హమ్మయ్యా! ఇక రండి!

హమ్మయ్య! మొత్తానికి బ్లాగ్ థీమ్ మార్చాను! హాయిగా చదువుకునేలాగానే ఉందా!?(అబ్రకదబ్రాగారూ, ఒకేనా!? – దీని కామెంట్ పోర్షన్ చిన్నగా వస్తోంది,అందుకనీ మళ్ళా మార్చాలో,లేక దీంట్లో ఏదన్న ఆప్షన్ ఉంటుందో!)

నిన్న “నిశ్శబ్దంలో ఙ్ఞానం”  మన చెవులకోసమే “శబ్దం” ఔతుందని చెప్పాను కదా!  ఇప్పుడు “శబ్ద కాలుష్యం” మీద చెప్తా! నిజానికి ఇది ఇదువరకు టైపు చేసిన కోతిగీత, కానీ ఎందుకో – అబ్రకదబ్ర గారి, తాడేపల్లి గారి  బ్లాగు చదవుతున్న మీకు నేను పానకంలో పుడకలా రావద్దని – పోస్టుపోన్ చేసి ఇవ్వాళ్ళ వేస్తున్నాను.

ఇండియా ఈజ్ మై కంట్రీ అండ్ ఇట్ ఈజ్ ఎ వెరీ లౌడ్ కంట్రీ – ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ వీ టాక్ ఎలౌడ్. – భారతదేశము నా మాతృభూమి; నా దేశములో శబ్ద ఘోష ఎక్కువ ; భారతీయులందరూ నా సహోదరులు; నా దేశమునందు మేమందరమూ బిగ్గరాగా నే మాట్లాడుకుంటాము.

వంద కోట్ల జనాభా – చిన్ని చిన్ని ప్రాంతల్లో అత్యధిక సాంధ్రత కలిగినట్టుగా జీవిస్తాం – (లేకపోతే వ్యవసాయానికి భూమి మిగలదేమో! అప్పుడు తిండికూడా సరిపోక దిగుమతి చేసుకోవాలేమో! ఆల్రెడీ చేసుకుంటున్నాముగా అంటారా!)

నా మటుకు నాకు కొంత శబ్దాలు వినపడకపోతే భయం వేస్తుంది. ఆస్ట్రేలియా లోనో న్యూజ్ లాండులోనో నేను బ్రతకలేనని నా స్నేహితుడు ఒకడు తేల్చేశాడు. కానీ ఇన్ని కోట్ల జనాభాలో నేను ఒంటరిగా ఉండగలను. “అప్పుడప్పుడు” ఎవ్వరితోనూ పల్లెత్తు మాటలేకుండా ఉంటాను. నా అస్తిత్వాన్ని, “కుట్టే దోమ” కుడా గుర్తించకపోయానా, చూట్టు మనుషులుంటారు – ఎప్పుడో ఓ సారి అలా ఉంటాను.

 కానీ చూట్టూ శబ్దాలు మాత్రం ఉండాలి. వాటిల్లొనూ ఓ రిథమ్ ఉంటుంది అది మిస్స్ అయితే చిరాక్కా ఉంటుంది. అందుకని  శబ్దం నాకు ఓకె. అలా అన్నానని చెవిలో లౌడ్ స్పీకర్లో అరవకండే! ప్లీజ్!

మన సౌండ్ మిక్సింగ్ ని ఎవరో తప్పు బట్టినప్పుడూ అదే చెబ్దామనుకున్నా.మన సినిమాలు కూడా అందుకే చాలా లౌడ్ గా ఉంటాయి; ఒకోసారి నిజజీవితంకంటే కూడా లౌడ్ గా ఉంటాయ్ – లేక పోతే ఎఫెక్ట్ ఉండదు, తెలుసా!? అలా అని నిశ్శబ్దం ఈ దేశంలో లేదనుకోకండి. “నిశ్శబ్దమూ ఓ రాగమే” నన్నాడు ఇళయరాజా! అలాగే చేసి చూపించాడు – చాల పాపులర్ సినిమాల్లో. పైగా మొన్న రసూల్ – ఇతనికి భారతదేశం మీద ప్రేమెక్కువే ననపించింది – ఏమన్నాడు! – ఏదో…….. ” యూ హర్డ్ దట్ కాకఫోనీ ఆఫ్ ముంబయ్ – బట్ ఐ కమ్ ఫ్రమ్ ది సేమ్ కంట్రీ వేర్ దేర్ కేమ్ ఒన్ “వర్డ్” ఇంటర్స్పెర్స్ డ్ బెటివీన్ లాట్ ఆఫ్ సైలెన్స్ ఫాలోవడ్ బై అనదర్ స్పెల్ ఆఫ్ మోర్ సైలన్స్ ’ – ఆ ’word’  వచ్చింది అనగానే  పాశ్చాత్య క్రిస్టియున్ గుండెల్లో డప్పులు మోగే ఉంటాయి కదా!  – అండ్ దట్ వర్డ్ ఈజ్  “ఓం”  ’ అన్నాడు – అన్లేదూ! ఎవరు మీకిది చెప్పింది – పేరు చూసారా – ”  ’రసూల్’  పూకుట్టీ “

అలాగే దైనందిన జీవితంలో కూడా – కొన్ని నిశ్శబ్ద విశ్రాంత సమయం చేజిక్కించుకోవడం పెద్ద కష్టం కాదనే నేననుకుంటాను. పైగా – రోడ్డు మీద అంత గొడవలో – మీ వాహనానికి ఎదురుకుండా అడ్డువచ్చిన వ్యక్తికి కాని, మరో వాహనానికి కానీ – మీరెంతె బిగ్గరగా హార్న్ చేసినా వినబడదు సుమండి! నిర్భయంగా – అడ్డంగా దాటుకుంటూ/ దూసుకుంటూ వెళ్ళిపోతాడు. వాడి లక్ష్యసాధనలో ఇవన్నీ కనబడవు, వినపడవు. ఎదురుకుండా దొరుకుతున్న ఇంత సందులో ముందుగా దూసుకెళ్ళకపోతే – ఇక్కడ అరసెకను ఆలస్యం  – అనుకోకుండానే అరగంటగా మారిపోయే అవకాసాలెక్కువ -అందుకని! అలా అని మీరు హార్న్ ఇవ్వలేదనుకోండి, అప్పుడు మీకు వినబడతాయి – బూతుల గుళ్ళవర్షం – తూట్లు పొడుస్తుందో, తడిపేస్తుందో అనేది మీ సామర్ధ్యం;  లేదా మాట్రిక్స్ రేంజిలో ఏవి తగలకుండానే మీరు దూసుకెళ్ళిపోతారో; తాడేపల్లి గారి బ్లాగులో(మీరు చదివేశారు) చెప్పినట్టు – నేను సీరియస్ గా అడుగుతున్నా – అంతకంటే ఇంక యోగమంటూ మళ్ళా వేరుగా నేర్చుకోవల్సింది ఏమిటి!?

ఓ నివాసంలో  – రెగ్యులర్ గా “అల్లాహో అక్బర్” వినబడేది ; అందులోనూ ఓ రాగముంది; నాకైతే ఈజీగా నే తెలుస్తుంది.  వామ్మో రాగం పేరనుకునేరు! – అందులో ఉన్న ఓ “ఫ్లో” అని అంతే;

మరో ప్రాంతం కి వెళ్ళినప్పుడు – దీన్ని చాలా రోజులు మిస్ అయ్యానంటే నమ్మండి!  “మగోనియా” అని ఏదో డచ్ డ్రామా – సినిమా చూస్తున్నా – అందులో ఓ ముసలివాడు ఈ అల్లాహో అక్బర్ అంటూ నమాజుకు పిలిచేవాడు – వాడి కింద అది నేర్చుకునేవాడు “వేరె రాగాలు” చేస్తుంటాడు; చివరగా ఒక్కసారి – మొదలెడతాడు – ముందు కాస్త అటూ ఇటూ అయ్యింతరువాత చక్కటి రాగంలోకి వచ్చేస్తాడు. ఆ సీన్లని చూస్తున్నప్పుడు మళ్ళా ఆ రాగం గుర్తొచ్చింది; అసలు సుమారుగా అక్కడినించె ఆ సినిమా చూశా! జస్ట్ అప్పుడే ఆ ఊళ్ళో లౌడ్ స్పీకర్ వస్తుంది – దాంట్లో ఈ ప్రయోగలన్న మాట!

ఇలా ఫీలౌతూ వచ్చి చూద్దును కదా అబ్రకదబ్రగారేమో – పరీక్ష కాలం అంటూ రాశారు – ప్చ్ – మరదీ నిజమే!

అందుకే నాకు తెలిసిన ఒకాయన ప్లాట్లు కొనేటప్పుడే – ఈ గుళ్ళూ, చర్చలూ,మసీదులూ  వస్తాయో రావో అంచనా వేయడం గురించి చెప్పారు; ఎంతయైన అనుభవఙ్జులు లెండి! మీరు కూడా గమనిస్తే – ముందే పసిగట్టచ్చేమో!  ఫారిన్ లో  రియల్ ఎస్టేట్ బిజినస్ సంగతి తెలీదు గాని – మన దగ్గర మాత్రం ఓ వెరైటీ ఉంది; ప్లాట్లేసే టప్పుడే సరిగా వెయ్యిచ్చుగా – అహా! కావలని కొన్ని ఈశాన్య వీధి పోటులూ – కొన్ని మామూలు వీధి పోటులూ!  (ప్రాడక్ట్ డిఫరెన్షియేయన్ / ప్రైసింగ్ / అండ్ మార్కెట్ సెగ్మెంటేషన్ – అన్నమాటా) ;  దీని కోసం మరో వాస్తుశాస్త్రఙ్జుడు చెప్తాడు – ఇక్కడో గణపతి కావాలి అని! ఎప్పుడో ఏ వీర భక్తుడికో ఆ గణపతి సడన్ గా పాలు తాగుతూ కనపడతాడు! అంతే – అదో గుడి – అది మెల్లగా అటూ ఇటూ రోడ్డుని ఆక్రమిస్తూ వెళ్తుంది ;

రోడ్డు మధ్యలో పోలేరమ్మా, మైసమ్మా గుళ్ళూ, – అదేంటంటే! మా దేవుళ్ళు దేవుళ్ళు కాదా!? ఔను మరి కొన్ని చోట్ల  పెద్ద దేవుళ్ళు కొందరు భూ కబ్జా కి సహాయం చేస్తే –  గ్రామ దేవతలు గ్రామస్థులకి సహాయం చేశారండి. తప్పేంటి? ఆ మధ్య రోడ్ వైడనింగ్ లో ఎన్నో చోట్ల రకరకాల రూపాల్లో  దేవుళ్ళూ,దేవతలూ గా ఆ భగవంతుడు వెలిశాడు తెలుసా!

ఇదతంతా ఏ పాశ్చాత్యుడికో ఎలా ఉంటుంది!? ఎయిర్ పోర్టులో దిగంగానే కనేసం ఓ మూడు దేవుళ్ళు చూస్తాడు. రోడ్డుమీద వెళ్తున్నంత సేపూ దేవుడి గుళ్ళే! కాక, స్వాగతించడానికి వచ్చిన వాడు – దారిపొడుగునా రకరకాలుగా దణ్ణాలు, ముద్దులూ!?  ఇక ఆ వచ్చిన వాడు “లాండ్ ఆఫ్ పేగన్ గాడ్స్” అనుకుంటాడేమో పాపం!

ట్రాఫిక్ తో కొట్టుకున్నా సరే – అదంతే! –  ఏంచేద్దాం – పెరిగే ఆవాసాలలాంటివి; నల్లకుంట శంకర్ మఠ్- ఇవ్వాళ నో ఎక్సెప్షన్! ఇంటి మీద గుడి ధ్వజ స్థంభం పడకూడదు – కానీ ఏ పెద్ద గుడి చుట్టూ అంగుళం ఖాళీ ఉండదు – “ఇల్లు కమ్ కొట్టు” గా అన్నీ ఆవాసాలే! సో ద ప్రాబ్లం ఈజ్ డీపర్ దాన్ ఇట్ సీమ్స్ టు ది నేకడ్ ఐ.

కాబట్టి – అబ్రకదబ్ర గారి కుర్రాడు ఏ  “జి ఆర్ ఈ” నో చేసుకొని వెళ్ళేదాకా తప్పదు – ఈ దేశం నుంచి పారిపోవడానికి ఇదంతా మోటివేషన్ అనమాట!!!! 🙂  అందరూ ఇక్కడే ఉంటే అమాయకులెలా బతకాలంటా! లేక పోతే ఏ  ” ఐ య్యే యస్సో” చేసి దేశనుద్దరించ మనండి!

బైదవే మీకు తెలుసా – మన దేశంలో GRE , IAS లు చేయటమో, చదవటమో చేస్తారు!? పైగా IAS ప్యాస్ అయ్యేవాళ్ళు కూడ కొంతమంది! అవీ డిగ్రీలైనట్టు! ఎందుకంటారు? ! ఉత్తర భారతంలో ఇప్పటికీ డిగ్రీ తరువాత అందరూ ias,ips, సివిల్ సర్వీస్ లూ చదువుతుంటారు.

ప్రకటనలు
Explore posts in the same categories: బ్లాగుల గురించి

ట్యాగులు:

You can comment below, or link to this permanent URL from your own site.

2 వ్యాఖ్యలు పై “హమ్మయ్యా! ఇక రండి!”

 1. surya Says:

  Hindu దేవుళ్ళు ఎం పాపం చెసారు, వాళ్లని మాత్రమె ఎకిపారెసారు. మసీదులు, చెర్చిలు కనపడలెదా?

 2. rayraj Says:

  హా హా నేను దేవుళ్ళని ఏకానా!? మీకలా అర్ధం అయ్యిందా!

  సరే!నేనూ యాంటీ హిందూ కాదండి! నా కిష్టమైన దేవుళ్ళే, దేవుడి గుళ్ళే – నా పరిసారాలకి ఇబ్బందిగా ఉండటం పై నేను పడ్డ బాధ!నా దేశాన్ని అందంగా చూపించాలన్న దుగ్ధ!

  నా హిందూ క్రెడెన్షియల్స్ కావాలంటే, ఓపిగ్గా నా పోస్టులు చదవచ్చు!ఒక్కటే ఐతే : “హిందూ మతాన్ని తిట్టుకొని ఏం లాభం?” అన్నది చదవండి.

  నా కవితల్లో “ఇది మాయే అన్నది నిజమైతే”,”గతి తెలియకున్నానురా”,”నిప్పులలోకి సీతను తోసేసి” ల్లో కూడ ఆ విషయం తెలుస్తుంది.మొదటి రెండిటిలో హిందూ మతం నేర్పిన నిజమైన సెక్యులరిజం కూడా చూస్తారు.ఏ పేరులేని దేవుడితో నే పాడుకున్న పాటలు.

  చర్చిలూ,మసీదులూ కూడా నేను ప్రస్తావించాను.లొకేషన్స్ వైజ్ వాటి లిస్ట్ రాయలేను – ఎందుకంటే నా యోగలో నా కవి కనపడవు.నా దేవుడే కనిపిస్తాడు – పోస్టులో యోగ అంటే ఏంటో చెప్పను!


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: