తెలుగెందుకు – ప్రతిస్పందన

మహేష్ చెప్పిన “Evolutionary anthropology”, నేనూ, మిగిలిన వారనుకుంటున్న “సంస్కృతి”  వేరు. అది శాస్త్రం – దాని లక్ష్యం వేరు; ఇదంతా సంస్కృతిని కాపాడుకోవటమెలా అన్నదానికి జరుగుతున్న మధన – అని ఎట్లీస్ట్ నేను భావిస్తున్నాను :).

సైకిల్ నేర్చుకోవటంలో ఒక్కోసారి కింద పడతారు.అలా ఇప్పుడు పిల్లాడు కిందపడ్డాడు – ఇదంతా శాస్త్రానికి సంబధించిన భాష.. కిందపడి, మళ్ళాలేచి సైకిల్ తొక్కేవాడు-పిల్లాడు. అదే సంస్కృతి. ఇట్ ఈజ్ మోర్ డైనమిక్; రూల్ లెస్, రూత్ లెస్ అండ్ రాండమ్.

ఇంటెలెక్ట్యుయల్ ఎవరా? కింద పడ్డ పిల్లాడిని లేపి,దుమ్ము దులుపి,”ఏం కాలేదు నాన్న..ఏది చూడనీ, సరే ఇదిగో బాండేసాగా, పో మళ్ళా ట్రై చెయ్యి” అని స్వాభావిక ప్రేమతో చెప్పివెళ్ళే ఓ మనిషి.; ఇంకో రకంగా కూడా చెయ్యొచ్చు – మనమే సైకిల్ తొక్కేసి, పిల్లాడిని కడ్డీమీద కూర్చోబెట్టేసి, స్పీడుగా తీసుకెళుతూ ఆనందింప చేయొచ్చు. బట్ ఐ ప్రిఫర్ ది ఫస్ట్; ఇంకా చాలా మార్గాలుండొచ్చు – ముందు స్టాండింగ్ సైకిల్ మీద పెడలింగ్ నేర్పిచ్చి,అలా ఏదో….సో ఊరికే చెప్పాను; ఇక ఈకకి ఈక, పీకకి పీక పీక్కండి.  🙂

కాకపోతే, “భాష” అనేది సంస్కృతి యొక్క భౌతిక లక్షణం. ఎవరూ ఇలా అన్లేదేమోగానీ, ఇది నా మాట; అందుకే మహేష్ “మానసికత”  అనేసరికి, అతని ఉద్దేశ్యం అడిగాను.

ఏదో ఓ కోయ భాష ఉందనుకోండి – దాన్ని రక్షించాలి అని అందరూ అనుకుంటారా!? అనుకోరు. ఎందుకంటే – ఆ కోయవాళ్ళ సంస్కృతి అంతరించిపోతుంది కాబట్టి. అలా ఒకటి పోయి, ఇంకోటి వస్తూనే ఉంటుంది. ఆ మాత్రం మనకి తెలీదా!

ఇక్కడ తెలుగు చచ్చిపోతుంది అని గానీ, చచ్చిపోదూ అని గాని నిర్ధారించలేం; అది సంశయమే! ఏదైనా జరగచ్చు. కానీ, చచ్చిపోతే నష్టం ఏంటి అనేది ప్రశ్న.అప్పుడు తెలుగువాడు చచ్చిపోతాడు అనేది సమాధానం.

సంస్కృతం – టు బి హానెస్ట్ – ఈజ్ డెడ్! ఎందుకు – నధింగ్ హేపన్స్ ఇన్ సాంస్క్రిట్! కాని అది ఉన్నది – ఎవరి చేతుల్లో ఉంది! వాళ్ళని సంఘంలో ఎంతమంది గౌరవిస్తున్నారు?అసలు గౌవవించాలా!? వాళ్ళని కోయవాళ్ళని చూసినట్టే చూడాలా!? వాళ్ళని సంస్కరించి, మన లాగా మార్చేసి మైయిన్ స్ట్రీమ్ లో కలిపేసుకోవాలా!!??

ఇఫ్ నధింగ్ హాపెన్స్ ఇన్ తెలుగు, దట్ ఈజ్ ది పాయింట్ వి మైట్ రీచ్. ఇట్ మైట్ బి దేర్, ఫర్ యు టు సి,  హియర్ అండ్ దేర్ ; బట్ ఇట్ మైట్ యాజ్ వెల్ బి డెడ్; అలా అనటం నచ్చకపోతే – అది ఓళ్డేజ్ హోమ్ లో ఉన్న తల్లి లాంటిది అనండి.

నా దృష్టిలో అలా సంస్కృతాన్ని రక్షిస్తున్న వాళ్ళు కలకాలం ఉండాలి – కనీసం ఓళ్డేజ్ హోమ్ లో తల్లిలా.  కనీస అవసారాలు తీర్చగలిగినా, వాళ్ళు దాన్ని పరిరక్షస్తారు – వాళ్ళ కర్ధమైన రీతిలో. ఎందుకంటే – ఆ భాష, దాని సంస్కృతి యొక్క “మానసికత” అలాంటది.  ( తెలుగు “మానసికత” అది కాదు.)

న్యూటన్ ఇలా రాశాడు, ఐన్ స్టీన్ ఇలా రాశాడు, కోప్లర్ ఇలా చెప్తున్నాడు అంటే, ప్రతివాడు అన్నీ చదువుతాడా!? చదివినా అర్ధమౌతాయా!? నమ్ముతాం – అంతే. అణువును నువ్వు చూశావా!? ఎలక్ట్రాన్ నువ్వు చూశావా!? ది కాంసెప్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఇట్స్ రియాలిటీ అండ్ వాలిడిటీ – దో పారడాక్సికల్లీ, వీ యూజ్ ది కాంసెప్ట్ టు అండర్ స్టాండ్ ది రియాలిటీ!

సంస్కృతము ఓ భాషే ఐనా – అది ఓ భౌతిక లక్షణమే ఐనా –  భాషకు  మించి ఇంకా ఏదో ఉందని, కొందరు తెలుసుకొని దాన్ని రక్షించే ఏర్పాటు చేశారు/ చేస్తున్నారు. నా జీవిత లక్ష్యం అందులో ఏముందో తెలుసుకోవటం కాదు కాబట్టి, అంతకు మించి ఆలోచించను. అలాగని, “అది కూడా కోయ భాషలాంటిదే , దాన్ని రక్షించడం ఆపండి” – అని నేను గొడవ చేయను. అందులో ఏమీ లేదు అని ఎవరన్నా నిర్ధారిస్తే మాత్రం, అంగీకరించను. ఎందుకంటే, ఇవ్వాళ్ళ ఇంత అభివృద్ధి చెందిన తరువాత కూడా, ఇంకా మనకి తెలీనివి చాలా ఉన్నాయి.  తెలిసిన వాటితో తెలీనివి తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తాం. కానీ, ఆల్ ది వైల్ – ఇంకా తెలీదు – అనేది ఙ్జప్తికి  ఉంచుకోవాలి.

ఇప్పుడున్న ఙ్ఞానంతో సమస్తం తెలుసు అనే భావం ఎప్పుడూ కరెక్టు కాదు.

సంస్కృతంలో ఏదో ఉన్నదని “నమ్ముతాను” – దీన్ని మూఢ నమ్మకం అంటారా? ఎక్జాక్ట్లీ – న్యూటన్ మీద నమ్మాకానికీ, సంస్కృతం మీద నమ్మాకానికీ, పోలేరమ్మ గుళ్ళో మేకలు బలిస్తే మంచి జరుగుతుందన్న నమ్మకానికి – అన్నిటికీ, అన్నిటికీ నమ్మకమే ఆధారం. అప్పుడు “మూఢ” నమ్మకం అంటే ఏమిటి!? – అందుకే  “జోధాఅక్బర్-జ్యోతిష్యం”   అని కోతిగీత రాసింది.

“సత్యం” లో మీరు డబ్బు పోగొట్టుకున్నారు – ఐతే ప్రభుత్వం అనే కాంసెప్టు బూటకమా!? ఆడిటింగ్ అనే కాంసెప్ట్ బూటకమా !?  డైరెక్టర్లు, ఇంత పెద్దా ఆర్గనైజేషనే బూటకమా!?  ఈ ప్రభుత్వం, సెబీ, న్యాయస్థానం, ఆడిటింగ్, పోలీసులు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ లు, డైరెక్టర్లు, ఉద్యోగులు, విజిల్ బ్లోయింగ్ పాలసీలు – అన్నీ కాంసెప్ట్లు బానే ఉన్నాయ్. కానీ ఇప్పుడు డబ్బు పోగొట్టుకోవటం ఒకటే రియాలిటీ , మిగితా వన్నీ బూటకమేనా!!?? కాదే! నాకు వర్కౌట్ కాకపోయినా, అవీ ఉన్నాయనే నమ్మాలి – నమ్మకమే కాదు, ఉన్నాయి – ఇన్  ఎ కలెక్టివ్ బిలీఫ్ సిస్టమ్(సమిష్ఠి నమ్మకం) – అవి ఉన్నాయి. నిజానికి అవన్నీ ఉన్నాయిగా అని ఎవరికి వారు కళ్ళు మూసేసుకున్నారు. దాంతో ఏవీ లేవు. ఇప్పుడు నమ్మకమే బూటకమై పోయింది!

ఈ పోలిక మీకు వింతగా ఉందా! ఉండొచ్చు; కాని అది నిజం; అన్నీ ఉన్నాయి – ఉన్నాయ నుకుని కళ్ళు మూసుకుంటే ఏమి లేవు -అచ్చు అద్వైతం చెప్పినట్టు లేదు! 🙂

– ధింక్ , ఆలోచించండి . వి ఆల్ లివ్ ఇన్ ఎ కలెక్టివ్ బిలీఫ్ సిస్టమ్ – అండ్ ఇట్ ఈజ్ అవర్ “ఛాయిస్” టు బిలీవ్ ఆర్ నాట్,  బట్ యూ ఆర్ నాట్ హియర్ టు త్రో ఎవే ది బిలీఫ్ సిస్టమ్స్ – విచ్ ఆర్ సో పెయిన్ స్టేకింగ్లీ ప్రొటెక్డెడ్ బై వేరియస్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ. కానీ కష్టపడి మరి బలి, సతి లాంటి సాంప్రదాయాల్ని మాన్పించేస్తాం. అలాగే, సంస్కృతాన్ని మ్  ఏంటి!!మూఢనమ్మకమని!!??  –   చెయ్యం. చెయ్యకూడదు.

పోనీ, ఇంకోటి చెప్తా : రామ్ గోపాల్ వర్మ రాస్తాడు –  లిజన్ టు యువర్ హార్ట్  అండ్ టు సమ్ ఆఫ్ యువర్ బాడి పార్ట్స్ అంటాడు. ఒకవేళ మీ “బాడీ పార్ట్” ఏం చెయ్యట్లేదనుకోండి , మిగితా వాళ్ళందరూ అనుభవిస్తున్నా “ఆ రియాలిటీ” ఇంక లేదన్నట్టా!? మీకే లేనట్టా!? అంటే ప్రతి వాడికి ఒక్కో “రియాలిటీ” ఉన్నట్టా!? ఐతే అందరికీ కలిపి ఒకే రియాలిటీ ఉన్నట్టా లేనట్టా!? అసలుండాలా అక్కర్లేదా!? ఉంటే కనుక్కోవాలా అక్కర్లేదా!?

ఒకవేళ తెలీక పోతే – తెలీటం లేదు – అనన్నా చెప్పుకోవాలి కాని ; అసలేమీ లేదు అని నిర్ధారించలేము.  రైట్! ; ప్లీజ్ కీప్ దిస్ పాయింట్ ఇన్ యువర్ మైండ్. బై ద వే! వాడు “మై రియాక్షన్స్ టు రియాక్షన్స్” అని రాస్తాడు. నేనూ దాన్నే “ప్రతిస్పందన” అని శీర్షిక చేశాను! కాపీ యా! కాదు, తెలుగులో  నాకు సింగిల్ పదం ఉందని 🙂 

చివరికి నేను చెప్పేదేంటంటే – అలా అక్కడక్కడ కనపడుతూ ఉంది కదా అని భాష బతికే ఉంది అనుకోవటం తప్పు. కొన్నిటిని కనీసం అలా ఓళ్డేజ్ హోం లో తల్లిలా బతికించుకున్నా – అసలు జీవించడం అంటే – భాషైనా, సంస్కృతి అయినా ఇంకా చాలా లైవ్లీగా ఉండాలి.  ఐతే తెలుగు అలా ఉన్నదా : చాలా కాలం దాని మనసు సంస్కృతం నుంచి వచ్చింది అనుకుందాం. తరువాత కార్ల్ మార్క్స్ నుంచి వచ్చింది అనుకుందాం; ఇప్పుడు అమెరికా నుంచి వస్తుందేమో చూద్దాం 🙂

ప్లీజ్! అర్ధం చేసుకోండి. తెలుగు ఎందుకు బతకాలి అంటే నేను తెలుగువాణ్ణి కాబట్టి ; అది నా ఐడెంటీ కాబట్టి. ఒకవేళ ఈ ఐడెంటీ అక్కర్లేక పోతే, తెలుగు అవసరం ఇంక ఎవరికి ఉంటుంది!? ఎవ్వరికీ ఉండదు!

ఎవరికన్నా ఐడెంటిటీ ఎందుకు కావాలి?
నేను IIT లో చదువుకుంటే, మీరు వద్దన్నా IIT వాళ్ళందరం కలుస్తునే ఉంటాం ; నేను IIMA అనుకోండి IIMA వాళ్ళంటే కొంచెం అభిమానం ఎక్కువ. బ్రాడ్ గా IIM లందరూ ఒకటీ! – ఇది తప్పు కాదు – దే ఆర్ గ్రూమ్డ్ టుగెదర్ అండ్ షేర్ కామన్ లెవల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ సో ఫ్లోక్ టుగెదర్. అంతే! నా సమాధానం లో ౩b లో చెప్పినవాడు బహుశా తనని తాను “హైద్రాబాదీ” అని పిలుచుకుంటే, హైద్రాబాదీలు ఒక ఐడెంటిటీ!

వ్యక్తిగతంగా కూడా మనిషి తనదైన ఓ ప్రత్యేక గుర్తింపు కోరుకుంటాడు. అలాగే, ఓ కమ్మ్యూనిటీగానో,  సంఘం గానో, సంస్థతోనో (మైక్రోసాఫ్ట్, ఆక్సంచూర్, ఇస్రో, డిఆర్ డిఓ,బి హెచ్ ఈ ఎల్, ఇన్ఫోసిస్, విప్రో  అలా అన్నమాట) కలసి ఓ ఉమ్మడి గుర్తింపునీ కోరుకుంటాడు – అదో తృప్తి, భద్రత, సాంఘిక అవసరం, అండ్ బార్ గైనింగ్ పవర్!

యెస్! బార్ గైనింగ్ పవర్! ( పవర్ కి తెలుగు పదం ఏంటీ! ఎవరన్నా సహాయం చేయండి ప్లీజ్!)

ఈ గుర్తింపు ఓ రాజకీయ – పొలిటికల్ పవర్! ఓ ఆర్ధిక  – ఎకనమిక్ పవర్ తెచ్చి పెడతాయి. ఇవి అన్నిటికన్నా ముఖ్యమైనవి. రేరాజ్ రాజకీయం చేయడు.కానీ తెలుగు గుర్తింపు ఈ పవర్స్ ని తెస్తాయి కాబట్టి – వీటిని స్పృశించక తప్పదు. ఎందుకంటే – ఇవే మీరొద్దన్నా తెలుగు నిలబడటానికి, నిలబడలేక పోవటానికి కారణం ఔతాయి.

నా సమాధానం కామెంట్స్  లో,  దిలీప్ కిచ్చిన సమాధానంలో,  కోక్ ఎక్జాంపుల్ ని చెప్పాను. దాన్ని అర్ధం చేసుకోండి చాలు. అందులో ఉదహరించినట్టు – ఏపీ వాళ్ళ కోసం,  కోకో పెప్సీ యో ఏదో ఒకటి  – డ్రింక్ లో ఫిజ్ పెంచారు అంటారు. చంకలు గుద్దుకుని తాగేస్తారు; ఓ రోజు సడెన్ గా ఎవడికో ఇది మన సంస్కృతి కాదు అని గుర్తిస్తాడు – వాడు తెలుగు ఫండమెంటలిస్ట్ ఔతాడు; ఛాందస వాది ఔతాడు! అలాగని ఈ డ్రింక్స్ ని తెలుగుతనం లో కలిపేద్దామా వద్దా!? మనమేమన్నాచేయగలమా చేయలేమా!?

(చెయ్యగలం – థమ్స్ అప్ అనేది ఇండియన్ బ్రాండ్ – దాన్ని చంపేద్దాం అని ప్రయత్నించినా చావకపోతే ఆ భ్రాండ్ అలాగే ఉంచారు.ఆఫ్ కోర్స్ ఇంకా విదేశాల్లోకి మార్కెట్ చేయబడలేదు. నిజానికి ఇంకొద్దిగా ఆ బ్రాండ్ నిలబడ గలిగి – ఓ ఇండియన్ ఫిజ్ డ్రింక్ గా యూ యస్ లో అమ్మగలిగితే , కనీసం జపాన్ వాడు కారులు అమ్మినంత శాటిశ్ ఫాక్శన్ మనం పొందే వాళ్ళం – గౌరవం లోనూ, ఎగుమతి ఆదాయంలోనూ – ఊరికే అతిసయోక్తికి చెప్పాను. నిజానికి మనం అమెరికన్ మార్కెట్ కి వాళ్ళేసుకునే బట్టలని పంపుతాం, కానీ “వి క్లోత్ ది అమెరికన్” అని తల ఎగరయ్యలేం!!?? )

ఒక పక్కనుంచి వాళ్ళు కార్న్ ఫ్లేక్స్ అని, సిరియల్  ప్రాడక్ట్స్ అని మన మార్కెట్లోకి వస్తుంటే, మనం మౌనంగా చూస్తున్నాం ; కొత్తదనాన్ని తొందరగా నేర్చుకుంటున్నాం. పైగా అవి మనకి కన్వీనియంట్ గా ఉంటాయి; నేను అవి తింటాను అంటే  నేను కాస్త సోషల్ క్లాస్ లో పైన ఉన్న వాడిని! ఉన్నత వర్గం తింటుంది కాబట్టి, మధ్య తరగతి  తింటుంది! మళ్ళా తిరిగి చూసుకునే సరికి ఇడ్లీ, దోసె ఎగిరి పోతాయ్!!!  చెప్పండి – ఆహారం మన సంస్కృతిలో భాగం అన్నారుగా! మరి మన ఆహారం మారిపోతే, కార్న్ ఫ్లీక్స్ , సాండ్ విచ్ లాంటి పదాలుంటాయి గానీ, ఇడ్లీలు , దోసెలు అనే పదాలుంటాయా!!??  అలా ఎన్ని ఆహార పదార్ధాలు, వాటి పదాలు తెలుగులో నుంచి వెళ్ళిపోలేదు! (దీన్నిబట్టి మనమూ కార్న్ ఫ్లేక్స్ చేసి,  దానికి “మొక్కజన్న అటుకులు” అని పేరు పెడతాం అని కాదు! అటుకులతో ఏదో చేసి, ఓ తెలుగు పేరున్న బ్రాండ్ తో అటుకులు అని ప్రపంచం మొత్తానికి అమ్మగలగాలి!…………. తెలంగాణాలో అటుకులతో చేస్తారు. ఎప్పుడన్నా తిన్నారా! నాకు భలే ఇష్టం )

కాబట్టి ఈ మారిపోయేవి ఎలాగూ మారిపోతాయి. కాకపోతే ఆ మార్పు మీరు తెస్తే, అది మీ సొంతమనే ధైర్యం, ఆత్మ విశ్వాసం ఉంటుంది. దానివల్ల ఆత్మ గౌరవం పెరుగుతుంది. మనం తీసుకొచ్చిన కొత్త వస్తువులు, అలవాట్లు, సాహిత్యం, సినిమాలు, ఫిలాసఫీ, వివిధ శాస్త్రాల్లో కొత్త థియరీలు, కొత్త సైన్స్ ఆవిష్కారాలు “మన తెలుగు సంస్కృతి”  ఔతాయి . అలా ఓ జాతిగా ఎదిగి, మన ఐడెంటిటీ ఉంచుకొని, తద్వారా లాభపడాలని మనం తెలుగు జాతి గా ఉండాలి! అందుకని భౌతిక స్వరూపమైన “తెలుగు భాష” ని కాపాడితే –  “తెలుగు” వారు ఒకటిగా ఉండొచ్చు;  ప్రాచీనమై పోయిన సంస్కృతి ని చాటిచెప్పినవాళ్ళమౌతామూ, భవిష్యత్తులోనూ మనదంటూ ఎప్పుడూ ఓ ప్రత్యేక సంస్కృతి తో  “తెలుగు జాతి” గా గుర్తించ బడతాము.

ఐతే, ఇలాంటి గుర్తింపు ఇది వరకు చెప్పినట్టు చాలా రకాలుగా రావాలి/కావాలి. ఎక్కడో అక్కడ ఓ బాలెన్స్ కావాలి. ఆ గ్రూపు మరీ చిన్నదై పోకూడదు. ఆ గ్రూపు మరీ హెటిరోజినియస్ ఐపోకోడదు.

అందుకనే – తెలుగువారందరు ఒకటిగా ఉండే ఐడెంటిటీ కోసం “తెలుగు” ను కాపాడు కోవాలి; అంతే గానీ, సంస్కృతి కోసం, మాతృభాషకోసం, మెజార్టీ తెలుగువారు కాబట్టి వాళ్ళ కోసం, పేదవాళ్ళకి పై చదువుల కోసం, నా కవితల కోసం , మీ కవితల కోసం, శ్రీ శ్రీ కవితల కోసం , తిక్కన కోసం, జ్యోతిష్యుల కొసం, ఇన్నయ్య ఇంపోర్టెడ్ హేతువాదం కోసమో (నా దృష్టిలో సంస్కృతంలో కూడా హేతువాదం ఉన్నది;ఇట్స్ జస్ట్ ఓవర్ లుక్డ్ అంతే!) కాదండి!  తెలుగువారందరికోసమూ నండి.

తెలుగెందుకు బతకాలి – నేను తెలుగు వాణ్ణి కాబట్టి ; అందరూ కలిసి అరిస్తే – 18 కోట్ల తెలుగు వాళ్ళమూ “మా కోసం ” అని ముక్త కంఠం తో అరవాలి.

ఇప్పుడు మీరు ఏ గూగుల్ వాడి దగ్గరికో , అడోబి వాడి దగ్గరికో,  మైక్రోసాఫ్ట్ వాడి దగ్గరకో, వర్డ్ ప్రెస్ వాడి దగ్గరికో, బ్లాగ్ స్పాట్ వాడి దగ్గరకో వెళ్ళి – మీరు తెలుగులో సాఫ్ట్వేర్ ఎందుకు చేస్తున్నారో నిజాయితీగా చెప్పండి అని అడిగితే ఏం చెప్తాడో మీకు తెలిసిందా!!??  “తెలుగు కోసం” , “తెలుగువారి” కోసం అని మాత్రం అనుకోకండి!

ఇప్పుడు మనం ఎందుకు ప్రతిదీ కాపీ కొట్టకూడదో కూడా అర్ధం అయ్యిందేమో కూడా కదా!!!! ( a2zడీమ్స్! చూస్తున్నారా!)

చాలు. తదుపరి పోస్టు సినిమా మీదే!

ప్రకటనలు
Explore posts in the same categories: Uncategorized

ట్యాగులు:

You can comment below, or link to this permanent URL from your own site.

11 వ్యాఖ్యలు పై “తెలుగెందుకు – ప్రతిస్పందన”

 1. krishna rao jallipalli Says:

  సంస్కృతి కోసం, మాతృభాషకోసం, మెజార్టీ తెలుగువారు కాబట్టి వాళ్ళ కోసం, పేదవాళ్ళకి పై చదువుల కోసం, నా కవితల కోసం , మీ కవితల కోసం, శ్రీ శ్రీ కవితల కోసం , తిక్కన కోసం, జ్యోతిష్యుల కొసం, ఇన్నయ్య ఇంపోర్టెడ్ హేతువాదం కోసమో … ani evaru meeto annaaru??

 2. rayraj Says:

  అదేంటండీ – నాకందరు ఇచ్చిన సమాధానలు అవే!నేను కనీసం ఓ 50 Answers – తెలుగువాళ్ళమైన మనకోసం అని చెప్తారేమో అని ఆశ పడ్డాను!ఒక్కరే ఒక్కరు – అది నా ఐడెంటిటీ అని చెప్పారు!

 3. rayraj Says:

  ఈ లింకు చూడండి : నాకు ముందు ఈ చర్చ జరిగింది.కానీ కేవలం సాహిత్యమే భాష అని,అదే సంస్కృతి అని పొరబడ్డ చర్చ – కొత్త పుస్తకాలు, సినిమాలు కోరికుని ఆగిపోయింది.

  భవానీ గారు రాసిన పోస్టుపై మరింత వివరంగా నా భావాన్ని విశదీకరించాను. చదవండి.


 4. తెలుగు పత్రికలు నడిపేవాళ్ళని కూడా తెలుగు సరిగ్గా రాదు. ఈ లింక్ చదవండి: http://venuvu.blogspot.com/2009/04/blog-post_27.html


 5. కాస్త ఆలస్యమైన స్పందన. నిన్ననే మరి మీ టపాలు చదివేను. నాకూ ఇలాటి ఆలోచనలే ఉండేవి, ఇంకా కొన్ని ఉన్నాయి. అయితే వాటితోపాటు మరి కొన్ని సందేహాలు కూడా.
  మీరన్న ఐడెంటిటీ (తృప్తి, భద్రత, సాంఘిక అవసరం, అండ్ బార్ గైనింగ్ పవర్ కోసం) భారతదేశ పౌరసత్వం ఎందుకు కాకూడదూ? అప్పుడుకూడా ఇవన్నీ సాధించే అవకాశం లేదంటారా? అప్పుడు “తెలుగుదనం” అవసరం ఉంటుందా? అప్పుడు “తెలుగు భాష” అవసరం ఉంటుందా?
  ఉదాహరణకి ఈ పరిస్థితిని ఊహించండి:
  మన ఆంధ్రదేశంలో (ఆ మాటకొస్తే మొత్తం భారతదేశం) ప్రధాన భాష ఇంగ్లీషు భాష అయిపోయిందనుకోండి (తెలుగులాంటి భాషలు సంస్కృతంలా చరిత్రలో మిగిలిపోయాయనుకోండి). సంస్కృతికూడా చాలావరకూ మారిపోయి ఇంచుముంచు పూర్తిగా పాశ్చాత్య సంస్కృతిలాగానే తయారయ్యిందనుకుందాం. అప్పుడుకూడా మనం భారత పౌరులమనే ఐడెంటిటీ, మనకి భద్రతనివ్వదా? ఆర్ధికంగా స్వయంప్రతిపత్తిని, శాస్త్రీయంగా ఇన్నొవేషన్లు సాధించి తలెత్తుకొని బతికే అవకాశం ఉండదా?
  ఇప్పటికే ఈ ప్రశ్నలకి మీ టపాలలో సమాధానాలు ఉన్నాయేమో తెలీదు (మీ చైతన్య స్రవంతిని అందుకోడం కష్టమే! :-). ఉంటే మళ్ళీ ఒకసారి నాకోసం చెప్పండి.

 6. rayraj Says:

  @కామేశ్వరరావు : “….. ఆర్ధికంగా స్వయంప్రతిపత్తిని, శాస్త్రీయంగా ఇన్నొవేషన్లు సాధించి తలెత్తుకొని బతికే అవకాశం ఉండదా?”

  – ఉండొచ్చు. కానీ,”తెలుగు” చచ్చిపోవచ్చు; మీరు గమనిస్తే, ఇలా ఆలోచించేవాళ్ళుంటారు; నిజానికి, ఇది సాధించే ఉద్దేశ్యంలోనే, హిట్లర్ బయలు దేరాడుట; అలాగే జర్మన్లు బానే ఇన్నోవేషన్స్ చేసారుట లెండి.ఒక కొత్త ఆర్డర్ నెలకొల్పబడాలని, అది తన సంస్కృతే అయ్యుండాలి అనే యుద్దానికి దిగాడుట.

  అలాగే,అలా ప్రపంచం అంతా తెలుగు లేక భారతీయ సంస్కృతే ఎందుకు స్థాపించబడకూడదు అని కూడా ఆలోచించవచ్చు!? కనీసం నా భారతదేశంలో అయినా నా ఇడ్లీ, నా సాంబారు నాకు దొరకాలి; బర్గరు, బన్ను తిన కూడదు అనైనా మనిషికి ఉంటుందిగా! సరిగ్గా ఇక్కడే ఫండమెంటిస్ట్ అనే వాళ్ళు స్టాట్ ఔతున్నారని నా ఉద్దేశ్యం.

  ఒకవేళ, మెక్ డొనాళ్డ్స్ ఇడ్లీ,సాంబారు అమ్మినా, కొంతకాలానికి అది మన కల్చర్ అని పించుకోదేమోనని చెప్పాను.దాన్నికూడా వాడే తినిపించాడని అనుకుంటాం. ఉదా: ఇవ్వాళ్ళ అన్ని “దర్శిని”లలో వంటచేసే ఉపకరణాలు,తినే పళ్ళాలు, గ్లాసులో చూసుకోండి. బహుశా అందులో మన “సంస్కృతి” లోంచి మనం వాడుతున్నది – దోశ వేసే ముందు “కొబ్బరి చీపురు” తో ఇలా ఓసారి “పెనం” లాంటి ప్లాట్ ఫార్మ్ (వేదిక అనాలిట 🙂 ) ని ఊడుస్తాడు;(ఇదువరకు ఉడుపి హోటల్స్ అని….ఇలా ఇడ్లీని దేశం మొత్తం వ్యాప్తి చేసిన ఘనత అంతర్గతంగా మనదేనని/భారతీయులదేనని గుర్తించమని మనవి)

  ఇక ఛాందసవాదులు : “అసలు “కొబ్బరి చీపిరి” పుల్లల్లో ఉండే నాచ్యురల్ హెర్బల్ విషయం తెలీక, మెక్ డోనాళ్డ్స్ వాడు దాన్ని మార్చాడు; మన వాళ్ళు వెళ్ళి ఎగబడి తింటారు.ఆధునిక శాస్త్రం ఇప్పుడే కొబ్బరి చీపిరులో ఉన్న ఆ తత్త్వాలని రీసెర్చె చేసు కనుగున్నారు” అంటారు. అప్పుడు చట్నీస్ వాడు – దోసె రేటు ఇంకొంచెం పెంచేసి -” మా హోటల్లో దోసె వేసే ముందు చీపురుతో ఊడుస్తాం” అంటాడు; దాన్ని ఇలైట్ క్లాశ్ : “ఓ దిస్ ఈజ్ సూపర్బ్! దిస్ ఈజ్ ఆథెన్టిక్ దోశ” అంటుంది; మిడిల్ క్లాస్ వాళ్ళు బర్గర్లు తింటారు; ఏనాటికైనా, ఇలైట్ క్లాస్ లాగైనా అవ్వకపోతామా అని కలలుకంటూ!ఇక అంత కంటే కింద ఉన్న వాళ్ళు బన్నులు తింటారు; గమ్మత్తు, బండిమీద దొరికే దోసె,చీపిరి ఎగిరి పోతాయి;అప్పటికి అవి “ఎక్సాటిక్” విషయాల్లెండి. మినుములు చిన్న కొట్లల్లలో దొరకవ్! :)) :)) :))….ఐ యామ్ సారీ,ఇఫ్ ఐ సౌండ్ ఫన్నీ….బట్ ఐ యామ్ సీరియస్.

  నేను ఆల్రెడీ పోస్టుల్లో చెప్పానండి…భాష అనేది చచ్చిపోయినా, సంస్కృతి అనబడేది చచ్చిపోయినా, పెద్దగా పోయేదేం లేదు అని; “ఐడెంటిటీ”, ఆత్మవిశ్వాసం ముఖ్యం అని; ఈ ఐడెంటిటీ “తెలుగు” ఐడేంటిటీ అవ్వాలని అనుకుంటే, ఆ భాషనైనా ఉంచుకోవాలి అని,దానికేం చేయాలో చెప్పటానికి ట్రై చేశాను; అండ్…భాష అనేది ఊరికే ఏదో నా మనసులో ఉన్నది మీకు చెప్పేటందుకే..అనేది తప్పేమోనని నా అభిప్రాయం; ఐ లవ్ యూ అన్నా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నా నిజానికి ఒకటే గా!మరి ఇక భాష ఎందుకూ!? పర్హాప్స్, ఇట్ హాస్ మోర్ వాల్యూ దాన్ జస్ట్ దిస్ కమ్మునికేషన్!


 7. రేరాజుగారు,

  “అలాగే,అలా ప్రపంచం అంతా తెలుగు లేక భారతీయ సంస్కృతే ఎందుకు స్థాపించబడకూడదు అని కూడా ఆలోచించవచ్చు!? కనీసం నా భారతదేశంలో అయినా నా ఇడ్లీ, నా సాంబారు నాకు దొరకాలి; బర్గరు, బన్ను తిన కూడదు అనైనా మనిషికి ఉంటుందిగా! సరిగ్గా ఇక్కడే ఫండమెంటిస్ట్ అనే వాళ్ళు స్టాట్ ఔతున్నారని నా ఉద్దేశ్యం.”

  ప్రస్తుతానికి మీకు మీలాంటివాళ్ళకు (అలాంటి వాళ్ళలో నేనూ ఉన్నాననుకోండి 🙂 అవి “నా” ఇడ్లీ, “నా” సాంబారు. కాని వచ్చే తరంలో చాలమందికి బర్గరు “మన బర్గరు”, బన్ను “మన బన్ను” అయితే?

  “నేను ఆల్రెడీ పోస్టుల్లో చెప్పానండి…భాష అనేది చచ్చిపోయినా, సంస్కృతి అనబడేది చచ్చిపోయినా, పెద్దగా పోయేదేం లేదు అని; “ఐడెంటిటీ”, ఆత్మవిశ్వాసం ముఖ్యం అని; ఈ ఐడెంటిటీ “తెలుగు” ఐడేంటిటీ అవ్వాలని అనుకుంటే, ఆ భాషనైనా ఉంచుకోవాలి అని,దానికేం చేయాలో చెప్పటానికి ట్రై చేశాను; అండ్…భాష అనేది ఊరికే ఏదో నా మనసులో ఉన్నది మీకు చెప్పేటందుకే..అనేది తప్పేమోనని నా అభిప్రాయం; ఐ లవ్ యూ అన్నా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నా నిజానికి ఒకటే గా!మరి ఇక భాష ఎందుకూ!? పర్హాప్స్, ఇట్ హాస్ మోర్ వాల్యూ దాన్ జస్ట్ దిస్ కమ్మునికేషన్!”

  మీ పోస్ట్లలో చెప్పింది నేను అర్థం చేసుకున్నంతవరకూ ఇది:
  తెలుగు భాష అన్నది “తెలుగుదనం”లో భాగం కాబట్టి, అది “మనది” కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలి. ఈ “మనది” అనే భావన ఒక ఐడెంటిటిని ఇస్తుంది. ఈ ఐడెంటిటీ వలన కొన్ని లాభాలున్నాయి. అంచేత “తెలుగు”ని ఉంచుకోవాలంటే ఏమిటి చెయ్యాలో చెప్పడానికి ప్రయత్నించారు.
  నేను అట్నుంచి నరుక్కురావడానికి ప్రయత్నిస్తున్నాను. అసలు “తెలుగు”ని ఎందుకు నిలబెట్టుకోవాలో స్పష్టమైతే కాని అది ఎలా సాధ్యమో ఆలోచించడం వ్యర్థం. “తెలుగు” మన ఐడెంటిటి అవ్వాలంటే ఏవిటి చెయ్యాలని ఆలోచించే ముందు అసలు తెలుగే ఐడెంటిటి ఎందుకవ్వాలన్నది స్పష్టమవ్వాలి కదా. అది మీ టపాల్లో నాకు కనిపించ లేదు. దాన్ని తెలుసుకోడానికే నా ప్రయత్నం.
  దీని మీద నాకున్న అభిప్రాయం:
  ఇప్పుడు మనం దేన్ని “తెలుగుదనం” అంటున్నామో దాన్ని మనం నిలబెట్టుకోవాలని తెలుగువాళ్ళు బలంగా అనుకోకుండా, దాన్ని నిలబెట్టుకోవడం సాధ్యపడదు. అంచేత ఎలా నిలబెట్టుకోవాలన్న ఆలోచనల వల్ల పెద్ద ప్రయోజనం లేదు.
  “తెలుగుదనం” మన ఐదెంటిటీ అవ్వాలని తెలుగువాళ్ళు బలంగా అనుకోవాలంటే దానికి రెండే రెండు మార్గాలున్నాయి. ఒకటి ఆ తెలుగుదనం మీద విపరీతమైన/నిర్హేతుకమైన అభిమానం ఉండాలి. రెండు ఆ తెలుగుదనాన్ని మన ఐడెంటిటీగా నిలుపుకోవడంవల్ల మనకి చాలా లాభమన్న విషయం స్పష్టంగా/హేతుపూర్వకంగా తెలియాలి. నా విషయంలో మొదటిది జరిగింది. మరి మీ విషయంలో?

 8. rayraj Says:

  I don’t ve my telugu tool now; I just finished giving 4-5 long comments in my style 🙂 @ parnashala; I think he will publish; Then we will discuss.I answered you in better fashion there.
  Let me tell you something – తెలుగుదనం మీద విపరీతమైన/నిర్హేతుకమైన అభిమానం ఉండాలి – This is bondage; I love freedom;

  You are missing my point; I don’t love telugu language because i can write poetry; If i love poetry, i will write poetry in whatever language; I generally wish to use a language which is useful for the day; If i could not ‘learn’ that language, i am in oldage and so i yearn for my past – where i was ‘free’ ; Hence Telugudanam is not to be determined; Its created by people from time to time; And hence, which attribute shall, we start with? i said – let it be language; why – i will answer in the ensuing post.

 9. rayraj Says:

  Or to give you short answer on why :
  Language is born as a medium of communication of thoughts/concepts.
  Later, Thoughts/concepts are influenced by language. Think on those lines.
  (And so, one even tries to get away from this limitations of language, discarding language; I think the first verse in the Dakshina murthi stotra says – the young guru is teaching the old desciples through silence and the old desciples are gaining the knowledge)
  (oh ya…. i see that in the sci fi movies…a lot of infomation is processed, consumed, undertood without a language! 🙂 )


 10. “Let me tell you something – తెలుగుదనం మీద విపరీతమైన/నిర్హేతుకమైన అభిమానం ఉండాలి – This is bondage;”

  Well, I don’t think it is a bondage and I don’t know why it should be so!

  “I don’t love telugu language because i can write poetry; If i love poetry, i will write poetry in whatever language;”

  I didn’t assume this either. I am only trying to understand why you love telugu language.
  I will wait for the other comments and post for it.

 11. rayraj Says:

  well, in a way, its not bondage….this is the limitation of a deterministic statement; At some point, blind love and trust are required too!. We will surely discuss;


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: