తెలుగు చచ్చిపోతే… – నా సమాధానం

తెలుగెందుకన్న సమాధానం చెప్పిన వాళ్ళు తక్కువగా ఉండటం, ఊహించినదే ఐనా, కొంచెం బాధాకరం.చెప్పిన వారికి ధన్యవాదాలు. ఎన్నెన్నో చెబ్దాం అనుకున్నాను. వ్యాఖ్యల్లో కొందరు కొన్నిటిని స్పృశించారు. కానీ సరియైన సమాధానం చెప్పినవారు ఒక్కరే. వారి గురించి ఏమీ తెలీదు కాబట్టి వేనోళ్ళ ఇప్పుడే పొగడలేను.

ఇక నేను చెప్పాల్సినవి ఎలా చెప్పాలో ఇంకా తెలీకపోయినా, చెప్పాలనుకున్న వాటిలో కొన్నైనా చెప్పేయాలి.

నా ప్రశ్న: “తెలుగు భాష” ఎందుకు బతకాలి!?
నా సమాధానం : “నేను తెలుగువాణ్ణి కాబట్టి”

మొత్తం చదవలేక పోతే :  “నేను పార్టికల్ ఫిజిక్స్ లో….”  – అన్న పేరా దగ్గర నుంచి చదవండి.

దీనికి అతి దగ్గరగా వచ్చిన సమాధానం – ఓ విధంగా ఇది మెరుగైన సమాధానం:

Mahi Says: తెలుగు ఎందుకు చచ్చిపోవాలి?అది మన ఐడెంటిటి.కొన్ని పదాలు వేరే భాషలో ఉండటం వేరు.పూర్తిగా మనది అయిన భాష ఉండటం వేరు.

అలగే కాస్త దగ్గరగానే ఉన్న మరొక్క సమాధానం – కానీ ఇందులోనూ అందరూ చేసిన మిస్టేక్ ఉంది:
bhavani Says:  Any language is representative of the culture that we inherit. Can you imagine talking about our festivals, food, traditions and customs in english? How would that sound? Language is a byproduct of the needs of the people of a particular culture. If it’s lost, much of our identity gets lost.(బొల్డ్ వరకు కరెక్ట్)

మీరిచ్చిన మిగిలిన సమాధానాలు :
1. ఎందుకు చావాలి? మీకు వేరే భాష ఇష్టమైతే నేర్చుకోండి. కవితలల్లండి.
నేను ఇంగ్లీషు నేర్చుకున్నాను. కవితల్లటానికి కాదు. మంచి ఉద్యోగం కోసం,డబ్బు కోసం, హోదా కోసం, మెరుగైన జీవన ప్రమాణం కోసం.నాకు నిజంగానే తెలుగు చచ్చినా వచ్చే నష్టం లేదు.మహా ఐతే  “వీడు తెలుగు తెగ వాడు” అని ఎవరన్నా గేలి చేస్తే  –  వ్యక్తిగతంగా నేనేంటో తెలుసుకొని, నా గొప్పతనాన్ని తెలుసుకొని నా సాంగత్యం కోరలేని ఆ ఎదుటి వారి దౌర్బల్యానికి – పరిహాసంగానో, సంతాపంగానో నవ్వుకొని, ముందుకు సాగిపోతా!

2..ఈ భాష పోతే ఇంకోటి ; పోతే యే!?
– నేనడిగింది అదే! పోతే యే!-  కాని ఆ తరువాత తెలుగు వాడిగా నన్ను నేను చెప్పుకోను.ఆ ఐడెంటీని నే కోరుకుంటున్నానా లేదా అన్నది ఎవర్ని వారు ప్రశ్నించుకోవలసిన ప్రశ్న.

3 .a. మాతృ భాషని వదిలేసి ఇంకో భాషని ఎందుకు చదవాలి అనిపిస్తున్నదీ?
ఆల్రెడీ చెప్పాను.మంచి ఉద్యోగం కోసం,డబ్బు కోసం, హోదా కోసం, మెరుగైన జీవన ప్రమాణం కోసం.ఇంకా మరెన్నో స్వాభావిక కోరికలు తీర్చుకోవటం కోసం.

b. తెలుగు భాష చచ్చిపోతే, మన సంస్కృతి చచ్చిపోతుంది.

ఏది మన సంస్కృతి!? నేను పుట్టిందగ్గర నుంచి “డూ డూ బసవన్న”ని చూడలేదు; కోకిల పాట,మామిడి చిగురు చూడాలేదు.(అమ్మ పెట్టిన ఉగాది పచ్చడి తిన్నాను. నాన్న తెమ్మంటే మార్కెట్టు కెళ్ళి బంగారం ధరలో ఉండే కొంత చెత్త కొని తెస్తాను. వినాయక చవితి నాడైతే మరీ దారుణం.) కోకిల, మావిడి అనేవి – చిన్నప్పడినించి గ్రీటింగ్ కార్డ్ ల మీద, పత్రికల్లో చూసిన చిత్రాలు – అంతే! గొబ్బెమ్మలు గట్రా  అసలే చూడలేదు.( – యాక్ – పేడలో పని చేసివాళ్ళు చేసుకోవచ్చు; ఆ రోజుల్లో దాని వల్ల మంచేదో ఉండి ఉండవచ్చు. అపార్ట్ మెంట్ లో చెత్త దాచుకోవడానికి ప్లేస్ లేదు; పేడ కూడనా!?)  కాని, సినిమాల్లో, టివి ప్రోగ్రామ్స్ లో చెప్తుంటారు.అలా గొబ్బెమ్మలు నేను చూసాను.నా జీవితంలో నేను “పంచె”  కట్టలేదు. కట్టను కూడ. గుడికి వెళ్ళినా నేను జీన్స్ , టీ షర్ట్ వేసుకొని వెళ్తున్నాను. ఏది తెలుగు సంస్కృతి!? – మీ దృష్టిలో అసలు ఇప్పుడు నేను తెలుగువాణ్ణేనా కాదా!?.  మీరు చెప్పే ఏ సంస్కృతి ఐనా సరే, ఒకవేళా నేను దాన్ని పాఠించని వ్యక్తినైతే, నేను తెలుగువాణ్ణి కానా!? అలా ఐతే – చాలా మంది నా లాగానే ఔతారు. వాళ్ళ కోరిక అదే. ఏది నేర్చుకున్నా, మనిషి ఏమౌదామని కోరుకుంటున్నాడో చూడండి. ఆ ఆదర్శంలో తెలుగు సంస్కృతి ఉందా!? ఒకవేళ లేకపోతే, మన సంస్కృతి భాషతో నిమ్మితం లేకుండా కూడా చచ్చిపోతుంది. మీరనవసరంగా భాష వల్ల సంస్కృతి నిలుస్తుందన్నారు. భాష ఉన్నా సంస్కృతి చచ్చిపోగలదు మరి! – అని నేనంటున్నాను. అందుచేత, భాషని బతికిస్తే, సంస్కృతి నిలవదేమో సరి చూసుకోండి!.

4. మన తల్లి చనిపోతే తప్పేమిటి అని ఎప్పుడైనా ఆలోచిస్తామా?
ఆలోచించ లేం. నిజమే. కానీ అమెరికాలో ఉన్న ఓ వ్యక్తి  తన అమ్మగారిని ఎంత బతిమాలినా నేనిక్కడే ఓళ్డేజ్ హోమ్ లో ఉంటాను అంది. ఆమె కోరిక మేరకి అలాగే చేశాడు. ఆవిడ చనిపోయినప్పుడు వచ్చి, ఏవో చేయాల్సినవి చేసి అమెరికా వెళ్ళిపోయాడు. ఫైన్, నే చెప్పేది అదే! ఉన్నంతకాలం తెలుగు ఉంటుంది. పోయింతరువాత, నివాళులర్పిస్తే సరి. మనం “బతికించుకోనక్కర్లేదుగా!” ’మాతృ’భాష అనేది ఓ సెంటిమెంటల్ వాల్యూ క్రియేట్ చేయడానికి బావుంటుంది. కానీ ఆ వాల్యూ తో భాషను బ్రతికుంచుకోలేం. తల్లినే వదిలేస్తున్న రోజులివి బాబు! ; బై ద వే, శీర్షికలో “తెలుగు చచ్చిపోతే తప్పేంటి?” అని వాడింది నిజమే – దానికి సమాధానం- “నేను” తెలుగువాడిగా చచ్చిపోతాను కాబట్టి” ; కానీ నే ప్రశ్నించింది మాత్రం : “తెలుగు భాష” ఎందుకు బతకాలి!? – దీనికి సమాధానం – “నేను తెలుగువాణ్ణి కాబట్టి:

5.మనకంటూ ఒక పరిపుష్ఠమైన భాష ఉన్నప్పుడు, అరువు తెచ్చుకున్న భాష అవసరమా?
అవసరమే! మళ్ళా చెబ్తున్నాను : మంచి ఉద్యోగం కోసం,డబ్బు కోసం, హోదా కోసం, మెరుగైన జీవన ప్రమాణం కోసం.ఇంకా మరెన్నో స్వాభావిక కోరికలు తీర్చుకోవటం కోసం (కవితలు కూడా ఓ రీజన్ కావచ్చు!)

6.తెలుగు భాష లేకపోతే స్థానిక ప్రజలు ఇబ్బంది పడతారు. (దీంతో పాటు వీరు ఇంకొంచెం వివరణలు కూడా ఇచ్చారు)
కరెక్టు. ఎందుకు ఇబ్బంది పడతారు? వాళ్ళకి ఇంగ్లీషు రాదు కనుక. ప్రాధిమిక స్థాయి నుంచి, మనం ఇంగ్లీషే నేర్పిస్తే, ఈ గొడవ ఉండదు. ప్రభుత్వం కూడా అందరూ ఇంగ్లీషే నేర్చుకునే విధంగా విద్యావిధానాలు సవరించుకుంటే,  అసలు గొడవే లేదు. అతి చిరకాలంలో ఆంధ్ర ఇంగ్లీషు రాష్ట్రంగా అవతరించవచ్చు!

పైగా, ప్రభుత్వం తెలుగు నేర్పిస్తుండగా, డబ్బున్న వాళ్ళు ఇంగ్లీషులో నేర్చుకోవటం వల్ల, ఈ అంతరం మరింత పెరిగిపోతోంది. సో, బెటర్ ఎవ్రీ బడీ ఈజ్ టాట్ ఇన్ ఇంగ్లీషు. అందుకే పేదవాళ్ళు సైతం, ఎలాగైనా పిల్లల్ని ఇంగ్లీషు మీడియంలో చేర్పించాలని కోరుకుంటున్నారు.వాళ్ళకి మనం ఇంగ్లీషు స్కూళ్ళూ ఏర్పాటు చేద్దామా!?

అలా  – మెజారిటీ ఇంగ్లీషు కోరుకుంటే, మనం ఇంగ్లీషు నేర్పించేద్దామా!?  మెజారిటీ ఫ్రీ సెక్స్ – విచ్చలవిడి శృంగారం కోరుకుంటే, ఒప్పేసుకుందామా!?

మెజారిటీ కోరుకున్నది జరగదు మాష్టారు. మెజారిటీ ఒక విషయాన్ని కోరుకునేలా కొందరు చేస్తారు. అలా చేయడం కుట్ర కాదు. ఒక్కొక్క సారి అది అవసరం. అదే ప్రజాస్వామ్యం. దాని వల్ల సమాజానికి మంచి జరుగుతుందని కొందరన్నా నమ్మి, ఆ నమ్మకాన్ని విస్తరింప జేసి, దాన్నే అందరూ కోరుకునేలా, ఆచరించేలా చేస్తారు. ఆ విధంగా తెలుగు నిలబడాలని కోరుకునే వాళ్ళే తెలుగు నిలబెట్టాలని చూస్తారు. స్థానిక ప్రజలకు మీరు ఇంగ్లీషు నేర్పితే, వాళ్ళు అదే నేర్చుకుంటారు.

అందుకే నేనడిగేది – అసలు తెలుగు ఎందుకు బతకాలి అని అనుకుంటున్నాం – దానికి సమాధానం – అది ఓ తెలుగువారిగా మన ఐడెంటిటీ! అసలు తెలుగు లేకపోతే, తెలుగువాడు లేడు!

7.a. ముందుగా నాదో ఎదురు ప్రశ్న. ఈ ప్రశ్న మీరు తెలుగులోనే ఎందుకడిగారు?
నా సమాధానం : నేను తెలుగు వాణ్ణి కాబట్టి; తెలుగు బతకాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి; తెలుగును బతికించాల్సింది తెలుగు వారు కాబట్టి; ఆ తెలుగువారే నా మాట వినాలని నే కోరుకున్నాను కాబట్టి.

b. మీకా ప్రశ్న, దానికి సంబంధించిన అనుమానం అసలెందుకొచ్చాయి?
తెలుగుకు తెగులు పట్టిందని కాదు. కానీ, తెలుగు అభిమానుల దృక్పదంలో మార్పు రావాలని ఇలా ప్రశ్నించాను. గమనించండి – సాహిత్యం ఇష్టం ఉన్న వాళ్ళు – అభివ్యక్తి అనీ అదని ఇదనీ రాస్తారు; తెలుగంటే సాహిత్యం కాదు. కానీ గొప్ప సాహిత్యాన్ని కూడా పుట్టించింది కాబట్టి తెలుగు గొప్పది. కాపాడుకో దగ్గ భాష!  రెండిటికి భేదం ఉంది. ఫిలాసఫీ/తర్కం లో దీన్ని ఏదో Fallacy / “అభాస” అనో అంటారు  (ఈ అభాస – imaayaa.blogspot దొరకట్లేదు!)

ఈ చర్చని నేను ఇన్నయ్యగారి బ్లాగు పోస్ట్లో ఆయన్నే అడిగాను. ఈ  వ్యాఖ్యలని మీరు తప్పక చదవండి. ఆయన “మెజారిటీ తెలుగువారు కాబట్టి, తెలుగు ఉండాలి అన్నారు”. కానీ మళ్ళా ఆయనే “అందరూ ఇంగ్లీషు మీడియం లోకి వెళ్ళాలనుకుంటున్నారు” అన్నారు. ఐతే మెజారిటీ ఇంగ్లీషు కోరుకుంటే,  – “అది తప్పు, తెలుగులో నేర్చుకోండని ఎందుకు చెబ్తున్నారు?  మెజారిటీ కోరుకున్నదానికి ప్రాధాన్యం ఇచ్చి ఇంగ్లీషు నేర్పండి?” అని ఎదురు ప్రశ్నించాను. దానికి ఆయన తిరిగి – “మెజారిటి తెలుగువారి కోసం, తెలుగు ఉండాలి”  అన్నారు.  ఆ సమాధానం నాకు నచ్చలేదు. మెజార్టీ సత్య సాయి బాబా ని దేవుడిగా కోరుకుంటున్నారు అని నేను నిరూపిస్తే , ఆయన ఒప్పుకుంటాడా!? హేతువాదం అంటే – ర్యాషనలిజమ్ ట. ఇదేనా తెలుగు బ్రతికుండటానికి కారణం చెప్పేవిధానం!?బహుశా ఆయనకి అసలు తెలుగు బతకాలని లేదేమో! లేక – “నేను తెలుగువాడిని కాబట్టి తెలుగు ఉండాలి అని కోరుకుంటు”న్నట్టుగా ఆయనకి చెప్పటం ఇష్టం లేదేమో!

మెజార్టీ కోరుకున్నది తప్పైతే, ఇది తప్పు అని కొందరం చెప్తాం. కాబట్టి, తెలుగు బతకాలని కోరుకునేవారు ఎందుకు అది బతకాలి అనుకుంటున్నారో చెప్పాలి. అంతే గానీ, ఇంగ్లీషు కోరుకునే మెజార్టీ ని తెలుగు నేర్చుకోమనటం తప్పు కదా!?ఎందుకంటే మెజార్టీకి మాతృభాష అని సెంటిమెంట్ ఉన్నా, నేర్చుకునేదంతా ఇంగ్లీషు బుద్ధులే!

పైపెచ్చు “జ్యోతిష్యంలో వింతలూ”  అని రాసే ఈ మనిషి అంతకు ముందొక రోజు : “రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పార్టీలు మఖలో పుట్టి పుబ్బలో అంతరించాయి.” అని రాస్తాడు!  ఏ ?

–  “మెజాన్స్ పుట్టినట్టు పార్టీలు పుడుతున్నాయి” అనచ్చు కదా!

ఎందుకిలా మఖ- పుబ్బ అని రాశారు? అది తెలుగు నుడికారం. ఎక్కడ్నుంచి పుట్టింది? జ్యోతిష్యంలోనే గా పుట్టింది!?  ఇక్కడ జ్యోతిష్యాన్ని బలపర్చటమో, వ్యతిరేకించడమో కాదు : ’తెలుగు’ అన్న తరువాత – అన్నీ – తెలుగులో కి వస్తాయి. ఇలాంటి విచక్షణ చూపించకూడదు. అందులోని విశ్వాసాల వల్ల వస్తున్న నష్టం చెప్పుకోవచ్చు. కానీ, జ్యోతిష్యపు ఆలోచననే తిట్టేవాళ్ళు – అది మన అనాగరికతకి చిహ్నంగా భావించి వదిలేసిన రేపటి తెలుగువారు, ఇలాంటి పదప్రయోగాం ఎలా చేస్తారు!? పోనీ అసలు ఎలా అర్ధం చేసుకుంటారు!?నా దృష్టిలో జ్యోతిష్యంలొ తప్పులుండొచ్చు. కానీ,అది ఓ నాగరికత గొప్పతనాన్ని చాటే ఓ మేలిమి చిహ్నం.తెలుగుతనం అంటే, దాన్ని కూడా కాపాడుకోవాలి! అలా ఒక్క జ్యోతిష్యమే కాదు.చాలా విషయాలని – దయ్యాల సినిమాలతో సహానండోయ్!  🙂

8.“తెలుగుతనం నశించిన రోజున, తెలుగు భాషకు విలువలేదు, దాని అవసరం లేదు”
ముందు 3.b లో ఇచ్చిన సమాధానమే మళ్ళీ! ఏదీ తెలుగుతనం?  మీ దృష్టిలో తెలుగు భాష వేరు ; తెలుగుతనం వేరు – కదా? పొరబడ్డారు ;  మళ్ళా ఓ సారి ఆలోచించుకోండి. 

మీరనే ’తెలుగుతనం’ చచ్చిపోయినా, తెలుగు భాషను బ్రతికించుకోవచ్చు. నిజానికి, తెలుగు భాష లేకుండా “తెలుగుతనం” లేదు అన్నది మీరు అర్ధం చేసుకోండి.

తెలుగు భాష ఉంటే, తెలుగు వారి తనమే “తెలుగుతనం” ;

నేను పార్టికల్ ఫిజిక్స్ లో  (earth shattering) భూమి బద్దలయ్యే ఓ అపూర్వా సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాను; దాని వల్ల మొత్తం శాస్త్రీయ దృక్పదాల్లోనే పెనుమార్పులు చోటు చేసుకోగలవు. నేను దాన్ని తెలుగులో రాసి చెప్తే అది “తెలుగుతనం” అవ్వదా!?

కానీ ఓ తెలుగువాడు అలాంటి పని ఎందుకు చేయడు?  – తెలుగులో చెప్తే ప్రపంచం వినదు కనక.

లేదా ఎందుకు తెలుగులో చేబ్తాడు? – ఒకవేళ మీరు “తెలుగువాళ్ళ కోసం చెబ్తాడు” అని చెబితే , ఇక జీవితకాలం తర్జుమాలు చేయలేక,  కొన్ని మూఢవిశ్వాసాల ప్రతీకగా (గొబ్బెమ్మల్లాగా) హీనంగానే తెలుగు చూడబడుతుంది. ఓళ్డ్ ఏజ్ హోమ్ లో తల్లిలా ముసలి దై  పోతుంది – ప్రాచీనమై పోతుంది.

అదే – ఓ తెలుగువాడు – నేను తెలుగువాణ్ణి కాబట్టి నేను తెలుగులో చెబ్తున్నాను ; కానీ దీనివల్ల నీకిది లాభం  అని చెప్తే : ఆ లాభేపేక్షకోసం – ఎంతటి వారైనా తెలుగు నేర్చుకొని , వారి భాషల్లోకి తర్జుమా చేసుకుంటారు. తర్జుమా చేసుకోవాల్సిన పని మిగిలిన భాషల వాళ్ళకి వస్తుంది.ఇది కొంచెం వింతంగా ఉందా! ఉండొచ్చు. కానీ ఆ వింత జరగాలి. అప్పుడే, తెలుగువారు తమ ఐడెంటీని మరింత కోరుకుంటారు! మేము తెలుగువాళ్ళమని సగర్వంగా చెప్పుకుంటారు.

ఇప్పటికే ఈ పోస్టు పెద్దదైపోలేదూ!? సో ఆ వింత గురించి మరోసారి.

పైగా – ఐడెంటిటీ అన్న తర్వాత – తెలంగాణా, రాయలసీమ, కోనసీమ, ఆంధ్రా, కోస్తా, ఎవరో ఒరిస్సా, మధ్య ప్రదేశ్ కలిపారు – ఇక తమిళ తెలుగు, కన్నడ తెలుగు,ఆఫ్రికన్ తెలుగు (ఒక్కొక్క దేశానికి, ఒక్కొక్క మతానికి వేరు వేరు తెలుగు!) కాక , రెడ్డి, కమ్మ, కాపు, దళితుల ఐడెంటిటీ!?  ఇవేవి కాకుండా ఓ భారతీయ – ఇండియన్ ఐడెండిటీ వద్దా!? అది హిందీలో ఉండాలా, ఇంగ్లీషులో ఉండాలా!?

అందుకే ఈ బ్లాగులో ఆల్రెడీ ఓ సారి రాసాను : అదృష్టమో , దురదృష్టమో కానీ – మనకి “గుర్తింపు” అనేది చాలా రకాలుగా రావాలి/కావాలి.

ఇప్పుడు ఓ సారి ఆలోచించండి : మీకసలు “తెలుగువాడి” గా గుర్తించబడాలని ఉందా లేదా!? ; అలా ఉంటేనే మీరు తెలుగును కాపాడతారు. ఈ కోరిక లేకపోతే, ఫర్ గెట్ ఇట్! నేను ఇంగ్లీషులో ఇండియన్ ఐడెంటిటీ అంటూ వేరే బ్లాగులు స్టాట్ చేసుకోనా!? :))

(దీనికి రెండో భాగం ఉంది)

ప్రకటనలు
Explore posts in the same categories: Uncategorized

ట్యాగులు:

You can comment below, or link to this permanent URL from your own site.

24 వ్యాఖ్యలు పై “తెలుగు చచ్చిపోతే… – నా సమాధానం”

 1. krishna rao jallipalli Says:

  (దీనికి రెండో భాగం ఉంది)… vaammo

 2. bhavani Says:

  మీరు ఐడెంటిటీని నిర్వచిస్తే వినాలని ఉంది.:)


 3. “అదే – ఓ తెలుగువాడు – నేను తెలుగువాణ్ణి కాబట్టి నేను తెలుగులో చెబ్తున్నాను ; కానీ దీనివల్ల నీకిది లాభం అని చెప్తే : ఆ లాభేపేక్షకోసం – ఎంతటి వారైనా తెలుగు నేర్చుకొని , వారి భాషల్లోకి తర్జుమా చేసుకుంటారు. తర్జుమా చేసుకోవాల్సిన పని మిగిలిన భాషల వాళ్ళకి వస్తుంది.ఇది కొంచెం వింతంగా ఉందా! ఉండొచ్చు. కానీ ఆ వింత జరగాలి. అప్పుడే, తెలుగువారు తమ ఐడెంటీని మరింత కోరుకుంటారు! మేము తెలుగువాళ్ళమని సగర్వంగా చెప్పుకుంటారు.”

  అసలు మనం కనిపెట్టి మనం ఇతరులకి లాభాపేక్ష కలిగించాల్సిన అవసరం కూడా లేదు. మనం మొత్తం రాష్ట్రంలొ 8 కోట్ల మందిమి. ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర కలుపుకుంటే ఇంకో 4 కోట్లు ఉంటాము. ప్రపంచంలో మొత్తం తెలుగు వాళ్ళు 18 కోట్లంట. సరే రాష్ట్రం బయటున్నవాళ్ళ సంగతి వదిలెయ్యండి. రాష్ట్రంలో జనాభా తీసుకుంటేనే ఐరోపాలో చాలా దేశాల కన్నా జనాభా ఎక్కువ. మన 8 కోట్లు పెద్ద మార్కేటు. ఎవడైనా ఏదైనా కనిపెట్టి/తయారుచేసి మనకి అమ్మాలి అంటే తెలుగులో చెప్తేనే కొంటాను అంటే చచ్చినట్టు అమ్ముతాడు ఐరోపా దేశాల్లో జరుగుతున్నట్టు, అరబ్బు దేశాల్లో జరుగుతున్నట్టు.

  బంధాలు(మానవ, రాజకీయ, ఆర్ధిక… ఎలాంటివైనా) షరతులతో కూడుకున్నప్పుడే నిలబడతాయి అని ఎవరో అన్నారు. ఆ బంధం నుండి మనకి ఏం కావాలి, అవి పొందుతూనే మనం ఏమి కోల్పోకూడదో తెలుసుకుని నిర్వర్తించుకుంటే ఆ బంధం మన అవసరాలని తీర్చడమే కాకుండా,మనకి సంతృప్తిని మిగుల్చుతుంది, మన అభిమానాన్ని నిలుపుతుంది.

  అలా కాకుండా, మన అభిమానాన్ని, మన అలవాట్లని/పద్ధతులని, మన వెసులుబాటుని ఒక అవసరం(అది ఎంత వరకూ అవసరమో కూడా ఒక్కోసారి మనకు తెలియదు) కోసం వదిలేసుకున్నామనుకోండీ… ఇక అంతే, మనవైనవి మెల్లిగా ఒక్కోటి వదులుకోవడమే! అలా అలవాటైపోయి ఏది వదులుకోవచ్చు, ఏది వదులుకోకూడదు అనే విచక్షణ కోల్పోవడం మొదలవుతుంది. అది మన దైనందిన నిర్ణయాలన్నిటిలోకి ప్రవేశిస్తుంది. ఎవరైతే ఏంటి? ఏదైతే ఏంటి? అనే ఉదాశీనత రాజ్యమేలుతుంది. గమనిస్తే ఆ ఉదాశీనత భారతీయులలోకెల్లా తెలుగువాళ్ళకే ఎక్కవైపోయింది. మన చుట్టూ ఉన్నవాళ్ళు మనంత ఉదాశీనంగా ఉండరు, వాళ్ళు వారి వారి అలవాట్లకి సమయం వచ్చినప్పుడు ప్రాధాన్యత ఇచ్చుకుంటారు అనే విషయాన్ని మనం చూసి చూడనట్టు ముందుకు సాగిపోతాము. పైగా మన ఉదాశీనతకి ఉదారత అనే ముసుగు తొడిగి తతిమావాళ్ళందరినీ సంకుచితులు అనే ముద్రవేసేస్తాము.

  ప్రపంచం కొన్ని విషయాలలో తెలుగు వాళ్ళు మారినంత వేగంగా మారడంలేదు. 🙂

  ఏకాంతపు దిలీప్

 4. rayraj Says:

  @bhavani ; అయ్యో రాత! ఇంత రాత తర్వాత ఇంకా నిర్వచనమా! 🙂
  మీరు స్మైలీ వేసిన కూడా , “మీదాంట్లో మిస్టేక్ ఉంది” అన్నందుకు ఎక్కడో చివుక్కుమంది మీకు – అని నా కనిపిస్తోంది. డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ. మీ దోస్కాయ్ స్టోరీ చూశాను. బావుంది.
  నిజానికి ఇక్కడ కామెంటేసిన వాళ్ళు చెప్పింది ఏదీ తప్పు కాదు. కానీ, నే చెప్పిందాంట్లో “దృక్పదంలో మార్పు” ఉంది.అంతే!
  “తెలుగుతనం ఇది” అని అన్యమనస్కంగా ఐనా మీరు నిర్వచిస్తే, మీరు మిగితా ఏ విషయాన్ని తెలుగుతనం అనుకోరు.our festivals, food, traditions and customs – వరకే కాదు ; పార్టికల్ ఫిజిక్స్ లోనో, ఖగోళ శాస్త్రంలోనో, జ్యోతిష్యంలోనో, వాస్తులోనో, ఆర్కిటెక్చర్ లోనో, చరిత్రలోనో, పురావస్తు శాస్త్రం లోనో, జియాలజీలోనో – ఎందులో ఐనా సరే – తెలుగువాడు అభివృద్ధి చెందితే, అది తెలుగుతనం అవ్వదా!? ప్రస్తుతానికి అవ్వట్లేదు. పైగా ఆ తెలుగువాడు దాన్ని తెలుగులో చెప్పడు. మనకున్న తెలుగు మేధావులందరూ – తెలుగువాళ్ళని, తెలుగుని మన మూఢనమ్మకాలనుంచి, మన తప్పుడు సంప్రదాయల నుంచి ఉద్దరించేవారే! సంఘసంస్కర్తలే ! కానీ తెలుగులో ఏమీ జరగదు! అంతా ఇంగ్లీషులోనే! ఎందుకు!? దానికి కావల్సింది, ముందుగా మన “దృక్పదంలో మార్పు” ; కింద దిలీప్ గారికి చేప్పేదే మీక్కూడా మళ్ళీ! ఐనా మీకు నిర్వచనం కావాలా – అదీ చెప్పాను : తెలుగువాడికి తెలుగుభాషే ఐడెంటిటీ – తెలుగు భాషే లేకుండా మనల్ని మనం తెలుగువారిమని పిలుచుకోవటం సరి కాదు. (బట్ దేర్ లైస్ ఎ క్యాచ్ : డు యు నో దేర్ ఆర్ లాట్ ఆఫ్ గైస్ ఔట్ దేర్ హూ ఆర్ తెలుగు యెట్ దే కాంట్ రీడ్ అండ్ రైట్ తెలుగు!!??)
  @దిలీప్: ముందుగా స్పందించనందుకు ధన్యవాదాలు.మీరు చెప్పింది నిజమే!సరియైనదే! కానీ అందులోనూ తప్పులున్నాయి.
  1. మన మార్కెట్ మనకి సెల్ఫ్ సఫిషియంట్ అన్నది రాంగ్ నోషన్ – జస్ట్ ఓ దశాబ్ద కాలంలో, మనం ఈ సెల్ఫ్ సఫియన్సీ కోణంలోనుంచి – గ్లోబలైజేషన్ లోకి వెళ్ళి, మళ్ళీ సెల్ఫ్ రిలెయన్స్ లోకి సుమారుగా వచ్చేశాం. కానీ, గ్లోబలైజేషన్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ ది డే!
  2.అయినా చరిత్ర చెప్పిన పాఠాన్ని సరిగ్గా ఎందుకు తెలుసుకోరు!? మీ స్థానంలో మీరు బావున్నారుగా అని మిగిలిన బాహ్య ప్రపంచం మిమ్మలిని మీ మానానికి వదిలేయదు. మిమ్మల్ని 18 కోట్ల మార్కెట్టుగా లెక్కేసి, ఆల్రేడీ మీ ప్రపంచాన్ని విదేశీ కంపెనీలు దున్నేస్తున్నాయి.కోక్ తెలుగు వారి కోసం ఫిజ్ పెంచాడు అని చంకలు కొట్టుకుంటున్నారా!?
  తర్వాత అయ్యో! అమెరికనైజ్ ఐపోతున్నాం అని ఏడవటం తప్ప – మీరు యువతని కోక్ ని, పెప్సీని తాగకుండా ఆపగలరా!? అదీ తెలుగుతనం అనుకొని బతికేస్తారా!? అతి తక్కువ సమయంలో మీరు కెల్లోగ్స్ లాంటి కంపెనీల కార్న్ ఫ్లేక్స్ , సిరియల్ ప్రాడెక్ట్స్ కి అలవాటు పడతారు. పొద్దున్నే మీ అమ్మ చేసి పెట్టిన వేడి వేడి ఇడ్లీలు “తెలుగుతనం” చిహ్నంగా మారిపోతాయి. దాన్ని సెలెబ్రేట్ చేసుకోవడానికి అప్పుడప్పుడు చట్నీస్ కెళ్ళి తిందురుగానీ – అదే మీ గతించి పోయిన “తెలుగుతనం” గా భావించేద్దురు గానీ! – చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు దిలీప్!

  మీకో మాటా చెప్పనా! “ప్రపంచం కొన్ని విషయాలలో తెలుగు వాళ్ళు మారినంత వేగంగా మారడంలేదు.” అన్నారు కదా – ఒకవేళ ఇదే నిజమైతే, దీన్ని నేను వీక్ నెస్ గా భావించను. ఇదే తెలుగువాళ్ళ ఎస్సెట్ అని చెప్తాను. మార్పు అనివార్యం. మారిపోవడం కన్నా , “మారడం, మార్పుతేవడం” – ముందుజగా గుర్తించబడుతుంది.(కానీ మీరు “కొన్ని విషయాలలో” – అనటంతో దానిలో ఫిజ్ తీసేశారు 🙂 ) కాని నిజం అదే – ఆలోచించాల్సింది అదే – ఏవి మార్చాలి, ఎలా మార్చాలి, ఎలా “మనం ముందు” అని చెప్పాలి!? అలా తెలుగు వారు తమ ఐడెంటీ ని సృష్టిస్తునే ఉండాలి! కానీ మనం తెలుగువారమెలా అయ్యాం అంటే – “తెలుగు భాష వల్ల అయ్యాం”- అన్నదాన్ని ప్రాతిపదికగా (ఐ మీన్ బేసిస్ గా ) అందరం అంగీకరించాలి! అంగీకరించేలా చెయ్యాలి!
  ఒక్కసారి నా ప్రశ్న, సమాధానాలని రెండూ మళ్ళా చదవండి. ప్లీజ్!

 5. rayraj Says:

  @krishna rao: :)) నేను చాలా షార్ట్ గా చెప్పాను – రాతలెక్కువ అని! ఐనా డేర్ చేసేరే!? ముందటి పోస్టులో మీరు “ఛస్తే నష్టం లేదు” అని తీర్మానించారుగా – అది నాకు తెలుసు.ముసలి తల్లిని ఓళ్డ్ ఏజ్ హోమ్ లో వదిలేసేవాళ్ళు కొందరైతే,ఆ తల్లి కోసం తిరిగి వెనెక్కి వచ్చే జీవితాన్ని ఎంచుకున్నవాళ్ళూ ఉంటారు.ఇట్స్ ఎ ఛాయిస్!
  అందుకే ఈ సమాధానం రాసింది – తిరిగి ప్రశ్నించింది – తెలుగువారిగా గుర్తించబడాలని మీరు కోరుకుంటున్నారా లేదా అన్నది ప్రశ్న.అదే రెండో భాగం.
  @bhavani,
  బై ద వే! మీరు ఐడెంటినీ నిర్వచించమన్నారు కదా! రెండో భాగంలో చెప్తాను. యూ ఆర్ రైట్! పెర్హాప్స్ – ఐ మిస్ అన్డర్ స్టుడ్.మీరు తెలుగు ఐడెంటిటీని నిర్వచించమనలేదు కదూ!


 6. @ రయ్రజ్

  మీరు అన్నవాటన్నిటితోను ఏకీభవిస్తాను. కనిపెట్టాల్సిన అవసరం ఏ మాత్రం లేదు అని నా ఉద్దేశం కాదు. నేను మీ ముందు టపాలొ రాసిన వ్యాఖ్య కూడా అదే చెప్తుంది. “నా ప్రాంతం ప్రపంచానికి అందించిన జ్ఞాన భాండాగారాన్ని… ” అని రాసాను. మనం ప్రపంచ జ్ఞానానికి మనదైనది నిరంతరం కలుపుకుంటూ పోతేనే మనకు శాశ్వతమైన గుర్తింపు ఉంటుంది అనేది తిరుగులేనిది. నేను ఇంకో కోణం కూడా చెప్తున్నాను అంతే. నా బాధ ఏంటంటే, మనం కొత్తగా కనిపెట్టక పోయినా పరవాలేదు, మనకి ఉన్నవి (కొన్నైనా) మనం నిలుపుకోవచ్చు అని మాత్రమే! దానికి మన నుండి కొన్ని షరతులు కావాలి అని మాత్రమే అంటున్నాను. తమిళ్ వాళ్ళు, కన్నడ వాళ్ళు, మళయాళం వాళ్ళు, బెంగాలీలు ఇలాంటి కొన్ని విషయాల్లో ఖచ్చితంగా ఉంటారు, హిందీ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళంతా వాళ్ళల్లో వాళ్ళు కలిసినప్పుడు గమనిస్తే మనకన్నా తక్కువ ఇంగ్లీషు పదాలు ఉపయోగిస్తారు… ఇంగ్లీషు మీడియం చదువులు చదివినా సరే వాళ్ళు మన కన్నా తక్కువ ఉపయోగిస్తారు.

  మన స్పీకరు ఇంగ్లీషులో దర్జాగా మాట్లాడేస్తుంటే, ఇంగ్లీషులో మెమోలు, నోటీసులు పంపించేస్తుంటే మన ప్రతినిధులు అడ్డం పడొచ్చు.

  మన జిల్లా కలెక్టరు ఇంగ్లీషులో ప్రకటనలు వేయిస్తే మనం వెళ్ళి తనకి ప్రజా సంభంధమైన వ్యవహారాల్లో తెలుగుని మాత్రమే ఉపయోగించమని చెప్పొచ్చు..

  అసలు అన్ని పేర్లూ ఇంగ్లీషులోనే ఉంటే, అవసరమైన చోట తప్ప మిగిలిన చోటల్లా తెలుగు మాత్రమే ఉపయోగించ్మని చెప్పొచ్చు…

  “తెలుగువాళ్ళు కొన్ని విషాయాల్లో ప్రపంచం కన్నా త్వరగా మారిపోతున్నారు” అని నేను వ్యంగ్యంగానే అన్నాను. తమని తాము మరింత బలహీనపరుచుకోవడంలో, ఎదుటివారికి ఎలా ఉపయోగపడాలా అని ఆలోచించి తమవైనవి వదులుకుని మారిపోవడంలోను, అలా కొన్నాళ్ళు వదిలేసుకుని తరవాత మనపాతవన్నీ వదిలేసుకున్నతరవాత ( అప్పుడు గమనించడం మొదలెడతారు, పాతె బంగారం అని) ప్రపంచంతో పోల్చుకుంటే మనకి మన పూర్వీకులనుండి సంక్రమించింది నిలుపుకోలేకపోయామని తీవ్రంగా బాధపడతాము. అది పాత కట్టడం కావొచ్చు, మన ఇళ్ళల్లో చేసే వంటకం కావొచ్చు, మన ఆట-పాటలు కావొచ్చు, అలంకారం కావొచ్చు, పద్ధతులు కావొచ్చు ఏదైనా…

  అలా, మనకు మనంగా మనవైనవని కొన్ని సమ్రక్షించుకోవచ్చు…


 7. చాలా ఆలోచనల్ని గుప్పించారు.

  ఎక్కడో చెప్పినట్లు తెలుగు అవసరమా కాదా అనేది మధ్యతరగతి “ఇంటలెక్చువల్” సమస్య. పల్లెల్లో, పేదోళ్ళ గుడిసెల్లో “అవసరమైన” తెలుగు వాడుతూనే అక్కరకొచ్చే ఇంగ్లీషు కోరుకుంటున్నారు. ఈ స్థాయిలో coexistence based on need అస్సలు సమస్య కాదు.

  తెలుగు భాష చచ్చిపోవడం కాదుకదా, కనీసం పెద్ద ప్రమాదంలో ఉందని నేను అనుకోవడం లేదు.

  ఇక తెలుగు సంస్కృతి అంటూ మీరు ఉటంకించిన జాబితా, సంస్కృతికి సంబంధించిన కొన్ని భౌతికస్వరూపాలవే తప్ప, ఒక civilization కు సంబంధించిన social and anthropological మానసికతకు సంబంధించినవి కాదు.

  “తెలుగుతనం” లో కూడా multiple identities ఉన్నాయన్న నిజాన్ని మీరు చాలా బాగా గుర్తుచేసారు. అందుకే మనకు కులభాషలు, మాండలిక యాసలూ ఎన్నెన్నో ఉన్నాయి. తెలుగు భాష సంస్కృతి monolithic కాదు. ప్రస్తుతం తెలుగు భాష చచ్చిపోతోందని గగ్గోలు పెట్టే చాలా మంది, వాళ్ళే standardize చేసి సామాన్యులకు దూరం చేసిన తెలుగు పనికిరాకుండా పోతుంటే పోతుంటే బాధపడుతున్నారు. అంతే!

 8. bhavani Says:

  అయ్యో! ఇందులో నొచ్చుకోటానికి ఏముంది? పర్సనల్ గా తీసుకోలేదు.
  నేను చెప్పిన దృక్కోణం మీకు కనిపించాలని వేసిన ప్రశ్న అది.
  అంతే.

  1. నేను మన ఐడెంటిటీనే నిర్వచించమన్నాను. మన ఐడెంటిటీలో కొంత భాగం సంస్కృతి నుండి నిర్మితమైవుంటుంది. కాదంటారా?

  2. ఖగోళ శాస్త్రం కానీ, మరే శాస్త్రం రాకమునుపు భాషను ఊహించండి. అప్పుడు భాషలో ఉండే ప్రిమిటివ్స్ ఏమిటి? – మన చుట్టూ ఉండే వాతావరణం, మన ఆహారపలవాట్లూ, మన వేషబాషలూ, మన పద్దతులూ.
  ఎస్కిమోలకు మంచుకు సంబంధించిన పదాలు 13,000 ఉన్నాయట.
  మరి మనకో? వాళ్ళు మన భాషలో వాళ్ళనుకున్నదాని గురించి మాట్లాడగలరా? అలానే నా సంస్కృతి నుండి నిర్మితమైన అనుభవాలను చెప్పటానికి నాకు ఇంగ్లీషు సరిపోదు. అలాంటి పరిస్థితుల్లో నేను ఇంతవరకూ నిర్మించుకున్న నా ఐడెంటిటీలో కొంత భాగం పోయినట్లేగా.
  ఈ శాస్త్రాల గురించి, నేను చెప్పలనుకున్న భావం పోకుండానే నేను ఇంకో భాషలో మాట్లాడగలను. నేనే కాదు. ఏ భాషకు సంబందించిన వారైనా మాట్లాడగలరు. శాస్త్రాలు మన చుట్టూ జరిగే general phenomena గురించి. They are not specific to a culture

  3. ఈ శాస్త్రాలను తెలుగులో మాట్లాడుకునేలా చేయటం ద్వారా తెలుగు అభివృద్ది అవుతుంది. అలా కాని పక్షంలో ఆ భాషలో మాట్లాడుకునే కోట్లాది ప్రజల వలన జీవిస్తూనే ఉంటుంది. చావదు.

 9. rayraj Says:

  @bhavani : మీ కోణంలో నేను చూశాను. actually అందరం అలాగే చూస్తున్నాం.దాని వల్ల వచ్చే నష్టాన్ని ఆపడానికే వేరే కోణంలో చూడమని చెబ్తున్నాను.Past లోకి చూసినప్పుడే – భాష సంస్కృతి వల్ల పుట్టింది.Future లోకి భాష వెళ్ళాలంటే? మారే సంస్కృతి భాషను కాపాడదుగా!మరి అప్పుడు భాష అవసరమా! లేదు.అందుకే ఒక్కక్కరిగా తెలుగుభాషను సామాన్య జనం వదిలేస్తున్నారు.
  మీ మూడో పాయింట్లో చెప్పినట్టు – భాష కనపడుతునే ఉండటం,బతకటం కాదు.కొంచెం అన్ రిలేటడ్ గా అనిపించినా ఓ సారి “చంపడం తప్పా?” అన్న నా పోస్టు చదవండి.(దాన్ని ఈజీగా యాక్సస్ చేయడానికి, ప్రస్తుతానికి కోతిగీతల ట్యాగ్ మీద కొట్టండి)
  @దిలీప్: గాట్ యుర్ పాయింట్.అగ్రీడ్.
  @మహేష్: ఇది ఇంటలెక్ట్యుల్ సమస్య అని నేనూ పోస్టులో చెప్పాను.మీరు అంగీకరిస్తున్నారో, లేక ఇక చర్చించకర్లేదంటున్నారో నాకు తెలీటం లేదు! ఇది ఇంటలెక్ట్యుయల్ సమస్య కాబట్టే చర్చిస్తున్నాను.ఇష్టమున్నవాళ్ళే చర్చిస్తారు. కాకపోతే ఈ స్టాండైజ్ చేస్తున్న మనుష్యులు ఎందుకు చేస్తున్నారు!? వాళ్ళ లక్ష్యం ఏంటి!?
  social and anthropological మానసికత అంటే ఏంటి!?

 10. bhavani Says:

  నేను ఎప్పుడొ ఆవిర్భవించిన సంస్కృతిని నేర్చుకోలేదు.
  కొంతవరకూ మారిపోయిన సంస్కృఇతి నుండే నా భాష నేర్చుకున్నాను.
  మారిపోయినప్పటికినీ అది మిగతా సంస్కృతులకంటే విభిన్నంగా ఉంటూ
  నాకా అనుభవాలను పంచుతుంది. అందుకే నాకో ప్రత్యేకమైన ఐడెంటిటీ
  ఉంది. ఇంతకు మించి అభివృద్ది చేయటానికే మనము మిగతా విషయాల్లో తెలుగును
  ప్రవేశపెట్టాలి. ఖర్మ కాలి అలా జరగకపోయినా తెలుగు మారిపోయిన
  సంస్కృతినుండే నిర్మితమయ్యి బ్రతుకుతుంది.


 11. @రేరాజు: Evolutionary anthropology ని కొంచెం oversimplify చేసి నేను social and anthropological మానసికత అని సంస్కృతిని నిర్వచించాను.

  Evolutionary anthropology is concerned with both biological and cultural evolution of humans, past and present. It is generally based on a scientific approach, and brings together fields such as archaeology, behavioral ecology, psychology, primatology, and genetics. It is a dynamic and interdiscplinary field, drawing on many lines of evidence to understand the human experience, past and present.


 12. ఇంకో విషయం. మన విద్య అంతా న్యూనతా భావంతో సాగుతుంది. ఇంగ్లీషుని పెద్ద భూతంలా చూస్తాము, అది తేలికగా వంటబట్టదు అని భయపెట్టేస్తారు. ఇంగ్లీషుని సమర్ధవంతంగా భోదించేవాళ్ళు కూడా మనకు తక్కువ. ఇంగ్లీషుని ఒక భాషలా ఆరోతరగతి నుండీ సమర్ధవంతంగా భోధించగలిగితే చాలు. పై చదువుల్లో ఇంగ్లీషు అవసరమైతే తక్కువ వ్యవధిలోనే మనం సన్నద్ధమైపోవచ్చు. కానీ ఇలా జరగదు/జరగనివ్వరు. పోనీ ఇంగ్లీషు మీడియం వాళ్ళందరూ ఇంగ్లీషులో కోవిదులైపోతారా అంటే అదీ లేదు.

  బహుసా ప్రజలలో ఉన్న భయాన్ని, అవసరం పట్ల ఉన్న ఉత్సుకతని ప్రైవేటు స్కూళ్ళ వాళ్ళు ఇంకా పెంచి పోషించడం వల్ల అలా జరుగుతుందేమో. ఏంటో రెండేళ్ళ క్రితం ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీషు మాధ్యమంలో భోదన అని విన్నా, ఏం జరుగుతుందో మరి ఇప్పుడు..

  నా చుట్టూ ఉండి ఇంగ్లీషులో ఎడాపెడా దంచేసే వాళ్ళందరిలో ఎక్కువమంది ప్రాధమిక విద్య తెలుగులోనే సాగింది.

  ఇంకో విషయం. భోధనలోనే కాదు, సామాజికంగా కూడా న్యూనతా భావం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. నేను మన ఊరెళ్ళి ఎవరైనా చదువుకున్న పెద్దాయనతో తెలుగులో మాట్లాడదామని ప్రయత్నిస్తే నాకే అదోలా ఉంటుంది. వాళ్ళు ఇంగ్లీషులో అందుకుంటారు, మనం అచ్చంగా తెలుగులో మాట్లాడలేము వాళ్ళతో. చచ్చినట్టు నేనూ ఇంగ్లీషులో మాట్లాడతా… లేకపోతే… అసలే ఇవాళ రేపు పిల్ల దొరకడం లేదు… వీడికి ఇంగ్లీషు రాదు,నాగ్గా ఉండటం రాదని ఇంకో ఇద్దరితో అన్నా ఇంక అంతే సంగతులు… ఇంకో మైనస్సు 🙂

 13. rayraj Says:

  @దిలీప్: 🙂 కాసేపు నాగ్గా ఇంగ్లీషు మ్యానేజ్ చేసేయ్.బాధగా అనిపించిన ఇవ్వాళ్టికి అదే మన సంస్కృతి :)) నేను దీన్ని మార్చాలనే ట్రైచేస్తున్నా – ఇంగ్లీషును యాక్సప్ట్ చేసేసి, మన సంస్కృతిలోకి గుంజేసుకొని,తెలుగు అన్ని వేళలా నిజంగా గౌరవించబడాలన్నది నా ఊహ. న్యూనత కి ఐడెంటిటీకి సంబంధం ఉంది కదా! అందుకే తెలుగెందుకు బతకాలి – అంటే నేను తెలుగువాణ్ణి కాబట్టి అనగలగాలి. అనవసరంగా ఎంత ధియరైజ్ చేసినా, మిగిలిన కారణాలన్నీ ఊరికే ఎగిరి పోతాయ్.

  @మహేష్ : ఇవబోయే “ప్రతిస్పందన” అనే పోస్టులో, మీకు స్పందిస్తూ మొదలెడుతున్నాను.

  @భవాని: ఏమీ అనుకోవద్దు – ఐ యామ్ రిపీటింగ్ మైసెల్ఫ్ అగైన్ జుస్ట్ ది సేమ్ వే యూ డిడ్ – మీ కోణం ఇంకా భూతకాలంలోకే చూస్తోంది.కాకపోతే ఓ వారం రోజుల బదులు మొన్నలోకి చూస్తోంది.ఇది నేను ఆల్రెడీ – ౩.b లో చెప్పాను.అందులో మనిషి “మొన్న వాడు” కాదు – బహుశా “నిన్న వాడు”.అంతే తేడా.ఐ యామ్ డభ్లీ ష్యూర్ యూ ఆర్ ఆన్సర్డ్. ప్లీజ్ రీడ్ ది పోస్ట్స్ ఒన్స్ అగైన్.

 14. gangabhavani Says:

  @రేరాజ్ గారు
  పిడ్జిన్ అంటే ఒక వ్యాపార అవసరం కోసమో, ఇంకే ఇతర అవసరం కోసమో రెండు సమూహాల మద్య ఏర్పడేవి. ఈ పిడ్జిన్స్ ఆ రెండు సమూహాల భాషలను మిళితం చేస్తే తయారవుతాయి. కాలక్రమేణా, అవి మాట్లాడే సమూహానికి మాతృభాషలుగా ఉద్భవిస్తాయి. అప్పుడు వాటిని క్రియోల్స్ అంటారు. ఎన్నో సంవత్సరాలుగా అలాంటి పిడ్జిన్స్, క్రియోల్స్ బ్రతుకుతున్నాయి. అవి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువమంది అయినా సరే. వాళ్ళ కమ్యూనికేటివ్ నీడ్స్ ని తీరుస్తుంది కనుక అవి బ్రతికాయి. ఏ భాష అయినా ఇంతే. అది తరువాతి తరాల వారికి వెళుతున్నప్పుడు (రూపాంతరం చెందినా సరే) బ్రతుకుతుంది. మీరు భాషని ఇంకా పరిపుష్టిగా చేయటం గురించి మాట్లాడుతున్నారు. నేను భాష బ్రతకటం గురించి మాట్లాడుతున్నాను. నిన్నకో, మొన్నకో వెళ్ళి కాదు.

 15. bhavani Says:

  ప్రపంచంలో పలుచోట్ల పిడ్జిన్స్ అని ఉన్నాయి.

  పిడ్జిన్ అంటే ఒక వ్యాపార అవసరం కోసమో, ఇంకే ఇతర అవసరం కోసమో రెండు సమూహాల మద్య ఏర్పడేవి. ఈ పిడ్జిన్స్ ఆ రెండు సమూహాల భాషలను మిళితం చేస్తే తయారవుతాయి. కాలక్రమేణా, అవి మాట్లాడే సమూహానికి మాతృభాషలుగా ఉద్భవిస్తాయి. అప్పుడు వాటిని క్రియోల్స్ అంటారు. ఎన్నో సంవత్సరాలుగా అలాంటి పిడ్జిన్స్, క్రియోల్స్ బ్రతుకుతున్నాయి. అవి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువమంది అయినా సరే. వాళ్ళ కమ్యూనికేటివ్ నీడ్స్ ని తీరుస్తుంది కనుక అవి బ్రతికాయి. ఏ భాష అయినా ఇంతే. అది తరువాతి తరాల వారికి వెళుతున్నప్పుడు (రూపాంతరం చెందినా సరే) బ్రతుకుతుంది. మీరు భాషని ఇంకా పరిపుష్టిగా చేయటం గురించి మాట్లాడుతున్నారు. నేను భాష బ్రతకటం గురించి మాట్లాడుతున్నాను. నిన్నకో, మొన్నకో వెళ్ళి కాదు.


 16. […] Rayraj Reviews రివ్యూ తక్కువ రాతలెక్కువ! « తెలుగు చచ్చిపోతే… – నా సమాధానం […]

 17. rayraj Says:

  పిడ్జిన్స్, క్రియోల్స్ అంటే ఏమిటో తెలీవు ; మీరు భాష , దాని ఎవల్ల్యూషన్ లాంటివి ఏదో చదివి చెప్తున్నారు. వీటిని పట్టుకొని నేను కాస్త చదువుకుంటాను.

  మీరు చెప్పిన మాటలు మళ్ళీ చదువుతుంటే గమనించాను :
  “ఈ శాస్త్రాల గురించి..మన చుట్టూ జరిగే general phenomena గురించి. They are not specific to a culture” – ఈ పాయింట్ చాలా తప్పమ్మా! అసలు వాటి వల్లే కల్చర్ ఉందమ్మా!లేకపోతే కోయభాషకీ తెలుగుకీ తేడా ఉండదు!”జల్సా” లో కోయ భాషలో బాధపడ్డట్టూ, ఎస్కిమోలు “అభివ్యక్తికరించు” కోవటం – ప్లీజ్!Language is not for Expression;there is much more to it!.Its a linguistic view,perhaps; And Science is definitely part of a culture and Science creates lot of language!(మఖ -పుబ్బ అని ఉదాహరణ చెప్పాను కదా!) You missed the whole point.

  You don’t miss identity that way; its just nostalgia you are talking abt!

  Thanks for showing lot of interest in this and keeping it live!Please kindly read the next post with same enthu.Perhaps, we will continue this some other time.But i wish to go ahead for some movie stuff now.Surely leave your comments though.

 18. krishna rao jallipalli Says:

  తెలుగువారిగా గుర్తించబడాలని మీరు కోరుకుంటున్నారా లేదా….తప్పక. పంజాబివారిలాగా, కాశ్మీర్ వారిలాగా, ఒరియా వారిలాగా, బెంగాలి వారిలాగా గుర్తింప బడాలని ఎలా కోరుకుంటాను. నేను పుట్టిందే తెలుగులో కదా మరి.

 19. bhavani Says:

  I am talking about the “survival” of a language too. I am not just talking about it’s birth or evolution.
  You don’t seem to stress on the first point as much as you do on the second one.
  Please give me one example where a subject like physics or mathematics is specific to a culture(whenever you want to get into this discussion).
  Thanks for ‘judging’ my comments.

 20. rayraj Says:

  ok. i am still there. physics n maths లేకుండా జ్యోతిష్యం పుట్టలేదు.”సున్న” భారతీయ కల్చర్లోనుంచే పుట్టింది.అంతకంటే మనం ఇంకా సాధించామో నేనూ చెప్పలేను.కాని, సాధించి ఉంటే మనది మరింత ఘనమైన సంస్కృతి.

  “1. నేను మన ఐడెంటిటీనే నిర్వచించమన్నాను. మన ఐడెంటిటీలో కొంత భాగం సంస్కృతి నుండి నిర్మితమైవుంటుంది. కాదంటారా? ” – ఔను.దీనితో ఎక్కడా విభేదించలేదు.

  ” “survival” of a language” యస్! ఒన్ మోర్ టైమ్!తెలుగు చచ్చిపోతే నష్టం ఏంటి!?లేదా తెలుగు ఎందుకు బతకాలి!?

 21. అబ్రకదబ్ర Says:

  @రేరాజ్:

  మీరు ‘తెలుగు చచ్చిపోతే తప్పేంటి’ అనకుండా ఉంటే నా ప్రశ్నలు మరో విధంగా ఉండేవి. మీ ముందటి టపా శీర్షిక చదివినోళ్లకి మీరు తెలుగు ఉన్నా పోయినా తేడా లేదు అనుకునేవారిలా అనిపిస్తే అది వాళ్ల తప్పు కాదు. తీరా చూస్తే ఇప్పుడు మీరు తెలుగు ప్రేమికుడిలా మాట్లాడుతున్నారు 🙂

 22. rayraj Says:

  ఈ లింకు చూడండి : నాకు ముందు ఈ చర్చ జరిగింది.కానీ కేవలం సాహిత్యమే భాష అని,అదే సంస్కృతి అని పొరబడ్డ చర్చ – కొత్త పుస్తకాలు, సినిమాలు కోరికుని ఆగిపోయింది.

  భవానీ గారు రాసిన పోస్టుపై మరింత వివరంగా నా భావాన్ని విశదీకరించాను. చదవండి.


 23. సంస్కృతి గురించి వ్రాసుకోవాలనుకుంటే హిందీలోనో, పంజాబీలోనో వ్రాసుకోవచ్చు. దానికి తెలుగు భాషే ఉండాలా? తెలుగువాళ్ళ మధ్య కూడా సాంస్కృతిక తేడాలు లేవా? బతుకమ్మ పండగ తెలంగాణాలో జరుపుతారు కానీ ఆంధ్ర ప్రాంతంలో జరపరు. వంటలలో కూడా ప్రాంతీయ తేడాలు కనిపిస్తాయి. వేర్వేరు ప్రాంతాలకి చెందిన తెలుగువాళ్ళ మధ్య సాంస్కృతిక తేడాలు ఉండడం విచిత్రం కాదు. భాష చచ్చినంతమాత్రాన సంస్కృతి చావదనే నేను నమ్ముతాను. సమీర్ అమీన్, లియో టాల్స్టాయ్ లాంటి రచయితలు వ్రాసిన పుస్తకాలు ఇంగ్లిష్ లో చదివాను. చలం, రంగనాయకమ్మ గార్ల పుస్తకాలు తెలుగులో చదివాను. ఇంగ్లిష్ బాష రానివాళ్ళు ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు. అందు కోసం తెలుగు సాహిత్యం కూడా అవసరమే. స్టాలిన్ వ్రాసిన “Dialectical & Historical Materialism” పుస్తకాన్ని తెలుగులోకి అనువదించడానికి ప్రయత్నించాను. కానీ తెలుగు గ్రామర్ లో నాకు నేర్పు తక్కువ ఉండడం వల్ల అనువాదం సఘంలోనే ఆపేశాను. ఇంగ్లిష్ రానివాళ్ళ కోసం ఇంగ్లిష్ పుస్తకాల్ని తెలుగులోకి అనువదించడం కోసం తెలుగు నైపుణ్యం అవసరమే. కానీ భవిష్యత్ లో అందరూ ఇంగ్లిష్ నేర్చుకున్న తరువాత తెలుగు భాష చనిపోతే తప్పు లేదని నేను నమ్ముతాను.

 24. rayraj Says:

  @మార్తాండ : ఔను.తప్పులేదనే నేను కూడా చెప్పాను.కాని దానికి మించి ఇంకా చాలా చెప్పాను.అవి మీరు అర్ధం చేసుకోవడాని ప్రయత్నించండి.పాయింట్#2 మీ సమాధానాలని ఉద్దేసించి చెప్పిందే!ఇక మీకు అర్ధం కాకపోయినా నన్ను ప్రశ్నించ వద్దు. ఇంత కంటే ఇంకా చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు.అర్ధం చేసుకుందామని మాత్రం ఉంటే, దీన్ని మీ కర్ధమయ్యింది అనిపించేటంత వరకు చదువుకోండి. అంతే నేను చెప్పగలిగేది.లేకపోతే వదిలేయండి.


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: