“ఒక్కడు” – 2

సరే! భూమికని ఇంట్లో ఉంచుకున్న సీన్లన్నీ ఖచ్చితంగా “ఇండయనైజ్డ్ వెర్షన్స్ ఆఫ్ ఎ పారిన్ మూవి” అనిపిస్తాయి – రూఫ్‍టాప్ నుంచి ఎంట్రన్స్ , బొమ్మల్లో భూమిక, బ్రెడ్ లోఫ్స్ బదులు “పూరీలు, బీర్ బాటిల్ బదులు మంచినీళ్ళు అయ్యుంటాయని నా ఫీలింగ్. అదే,  “అన్నం, కూర, పప్పు, సాంబారు, పచ్చడి, పెరుగు” ఐతే – రాత్రిపూట దొంగతనంగా తీసుకెళ్ళినట్టుగానో, ప్లేటు మొత్తం ఒకేసారి మాయమైనట్టుగానో తీసుకోవాల్సి వచ్చేది. నాన్-వెజ్ ఐడియా వద్దనే అనుకున్నాడు.

భూమికది సాధారణంగా “ప్లెజెంట్” గా ఉండే అందం; సెక్సిగా ఉండే అందం కాదు. బహుశా అదీ ఓ కారణమో! ఏదైనా, ఒకే రూమ్ లో ఉంటున్నప్పుడు, సజెస్టివ్ గా  ఉండే సీన్లు ఏమీ లేవు. కావలంటే అడాలసెంట్ మైండ్స్, వాళ్ళే ఊహించేసుకుంటారులే అన్న స్థాయిలో వదిలేశాడు. వెల్ హాండళ్డ్!

పీడకల వచ్చింది అని తల్లిదండ్రులని పలకరిద్దామనిపిస్తే, హీరో మొబైల్ వాడొచ్చుగా! ఆహా! హీరోయిన్ అర్ధరాత్రి ఒంటరిగా బయటకి వెళ్తుంది. దట్స్ ఓకే అగైన్! ఐడియా ఈజ్ – ఏదో ఓ కారణానికి బయటికి వెళ్ళి హీరో ఫాదర్‍ని వాళ్ళంటికే తీసుకురావడం – డ్రామాలో ఈ మొబైల్ ఐడియా మీకు రాదు.

చిన్న చీలిక – “రక్షణ” సినిమా మొదట్లో – నాగార్జున కళ్ళు తెరుచుకొని – చచ్చినట్టు పడుంటాడు; టివిలో రెండోసారి చూస్తున్నప్పుడు – మూత్రవిసర్జనకొచ్చి డెడ్ బాడీని చూసిన ఆ మనిషి, సెల్ ఫోన్ తీసి కాల్ చేస్తాడు – అనిపించింది ఓ క్షణం! అంతలోనే ఆ రోజులకి మొబైల్స్ లెవ్వు అని గుర్తొచ్చింది. జస్ట్ ఎ మాటర్ ఆఫ్ 10 ఇయర్స్ ఏమో! ప్రేక్షకుడి ఇంట్యూటివ్ ఆలోచనలో వచ్చిన తేడా అది!

బ్యాక్ ఎగైన్ –  పాస్ పోర్ట్ ఆఫీస్, స్నిఫర్ డాగ్స్ – అందరం ఎంజాయ్ చేస్తాం. బైదవే, ధర్మవరపు కి మొబైల్ లో కాల్ చేసినప్పుడు – రెండు డిపరెంట్ లొకేషన్స్ ని ఒక స్ప్లిట్ స్క్రీన్ లో చూపిస్తారు. కానీ ఏదో ఒక సీన్ ఫ్రీజ్ చేయాల్సి వస్తుంది.ఇంట్యూటివ్ గా రెండు సీన్ల లెంగ్త్ ఒకటే ఉండాలిగాబట్టి, ఆ ఫ్రీజ్ ఇబ్బంది పెడుతుంది. అంటే వాళ్ళు లెంగ్త్ సరిగా చూసుకోకపోవడమో, స్ప్లిట్ స్క్రీన్ ఐడియా తరువాత రావటమో అయివుంటుంది. వెల్! కామిడీ పండుతుంటే, ఇది మీరు మర్చిపోతారు.

అలాగే కుర్రాళ్ళు ఒకళ్ళ నొకళ్ళు రెచ్చగొట్టుకున్నప్పుడు – నాలిక మీద వేలు ఊపుతో చేసే జెస్చర్ – కుర్రాళ్ళు ఆల్రెడీ ఇంగ్లీషు సినిమాలు చూసి నేర్చుకున్నారనుకుందామా! ఓ.కె.

ఈ మధ్య హీరోయిన్ లందరూ కాస్త తింగరిగా ఉంటారు – “హాసినీ”లా కాస్త మెంటల్లీ రిటార్డెడ్ గా! దాన్ని “బబ్లీ” అంటార్లెండి ఈ జనరేషన్ / సినిమా వాళ్ళు. అలాంటి షేడ్ లో – విమానాశ్రయం ఎలా చేరాలని హీరో టెన్షన్ పడుతుంటే, పానీపూరీ తింటానంటుంది. ఆ చోట కనపడకుండా పోతుంది. హీరో వెతుకుతూ,  హీరోయిన్ షాపింగ్ కెళ్ళింది అని తెలియగానే, చాచి లెంపకాయ ఒకటిస్తాడు. స్టాండర్డ్ గా ఐతే, బాక్స్ బద్దలయ్యే సౌండ్ – ఎఫ్ఫక్టు కోసం – ఉండాలి.అంతే సౌండ్ వస్తుంది! అంతే ఎఫక్ట్ వస్తుంది! కానీ ఓ బస్సు దూ………సుకెళ్ళిపోయిన సౌండ్ లో అది కలిసిపోతుంది!

ఇది దర్శకుడు ముందు అనుకోకుండానే ఇలా జరిగిందటంరా!?

గమనిస్తే సినిమాలో పెద్దగా రక్తాలు చిందించే విలనీ ఉండదు! కానీ – విలన్ చాలా పెద్ద విలన్ అన్నది మాత్రం రకరకాలుగా ఎస్టాబ్లిష్ అయిపోతుంది.( ఎలాగూ మిగితా సినిమాల ఎఫక్ట్ పడుతుందిగా! అందుకని ప్రేక్షకులూ కొద్దిగా ఊహించేసుకుంటారు)

అలాంటి విలన్ చేత తిరిగి ఎత్తుకొని రాబడ్డ భూమిక,  హీరో వచ్చి తీసుకుపోతాడు అన్నప్పుడు – మళ్ళా హీరో ఎలవేట్ ఐపోతాడు. రేప్ చేస్తానని బెదరించినా, ఈ విలన్ కి పౌరుషం ఎక్కువ! హీరోయిన్ ముందు హీరోని కొడితే గానీ, తను హీరోయిన్ ని ముట్టుకోడిక! అక్కడ పాట పెట్టడం, మొదటిసారి కాస్త బోరనిపించిందిగానీ, రెండోసారొ గమనించాను – ఆ పాటలో విలన్ మనసు నలిగిపోయి, హీరోను స్వయంగా జైల్లోంచి బయటికి తెస్తాడు. దీనివల్ల “పోలీసు-తండ్రి”  హీరోను ఎలా విడిపించాలి అనే ప్రాబ్లెం రాదు!

ఫస్ట్ ఫైట్, మధ్యలో ఫైట్స్ ఎంతో అందంగా థ్రిల్లింగ్ గా తీసాక, ఇక కైమాక్స్ కబడ్డీ దగ్గరకి వెళుతుంటే  – వామ్మో ఇప్పుడు కబడ్డీ ఆడి, ఆ తరువాత మళ్ళా డెన్ లో క్లైమక్సా – అని భయపడిపోయా! కానీ, కబడ్డీ గ్రౌండ్ నే క్లైమాక్స్ చేసుకోవడం – క్లైమాక్సు స్టాండర్డ్ లో లేకపోయిన బావుంటుంది.( స్టాండర్డ్ ఆంటే: ఫ్యామిలీ సినిమా అయినా సరే! స్టన్ గన్స్ కి,  ఓ 20 బాంబ్ బ్లాస్ట్స్ కి అలవాటుపడిపోయిన ప్రాణం కదా మరి! 🙂 )

ఓ స్పోర్ట్స్ మూవీ లో – “క్లైమాక్స్”  గ్రౌండ్ లో ఉంటుంది. అలా చాలా ఇంగ్లీషు సినిమాలున్నాయి. ఆ స్టాండర్డ్ లో తీసే ప్రయత్నం “సై” లో జరిగింది. ఎటొచ్చీ, ఆ ఆట మనం ఆడం కదా!!

సరే ! కబడ్డీనే క్లైమాక్స్ చేసినా, అక్కడ చివర్లో గాలి రావటం, గుంపు చెదరటం, తరువాత వాన రావటం – అంతా బానే ఉంటుంది. బట్, అక్కడ కూడా – అప్పటిదాకా నిక్కర్ లో ఉన్న హీరో ప్యాంట్ లోకి వచ్చేస్తాడు. గాలి గ్రౌండ్ లో ఉంటుంది గానీ, చుట్టూ ప్రశాంతంగానే ఉంటుంది  – (అవన్నీ ఐనా మేకింగ్ డిఫికళ్టీస్ – ఇప్పుడు వద్దు). శకుంతల విసిరిన బాంబుని , కుక్క తిరిగి తీసుకొస్తున్నప్పుడు వర్షంలో అది ఆరిపోదు! కామెడీకో, ఆనవాయితీ తప్పకూడదనో ఒక్క బాంబు బ్లాస్ట్ అన్నమాట!

చివరికి విలన్ ని చంపేది – చంద్రమోహన్, తన కొడుకుల్ని హత్యచేసినందుకు ప్రతీకారం! హోమ్ మినిస్టర్ విలన్ అన్నయ్యే ఐనా – మేధావి వర్గం అతన్ని అప్పటికి నిద్రపొమ్మని సలహా ఇచ్చి – సీన్లోంచి తప్పించేసింది. బ్రిలియంట్, నో లూజ్ ఎండ్స్! రైట్!

మీరు తెగనాడిన “అరుంధతి” ఎందుకు హిట్ అయ్యింది? అని నన్ను అడగవద్దు. ఒకవేళ అది హిట్ అవ్వటం నిజమైనా, దానికి నా వద్ద సమాధానం లేదు.

నే చెప్పేదేంటంటే – ఇది మంచి సినిమా. ఇదీ ఒక హిట్ సినిమా యే! ఇందులోనూ బోళ్డు తప్పులున్నాయి. ఐనా మరి ఇది హిట్ అయ్యింది!!

“సినిమా బాగా వచ్చిందండి” అనేది సినిమా వాళ్ళ మాట. ఎందుకంటే, “అనుకున్నట్టు” గా సినిమా రాదు అనేది అనుభవ పూర్వక ఙ్ఞానం వాళ్ళది.

అలాంటప్పుడు – సినిమాకి సక్సస్ ఫార్ములా – అంటూ తప్పుడు విషయాలని సినిమాగా తీయాలని ఎందుకు “అనుకుంటు”న్నారు!? మంచి సినిమానే ధైర్యంగా తీయండి.

ధైర్యలక్ష్మీ మీదే!!

సినిమా మంచిగా వచ్చినా, చక్కటి ప్లానింగ్ తో రిలీజ్ చేసినా, “సక్సస్” ఎవరి చేతుల్లోనూ లేదు! అలాంటాప్పుడు – “కాపీ కొట్టైనా”  – హిట్ కొట్టేసే సినిమా తీయాలని ఎందుకు!? మంచి ఒరిజినల్ సినిమాని మీ శక్తినంత వాడి తీయండి –

విజయలక్ష్మి మీదే!

బిగినింగ్ లో “లాఠీ” , “సొగసు చూడ తరమా” ని ఎందుకు చెప్పానో తెలిసిందా!

ప్రకటనలు
Explore posts in the same categories: సినిమా రివ్యూలు

ట్యాగులు: ,

You can comment below, or link to this permanent URL from your own site.

One Comment పై ““ఒక్కడు” – 2”


  1. రీవ్యూకి ఎక్కువ, వాతకి తక్కువ.

    Very well written.


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: