తెలుగు చచ్చిపోతే తప్పేంటి?

ముందుగా అందరికీ హార్దిక ఉగాది శుభాకాంక్షలు; ఈ ఉగాదికైనా ఒక్క ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పండి.

నేనేం చిరంజీవిని కాదుగా, మీరంతా వచ్చి నా మాట వింటానికో, నాకు సమాధానం చెప్పటానికో. ఐనా సరే ఇది చాలా ముఖ్య విషయం అని అడుగుతున్నాను.

మీరెవరైనా – కవులైన,  రచయితలైన,  సినిమావారైనా,  సైంటిస్ట్ లైనా, కంప్యూటర్ ఇంజనీర్లైనా, ఉత్త ఇంజనీర్లైనా,  డాక్టర్లనా,  యాక్టర్లైనా,  లాయర్లైనా,  సి ఏ లైనా,  సి యస్స్ లైనా, సేల్స్ గైస్ ఐనా,  సేల్స్ గాల్స్ ఐనా,  మోడల్స్ ఐనా, ఎడిటర్లైనా,  జర్నలిస్ట్ లైనా,  రైతులైన (కూలీలు బ్లాగర్లలో లేరేమో)  కూలీలైనా,  కార్మికులైన,  సంఘ సంకర్తలైనా,  సోషల్ యాక్టివిస్ట్ లైనా, టెక్నాలజిస్ట్ లైనా,  టెక్నోక్రాట్స్ ఐనా,  వ్యాపారవేత్తలైనా,  ఆంత్రప్రెన్యూరులైన,  ప్రైవేటు/ప్రభుత్వ ఉద్యోగస్తులైనా,  రియల్ ఇస్టేట్ కింగ్ లైనా,  బ్రొకర్ /లేక ఏజంట్లైనా,  విద్యాధికులైనా, విద్యావేత్తలైనా ,  హేతువాదులైనా,  మరేదో వాదులైనా,   జ్యోతిష్యులైన,  వాస్తు శాస్త్రఙ్ఞుడైనా, నాట్యకారులైనా,  సంగీత విద్వాంసులైనా,  పాటగాళ్ళైనా,  పాట గత్తెలైనా,యన్నారైలైనా, దేశస్థులైనా   ఏదైనా , మీరేదైనా సరే  – దయ చేసి నాకు ఓ “మాట” చెప్పండి.

తెలుగు ఎందుకు బ్రతకాలి!? తెలుగు భాష వదిలేసి, మనందరం ఇంగ్లీషు నేర్చుకుంటే తప్పేంటి? తెలుగు చచ్చిపోతే వచ్చే నష్టమేంటి!? సారీ! అవి మూడు ప్రశ్నలైనాయి కదా!

ఒకటే ప్రశ్న ; నాకు ప్రతి ఒక్కరినుంచి ఒక సమాధానం కావాలి ;

“తెలుగు భాష” ఎందుకు బతకాలి!?
 
నేను “మన సినిమా” అంటే తెలుగు సినిమా గా భావించి, రాస్తున్నానని ఇదివరకే ఓ సారి చెప్పాను. అలాగే సినిమా కి భాషతో చాలా తక్కువ పని అన్న విషయాన్ని కూడా చెప్పాను. దాని గురించి పెద్దగా విశదీకరించ లేదనుకోండి.

కాకపోతే తెలుగు సినిమా ఏంటో అనే దానికంటే, మనం అసలు “తెలుగు” గురించే ఓ రకమైన అంగీకరానికి రావటం ముఖ్యం. అందుకని నేను అడుగుతున్నాను.

నా వద్ద ఓ సమాధానం ఉన్నది. అది నేను తరువాత చెప్తాను. కానీ నాకు మీ సమాధానం చాలా ముఖ్యమైనది. ఎంతమంది దీనికి సమాధానం చెబితే  – నే చెప్పేది అంత అర్ధవంతమౌతుంది.

చెప్పండి : “తెలుగు భాష” ఎందుకు బతకాలి!?

దీనికి సమాధానం తర్వాత పోస్టులో ఇక్కడ రాశాను

ప్రకటనలు
Explore posts in the same categories: Uncategorized

ట్యాగులు:

You can comment below, or link to this permanent URL from your own site.

25 వ్యాఖ్యలు పై “తెలుగు చచ్చిపోతే తప్పేంటి?”


 1. సంస్కృత భాష చచ్చి ఆ స్థానంలో హిందీ పుట్టలేదా? సూరసేని భాష చచ్చి ఆ స్థానంలో పంజాబీ భాష పుట్టలేదా? తెలుగు భాష చచ్చిపోతే ఇంకో భాష పుడుతుంది.

 2. prabhakar Says:

  ఏ భాష ఐనా ఎందుకు చావాలి?
  ఇతర భాష అవసరమైతే నేర్చుకోండి. కావాలనిపిస్తే ఇతర భాషలో కవితలల్లండి. మీకు అక్కరకు రావట్లేదని తెలుగు చచ్చిపోవాలా?
  తెలుగు మాత్రమే వచ్చిన మన తోటి వాళ్ళను కూడా చంపేస్తారా / చావమంటారా?
  భాష మన భావాలను పరస్పరం ఇతరులతో పంచుకోవటానికి తోడ్పడుతుంది. ఇతరులతో వక్తంచేయడనికి మీకు తెలుగు వద్దకుంటే సరే. బలవంతం లేదు. తెలుగు లాంటి భాషను చచ్చిపొమ్మనే హక్కు ఎవరికీ లేదనుకుంతాను.
  అసలు ఏ భాష ఐనా ఎందుకు చావాలి?

 3. bhavani Says:

  Any language is representative of the culture that we inherit. Can you imagine talking about our festivals, food, traditions and customs in english? How would that sound? Language is a byproduct of the needs of the people of a particular culture. If it’s lost, much of our identity gets lost.


 4. సంస్కృత భాష చచ్చిపోయినా హిందీలో బోలెడన్ని సంస్కృత పదాలు కనిపిస్తాయి. పంజాబీ, ఒరియా లాంటి భాషలలో కూడా బోలెడన్ని సంస్కృత పదాలు ఉన్నాయి. Isn’t it not inheritance?

 5. Mahi Says:

  తెలుగు ఎందుకు చచ్చిపోవాలి?అది మన ఐడెంటిటి.కొన్ని పదాలు వేరే భాషలో ఉండటం వేరు.పూర్తిగా మనది అయిన భాష ఉండటం వేరు.


 6. బాగా అడిగావు. అడిగే ముందు, మాతృ భాషని వదిలేసి ఇంకో భాషని ఎందుకు చదవాలి అనిపిస్తున్నదీ? ప్రపంచంలో ఎక్కడైనా, మీ పిల్లలకి మీ మాతృ భాషనే నేర్పండి అని చెప్తారు. ఎందుకు?
  భాష – సంస్కృతిని తెలిపేందుకు, తెలుసుకునేందుకూ మాధ్యమం.
  తెలుగు భాష చచ్చిపోతే, మన సంస్కృతి చచ్చిపోతుంది. మన సెన్సిటివిటీస్ చచ్చిపోతాయ్. మనది కాని ఇంకో భాసలో మనల్ని మనం ఆవిష్కరించుకోలేక కుచించుకుపోతాం.


 7. MROని మండల శిస్తువసూలు అధికారి అంటే ఎవరికీ అర్థం కాదు, ట్రైన్ ని ధూమ్ర శకటం అంటే ఎవరికీ అర్థం కాదు, సిగ్నల్ లైట్ ని సంకేత దీపం అంటే ఎవరికీ అర్థం కాదు. అదేదో సినిమాలో కోట శ్రీనివాసరావు గారి లాగో, ఇంకేదో సినిమాలో నరేష్ గారి లాగో శుద్ధ తెలుగు భాషని పట్టుకుని వేలాడి మనం సాధించగలిగేది ఏమీ లేదు.


 8. >>చెప్పండి : “తెలుగు భాష” ఎందుకు బతకాలి!?>>
  తమ భాషే గొప్పది అనే సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న కొంత మంది సంతృప్తి కోసం తెలుగు బతకాలి అని ఆ ఫీలింగ్స్ గలవారి నమ్మకం.


 9. ఇంకొకరి తల్లి మనకి తల్లి అవనట్టె , ఇంగ్లీషు ఉందని తెలుగుని చంపేసుకోనక్కర్లేదు . మన తల్లి చనిపోతే తప్పేమిటి అని ఎప్పుడైనా ఆలోచిస్తామా?

 10. మనోహర్ Says:

  @”తమ భాషే గొప్పది అనే సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న కొంత మంది సంతృప్తి కోసం” :
  తమభాష గొప్పది అనుకోవడానికి , తమ భాషే గొప్పది అనుకోవడానికి చాలా తేడా ఉంది. ముందు అది అర్ధం చేసుకోగలిగితే మిగతావన్నీ అవే అర్ధం అవుతాయి.

  పక్కింటి పిల్లవాడి అమ్మ మిమ్మల్ని బాగా చూస్తారని మీ అమ్మని చంపేస్తారా?

  మీరడిగిన ప్రశ్మ కి సూటిగా చెప్పగలిగిన సమాధానం ఈ ప్రశ్నే

 11. మనోహర్ Says:

  మనకంటూ ఒక పరిపుష్ఠమైన భాష ఉన్నప్పుడు, అరువు తెచ్చుకున్న భాష అవసరమా?


 12. Language is not equivalent to mother. We cannot accept an alien woman as mother because such acceptance would be insult to real mother and it would be a serious misdeed. Acceptance of alien language cannot be compared to acceptance of alien woman as mother because acceptance of new language is no way harmful.

 13. అజిత్కుమార్ Says:

  తెలుగు భాష లేకపోతే స్థానిక ప్రజలు ఇబ్బంది పడతారు. ధనవంతులకు ఆంగ్లభాష అవనరమేమోగానీ పేదలకు అది అందని పండే. కొంతమంది తమ పిల్లల్ని ఇంగ్లీషు మీడియంలో చదివించడం వల్ల వారికి తెలుగు భాషతో పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. వాస్తవానికి భాషలో మార్పులు నగరప్రాంతాలలో ఎక్కువగా జరుగుతుంది. భాషాభివృద్ది గ్రామీణ ప్రాంతాలలో జరుగుతుంది. తెలుగు భాష చచ్చిపోయినా ఫరవాలేదనే అభిప్రాయం మీకు కలగడానికి మీ నివాస ప్రాంతమూ, ధనబలమూ కలిసివుండవచ్చు.ధనవంతులకూ పేదలకూ మధ్య పెరుగుతున్న అంతరాలలో భాషా సమస్య కూడా ఒకటి. సమాజం యొక్క సహజలక్షణాలలో భాగంగా ప్రజలు తమలో తాము చిన్నచిన్న గ్రూపులుగా విడిపోవడానికి ప్రయత్నిస్తూవుంటారు. ప్రత్యేక భాష , సంజ్ఞలు ఏర్పరచుకుంటారు. ప్రత్యేక కోడ్ కలిగిన పదాలు ఉపయోగించుకుంటారు.వ్యాపారులు వస్తువుల ధరల్ని ప్రత్యేక పదాలతో పలకడం, కొన్ని వృత్తులకు సంబంధించి కొన్ని ప్రత్యేక పదాలు ఏర్పరచుకొవడం , ఇలా వుంటాయి. భాషకు సంబంధించి మతవాదుల ప్రయత్నాలు మరోలావుంటాయి. మాత్రుభాష పేరుతో హిందువులైతే తెలుగు పేరుతో సంస్కృతము, ముస్లీములైతే ఉర్దూపేరుతో అరబ్బీ భాషనూ పిల్లలపైరుద్దుతారు.


 14. ముందుగా నాదో ఎదురు ప్రశ్న. ఈ ప్రశ్న మీరు తెలుగులోనే ఎందుకడిగారు?

  ఉప్పుడు, ఉంకో ప్రశ్న. మీకా ప్రశ్న, దానికి సంబంధించిన అనుమానం అసలెందుకొచ్చాయి?

  తెలుగేమీ మరణశయ్య మీద లేదు. భాషలో పరభాషా పదాలు, ప్రయోగాలు ఎక్కువయ్యాయి నిజమే. అది తెలుగో కాదో అర్ధమవ్వకుండా మాట్లాడేవాళ్లూ పెరిగారు నిజమే. ఐనా తెలుగు చచ్చిపోయే రోజులు కనుచూపు మేరలో లేవు. కాబట్టి అది చచ్చిపోతే తప్పేంటి అనే ప్రశ్నే రాకూడదు.


 15. దేశంలో హిందీ తరువాత తెలుగు భాష మాట్లాడే వాళ్ళ సంఖ్యే ఎక్కువ. చత్తీస్ గడ్ లోని దండకారణ్య ప్రాంతంలోని కొందరు గిరిజనులు తెలుగులోనూ, స్థానిక గిరిజన భాషలలోనూ మాట్లాడుతారు. వాళ్ళకి ఇప్పుడు కూడా హిందీ రాదు. దక్షిణ ఒరిస్సాలోని కొన్ని గిరిజన ప్రాంతాలలో తెలుగు, ఒరియా రెండు భాషలూ మాట్లాడుతారు. వాళ్ళ మాతృభాష తెలుగా లేదా ఒరియా అన్న విషయం రెండు భాషలు మాట్లాడే అక్కడి ప్రజలకి తెలియదు. స్కూల్ లో ఒడియా మీడియం చదువు చదివి ఇంటిలో తెలుగు మాట్లాడేవాళ్ళని కూడా చూశాను. తెలుగు భాష ఎక్కడా చావడం లేదు. తెలుగువాళ్ళ సంఖ్య తక్కువగా ఉన్న భుబనేశ్వర్, ఖుర్దా లాంటి పట్టణాలలో కూడా థియేటర్లలో తెలుగు సినిమాలు ఆడుతుంటాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇండియా నుంచి విడిపోకముందు ఇండియాలో హిందీ తరువాత బెంగాలీ, పంజాబీ భాషలు ఎక్కువగా మాట్లాడేవాళ్ళు, తెలుగు నాలుగవ స్థానంలో ఉండేది. దేశ విభజన తరువాత తెలుగు రెండవ స్థానంలోకి వచ్చింది. తెలుగు భాష చావదు, చచ్చినా నష్టమేమీలేదు.


 16. భాష ఆకాశం నుంచీ ఊడిపడదు. ఒక సంస్కృతి యొక్క నిర్ధిష్టమైన అభివ్యక్తి భాష. సంస్కృతిలో మార్పుతోపాటూ భాష మారుతుంది. భాష నిలువనీరు కాదు ఒక నిరంతరప్రవాహం. కాబట్టి అందులో కొంత చనిపోవడం, కొంత శైలిలో మార్పురావడం, కొన్ని కొత్త పుంతలు తొక్కడం సహజం. అంతమాత్రానా మొత్తం భాషే చనిపోతోందనుకోవడం అర్థరహితం.

  ఒకటి మాత్రం చెప్పగలను, నేనే ఎక్కడో రాసినట్లు “తెలుగుతనం నశించిన రోజున, తెలుగు భాషకు విలువలేదు, దాని అవసరం లేదు”.


 17. ఇప్పుడు కూడా చాలా మంది భాష విషయంలో ఎండోగేమస్ గానే ఉంటున్నారు. మా జిల్లాలో ఒరియా బ్రాహ్మణులు తెలుగు బ్రాహ్మణులని పెళ్ళి చేసుకోరు, ఒరియా పట్నాయకులు తెలుగు శిష్ట కరణాలని పెళ్ళి చేసుకోరు. ఈ ఎండోగేమస్ రిలేషన్స్ వల్లే భాషలు ఎక్కువ కాలం బతుకుతున్నాయి. ఒరిస్సాలోని గజపతి జిల్లాలో మా తాతలు నివసించిన ఒక మారుమూల గ్రామంలో ఒక కరణం ఉండేవాడు. అతని చెల్లెల్ని శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలానికి చెందిన ఒక వ్యక్తికిచ్చి పెళ్ళి చేశారు. అప్పట్లో మా తాతల గ్రామానికి బస్సు సౌకర్యం లేదు. ఎడ్ల బండ్ల మీద వెళ్ళాల్సి వచ్చేది. అప్పట్లో కూడా ఆ కరణం ఎక్కువ దూరాన ఉన్న ఊరికి తన చెల్లెల్ని పెళ్ళి కోసం పంపాల్సి వచ్చింది. ఆ కరణం తెలుగు వాడు. వాళ్ళ కుటుంబంతో చుట్టరికం కలుపుకోవడానికి ఒరియా పట్నాయకులు ఒప్పుకోరు. వాళ్ళ ఇంటి పేరు “డబ్బీరు” ఆధారంగా వాళ్ళు తెలుగు కరణాలని సులభంగా గుర్తు పట్టేస్తారు. అందుకే ఆ కరణం కుటుంబ సభ్యులు ఆంధ్రాలో పెళ్ళి సంబంధం వెతుక్కోవలసి వచ్చింది. How does languages die so easily while there are so much strict endogenous relations in our society?


 18. I believe in heterogamous culture but not in endogamy.


 19. […] Rayraj Reviews రివ్యూ తక్కువ రాతలెక్కువ! « తెలుగు చచ్చిపోతే తప్పేంటి? […]

 20. krishna rao jallipalli Says:

  బతక పోయినా మునిగిపోయేది ఏమి లేదు. చచ్చే ఏ బాశానయినా ఎవరు ఆపలేరు. దమ్మున్నది అదే బతుక్కుద్ది. ఒక్క తెలుగేమీ ఖర్మ ఏ బాష చచ్చిపోయినా ఏమి అవదు. ఈ క్షణాన english చచ్చిపోయినా ఏమి అవదు. హిందీ చచ్చినా అంతే. ఏది ఆగదు. కాకపొతే కొన్ని రోజులు కొంత మందికి ఇబ్బంది.. ఆ తరువాత అంతా మామూలే. ఇంకో విషయం… బాషే కాదు ఏ ప్రాణి చచ్చిపోయినా ఏమి అవదు. ఇందిరా గాంది చనిపోయినప్పుడు చాలా మంది అనేవారు.. ఈ దేశం ఏమవుతుందో అని. ఏమి అయింది. సముద్రంలో కలిసిపోయిందా?? పాతాళంలో కుంగి పోయిందా? కొన్ని లక్షల, కోట్ల సంవత్సరాల క్రితం ఎన్ని భాషలు పుట్టాయో, ఎన్ని చచ్చాయో ఎవరికెరుక. అలాగా ప్రాణులూ, మనుషులూ, భాషలూ, సంస్కృతులూ, సంప్రదాయాలూ, అన్నీనూ..ofcourse bloggers and blog readers also.


 21. భాష సంస్కృతికి జీవనాధారం. నా చుట్టూ ఉన్నవి నాకు నా భాషలోనే పరిచయమయ్యాయి. నా ఉనికిని చాటే నా ప్రాంతపు అలవాట్లు, ఆచారాలు, సంప్రదాయాలు, నా ప్రాంతం ప్రపంచానికి వివిధ రంగాల్లో అందించిన జ్ఞానం నా భాషలోనే నిక్షిప్తమై ఉన్నాయి. నా భాష సంగీతానికి వన్నె తెచ్చిన భాష. నా భాషను నిలుపుకుంటే నా ఉనికిని చాటుకున్నట్టే. నా భాషని నిలుపుకుంటే నా సంస్కృతిని నిలుపుకున్నట్టే. నా భాషని చదివితే తర తరాలుగ నా వాళ్ళు నాకందించిన జ్ఞాన భాండాగారాన్ని సంరక్షించుకున్నట్టే. ఇవన్నీ జరిగినప్పుడు నా నాగరికత కాల పరీక్షను తట్టుకుని విరాజిల్లుతుంది. నేను నిండైన ఆత్మాభిమానంతో ప్రపంచ పౌరులతో కరచాలనం చేస్తాను.


 22. It is not easy for a language to die in a society where strong roots of lingual endogamy exists. ప్రపంచంలో అతి ఎక్కువ మంది మాట్లాడే భాషలలో తెలుగు పదమూడో స్థానంలో ఉంది. లక్ష కంటే తక్కువ మంది మాట్లాడే భాషలు మాత్రమే అంతరించిపోయే అవకాశాలు ఎక్కువ అని పరిశీలనలో తేలింది.


 23. […] పెద్ద చర్చ జరిగింది. ఇలాంటి అంశంపైనే తెలుగు చచ్చిపోతే తప్పేంటి అన్నారు రేరాజ్ రివ్యూస్‌లో. ఈ టపాకు […]


 24. During the days of 2007, I was english blogger. ఇంగ్లిష్ అర్థం కాని వాళ్ళ కోసం 2008లో నేను తెలుగు బ్లాగింగ్ మొదలు పెట్టాను. In fact, I am more inclined towards international language english than regional language telugu.

 25. radhika Says:

  నాకెప్పుడూ సందేహమే ఈ విషయంలో.నేను తెలుగులో పుట్టి పెరిగి,తెలుగులో బతికాను కాబట్టి నా ఉనికి అక్కడ వుంది కాబట్టి నావరకు తెలుగు చాలా ఇష్టం..కానీ వేరే భాషలో పెరిగి వేరే భాషలో బ్రతికే నా పిల్లలకి తెలుగు ఉనికి ఎలా అవుతుంది?వాళ్ళకి దాని మీద ఇష్టం ఎలా పెరుగుతుంది.కానీ నేర్పడం మన బాధ్యత .పిల్లలు దానిని పాటించాలని ఆశించడం హాస్యాస్పదం.[తెలుగులో బ్రతుకుతున్న వాళ్ళని ఇంగ్లీషు లో మాట్లాడాలని అనడం లాంటిదే ఇదీను]వ్యవసాయం చేసుకుని బ్రతికేవాళ్ళకి,వాళ్ళ మీద ఆధారపడి బ్రతుకులు అల్లుకున్న వాళ్ళకి[వ్యాపారాలు] ఇంగ్లీషు వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదు..అందుకే అక్కడ భాష నిలబడుతుంది.వేరే భాష వస్తే గానీ నీకు బ్రతుకుదెరువు లేదంటే అక్కడా భాష మారిపోతుంది. ఈ తరం లో నేను తెలుగు,ఇంగ్లీషు మాట్లాడతాను.నా పిల్లలు ఇంగ్లీషులో బ్రతికి తెలుగు మాట్లాడడానికి మాత్రమే వుపయోగిస్తారు.తరువాత తరువాత ఇంగ్లీషే వాళ్ళ భాష అయిపోతుంది.ఇది కూడా పరిణామక్రమం.ఉపయోగం లేని భాగాలు క్షీణించి ఎక్కువ గా ఉపయోగించేవి అభివృద్ది చెందినట్టే భాష కూడా.బ్రతకడానికి దారి చూపించలేని భాష ఎక్కువ కాలం మనలేదు.ఇది నా అభిప్రాయం.ఎవరినీ నొప్పించే వుద్దేశ్యం లేదు..


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: