ధర్మకథలు -3-కథ చెబుతా కథ చెబుతా

సనకసనందాదులట! విష్ణువును చూసేందుకు వైకుంఠానికి వెళ్తే – అడ్డంగా ఉన్న జయవిజయులు “సార్ బిజీ!” అన్నారట! కోపమొచ్చిన సనకసనందాదులు శపించారుట! తరుణోపాయమేమిటని అడిగితే – విష్ణువు వాళ్ళకి “ఛాయిస్” ఇచ్చాట్ట – “నన్నే భజిస్తూ వంద జన్మలెత్తి నా దగ్గర కొస్తారా!? లేక మూడు జన్మలు నాకు వైరులై తిరిగొస్తారా” అని. దానికి వాళ్ళు “మేము వంద జన్మలు విడిచి ఉండలేం – అందుకని మేం వైరులమై మూడు జన్మల్లో వస్తాం”  అన్నారుట! నో వండర్! మనలో కొంతమందికి రావాణాసురుడు హీరోలా కనిపిస్తాడు! ఎందుకంటే వాడు విలన్‍లలో హీరో మరి! చెత్త విలన్ కాదుగా!

ఇక్కడ మీరు రెండు విషయాలు గమనించాలి:
నోట్ ది ఛాయిస్ హియర్! ఇట్స్ ఆల్వేస్ యువర్ ఛాయిస్;

అలా విలన్ కూడా దైవత్వాన్నందుకుంటాడన్న విషయం ఆల్రెడీ చెప్పేశారు. బట్ యెట్, ఇట్స్ యుర్ చాయిస్.

అలాగే “హవ్ టూ రాబ్ ఎ బాంక్” అనే సినిమాలో  హీరోయిన్ అనదగ్గ పాత్ర – “లైఫ్ అంటే ఎప్పుడో ఏదో జరిగే ఒక్క పెద్దరోజు కాదు; ఆ పెద్దరోజు కోసం ప్రతి రోజు చేసే చిన్న చిన్న ఛాయిస్ డెసిషన్స్” అంటుంది – అని వాళ్ళు బ్యాంక్ ఎలా దొంగిలించాలో డిసైడ్ చేస్తారు.అది వేరే విషయం

అలాగే లుక్ ఫర్ ది సిమిలారిటీస్ ఇన్ ది క్యారెక్టరైజేషన్స్ ఆఫ్ కిల్లర్స్  ఇన్ “ఇన్ బ్రూగ్” అండ్ ది విలన్స్ ఇన్ అవర్ రామాయణ/భారత స్టోరీస్. ఈ విలన్ల మధ్య సామీప్యత చూడండి. వాళ్ళు చాలా ప్రిన్సుపుల్స్ ఉన్న విలన్స్! ఓ విలన్ కి అలాంటి ఉదాత్తమైన పాత్రగా చెప్పినా కూడా వాడు విలనే! అది నిజ జీవితానికి అన్వయించుకునే పద్ధతి. ఆ పాత్రలు “కావాల్సిన చరిత్ర” లో ఎప్పుడూ విలన్స్ అన్నదే పాయింట్. రావాణాసురుడు దగ్గర పనిచేసే పిల్ల రాక్షసులు ఎవరి పిలక పట్టుకు లాగారూ అన్నది చర్చకే ఉండదు! 

అంతే కాకుండా – విషయం ఉత్కృష్టమైనది అన్నప్పుడు, ఓ కధలో చెప్పడం మన సాంప్రదాయం;  ఒక్క భారతదేశంలోనే కాదు – ఇది ప్రాచ్య  ఆధ్యాత్మిక తత్వంలో ఉన్న ఓ సాంప్రదాయం (చైనా, జపాన్ మొ| | అన్నమాట) . అంటే – ఇది “సృజనాత్మకత” అని తయారు చేసిన సాహిత్యం కాదు. మరేదో విషయాన్ని చెప్పడానికి “సృజించబడిన” కధలు. అందుకే మనకు ఇది ఎప్పటికీ సాహిత్యానికి, చరిత్రకీ, ధర్మానికి, ఫాంటసీ కి  కలగాపులగంగానే  ఉంటుంది.

ఓ కాలంలో – ఈ కధలకి సైంటిఫిక్ ఇంటర్ ప్రెటేషన్ చెప్పేవాళ్ళు మనవాళ్ళు:  – కుండల్లో పిల్లలు – టెస్ట్ ట్యూబ్ బేబీస్; అస్త్రశస్త్రాలు – మిస్సైల్స్; దివ్యదృష్టి – హలోగ్రాఫిక్స్ అంటూ! (చివరిది నేనే యాడ్ చేశానా 😉 – పోనీ టివీ లన్నారేమో );  ఈ కాంసెప్టు ఇప్పుడు పాతబడిపోయి, దీంట్లో అంత నావెళ్టీ లేదు. అవి ఎంత నిజం అనేది కాదు మనం వెదకాల్సింది. ఎందుకు చెప్పారు అని? ఇంగ్లీషు వాడు “మన చరిత్ర” మనకి చెబ్తూ – మనం అనాగరికం అని చెప్పినప్పుడు, జాతి ఆత్మన్యూనత భావంలో కుచించుకు పోతుంటే, “లేదురా! నీ చరిత్ర నీకు తెలియదురా! మనకింత వాంగ్మయం ఉంది, ఇంత నాగరికత ఉంది – ఒకఫ్ఫుడు అసలు చాలా అభివృద్ధి చెందిన నాగరికత మనది తెలుసా ”  అనే ధైర్యాన్ని వాళ్ళు తెచ్చుకొని, జనాలకి తెచ్చారు. (అదే ఇంగ్లీషువాడి ప్రపంచం ఎంత మూఢ విశ్వాసాలతో  ఇంకా కొట్టుమిట్టాడుతుందో ఈ రోజుకి కదా మనం అర్ధంచేసుకుంటూ ఉన్నది!)

హె జి వెల్స్ “ఇన్విజుబుల్ మ్యాన్” రాసినా, ఇవ్వాళ వరకూ అది సాధ్యపడలేదే! ఇట్స్ జస్ట్ ఎ క్రియేషన్! దాని లక్ష్యం సైన్స్ అభివృద్ధి కానే కాదు. కానీ, ఆయన ఊహల్ని నిజాలు చేసే సైంటిఫిక్ ఫెర్వెర్ మాత్రం కొందరికి వచ్చింది. అంతే!

ఓ సారి ఓ వ్యాపార వేత్త ఇచ్చిన లెక్చర్ విన్నాను. రాజులు యుద్ధాలు ఎందుకు చేశారు తెలుసా అని అడిగాడు;చివరికి ఆయన చెప్పిన సమాధానం – “భూమికోసం” అని; ఎంత భూభాగం ఓ రాజు సొంతమైతే, ఆ దేశానిది అంత పెద్ద మార్కెట్; తద్వారా అంత ఆర్ధిక అభివృద్ధి – జిడిపీ అన్నమాట; కృష్ణదేవరాయలి రోజుల్లో రత్నాలు రాశులుగా పోసి అమ్ముకున్నారు అంటే అర్ధం చేసుకోవల్సిన సత్యాలు వేరే అని – అయిన చరిత్రకిచ్చిన ఇంటర్ ప్రెటేషన్ అంతవరకు నేనూ విన్లేదు. గుళ్ళూ గోపురాలు కట్టిస్తే – అదో ఎకనిమిక్ యాక్టివిటీ ; అదేదో మతాలని పెంచడం కాదు. అలా  కీనీషియన్ థియరీ చెప్పాడు; చివరికి – అమెరికా డిఫెన్స్ టెక్నాలజీని వ్యాపారానికి వాడుతుంది. మనం అణుపరీక్షలు చేశాం కదా! దాని వల్ల మనకి ఒరిగిందేమిటి!? అంటూ ప్రశ్నించాడు – అలా ఆర్ధిక పరమైన చరిత్ర ఇంటర్ ప్రెటేషన్ ఇచ్చాడు. (అణ్వస్త్రాలని మనం మార్కెట్ చేయచ్చా అన్నది ధర్మ సంధిగ్ధత!)

మధుర మీనాక్షీ టెంపుల్ ఎలా కట్టారు అనేది డిస్కవరీ లోనో ఎందులోనో ఓ డాక్యుమెంటరీ ఉంది! గోపురంమీదకి అంత బరువును ఎలా ఎక్కించారు అని అలోచిస్తే – ఓ పది కిలోమీటర్ల రాంప్ వేసారేమో అనే ఆలోచన వచ్చిందిట-  హైపోటెన్యూస్/కర్ణం లెక్క వేసి);  చుట్టుపక్కల భూతలాన్నీ పరిశీలిస్తే కొంత దూరంలో అలా రాంప్ కట్టి తీసేస్తే మిగిలిపోయిన పల్లంగా ఉన్న భూమి కనబడిందిట. రాంప్ని  కట్టి అయినా పెట్టుండొచ్చు; అలాంటి భూభాగాన్ని వెతికి, మిగితా భూమిని తొలిచేసి ఉండచ్చు; ఊహకు, ఆ రోజుల్లో ఇలా అయ్యుండొచ్చునన్న పాయింట్ ఓ సినిమాకి ఎంత అధ్బుతమైన ఆలోచన! 

జోధా అక్బర్ సినిమాలో చివరివాక్యాలు వినండి;నా ఉద్దేశ్యంలో దర్శకుడి అసలు ఆలోచన ఆ వాక్యాల్లో  ఉంది. సినిమాలో  “గెలుచు కోవటం కాదు, రాజ్యమేలటం రావాలి. అది మనసులైనా, రాజ్యమైనా”  అని  ఓ ప్రేయసి /భార్య చెప్తే అక్బర్ దాన్ని పాలనలోకి అన్వయించాడు. దట్స్ ది డిఫెరెన్స్!దట్స్ ది ఐడియా! మిగిలిన చాలా రాజులు ఊరికే దోచుకున్నారు. అక్బర్ తన సామ్రాజ్యాన్ని / మార్కెట్ ని పెట్టుకొని ఓ ఆర్ధిక వ్యవస్థ ని నెలకొల్పాడు – చరిత్రలో “అక్బర్ పాలన” నే ఎందుకు స్పెషల్ గా చదువుతున్నాం? ఎందుకంటే మిగితా వాళ్ళు (అందరూ అని కాదు) “ప్లండర్” దోపిడీ చేసారు. త్వరలో మీకు కుదిరితే “ది లాస్ట్ నిజాం” అన్న పుస్తక సమీక్ష ఇస్తాను. దాన్ని కాకుండా అక్బర్ ఓ 3000 మందిని పెళ్ళిచేసుకున్నాడు, ఒక్క జోధానే కాదు -ఇది అనవసర చర్చ! చేసుకున్నా ఒక్క జోధాన్నే ప్రేమించాడేమో!

సింధుభైరవి సినిమాని కర్ణాటక సంగీతంలో ఎందుకు చుట్టేడో ఆయనకే తెలియాలి -ఓ మేధావి తనకు సమ ఉజ్జీ అయిన భార్య జతగా దొరకనప్పుడు – వేరే స్త్రీ దగ్గర స్వాంతన పొందాడు. ఈ యాంగిల్ “ఇద్దరు” సినిమాలో కరుణానిధి క్యారెక్టర్ లో కూడా ఉంది! సరే! అది మనసు -ప్రేమకథలు గా చెప్పుకుందాం ( కానీ అందులోనూ, అది సెక్స్ లోకి ఎందుకు దారితీయాలన్న ధర్మసంధిగ్ధత నాకు ఉంది మరి!) 

సరే విషయానికి వస్తే – మహాభారత కధల్లో మనం రోజూ నిజ జీవితంలో చూస్తున్న/ అనుభవిస్తున్న మంచి- చెడుల గురించే ఉంటుంది. అంత కంటే పెద్ద “చెడు” అందులో ఏమీ లేదు; కానీ అవి మాయలు/మహిమలతో నిండి ఉంటాయి. అవి లేకుండా, ఇన్నాక చెప్పిన సైంటిఫిక్ ఇంటర్ ప్రెటేషన్స్ కాకుండా,  ఇంకో విధమైన క్రియేటివ్ ఇంటర్ ప్రెటేషన్ లో రాసిన కధ – “పర్వ” .

మనకు చరిత్ర లేదని, మూఢవిశ్వాసాల అనాగరిక సమాజమని భావించి ఆత్మన్యూనత్వంలో కొట్టుమిట్టాడే ప్రతి అభాగ్య భారతీయుడూ – “గ్లోబలైజేషన్ ఎఫక్ట్”  లో కొట్టుమిట్టాడుతున్న “వీక్ హార్ట్స్”  అందరూ కొంగొత్తగా మహాభారతాన్ని చదువుకోదగ్గ అత్యంత ఆవశ్యకమైన పుస్తకం – పర్వ. 

ఇంత సృజనాత్మకత కల దేశం కదా మనది – ఎంత సేపు ఫారిన్ సిన్మాలను చూసి కాపీ కొట్టేద్దేమని ఎందుకనుకుంటున్నారు!?
*******************************************************
p.s. : పర్వ అనే పుస్తకాన్ని నేను చదవలేదు. అందుకనీ నిజంగా బైరప్ప ఇంటర్ ప్రెటేషన్ యొక్క లక్ష్యాన్ని నేను చెప్పలేను. కానీ “పుస్తకం.నెట్” లోని పర్వ సమీక్షని  చదవండి. వ్యాఖ్యలూ చదవండి – అందులో “అచిలిస్” అనే బ్లాగరి వ్యాఖ్యాలు చదవండి, సమీక్షలోని పర్ణశాల లింక్ కీ వెళ్ళండి. బైబిల్ కో మరోటికో చారిత్రక స్థాయినిచ్చినట్టు – మన వాళ్ళుమన కధలకి చారిత్రక స్థాయినిచ్చే తప్పిదం ఎప్పుడు చేయకూడదన్న అచిలిస్ వ్యాఖ్యతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

ప్రకటనలు
Explore posts in the same categories: సినిమా రివ్యూలు

ట్యాగులు: ,

You can comment below, or link to this permanent URL from your own site.

స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: