ధర్మకథలు- 2 -కథ చెబుతా కథ చెబుతా

కధలుగా / నవలలుగా రాసిన వాటిని  “చదువున్న” పాశ్చాత్యులు కూడా చాలా సీరియస్ గా తీసుకుని నిజంగా ఆ పాత్రలు ఉన్నట్టుగానే  నమ్మి బతికేస్తారు. వాటినుంచి నిజ జీవతాలకీ స్పూర్తిని పొందుతారు. “ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్” అనే సినిమా – నవల పరంపరని రాసినప్పుడు – కొన్ని జాతులు / తెగలు ఉన్నట్టు – వాళ్ళ భూబాగాల మ్యాపులతో సహా తయారు చేసాడు ఆ ఆథర్! అలా అని ఆ జాతులు ఉన్నాయనుకోవటం ఎంత మూర్ఖత్వం! కాని ఆ కధ/సినిమా అంత గొప్పదే!

మనం కూడా ఇలాంటి సమస్యకి ఫలానా నవల్లో హీరో/పాత్ర ఎలా స్పందిస్తుంది? ఖచ్చితంగా వాడైతే ఇలా చేయడు అంటూ నిజజీవితానికి అన్వయించుకునే సందర్భాలు ఉంటాయి కదా! అలాగే పాశ్చాత్యులని మీరు గమనిస్తే ఇలాంటి కొన్ని పాత్రలు వాళ్ళాకి నిజం కాదని తెలిసినా, నిజంగా ఉన్నట్టే భావించేస్తారు. దాని “నిజాని” కంటే – దాని ఐడియా చాలా ముఖ్యమైనది.

సూపర్ మాన్ / స్పైడర్ మాన్ / ఫాంటాం లాంటి కధలు,  స్టార్ వార్స్ / ఏలియన్స్ / ఫ్లైంయింగ్ సాసర్ లాంటీ కథలు ఓ రకమైన నమ్మకమే కానీ దానికి ఓ శాస్త్రీయత అనేదేమీ లేదే!?

ఇక్కడ ఓ చిన్న పాయింట్. చదువుకి – మూఢవిశ్వాసలకి/నమ్మకాలకి ఎలాంటి సంబంధమూ లేదనిపిస్తుంది.  ఇదేదో మానవ నైజానికి సంబంధించిన విషయమేమో – ఆలోచించుకోవాలి గదా!

అలాగే, భారత రామాయణాలు చరిత్ర కాకపోయినా  – ఒట్టి కధలే ఐనా – నిజంగా జరిగినట్టే ఈ దేశప్రజలు లెక్కకడతారు.అయోధ్యే లేక పోయినా, రామసేతువే లేక పోయినా,  రాముడికి – రాముడిని నమ్ముకున్న వాడికి ఢోకాయే లేదు!

కురుక్షేత్రమే లేకున్నా – అక్షౌహిణికాల లెక్కల్లో చెప్పినంత జనంలో సగం, ఆరోజు పాపులేషన్‍గా ఉన్నా లేకున్నా- ఎవడిక్కావాలి!? కురుక్షేత్రం- మహాభారతం కావాలి. అంతే!

కావాల్సిన చరిత్ర :

 “ది లాస్ట్ టెంప్టేషన్”  అనే సినిమాలో ఇలా తీసారు :
క్రీస్తు బ్రతికుంటే ఎవడిక్కావాలి!? శిలువ మీద చచ్చిపోయాడన్నదే “కావాల్సిన చరిత్ర” /నిజం.
శిలువ మీద ఉన్న క్రీస్తును ఓ ఏంజిల్ కలుస్తుంది. దేవుడు క్రీస్తుని రక్షించమని పంపించాడని చెబితే, దేవుడి అపారమైన ప్రేమ కి పరవశించిన క్రీస్తు బతికి బయటకొస్తాడు. వివాహం, పిల్లలు అన్నీ అనుభవిస్తాడు.కాని చివరాఖారికి , ఆ రోజు వచ్చింది ఏంజిల్ కాదు – “శాటన్” అలా మారు వేషంలో వచ్చి మభ్య పెట్టాడు అని తెలుకుంటాడు ;

శిలువ మీద ఉన్న క్రీస్తు ఈ సినిమా చూసేస్తాడు . అందుకనే ఆయన శిలువ మీద ఉండిపోయాడు.(సెల్ఫ్ ఇంటర్ ప్రెటేషన్)  అంటే నిజంగానే దేవుడు కరుణించి ఏంజిల్ ని పంపించినా, క్రీస్తు ఆ సహాయం తీసుకోడు. ది ఐడియా ఈజ్ మోర్ ఇంపార్టెంట్!

అలగే సోక్రటీసు కథ; ఇది బిసి కధ. అంటే – నిజానికి ఇది క్రీస్తుకి పూర్వం కధ! సో ఈ ఆలోచన అంతకంటె ముందే వచ్చేసింది. ఎలా? సోక్రటీసుకి అప్పటి ప్రజాస్వామ్య ప్రభుత్వం మరణ దండన విధించింది. ఆయన దాన్ని అంగీకరించి తీసుకున్నాడు. ఆయన నిజానికి రాసిందేమీ లేదు! ఆయన శిష్యులు మాత్రం – ” డైలాగ్స్” అంటూ, ఆయన చెప్పిన ప్రక్రియ అంటూ ఏవో రాసేసారుట. దానిలోనే క్రిటో సంవాదం ఒకటిట. క్రిటో అనేవాడు సోక్రటీసును తప్పించే ప్రయత్నం చేస్తానంటాడు.సోక్రటీసు అది తప్పు అని వాదించి – తను రైటైనా తాను మరణించాలిగానీ, పారిపోకూడదూ – అని హీరోయిక్ గా విషం తాగి చచ్చిపోతాడు. ఆయన తప్పించుకున్నాడా అన్నది కాదు కావల్సింది; తన వాదనకు కట్టుబడి చచ్చిపోయాడన్నది “కావల్సిన చరిత్ర” .

ఈ మధ్య ప్రపంచంలో చరిత్రలో పేరు మోసినవారందరనీ  “గేస్” అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగ హోమో సెక్సుయాలిటీకి అంగీకరం కుదిరిస్తారు. అలా “కావల్సిన చరిత్ర” తయారౌతోంది. మీ కళ్ళ ముందే! నిజమేమిటి అనేది కాదు ముఖ్యం – న్యూటన్ లు, ఐన్ స్టీన్ లూ, మరో మైఖేల్ ఆంజిలోలో, ఆస్కార్ వైళ్డేలూ, సోమర్ సెట్ మోగమ్ లూ హోమోలన్నది ఒప్పిస్తే , మెల్లిగా హోమో సెక్సుయాలిటీకీ ఆకెప్టెన్స్ పెంచెంచ్చు; ఐ యామ్ నాట్ టాకింగ్  కాంస్పిరసి ధియారీ! ప్లీజ్! లైటర్ వీన్ లో నా ఫ్రెండ్ చెప్పిన ఓ మాట చెబ్దాను – “కరణ్ జోహర్ గాడు మెల్లిగా జనాల్ని హోమో సెక్సుయాలిటీకి ప్రిపేర్ చేస్తున్నాడు! వాడి గోలంతా అది”  అని కభీ అల్విదా నాకెహనా దానికే ఓ  రాంప్ అప్ అనేవాడు. నెక్ట్స్ సినిమా మీకు తెలియంది కాదు. తెలుగు సినిమాల్లో వరసగా వస్తున్న గే కామిడీ మీరు గమనించండి. కుట్ర అనంటంలేదు – సమాజం మారుతోంది. దానికి ఓ సపోర్ట్ స్టక్చర్ కోసం చరిత్ర తవ్వి ఇలాంటి “కావల్సిన చరిత్ర” ని తీస్తున్నారు. 

గాంధీ మరణించేటప్పుడు “హే రామ్” అన్నాడు అనేది “కావాల్సిన చరిత్ర”. నిజం ఎప్పటికీ తెలీదు.

సీతని రాముడు నిప్పుల్లోకి తోసాడా, ఆవిడే వెళ్ళిందా అన్నది కాదు చర్చ. ఆవిడ నిప్పుల్లోంచి పువ్వల్లే వస్తే,  రావణుడికి –  సీతకి రంకు అంటగట్టలేరు. రాముడ్ని మాత్రమే తప్పు పడతారు. సీత పాత్ర పవిత్రతకి మంటనంటించే ప్రయత్నం ఎవ్వరూ చేయలేరు. అందుకని “నిప్పులలోకి సీతను తోసేసి ” అనేది  “కావాల్సిన చరిత్ర”

భారతం కూడా చాలా డ్రమటైజ్ చేయబడిన కధ. పైగా ఇందులో “ధర్మం” అనేది – పోయిన పోస్టులో  “ఇన్ బ్రూగ్” స్టోరీ చెప్పినట్టు ఓ పాయింట్! అందులో మళ్ళా బోళ్డు పిట్ట కధలూ! రామాయణమూ కధే! ఇవి కధలు అని చెప్తే ఏ హిందూ ఆధ్యాత్మిక వాదికి సమస్య ఉండకపోవచ్చు. ఎందుచేతనంటే, వీటికి పారలల్ మెటఫరికల్ స్పిరిట్యుయల్ ఇంటర్ ప్రెటేషన్ – ఆధ్యాత్మిక రామాయణం లాగా – ఉన్నాయి. అంటే, అసలు ఇది చరిత్రకాకపోయినా  అవి నిలిచే ఉంటాయి. అవి “కావాల్సిన చరిత్ర” లు.

పైగా ఈ కధల పరాకాష్ట –  ఐ మీన్, హైటు ఏంటో తెలుసా! జయ విజయుల కధ మూడవ భాగంలో!

ప్రకటనలు
Explore posts in the same categories: సినిమా రివ్యూలు

ట్యాగులు: ,

You can comment below, or link to this permanent URL from your own site.

స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: