గులాల్ – లవ్…పవర్…రెవల్యూషన్

డెవ్-డి కూడా చూసి ఒకే సారి ఏకేద్దాం వీణ్ణి అనుకున్నా గానీ, ఇప్పుడు టైమ్ లేదు. “తదుపరి పోస్టు సినిమా మీదే” అన్నమాట నిలబెట్టుకునేసి, వేరే ఇంకో పోస్టు వెయ్యాలి.

“దట్ హాండ్ కర్చీఫ్ , యూ గేవ్ టూ క్యాసియో! ”  – అదేదో షేక్స్ పిరియన్ డైలాగ్ ; మీరు చదివారా! నేను షేక్స్ పియర్ ని చదవలేదు.  కాకపొతే  చిన్నప్పుడు స్కూల్లో మా ఫ్రెండు ఆ డ్రామా లో యాక్ట్ చేసాడు. అందుకని, షేక్ స్పియర్ అనంగానే,నా కా డైలాగు, వాడు చెబ్తున్నట్టు గుర్తొస్తుంది.

చదవకపోయినా,  “ట్రాజెడీ” అంటే షేక్ స్పియర్ గుర్తుచ్చేస్తాడు! అదేంటో మరి! బిట్రెయల్, బేవఫా లాంటి పదాలు మీ మనసులో ఏ చిత్రాలు తెస్తాయి!? తెలుగులో మోసం చేసే స్త్రీ కధలు తక్కువా! కాదేమో గానీ, అదంతే! ఈ పదాలకి ఇక్వివెలెంట్ తెలుగు పదాలేంటో!?  మోసం చేసే స్త్రీ అనంగానే ఓ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ డైలాగు గుర్తొస్తోంది. కృష్ణ టోన్లో : “నిన్న్హూ , లలిథనూ  చూసి లోకంలో అందరు స్త్రీలు మీ లాగానే ఫవిత్రం గా, ఫ్రేమగా  ఉంటారనుకుని ఫొరఫడ్డానమ్మ్హా ! శూర్ఫణకలు, కైకేయిలూ కూడా ఉంటారని తెలుసుకోలేకపోయనమ్మా! “)

గులాల్ – లవ్…పవర్…రెవల్యూషన్…
టైటిల్ కంటే నాకు ఆ కాప్షన్ బాగా నచ్చింది – ప్రొమోస్ లో ఆ కాప్షన్ కి తగ్గ సినిమా అనిపించింది. చాలా ఇంటరెస్ట్ కలిగింది. దాన్ని ఈ సినిమా నిలెబెట్టుకుంది. గులాల్ అంటే రెడ్ కి వాడుకున్నాడు  – రెడ్ అంటే లవ్…పవర్…రెవల్యూషన్ అని వాడుద్దేశం. అలగే మొహానికి పూసుకునే రంగు. సూపర్బ్! – కాకపోతే గులాల్ అంటే రెడ్ అన్నది నా బ్రెయిన్లో రాదు; ఓ రకమైన పింకిష్ రెడ్ వస్తుంది నాకు 😉  – కానీ సినిమాని మొత్తం వాడు అనుకున్న ఆ రెడ్ ధీమ్ లో తీస్తున్నప్పుడు(అదే చూస్తున్నప్పుడు) ఆ పాయింట్ మీరు మిస్సవ్వరు.

షేక్స్ పిరియన్ ట్రాజిడీ స్టోరీల్లో ప్రేమ కి, పవర్ కి, భేవఫా కి మధ్య జరిగే కధ ఉంటుంది. అదే ప్రభావంలో వచ్చిన ఐడియా ఇది. కానీ “రెవల్యూషన్” మాత్రం ఓ విచిత్రమైన రెవల్యూషన్ ఇది! మీకు కార్మికులు, సైనికులు, దేశభక్తులు –  రాజులకు వ్యతిరేకంగా చేసే రెవల్యూషన్స్ తెలుసు. కానీ రాజులే ప్రభుత్వానికి వ్యతిరేకంగా విప్లవించటాన్ని ఎక్కడన్నా రెవల్యూషన్ అన్నారా!!???వీడన్నాడు. కానీ బావుంది; కన్విన్సింగ్ గా ఉంది. నిజం అదే! పీడిత వర్గం అంటే అది కూడా సాపేక్షికమేగా! ఆ విషయం మర్చిపోతాం మనం! రాజ్ పుట్ లని ఏకం చేసి “రాజు” లౌదామనే రాజకీయం చేస్తూ, రెవల్యూషన్ సృష్టించ బడుతుంది.

సినిమా మొదలవ్వటమే రెవల్యూషన్ తో మొదలవుతుంది; రాజ్ పుట్ లు దేశం కోసం చేసిన త్యాగాలు చెబ్తూ, అలాంటి త్యాగాలని ఖాతరు చేయకుండా భారత ప్రభుత్వం రాజ్ పుట్లను ఎలా మోసం చేసిందో,  ఆవేశంగా ఉపన్యసిస్తుంటాడు కేకే మీనన్! వాళ్ళు ఓ సైన్యం లా ఏర్పడుతున్నారు అని అర్ధం ఔతుంది. సినిమా మొత్తం కేకే ఇరగ తీసాడు అనిపిచ్చింది నాకు.

మీకు తెలీకుండానే సినిమా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది.మళ్ళా ఆ పాయింట్ కి వచ్చేసరికి ఫ్లాష్ బ్యాక్ నడిచిందన్న స్పృహ కలుగుతుంది; ఐ జస్ట్ లవ్డ్ ది టెక్నిక్! టెక్నిక్ పాతదే — కానీ కరెక్టుగానే వాడుకున్నాడు. కావాల్సిన ఎఫెక్టు వచ్చేస్తుంది.

సరే! నోటికొచ్చినట్టు, చేతికొచ్చినట్టు బూతులు రాయడమే రియాలిటీ అనుకునే మన వాళ్ళకి, ఇది మళ్ళా ఓ “రియల్ సినిమా”! అలాంటి బూతుమాటలు మాట్లాడుకుంటారు అన్నందుకు నాకీ సినిమా “రియల్” అవ్వలేదుగానీ – లా కాలేజెస్, స్టూడెంట్స్ ,హాస్టల్స్, వాళ్ళ మధ్య పాలిటిక్స్ , గొడవలు, వాటి వెనకాల నడిచే అసలు పాలిటిక్స్ – చాలా కొత్తరకంగా, రియాలిటీని కాప్చర్ చేస్తున్నట్టుగా – రాజస్ధాన్ బ్యాక్ డ్రాప్ లో తీసాడు;  అందులో మన హీరో రాజ్ పుట్ ఐనా కూడా, మగాడే ఐనా కుడా , కాస్త భిన్న మనస్తత్వం గలవాడు అవ్వడం మన ట్రాజెడీ డ్రామాకి పర్ఫెక్టు సెట్టింగ్ ఔతుంది.

ఓ రాజకీయ ఎత్తుగడల మధ్య , అసలు వీరత్వం ఉన్న ఓ రాజ్ పుట్ స్టూడెంట్ లీడర్, ఎలక్షన్స్ మధ్య చంపబడతాడు. ఆ నేపధ్యంలో అనుకోకుండ మన హీరో ఎలక్షన్స్ లో నిలబెట్టబడి, గెలిపించ బడతాడు.

ఓడిపోయిన హీరోయిన్ (అనొచ్చా!) – హీరోని ప్రేమలోకి దింపి, తనక్కావాల్సిన పోస్టు సాధిస్తుంది. దానికి వేరే రాజకీయ కారణాలు ఉంటాయి – హీరోయిన్ ఓ రాజుగారికి అక్రమసంతానం అన్నమాట! “నాజాయిజ్ ఔలాత్” అంటారే ఏదో! అదన్నమాట! చచ్చిపోయిన స్టూడెంట్ లీడర్ కీ ఆయనే తండ్రి! ఈ యాంగిల్ ని సినిమాలో ఇంట్రడ్యూస్ చేసిన విధానం, మొత్తం రాజకీయంలో – హీరోయిన్, తన వెనక కధ నడిపించే అన్నయ్య – చంపబడకుండా ఉండటం అనేది, ఆ “రాజు” వల్లే అవ్వటం! – దట్స్ రియలిటీ! కావాలంటే మన రాజకీయాలు చూస్తే తెలీటం లేదు!

ఈ ప్రేమ అంతా బూటకమని, నమ్మలేని మన ప్రేమికుడు/హీరో షాక్ తింటాడు! తన లాగానే, స్టూడెంట్ రాగింగ్ లో దెబ్బతిన్న  మరో లెక్చరర్-కమ్-హీరోయిన్(లెక్చరర్ ఎందుకవ్వాలి!?) – మన హీరోకి ఆ విషయాన్ని ఎంత ప్రేమగా చెప్పినా నమ్మడు,  నమ్మలేడు! కానీ చివరికి తనే ఫిస్టల్ తీసుకుని, ఒక్కొక్కరి నిజాన్ని తెలుసుకుంటూ, చంపుకుంటూ వెళ్ళిపోతాడు.  సింపుల్ గా చెప్పాలంటే తిక్కరేగి, కాల్చుకుంటూ వెళ్తుంటాడు. అందులో తనూ చచ్చిపోతాడు; చచ్చే ముందు, నిజాన్ని చెప్ప ప్రయత్నించిన లెక్చరర్ – నిజమైన  ప్రేమికురాలి దగ్గర రాలిపోతాడు.

ఈ సినిమాలో పాటల చిత్రీకరణ ఇంప్రెసివ్ అననుగానీ – క్లాసికల్ ట్యూన్స్ లో ముంచి తీసిన ఈ పాటలను జడ్జ్ చేయలేను గానీ – వెరైటీ గా ఉన్నాయి; సమ్ ధింగ్ ఈజ్ వెరీ ఇంప్రెసివ్ ఎబౌట్ దెమ్!

చెప్పాను గదా! షేక్ స్పిరియన్ లెవెల్లో ఉండాలి!  “బేవఫా” అంటే అదో తీరు – అదెంతే! అరె! మీరు ఈ  “నీ అందం” ఎప్పుడున్నా చదివారా!!! (ఓ సారి వినిపించాలి!)

నా కెందుకో విచ్చల విడిగా బూతులు వాడుతూ తీసిన , షేక్ స్పియర్ మెక్ బెత్ ఇండియన్ ఏడాప్టేషన్ అని చెప్పుకుంటున్న – “మక్బూల్” కంటే,  ఈలాంటి స్టోరీ లైన్లతో ఎడాప్ట్ చేసి తీయడం చాలా కరెక్టు అనిపించింది. కావాలంటే, ఇంత తొక్కలో బూతులు లేకుండా కూడా ఈ సినిమాని ఇలాగే రియలిస్టిక్ గా తీయచ్చు. బై దవే, ఇది షేక్ స్పియర్ ఇంస్పిరేషన్ అని వాడు చెప్పాడోలేదు!  వాడు చెప్పింది చదవలేక పోయాను, ఎప్పుడన్నా చూసి చెబ్తాను. ఇది నా ఇంటర్ ప్రెటేషన్! కాకపోతే షేక్ స్పియర్ – స్త్రీ లకి మరీ  ఇంత తక్కువ చిత్రీకరణ చేసుండడేమో!  స్త్రీలని అందంగా కాకుండా సినిమా చూపిస్తే ఇంకేమి ఆర్ట్ అండి!?

అలాగే , స్టూడెంట్ సబ్జెక్ట్ ని హాండెల్ చేయడంలో, మర్డర్లని క్యాజువల్ గా జరిగినట్టు చూపించి షాక్ ఎఫక్టు హ్యండిల్ చేయడంలో –  “శివ” , “సత్య” ల రాముగాడి ఇంఫ్లుయన్స్ నాకైతే కొట్టొచ్చినట్టు కనబడింది.అంటే ఇది రివర్స్ లో వీడి ఇంఫ్లుయెన్సు వల్లే “సత్య” అలా ఉంది అని చెప్పొచ్చు. కానీ ఈ స్టూడెంట్ సబ్జెక్టు,దాని హ్యాండ్లింగ్ లో నాకు రాము ఇన్ఫ్లుయెన్స్ అనుబుద్దేస్తోంది.అంతే!

దీన్ని చాలా మంది “కాంటపరరీ ఇండియా” గా భావించడం చూసాను – కానీ నాకెందుకో ఇది పిరియడ్ మూవీ అని, అంటే జస్ట్ పోస్ట్ ఇండిపెండెన్స్ –  ప్రి / పారలెల్ టు ఇందిరా అని అనిపిచ్చింది!  మళ్ళా చూస్తే ఎందుకో చెప్పగలను. మరి వాళ్ళెకెందుకలా అనిపిచ్చిందో నాకు తెలీదు ; నిజమేదో మీరు చూసేటప్పుడు తెలుసుకోవచ్చు.

అలాగే రియాలిటీ గా ఉన్నా సినిమా, కొద్దిగా అన్-రియలిస్టిక్ గా ఉంటింది. ఈ భావాన్ని ఎలా చెప్పాలో నాకు తెలిదు. చాలా మంది మంచి డైరెక్టర్లు  తమదైన ఓ “రియలిస్టిక్ ఫ్రేమ్ వర్క్” క్రియేట్ చేస్తారు.   ( ఇప్పుడు బాపు సినిమాలో  బాపు “తెలుగుతనం” ఉందనుకోండి – అది ఖచ్చితంగా నిజమైన తెలుగుతనమే! కానీ అదీ కేవలం బాపు గారి తెలుగుతనం! డూ యూ గెట్ మై పాయింట్! అక్రాస్ బోర్డ్ తెలుగంతా అందులో ఉన్నా, ఉండదంతే! అలాగే “రాం బంటు” సినిమాలో రాజేంద్రప్రసాద్ అన్ రియలిస్టిక్ గా ఉంటాడు! రైట్! అలాగే కోట శ్రీనివాసరావు “జపాన్” అంటూ ఓ పాత్ర! ) ఈ సినిమాలో ఓ రెండు మెటఫరికల్ పాత్రలని ఆల్మోస్ట్ నాటకాల్లో వాడినట్టు అలాగే మెటఫరికల్ గా వాడేయటం కూడా ఈ అన్ రియలిస్టిక్ ఫీలింగ్ ని, సెట్టింగ్ ని తెస్తుంది.

కాకపోతే, కామన్ ఆడియన్స్ కూడా చూడాలని తీసినా, ఇంటలెక్ట్యుయల్ సినిమాని తీస్తాం అని చెప్పుకోవడానికి పోయే డంబాల వల్ల , సినిమాలు కాస్త అర్ధం కాకుండా తీస్తారు. వీళ్ళకి ఈ ఐడియాస్ ని మైయిన్ స్ట్రీమ్ సినిమాగా తీయడం రాక! నిజం! కావాలంటే ఇదే ఎటెంమ్ట్ ని నాకో చాన్సిస్తే, కృష్ణవంశీ చేత తీయిస్తాను! సూపర్ డూపర్ కమర్షియల్ మూవీ – విత్ ఎ పర్ఫెక్ట్ బ్యాలెన్స్! 🙂 ( ఆ మాత్రం గాడికి నేనెందుకు! అందుకే రివ్యూ రాస్తున్నాను :p  )

పోనీ మీరెప్పుడున్నా “మౌనరాగం” అనే మణిరత్నం సినిమా చూసారా! అందులో పాత్రలకి మణిరత్నం ఎంత డెప్త్ ఎలా ఇచ్చాడూ మీరు ఇంటలెక్ట్యుయల్  గా అర్ధం చేసుకున్నారా! మన కార్తిక్ కారెక్టర్ కి వెనకల ఎప్పుడన్నా చూసారా! చూడరు! పోనీ “యువ” సినిమా చూశారా! అందులో ఇంటకెక్ట్యుయలిటీ తెలిసిందా!  కానీ వీడు ఏదో పీకాట్టా! దాన్ని మామూలు జనాలు అర్ధం చేసుకోలేరుట! మామూలు కమర్షియల్ సిన్మాలా తీద్దామని ఉన్నా, అది వెరైటీగా ఎలా తీయాలో తీలీక వీళ్ళు ఇలా తీస్తారు.

నా ఉద్దేశ్యం శ్యామ్ బెనెగల్ సరియైన ప్రొడ్యూసర్స్ దొరిగితే, ఆయన సినిమాలు అలా తీసుండేవాడు కాదు. ఇంకా బాగా తీసేవాడు. కమర్షియల్ గా తీసేవాడు; లేకపొతే “జుబేదా” ని కమర్షియల్ ఫార్మేట్ కి దగ్గరగా తేవడానికి ఎందుకు ప్రయత్నించాడు!!?? ఈన ఏం కమర్షియల్ గా తీస్తాడులే అని, ఎన్ని సార్లు టీవీలో సినిమా వచ్చినా ఎందుకో లోపలికి వెళ్ళలేదు. కానీ లాస్ట్ మంత్ చూసాను. ఇట్స్ ఎ బ్రిలియంట్ పిరియడ్ మూవీ – సెట్ అగైన్ ఇన్ ది సేమ్ టైమ్ ఫ్రేమ్  ఐ మెన్షన్డ్ ; పోస్ట్ ఇండిపెండెన్స్! సరిగ్గా ఇంకొంచెం కమర్షియల్ గా తీయడానికి డబ్బులుంటే, ఇట్స్ ఎ సూపర్బ్ స్టోరీ లైన్ ఫర్ ఎ కమర్షియల్ మూవీ! అండ్ ష్యామ్ బెనెగల్ అలాగే తీసాడు ; ఎటొచ్చీ, ఆయన ఈ సినిమా తీసేనాటికి, సినిమా మేకింగ్ స్టైల్ ఇంకా ఖర్చుతో కూడుకున్నదై పోయి, ఆయన సినిమా పాత 1960 ‘s లోని కమర్షియల్ సినిమానే చూస్తున్నామా అనిపిస్తుంది కానీ, పిరియడ్ మూవీ చూస్తున్నాం అనిపించదు.

పోనీ కమల్ హాసన్ “దశావతరం” లో ఎన్ని షేడ్ర్స్ ఉన్నాయో తెలుసా!ఎంత ఇంటలెక్ట్యుయల్ డెప్త్ ఉందో తెలుసా! పైకి చూస్తే , ఇంగ్లీషు సినిమాలాగా ఏదో వైయల్స్ లోని వైరస్ నుంచి హీరో ప్రపంచాన్ని రక్షించడంలా కనబడ్డా, కమల హాసన్ కుతికి పది రోల్స్ వేసాడు అనిపించినా , ఇట్స్ ఎ ట్రూ లీ గ్లోబల్ ఇండియన్ ఇంటలెక్ట్యుయల్ కమర్షియల్ మూవీ! ఈ సినిమాని మీరు హిట్ అనరా! నేనైతే హిట్ అనే అనుకుంటున్నాను. నిజానికి ఇట్ డిజెర్వ్స్ మచ్ మోర్ దేన్ ది ర్వివ్యూస్ ఇట్ గాట్!

నా ఉద్దేశ్యం ఏంటటే – “ఇది ఇంటెల్ట్యుయల్ సినిమా జనాలు అర్ధం చేసుకోలేదు” అని చెప్పేవి నిజంగా ఇంటెలెక్ట్యుయల్ కాదు. వాళ్ళ కన్ఫ్యూజన్. అంతే! ఆ కన్ఫ్యూజన్ కి ఓ “ఆరా” చేరిస్తే, అలా భ్రమింప చేయొచ్చు. ఈ “భ్రమింప చేయిచ్చు” అన్నంత వరకూ ఈ క్రియేటివ్ బ్రెయిన్స్ కి బాగా తెలిసిన విషయమే! మీకు తెలియదూ – మీ కేమి తెలీయకపోయినా అవతల వాళ్ళాని అలా అనుకునేలా చెయ్యొచ్చు అని! ఇది అంతే!

ఇంతకీ గులాల్ హిట్ అయ్యిందా లేదా!? నాకు బానే ఉంది; ఇది ఇండియన్ “రియల్” స్టోరీ నే! చూడకపోతే ఓ సారి చూడండి.

ప్రకటనలు
Explore posts in the same categories: సినిమా రివ్యూలు

ట్యాగులు:

You can comment below, or link to this permanent URL from your own site.

3 వ్యాఖ్యలు పై “గులాల్ – లవ్…పవర్…రెవల్యూషన్”


  1. Why don’t you place this review/a view in navatarangam.com
    నేనూ ఈ సినిమా గురించి కొంత రాశా.
    http://navatarangam.com/2009/03/gulaal_review/


  2. “అలాగే రియాలిటీ గా ఉన్నా సినిమా, కొద్దిగా అన్-రియలిస్టిక్ గా ఉంటింది. ఈ భావాన్ని ఎలా చెప్పాలో నాకు తెలిదు.” ఈ భావాన్ని magic realism అంటారు.


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: