరూ మళ్ళా అనకుండా . అర్ధం కాకపోతే వదిలేయండి. ఆ కనెక్షన్ ఇప్పుడు విశదీకరించలేను. ఆ! పోనీ ఇది – గాంధీ చచ్చిపోయినప్పుడు “హే రామ్” అన్నాడు అన్నది కావల్సిన చరిత్ర; అలాగే నిప్పులలోకి సీతను తోసేసి )

భారతం కూడా చాలా డ్రమటైజ్ చేయబడిన కధ. పైగా ఇందులో “ధర్మం” అంటూ పైన “ఇన్ బ్రూగ్” స్టోరీ చెపినట్టు ఓ పాయింట్! అందులో మళ్ళా బోళ్డు పిట్ట కధలూ! రామాయణమూ కధే! ఇవి కధలు అని చెప్తే ఏ హిందూ ఆధ్యాత్మిక వాదికి సమస్య ఉండకపోవచ్చు. ఎందుచేతనంటే, వీటికి పారలల్ మెటఫరికల్ స్పిరిట్యుయల్ ఇంటర్ ప్రెటేషన్ – ఆధ్యాత్మిక రామాయణం లాగా – ఉన్నాయి. అంటే, అసలు ఇది చరిత్రకాకపోయినా  అవి నిలిచే ఉంటాయి. అవి “కావాల్సిన చరిత్ర” లు.పైగా ఈ కధల పరాకాష్ట –  ఐ మీన్, హైటు ఏంటో తెలుసా! జయ విజయుల కధ!

సనకసనందాదులట! విష్ణువును చూసేందుకు వైకుంఠానికి వెళ్తే – అడ్డంగా ఉన్న వీళ్ళూ “సార్ బిజీ!” అన్నారట! కోపమొచ్చిన సనకసనందాదులు శపించారుట! తరుణోపాయమేమిటని అడిగితే – విష్ణువు వాళ్ళకి “ఛాయిస్” ఇచ్చాట్ట -“నన్నే భజిస్తూ వంద జన్మలెత్తి నా దగ్గర కొస్తారా!? లేక మూడు జన్మలు నాకు వైరులై తిరిగొస్తారా” అని. దానికి వాళ్ళు “మేము వంద జన్మలు విడిచి ఉండలేం – అందుకని మేం వైరులమై మూడు జన్మల్లో వస్తాం”  అన్నారుట! నో వండర్! మనలో కొంతమందికి రావాణాసురుడు హీరో ల కనిపిస్తాడు! ఎందుకంటే వాడు విలన్ లలో హీరో మరి! చెత్త విలన్ కాదుగా!( లుక్ ఫర్ ది సిమిలారిటీస్ ఆఫ్ ది క్యారెక్టరైజేషన్స్ ఆఫ్ కిల్లర్స్ ఇన్ ది అబొవ్ స్టోరీ అండ్ విలన్స్ ఇన్ అవర్ రామాయణ/భారత స్టోరీస్ )

అంతే కాకుండా – విషయం ఉత్కృష్టమైనది అన్నప్పుడు, ఓ కధలో చెప్పడం మన సాంప్రదాయం;  ఒక్క భారతదేశంలోనే కాదు – ఇది ప్రాచ్య ఆధ్యాత్మికతత్వంలో ఉన్న ఓ సాంప్రదాయం . అంటే – “సృజనాత్మకత” అని తయారు చేసిన సాహిత్యం కాదు! మరేదో విషయాన్ని చెప్పడానికి సృజించబడిన కధలు. అందుకే మనకు ఇది ఎప్పటికీ సాహిత్యానికి, చరిత్రకీ,ధర్మానికి కలగాపులగంగానే  ఉంటుంది.

ఓ కాలంలో – ఈ కధలకి సైంటిఫిక్ ఇంటర్ ప్రెటేషన్ చెప్పేవాళ్ళు మనవాళ్ళు:  – కుండల్లో పిల్లలు – టెస్ట్ ట్యూబ్ బేబీస్; అస్త్రశస్త్రాలు – మిస్సైల్స్;   దివ్యదృష్టి – హలోగ్రాఫిక్స్ అంటూ! (చివరిది నేనే యాడ్ చేశానా 😉 – పోనీ టివీ లన్నారేమో );

ఇప్పుడు పాతబడిపోయి, దీంట్లో అంత నావెళ్టీ లేదు. అవి ఎంత నిజం అనేది కాదు మనం వెదకాల్సింది. ఎందుకు చెప్పారు అని? ఇంగ్లీషు వాడు “మన చరిత్ర” మనకి చెబ్తూ – మనం అనాగరికం అని చెప్పినప్పుడు, జాతి ఆత్మన్యూనత భావంలో కుచించుకు పోతుంటే, “లేదురా! నీ చరిత్ర నీకు తెలియదురా! మనకింత వాంగ్మయం ఉంది, ఇంత నాగరికత ఉంది -ఒకఫ్ఫుడు అసలు చాలా అభివృద్ధి చెందిన నాగరికత మనది తెలుసా ”  అనే ధైర్యాన్ని వాళ్ళు తెచ్చుకొని, జనాలకి తెచ్చారు. (అదే ఇంగ్లీషువాడి ప్రపంచం ఎంత మూఢ విశ్వాసాలతో ఇంకా కొట్టుమిట్టాడుతుందో ఈ రోజుకి కదా మనకి అర్ధం అయ్యింది.)

హె జి వెల్స్ “ఇన్విజుబుల్ మ్యాన్” రాసినా, ఇవ్వాళ వరకూ అది సాధ్యపడలేదే! ఇట్స్ జస్ట్ ఎ క్రియేషన్! దాని లక్ష్యం సైన్స్ అభివృద్ధి కానే కాదు. కానీ, ఆయన ఊహల్ని నిజాలు చేసే సైంటిఫిక్ ఫెర్వెర్ మాత్రం కొందరికి వచ్చింది. అంతే!

ఓ సారి ఓ వ్యాపార వేత్త ఇచ్చిన లెక్చర్ విన్నాను. రాజులు యుద్ధాలు ఎందుకు చేశారు తెలుసా అని అడిగాడు;చివరికి ఆయన చెప్పిన సమాధానం – “భూమికోసం” అని; ఎంత భూభాగం ఓ రాజు సొంతమైతే, ఆ దేశానిది అంత పెద్ద మార్కెట్;తద్వారా అంత ఆర్ధిక అభివృద్ధి – జిడిపీ అన్నమాట; కృష్ణదేవరాయలి రోజుల్లో రత్నాలు రాశులుగా పోసి అమ్ముకున్నారు అంటే అర్ధం చేసుకోవల్సిన సత్యాలు వేరే అని – అయిన చరిత్రకిచ్చిన ఇంటర్ ప్రెటేషన్ అంతవరకు నేనూ విన్లేదు. గుళ్ళూ గోపురాలు కట్టిస్తే – అదో ఎకనిమిక్ యాక్టివిటీ – కీనీషియన్ థియరీ చెప్పాడు అందులో! చివరికి – అమెరికా డిఫెన్స్ టెక్నాలజీని వ్యాపారానికి వాడుతుంది. మనం అణుపరీక్షలు చేశాం కదా! దాని వల్ల మనకి ఒరిగిందేమిటి!? అంటూ ప్రశ్నించాడు – అలా ఆర్ధిక పరమైన చారిత్రక ఇంటర్ ప్రెటేషన్ ఇచ్చాడు.

అలాగే  – మహాభారత కధల్లో మనం రోజూ నిజ జీవితంలో చూస్తున్న/ అనుభవిస్తున్న మంచి- చెడుల గురించే ఉంటుంది. అంత కంటే పెద్ద చెడు అందులో ఏమీ లేదు; కానీ అవి మాయలు / మహిమలతో నిండి ఉంటాయి. అవి లేకుండా, ఈ సైంటిఫిక్ ఇంటర్ ప్రెటేషన్స్ కాకుండా,  ఇంకో విధమైన క్రియేటివ్ ఇంటర్ ప్రెటేషన్ లో రాసిన కధ – “పర్వ” .

మనకు చరిత్ర లేదని, మూఢవిశ్వాసాల అనాగరిక సమాజమని భావించి ఆత్మన్యూనత్వంలో కొట్టుమిట్టాడే ప్రతి అభాగ్య భారతీయుడూ – “గ్లోబలైజేషన్ ఎఫక్ట్”  లో కొట్టుమిట్టాడుతున్న “వీక్ హార్ట్స్”  అందరూ కొంగొత్తగా మహాభారతాన్ని చదువుకోదగ్గ అత్యంత ఆవశ్యకమైన పుస్తకం – “పర్వ.” 

ఇంత సృజనాత్మక కల దేశం కదా మనది – ఎంత సేపు – ఫారిన్ సిన్మాలను చూసి కాపీ కొట్టేద్దేమని ఎందుకనుకుంటున్నారు!?
*******************************************************
p.s. : పర్వ అనే పుస్తకాన్ని నేను చదవలేదు. అందుకనీ నిజంగా బైరప్ప ఇంటర్ ప్రెటేషన్ యొక్క లక్ష్యాన్ని నేను చెప్పలేను. కానీ “పుస్తకం.నెట్” లోని పర్వ సమీక్షని  చదవండి. వ్యాఖ్యలూ చదవండి – అందులో “అచిలిస్” అనే బ్లాగరి వ్యాఖ్యాలు చదవండి, సమీక్షలోని పర్ణశాల లింక్ కీ వెళ్ళండి. బైబిల్ కో మరోటికో చారిత్రక స్థాయినిచ్చినట్టు – మన వాళ్ళుమన కధలకి చారిత్రక స్థాయినిచ్చే తప్పిదం ఎప్పుడు చేయకూడదన్న అచిలిస్ వ్యాఖ్యతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

ప్రకటనలు
Explore posts in the same categories: సినిమా రివ్యూలు

ట్యాగులు: ,

You can comment below, or link to this permanent URL from your own site.

4 వ్యాఖ్యలు పై “పర్వ – ధర్మకధలు – కధ చెబుతా కధ చెబుతా”

 1. nagamurali Says:

  చాలా బాగా రాశారు. కానీ మీరు కూడా ‘పర్వ’ నవల చదివి మీ అభిప్రాయాలు వ్రాసి ఉంటే ఇంకా బాగుండేది. త్వరలో అలా రాస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే, ఆ నవల చదివాకా కూడా మీరిలాగే అభిప్రాయపడతారో లేదో నాకు చూడాలని ఉంది –
  >> మనకు చరిత్ర లేదని, మూఢవిశ్వాసాల అనాగరిక సమాజమని భావించి ఆత్మన్యూనత్వంలో కొట్టుమిట్టాడే ప్రతి అభాగ్య భారతీయుడూ – “గ్లోబలైజేషన్ ఎఫక్ట్” లో కొట్టుమిట్టాడుతున్న “వీక్ హార్ట్స్” అందరూ కొంగొత్తగా మహాభారతాన్ని చదువుకోదగ్గ అత్యంత ఆవశ్యకమైన పుస్తకం – “పర్వ.”


 2. చాలా బాగా రాశారు. రామాయణ-మహాభారతాల్నీ, ఇతర పురాణాల్నీ జీవితానికి పనికొచ్చే విలువల్ని ఆసక్తికరంగా చెప్పడానికి ఉపయోగించబడ్డ కథలుగా చూస్తే అసలు సమస్య లేదు. ఎందుకంటే, వీటిని “సాహిత్యం” అని ఒప్పుకున్నాక సమయానుగుణంగా మనదైన భాష్యం(interpretation) చెప్పుకునే అవకాశం వచ్చి మరింత అర్థవంతంగా అనిపిస్తాయి. అన్వయించుకుని జీవితంలో భాగం చేసుకోవడానికి అవకాశం కలిసొస్తుంది. కానీ ప్రస్తుతం వాటినొక చారిత్రక నిజాలుగా, నమ్మకాలకూ-సాంప్రదాయాలకూ ఆధారాలుగా ప్రమాణాలు చూపిస్తూ జీవితాల్ని శాసించే ప్రయత్నం జరుగుతోంది. అందుకే బహుశా కొంత వ్యతిరేకత చూపించక తప్పడం లేదు. i believe in Ramayana and Mahabharata as long as I read them. But, not beyond.

 3. rayraj Says:

  @nagamurali: thank you; if i read, i will try to write.
  From ” A Few Good Men ” – memorable quotes :
  ——————————————–
  Judge Randolph: *Consider yourself in Contempt!*
  Kaffee: *Colonel Jessep, did you order the Code Red?*
  Judge Randolph: You *don’t* have to answer that question!
  Col. Jessep: I’ll answer the question!
  [to Kaffee]
  Col. Jessep: You want answers?
  Kaffee: I think I’m entitled.
  Col. Jessep: *You want answers?*
  Kaffee: *I want the truth!*
  Col. Jessep: *You can’t handle the truth!* [pauses]
  Col. Jessep: Son, we live in a world that has walls, and those walls have to be guarded by men with guns. Whose gonna do it? You? You, Lt. Weinburg? I have a greater responsibility than you could possibly fathom. You weep for Santiago, and you curse the marines. You have that luxury. You have the luxury of not knowing what I know. That Santiago’s death, while tragic, probably saved lives. And my existence, while grotesque and incomprehensible to you, saves lives. You don’t want the truth because deep down in places you don’t talk about at parties, you want me on that wall, you need me on that wall. We use words like honor, code, loyalty. We use these words as the backbone of a life spent defending something. You use them as a punchline. I have neither the time nor the inclination to explain myself to a man who rises and sleeps under the blanket of the very freedom that I provide, and then questions the manner in which I provide it. I would rather you just said thank you, and went on your way, Otherwise, I suggest you pick up a weapon, and stand a post. Either way, I don’t give a damn what you think you are entitled to.
  Kaffee: Did you order the Code Red?
  Col. Jessep: I did the job I…
  Kaffee: *Did you order the Code Red?*
  Col. Jessep: *You’re Goddamned right I did!*

  ——————————————————————————–
  Kaffee: This code of honor of yours makes me wanna beat the *shit* outta somebody.

  ——————————————————————————–

  ఇది నిజజీవితపు డ్రామా. దీన్నే జగన్నాటకం అన్నారు.దీనిలో మన పాత్రలు మనకుంటాయ్.

 4. Achilles Says:

  Rayraj,

  The movie “Few Good Men” is one of of my fav movies of all time. And yes, this dialogue and yes, Jack Nicholson rocks 🙂


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: