రెడ్డిరాకున్నా మళ్ళీ మొదలాడాలా!

అబ్రకదబ్రాగారూ, ఇంత రాతల తర్వాత మీరు ఈ ప్రతిపాదన తెస్తే, నేను మళ్ళా అంతా రాయాలా?  చెడుగుడు ఆడుకోండి అంటే మరీ ఇలాగా?

నేను భాషని, అభివృద్దికి, ఇన్నోవేషన్స్, ఠపీమని లింకేట్టేసెయ్యట్లేదు ; లింకు పెట్టుకుందామని, అలా కృషిచేయాలని అడుగుతున్నాను.

సరే! స్టోరీని రివర్స్ గేర్ లో మెల్లిగా చెప్తా . వినండి. చివర్లో మూడు కొత్త పాయింట్లు కూడా ఇస్తున్నాను.

ఇన్నోవేషన్స్ ఎలా జరుగుతాయి అంటే దానికి సూటిగా చేప్పే సమాధానం లేదు; IBM వాడు ఆ కష్టాల మీద యాడ్స్ వేస్తాడు . సింపుల్ గా చెప్పాలంటే మాత్రం “ప్రయత్నిస్తూ ఉంటే, ప్రయోగాత్మకంగా ఉంటే వస్తాయి” అని చెప్పవచ్చు; దానికి మనకి ఓ కల్చరల్ షిఫ్ట్ అవసరం; అలాంటి యాటిట్యూడ్ పెంచడానికి ( నిజానికి నిద్రాణంగా ఉన్న ఆ భావాన్ని నిద్రలేపడానికి అని రాయాలి) కాస్త ఙ్జానం పెంచే విధంగా, మేధావితనం పెంచే విధంగా ఏవో కొన్ని పనులు మనం చెయ్యాలి. ఇప్పుడు మేధావితనం  సమాజంలో లేదా అని అడిగితే “ఉన్నది”  అని నేను  చెప్తాను.; కాకపోతే, ఆ మేధవితనంతో అంతా ఇంగ్లీషులో కొత్తవి సృష్టిస్తున్నారు కానీ, తెలుగులో కాదు.

అసలు ఇన్నోవేషన్స్ రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది:

ఇవ్వాళ్టి రోజు, మన జీవన విధానం అంతా – తద్వారా మన సంస్కృతి అనబడేవన్నీ – ఇంగ్లీషులో వ్యక్తీకరింపబడిన ఆలోచనలవల్లే నిర్దేసించబడుతున్నాయి. పూతరేకులు, ముగ్గులు మన సంస్కృతి ఔతాయేమో గానీ, బర్గర్ లు, పబ్ లు “మన సంస్కృతి” అని ఎలా గర్వపడగలం చెప్పండి? అందుచేత, మన భాషకి, సంస్కృతికి ఎదుగుదల ఉండక, ఛాందసవాదులుగా తయారవుతాము; మెల్లి మెల్లిగా ఇంగ్లీషునుంచి వచ్చినవే మనకి మిగిలిపోయి, మన దంటూ ఏమీ మిగలకపోవచ్చు; చచ్చిపోయిన పూతరేకులు, అంబలి అంటూ హాయిగా కవితలు రాసుకోవచ్చు :). తెలుగులో అంతకంటే భావాలు వ్యక్తపరచరు. మనదిగా గుర్తించబడేవి కొన్ని మనం ప్రపంచంలోకి తొసి బతికించుకుంటూ ఉంటేనే మనది జీవభాష ఔతుంది. అంటే పాత ఛాందసవాద ఆలోచనలను ప్రపంచం ముందు పరచి, వాటిని తెలుసుకోమని అర్ధించటం కాదు; (అందులో గొప్ప తాత్విక చింతన ఉంటే ఉండొచ్చుకాక; అది వేరే విషయం; దానిలో గొప్పవిగా గుర్తించినవన్నీ ఆల్రేడీ – జాతీయం లాగా – ప్రపంచీయం ఐపోతూనే ఉన్నాయి, అవి మనవి అని చెప్పుకునే స్థితిలో మనం ఎలాగూ లేము) అందుచేత, మనం కూడా కొత్త ఆలోచనలు, కొత్త వస్తువులు, కొత్త తినుబండారాలు, కొత్త జీవన విధానాలు సృష్టించుకుంటూ, దాన్ని ఇతరులు ఫాలో అయ్యే అంత ఉన్నతంగా మార్చాలి; మనల్ని చూసి, ప్రపంచ దేశాలు –  ” భారతీయులు చాలా ముందునుంచీ ముందే ఉన్నారు; వాళ్ళని మనం అందుకోవాటానికి మరో శతాబ్దం పడుతుంది; అప్పటిదాకా వాళ్ళని మనం కాపీ కొడుతూనే ఉండాలి” అని అనుకునేలా ఎదగాలి. అందుకని మనం ఓ ఇన్నోవేటివ్ సొసైటీగా మారాలి.

అలాంటీ కల్చరల్ షిఫ్ట్ ఎలా వస్తుంది :

ముందుగా అలాంటి కల్చర్ ఇప్పుడు లేదు అని చెప్పలేం; అలాంటి యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు, ఇప్పుడు దారిలేక  ఇంగ్లీషులోకి మారిపోతారు; వారి జిఙ్ఞాసకి కావాల్సిన మెటీరియల్, కంటెంట్, థాట్ ముందు తెలుగులో దొరకదు; తరువాత డబ్బు, మార్కెట్టు దొరకదు; ఆ తరువాత తెలుగులో అమ్ముకోగలిగేది ఏంటేంటే – లస్ట్ అండ్ బ్లడ్ థర్‍స్ట్; కొంచెం ఇంటలెక్ట్యుయల్ గా ఏమన్నా విషయం కావాలంటే, కష్టపడి పరభాషల్లోంచి కాపీ కొట్టుకోవడం; ఇది మరింత “సృజనాత్మక దారిద్ర్యాని”కి దారి తీస్తూ పోతుంది. అందుకని ఆ ఇన్నోవేటివ్ స్పిరిట్ ని తెలుగులోనూ పెంపొందిచడానికి, ది సో కాళ్డ్ ఇంటలెక్ట్యుయల్స్ – తెలుగులో ఆలోచిస్తూ, చర్చించాలి.

ఇవ్వాళ్టి రోజు-  ఓ పేరుమోసిన ఆంగ్ల పబ్లికేషన్ లో ఓ కొత్త ఆలోచన పుడుతుంది; దాని రూపు రేఖాలు సంతరించుకొంటుంది; “మన సంస్కృతి” గా గుర్తించబడని మన సంస్కృతిలోనే ఇంగ్లీషులో అది పెరిగి పెద్దదవ్వచ్చు గాక, ఐనా చివరకి ఆ ఆలోచన మనది కాకుండా పోతుంది. అప్పుడు అగ్రదేశాలలో మార్కెట్ చేయబడుతుంది; దాన్ని ఒకటీ, రెండు రోజుల్లో దేశీ న్యూస్ ఛానెల్స్/ పేపర్లు ప్రచురిస్తాయి; దానికి మరో వారం లోపుగా ప్రాంతీయ భాషల్లోని మాధ్యమాలు, వాటిని- తప్పులు తడకలుగానో, సరిగానో తర్జుమా చేసి, లోకలైజ్ చేసి – ప్రచురిస్తాయి. – ఇదీ పరిస్థితి. ( సినిమాల్లో ఇది ఎలా జరుగుతోంది అనేది నేను మన సినిమా ట్యాగులో మళ్ళీ ఎప్పుడన్నా ఎలాగూ రాస్తాను); మీరు కావలంటే – ఓ ఐ-పాడ్, మరోటో ఎలా మార్కెట్ ఔతుందో, మొదటినుంచి సైకిల్ గమనించండి. లేదూ ఓ కొత్త ప్రపంచ ఆర్ధిక విధానం అనుకోండి! లేదూ ఓ కొత్త జన్యు శాస్త్ర పరమైన ఆవిష్కారం అనుకోండి!

మరి మన దగ్గర గొప్ప ఆలోచనలు ఎలా పుట్టాలి? ఎలా పెంపొందించ బడాలి? ఎలా అవి మనవిగా చెలామణీ ఔతూ ప్రపంచ రాజ్యమేలాలి? అందుకని ఆలోచన మన భాషలో పుట్టాలి; మన సంస్కృతిలో ఎదగాలి; మన నుంచి జనాలు తెలుసుకొని వెళ్ళాలి -పైగా దాన్ని డబ్బులిచ్చి మరీ కొనుక్కోవాలి సుమా!

మీరుదుహరించిన రష్యన్ – ఓ విధంగా ఫైల్డ్ కేస్, జర్మన్ -ఓ విధంగా సక్సస్ ఫుల్ కేస్, లేదా స్విట్జర్లాండులో, జపానులో, చైనాలో – నాకు తెలిసి,  వారి భాషలోకి ప్రతి విషయాన్ని తర్జుమా చేసుకొని,చేసుకొని అలసి పోతున్నారు. భాష మిగిలే ఉందిగా అని మీరు వాదించినా,  దానితో వచ్చే లోటుపాట్లు మీరు చెప్పడం లేదు. పైపెచ్చు వాళ్ళ ప్రభుత్వాల్లాగా మన ప్రభుత్వాలు ఏదో పీకట్లేదని ఎత్తిపొడుపొకటి. ఇదీ కూడా కాపీ వాదమే!

ఒక్కమాట చెప్పండి: మనంత డైవర్సిటీ ఉన్న చోట, మొత్తం 16 ప్రాంతీయ భాషలో ఎన్నో గుర్తించి, నోట్లమీద కూడా గుద్దుకున్న మన ప్రభుత్వాలకు – ప్రపంచంలో పుట్టే ప్రతి ఆలోచనని మన 16భాషల్లో తర్జుమా చేయడం సాధ్యమా? పోనీ అలా అని మన దేశభాషేగా అని హిందీని అధికార భాష చేయడానికి మీరు సిద్ధమా? లేక ప్రతి అధికారిక పత్రం – ఇంగ్లీషు, ప్రాంతీయ భాష, మరియూ హిందీలో ప్రచురించబడాల!? నేను సిద్ధంగా లేను.

నాకు ఈ దేశం “భిన్నత్వంలో ఏకత్వాన్ని” దర్శిస్తూ జీవించడమే ఇష్టం; ఆ భిన్నత్వం రాజకీయ మేధావులు తెస్తే, ఆ ఏకత్వాన్ని మిగిలిన మేధావులు తేవాలి. ఇదేమీ రూలు కాదండీ! – ఇది ఓ “అంగీకారత్మక దృక్పదం” ఐతే, ఇలా సాధ్యం అని చెప్తున్నాను; తెలుగువాడి ఉనికి తెలుగు భాష అని ముందు అనుకుంటే, మనం దాని ప్రాతిపదికన ఈ కల్చరల్ షిఫ్ట్ కోసం తీవ్రకృషి సలపగలుపుతాము; అలా తెలుగు బతకటం అనేది జస్ట్ ఓ సాహిత్య సాంస్కృతిక ఉద్యమం కాదు; ముందు ఓ “దృక్పదంలో మార్పు” ; ఆ తరువాత ఇదీ అదీ అని లేకుండా ఎన్నో ఆలోచనలు, చర్చలు, వింతలూ, కనుగొనటాలు, తయారు చేయటాలు రావాలి

అలా కాక,మనకున్న మళ్టిపుల్ ఐడెంటీస్ కోసం మనలోమనమే కొట్టుకు చద్దాం అంటే, అలాగూ ఒకే! ఐనా మనం అభివృద్ది ఎలాగోలా సాధిస్తాం లెండి. కానీ మనం ఈ అస్తిత్వాన్ని కోల్పోవచ్చు.

ఇప్పటికే దేశానికి ఓ అస్తిత్వం లేదుట – మనం గుడ్డివాళ్ళం. కుంటివాళ్ళం, రహస్యకుతిగాళ్ళం, హిపోక్రైట్లం, కులతత్వవాదులం, మతఛాందస వాదులం, నీచ రాజకీయల గాళ్ళం, భావ వైశాల్యం లేని వాళ్ళం, నపుసంక ప్రభుత్వం గల వాళ్ళం  – ఇలా మన బ్లాగ్లోకం అంతా ఇష్టం వచ్చినట్టు మనల్ని మనం కించ పరచుకుందాం; – కాకపోతే బ్లాగులతో తెలుగు వెలిగిపోతోంది అన్ని కళ్ళమూసుకుందాం. – అలా అన్నీ ఉన్నాయనుకునే – “సత్యం” మాయపోయింది;

ఎదో ఒకటీ ఎవరో ఒకరూ అభివృద్ది కోసం, ఎదుగుదల కోసం చేస్తునే ఉండాలి;

భాష చచ్చిపోయినా, సంస్కృతి అనేది చచ్చిపోయినా కొంపలేం అంటుకు పోవండి. నిజానికి మనకొక ఐడెంటీ, ఆ గుర్తింపుతో ఓ ఆత్మవిశ్వాసం కావాలి అంతే!

చివరగా కొన్ని కొత్త పాయింట్లిస్తాను :

1.ఇన్నోవేషన్సే నిజానికి అభివృద్దికే దారితీస్తాయన్న గ్యారెంటీ ఏం లేదు(రష్యానే ఉదాహరణ) అందుకే అసలు ఏ విధమైన మార్పునైన మనిషి ముందు ప్రటిఘటిస్తాడు; తను ఉన్న కంఫర్ట్ జోన్ లోంచి అంత త్వరగా మారలేక ఛాందసవాదిగా మారిపోతాడు. యువతకే ఈ మారే ధైర్యం, ఉత్సాహం, కొత్తదానికోసం తాపత్రయం ఉంటాయి. కాబట్టి యువత నడుం బిగించి కాపీకొట్ట కుండా ఆ “కొత్తదనం” తేవాలి.

2. అభివృద్ది అనేది గ్రాస్ డొమెస్టిక్ ప్రాడక్ట్ అని మాత్రమే మాట్లాడుకుంటే, ఇన్నోవేషన్స్ లేకుండానే మనం అభివృద్ది చెందు తున్నట్టు చెప్పవచ్చు;దారిద్ర్య రేఖలకి పైకి జనాలని తీసుకురావచ్చు. కానీ సంస్కృతి, ఆత్మ విశ్వాసాల ప్రశ్నలని అది సమాధాన పరచలేక పోవచ్చు.

3. పై రెండూ రాస్తున్నప్పుడూ ఈ మూడో పాయింటు గుర్తొచ్చింది – ఎవరో ఇన్నోవేషన్ ఇండెక్స్  గురించి ఆంగ్లంలో ఆర్ధికవేత్తలు ఆలోచిస్తున్నట్టున్నారు; అది స్టాండైజ్ అయ్యేదాక ఆగితే, ఆ తరువాత కుడా, ఆ ఇండెక్స్ ప్రకారం మనం వెనకబడ్డ దేశంగా గుర్తించబడి మళ్ళీ సిగ్గుతో చచ్చిపోతుంటామేమో ఆలోచించండి.

అందుకే ఇంకో పోస్టులో ఎక్కడో చెప్పాను – రూల్స్ ని మార్చే శక్తిగా ఎదగాలి అని ; 

(హా హా 🙂 నాకు ఇంకో అనుమానం వస్తోంది ; కొందరిలా ఆలోచిస్తున్నారేమో అని –
“నిన్నటి దాకా వీరు తెలుగు గుర్తింపు అంటే TDP అనుకున్నాం –
మధ్యలో హిందూ థాట్ అన్నారు  సరే బిజేపీ అనుకున్నాం –

ఇప్పుడు రూల్స్ మార్చే శక్తి అంటున్నాడు – లోక్ సత్తా అనుకోవాలా? “

హా  హా 🙂  కాదండి; రేరాజ్ రాజకీయం చేయరు;  రేరాజ్ రివ్యూస్. అంతే!
అందుకే “భిన్నత్వంలో ఏకత్వం” అని పాత మాటే చెప్పారు. నిజానికి అంత సృజనాత్మకతని ఇంకా ప్రదర్శించలేకే , రేరాజ్ రివ్యూస్.
( …..ఐబాబోయ్ అది కాంగ్రేస్ భాష కాదండీ ఇప్పుడూ!)

ప్రకటనలు
Explore posts in the same categories: Uncategorized

ట్యాగులు:

You can comment below, or link to this permanent URL from your own site.

8 వ్యాఖ్యలు పై “రెడ్డిరాకున్నా మళ్ళీ మొదలాడాలా!”


 1. Would you gimme ur email plz, if u have no objection?

 2. Srikar Says:

  *యువతకే ఈ మారే ధైర్యం, ఉత్సాహం, కొత్తదానికోసం తాపత్రయం ఉంటాయి. కాబట్టి యువత నడుం బిగించి కాపీకొట్ట కుండా ఆ “కొత్తదనం” తేవాలి.*

  ఒక్కప్పుడు నేను మీలాగే అనుకుంట్టుండే వాడిని కాని నాకు తెలిసి ఈ కాలం లోని యువత అంత వెన్నెముక లేని వారిని నేన్నెక్కడా చూడ లేదు. వాళ్ళు తీసుకొచ్చిన/తిసుకోవచ్చే మార్పు ఎమిటి?

 3. అబ్రకదబ్ర Says:

  నేనన్నది భాషకీ వృద్ధికీ పెద్దగా సంబంధం లేదనే చిన్న ముక్క; ఇచ్చింది దానికి రెండు బుల్లి ఉదాహరణలు. మీరు దాన్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్లి ఏదేదో చెప్పారు. పన్లో పనిగా నేనేదో వేరేవాళ్లతో పోలిక పెడుతున్నానని, నాదీ కాపీవాదమేననీ అభాండాలు! మరోసారి నా క్రితం కామెంటుని వివరంగా చదవండి.

 4. rayraj Says:

  @Srikar : “ఈ కాలంలోని యువత..” అని అంటున్నారు అంటే, మీరు యూత్ స్టేజ్ దాటిపోయారని నాకర్ధమౌతోంది.
  కానీ మీరు పొరబడుతున్నారు – వెన్నుముక కలిగిన వీరులు, ధీరులు – సైన్యం కోసం కావాల్సిన యూత్; నాకు చాలా ఫ్లెక్సిబిల్ గా , హార్మనీలో “డాన్స్” చేయగల యువత కావాలి 😉 – ఇంకోటి యవ్వనం వయస్సుకు సంబంధించింది కాదు; మనసుకు సంబంధించింది; “ఈ నాటి యువత చెడిపోయింది, మా అప్పుడు…” అని చెప్పిన మరుక్షణం మీరు గ్రహించాల్సిన విషయం ఏంటో తెలుసా : ముసలితనపు ఛాయా మీకొచ్చేసింది అని 🙂

  యువత మార్పుని కోరుకుంటారు; తాపత్రయపడతారు ; కానీ ఏ మార్పుని కోరుకోవాలో చాలా సార్లు వాళ్ళకి తెలీదు.ఓ రోజుకి ముసలితనం వస్తుందని, అప్పుడు మన సంతానం యూత్ లో ఉంటారని, ఈ క్షణాన్ని ఎంజాయ్ చేసినా,ముసలితనం ఎంజాయ్ చేయడానికి ఇవ్వాళ్టి నుంచే కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలని యూత్ అంతా ఆలోచించదు. ఆలోచించాలని రూల్ కూడా లేదు!

  చివరగా : పెద్దవాళ్ళు చేయాల్సింది ఏంటి? మామిడి పిందెలు నాటటం; తమ పిల్లల యుక్తవయసు వచ్చేసరికి, అవి మామిడి చెట్లయ్యి, వారికి మామిడిని దొరికేలా చేయటం – ఆ కధ మీకు తెలిసే ఉంటుంది; ఆ పేదవాడు ఆ రాజుకి ఈ విషయం చెప్పి, “నేను తినటానికి ఈ మామిడి పిందని నాటంటం లేదు, రాజువైన నువ్వూ అలాగే చెయ్యాలి” అని బోధించడం. ఆ పిందెలు నాటిని “పేద” వాడికి తెలుసు, నాటిని ప్రతి పిందె మొలకెత్తదని, చివరికి చెట్టుగా అవ్వదని; ఐనా చేస్తాడు. ఎందుకు? – హీ ఈజ్ ది ఇంటలెక్ట్యుయల్. కాతే, ఈ కధలో నాకెప్పుడూ ఓ సమస్య ఉంది – యుక్తవయస్సులో పిల్లలకి మామిడి నచ్చకపోతే? అని – “ఆ వాళ్ళే దాన్ని నరికి ఏదో ఓటి చేసుకుంటారూ, నాకెందుకూ?” అని ఆ పేదవాడు తన పని చేసేస్తాడేమో!

  @అబ్రకదబ్ర :అయ్యో! అబ్రకదబ్రాగారూ – పోస్టులో ఉన్న మీరు నాకు జస్ట్ ఓ ఆలంబన మాత్రమే! ఆ మాత్రం అర్ధం చేసుకోలేని అమాయకులనుకోలేదు.

  మీరు చెప్పిన చిన్న ఉదాహారణ మీద,ఓ పెద్ద పోస్టు ఇదువరిలోనే వేసేసిన పెద్దవారున్నారు;చెప్పానుగా -పెద్దవారెవరూ వచ్చి నాతో ఏకీభవించడం కానీ, విభేధించడంగానీ చేయట్లేదు;చేస్తే,నేనన్నా మారతాను; వాళ్ళనన్నా మారుస్తాను.

  ఐనా పెద్దవాళ్ళని వదిలేయండి.మీ వయసుతో నాకు నిమ్మిత్తం లేదు; నాకు మీరు యూత్ ఫుల్ గానే కనిపిస్తున్నారు. మీకు ఇంత నా కంఠశోష – కాదు నా ఈ టేపుశోష నచ్చిందా లేదా? డు యూ అగ్రీ విత్ మీ ఆర్ నాట్!

  ఒకవేళ అగ్రీ ఐతే, మీరున్న దేశంలో, మీకుండే పలుకుబడిలో మీరు ఈ మార్పుకు చేయగల “కృషి” ఏదో నేను చెప్పక్కర్లేదు; మీకే మీరు నిర్ణయించుకోగలరు. అలాగే మీ విశ్లేషణల, గోడుల చివరి వాక్యాలు, కంక్లూడింగ్ లైన్స్ లో ఏ మార్పుని కోరుతున్నానో మీకు తెలిసిపోతుంది.

  అభాండాలు కాదండి; ఇది అభిమానం; ఈ మార్పు మీరు తేగలరేమోనన్న ఆశావాదం.

  ఒకవేళ మీరూ పెద్దవారే ఐతే, మళ్ళీ చెబ్తున్నాను – క్షమించండి; ఓ పెద్దవారు నా బ్లాగులో ఇంత ముక్కవేసినందుకు, ధన్యుడిని.

 5. R Says:

  chaala baaga vishlesinchi vrasaaru…

 6. rayraj Says:

  @అబ్రకదబ్ర : ఖచ్చితమైనా సమాధానం ఇస్తున్నాను – “ఇండియాలో ఇంగ్లీషుతో మాత్రమే మనషి అభివృద్ధి చెందగలడు.”

  ఇంకో తోక :” అదే ఇండియా కి స్ట్రాంగ్ పాయింట్ కూడా అయ్యి, ఇవ్వాళ్ళ ఐటి రంగంలో ఈ మాత్రం కాసేపు వెలిగాము ” (ఆరిపోతున్నామేమో తెలీదు!);(విశ్లేషణ ఇక మీరే చేసుకొనమని వదిలేస్తున్నాను.కానీ ఇంత ఆశ పెట్టుకొని, ఇప్పుడు మనసు మార్చుకోవటం, కొంచెం నాకు కష్టంగానే ఉంది 😦 )

 7. అబ్రకదబ్ర Says:

  సారీలొద్దు బాబూ 🙂 నేనంత పెద్దోడిని కాదు.

  కొన్ని సార్లు మీ టపాలు మరీ random thoughts లా అనిపిస్తుంటాయి. ఎట్నుండి ఎటెటో ఎగిరెళ్లే ఆలోచనల సమాహారంలా అనిపిస్తుంది. లేదా, వాటిని అర్ధం చేసుకోవటం నాకు చేతనవటం లేదు. సమయాభావం వల్ల నేను ఎవరి టపాలనైనా చాలా వేగంగా చదివెయ్యటానికి ప్రయత్నిస్తుంటాను. So, most of the times I miss what’s between the lines. కొంత పొడుగు తగ్గించి, టపాకి ఓ విషయమ్మీదనే దృష్టి పెడితే మీనుండి అద్భుతమైన వ్యాసాలు రాల్తాయని నా అభిప్రాయం.


 8. అవును మహేష్, నేను క్రిస్టియానిటీ గురించి చదవలేదు.. అక్కడక్కడ చూసిన సినిమాలు, ఇంటర్నెట్ లో చదివిన ఆర్టికల్స్ తప్ప.

  అయినా ఒకమతంమీద, వారి నమ్మకాలమీద విషంకక్కే ఆర్టికల్స్ రాయడం వల్ల నాకొచ్చే లాభం నాకు ఏదీ కనిపించటంలేదు.

  ఇప్పుడు నాకోసందేహం, మీరు “రామాయణం జరిగిందా?” “రాముడుకి సీత ఏమవుతుంది?” “భారతదేశం సెక్ష్ కోసం తపించి పోయే దేసం” ఇలాంటివి వ్రాయడంవల్ల, పాఠకులకు ఏమి చెప్పదలుచుకున్నారు? హిందూమతము, భారత దేశము ఒట్టి దండగ, వేరే మతాలు పుచ్చుకొని వేరే దేశాలకు వెళ్ళమనా? లేక హిందూ మతము, వారి(మీ) దేవుళ్ళు, వారి ఆచారాలు సుద్ద దండగనా? ఇలాంటి టపాలు ఎవరిని ఉత్తేజ పరచాలని? మీ కార్యాచరణ ఏదో మీమాటల్లో వినాలని కోరిక.

  ఇంకోమాట సెక్స్ గురించి, ఒక అందమైన అబ్బాయో, అమ్మాయో కంటికింపుగా కనిపించిన తరువాత కూడా మనకు ఏమీ కలగలేదంటే కొజ్జా అంటాము. అలాగే మీరన్నట్టు మనదేశం లో సెక్స్ అంత బహిరంగ చర్ఛ కాదు, దీన్ని బహిరంగ పరచి westren countries లో లాగా 13 సంవత్సరాలకే ఆడపిల్లలకి అబార్షన్ రైట్ చట్టబద్ధం చేద్దామా?


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: