I think, therefore I am

పర్ణశాల తెలుసు పుస్తకంలో  విషయానికి, అందులోని కామెంట్లకి నా  తిరగ మో(రా) త:

1.విశాలాంధ్ర, నవోదయ, ఎమెస్కో లు – వాటి స్థాపనలోనే – ఈనాటి బుక్ మాల్స్ లాంటి దృక్పదాలతో స్థాపించ బడలేదేమో! వాటి ఆలోచనలోనైనా అవి కొనసాగగలగాలి, లేదా వాటి ఫిలాసఫీ అవి మార్చుకోవాలి. అంటే – మారాల్సింది పబ్లిషర్స్; అమ్మే కోరిక వాడికే లేకపోతే, తెలుగువాళ్ళ మీద పడి ఏడవటమేమిటిట!  కాబట్టి: తెలుగులో పుస్తకాల పబ్లికేషన్స్ వ్యాపారానికి – “పెద్ద పెట్టుబడితో దిగుదాం అనుకునేవాడికి చాలా స్కోపు ఉంది”. దేర్ ఈజ్ నో సీరియస్ కాంపిటీటర్!
( ఓ చిన్న చీలిక : ఈ స్కోపు ను కనుక్కోవటం అసలు ఒక MBA  స్టూడెంట్ ప్రాజెక్టు విషయం అవ్వచ్చు. రెండో సంవత్సరం MBA చదువుతున్న వాళ్ళు సీరియస్ గా చేయదగ్గ ప్రాజెక్టు; మరి దీనికి ఖర్చు లైయ్యేట్టైతే – ఆ పైన చెప్పిన పబ్లిషర్స్ వీళ్ళను ఫైనాన్స్ చేస్తారా!!?? )

2.అసలు కొని చదివే అలవాటు తెలుగువాడు ఎందుకు చేసుకోవాలి? వాడి అలవాటు అది కాకపోతే :
అ) వాడి అలవాటుకు తగినట్టు ఎలా అమ్మాలో ఆలోచించాలి.
ఆ) వాడికి అలవాటు అయ్యేట్టుగా చెయ్యాలి.
ఈ గుల ఎవడికి ఉండాలి – అమ్మేవాడికి ఉండాలి.

౩) “అసలు కొనే అలవాటు లేదు” అనేమాట కొద్దిగా మీరే కాంట్రడిక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే – ఇంగ్లీషులో ఐతే వీడు కొంటాడని మీరే చెప్పారు! అలాగే పేపర్లు, వీక్లీలు; కాబట్టి వీడు కొనేవాడే. అమ్మేవాడి దగ్గర అసలు సరుకు లేదేమో! ఔను మరి – నేను చెప్పేది అది; అనువదించి ఇచ్చే పుస్తకానికి, తెలుగులో ఎందుకు చదవాలి?  నేను(తెలుగువాడు) ఇంగ్లీషులోనే కొనుక్కుంటున్నాను. తెలుగులో ఉన్నదంతా చెత్త అనువాదం; “అసలు ఆలోచన” తెలియని, మక్కీకి మక్కీ ట్రూ ట్రాన్స్ లేషన్స్!!!.

4.) “ఈ- బుక్” కేవలం ఒక ఆప్షన్. అందరికీ అది నచ్చదు – దీన్ని కొందరాల్రెడీ ఏకీభవించారు. కాబట్టి నేను విభేదించి చెబ్తున్నాను 😉 : ఈ – బుక్ మంచి ఆప్షనే. పుస్తకానికంటే తొందరగా (తొందరగా మారిపోగల నేర్పున్న తెలుగువాళ్ళు) ఈ- బుక్స్ కి అలవాటు పడతారు. కాబట్టి,  సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ బిజినస్లో ఉన్న తెలుగువాళ్ళు ఎంత తొందరగా ఆ కిండిల్ ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి, ఎంత తొందరగా తమవైన  “తెపలకలు” , “ఈవాచకాలు”  “ఈతెచదువర్లు” తయారు చేస్తారో, అంత తొందరగా లాభపడగలరు!
( కిండల్ యూజర్ ఇంటర్ ఫేస్ కన్నా, తెలుగువాడి అభిరుచికి దగ్గరగా, తెలుగు అభిరుచిని పెంచు విధంగా మనదైన ఇంటర్ ఫేస్ తో మనం ఒక ప్రాడెక్టు చేసుకోవాలి -అది సరిగ్గా చేస్తే, దక్షిణ భారత మరియు (గుండ్రటి లిపి ఉన్న ఇతర భాషలకు) దగ్గరగా చేస్తే మంచిది. ఇది ఇంజనీరింగ్ కాలేజీల్లో చేసుకోవాల్సిన ప్రాజెక్టు! ఫండింగ్ ఎవరు చేయాలంటే – రియల్ ఎస్టేటులో దొంగ డబ్బు సంపాదించే సాఫ్ట్వేర్ కంపెనీలే కాదు – నిజమైన సాఫ్ట్వేర్ కంపెనీలు; డిఫెన్స్ ప్రాజెక్టుల మీద కాలం వెళ్లదీస్తున్న ఎలక్ట్రానిక్ కంపెనీలు! మనకి ECIL X రోడ్స్ చుట్టుపక్కల ఎన్ని పనికిమాలిన ఎలక్ట్రానిక్ కంపెనీలు ఆలోచన రహితంగా కాలం వెళ్ళ బుచ్చుతూ, SSI  యూనిట్ల కింద కోటానుకోట్ల బ్యాంకు రుణాలను వృధా చేస్తున్నాయా తెలుసా మీకు!!)

మీరు లాంగ్వేజి స్టూడెంటు;అందుకని మీకు అన్నీ “భాష”లో మాత్రమే తప్పులు కనిపిస్తాయి; నాకు అన్ని “ఆలోచనలు” నశిస్తున్న సంఘం కనిపిస్తుంది; దానికి కారణం : అమెరికన్ డామినంట్ పారడైమ్ అంటాను నేను. దాని హెజిమనీ! లో జరుగుతున్న “oppression on mind” = “అణిచివేత” అంటాను నేను.

5.రీ-సైకిల్ పేపర్ ని వాడి,  ఖర్చు మరియు బరువు తగ్గించవచ్చు; బరువు తగ్గిస్తే ట్రాన్స్ పోర్టు ఖర్చులు కూడా తగ్గుతాయేమో!!( ఓ పక్కన మన పేపరు బాలేదు అన్నారు! ఆల్రెడీ రీసైకిల్ పేపర్ వాడుతున్నామేమో! )

ఇవన్నీ కాక ఇంకా కొన్ని చెప్పనా!

మీ దగ్గర అనానిమస్ కామెంటేసిన మనిషి పబ్లిషర్ ఐతే, అసలు వారు కావాలి నాకు. నా గెస్ కరెక్టు ఐతే – వారమ్ముతున్నది “అనువాద”  తెలుగు పుస్తకాలు; తెలుగు పుస్తకాలు కాదు.
“రెండువేల కాపీలు అమ్మడానికి  2-5 ఏళ్ళు పడుతుంటే” అని అడగటానికి సిగ్గులేదు – ఇట్స్ బాడ్ సేల్స్ మాన్ షిప్. అమ్ముకోవటం రాకపోతే వ్యాపారంలో ఎందుకున్నారంటాను నేను.

అ)  సినిమా ధియేటర్లలో  పుస్తకాలు అమ్మకూడదు అని రూలేమన్నా ఉందా!! అక్కడికి వచ్చేంత తెలుగు మాస్ జనం ఎక్కడికీ రారు; ఎందుకు అక్కడ స్టాల్స్ పెట్టే ఆలోచన చేయలేదు!!?? కనీసం “మాల్స్” లో పెడుతున్నా మీకు ఐడియా రాలేదా! మీకంటే మొక్కజొన్న “కప్పు” లమ్ముతున్న వాడు నయం! ఠపీమని కాపీ కొట్టాడు.

ఆ) రైళ్ళల్లో, బస్ స్టాండుల్లో – ఎన్నో చిన్ని చిన్ని “ఇంగ్లీషు” పుస్తకాలను (ముఖ్యంగా పిల్లలకోసం అని) మోసుకుంటూ తిరుగుతూ అమ్ముతున్నారు జనం; Rs.40 కి పైరేటెడ్ మూవీ సీడీస్ ని పోలీసులనుంచి తప్పించుకొని అమ్ముతున్నారు జనం; “తెలుగు” పుస్తకాలని అలా అమ్మలేకపోయారా!!!! వీక్లీని, న్యూస్ పేపర్లని చేతిమీద వేసుకొని అమ్ముతున్న ఆ పేదజనం తో మీ పుస్తకాలను అదే యాభే రుపాయలకి ఎందుకు అమ్మించ లేదు అని అడుగుతున్నాను నేను.

(అరే! రోడ్ షోస్ అని, మొబైల్ సేల్స్ అని – బ్యాంకులు, ఇన్సూరెన్స్ లు, సెల్ఫోను కంపెనీలు, ఒకటేమిటి ప్రతి వాడు రోడ్డు మీద కూర్చొని అమ్ముతుంటే – మీ తోటీ పేపర్లు, వీక్లీలు రోడ్డు మీద కుర్చొని అమ్ముతుంటే – మీకేంటి నామోషీ! స్టాల్స్ కావాలిట స్టాల్స్ – అక్కడ కొనేవాడు తెలుగువాడు కాదు. తెలుగు అభిమాని అంతే! అది గుర్తు పెట్టుకోండి.)

ఇ. రవి “అలవాటు” చేయించిన వ్యక్తిగతమైన ఆలోచనని, మీరు వ్యాపార దృష్టితో ఆలోచించి అలవాటు చేయించే ఐడియాలు ఎందుకు చేయలేదు. దానికి ఐడియాస్ కావాలా :

a. అర్చీస్ ఓ లవర్ రాసిన సుదీర్గ ఉత్తరాన్నే గిఫ్ట్ ఐటమ్ కింద అమ్మే ప్రయత్నం చేస్తుంటే – మీ పుస్తకాలను అలాంటి ప్రతి గిఫ్ట్ షాప్లో ఓ షెళ్ఫ్ స్పేస్ అమ్మించే ఏర్పాటు ఎందుకు ప్రయత్నం చేయలేదు. (నా దృష్టిలో ప్రతి ఊళ్ళో ఓ 10 గిఫ్ట్ షాపులున్నాయి గానీ, ఓ ఐదు పుస్తకాల షాపులు లేవు; ఉన్న పుస్తకాల షాపులు – టెక్స్ట్ బుక్స్, స్టేషనరీ అమ్ముతున్నాయి అంతే! ఇది కూడా MBA  స్టూడెంట్స్ ప్రాజెక్టు పర్వ్యూలోకి వస్తుంది)

b. కనీసం “కాఫీ” టేబుల్ పుస్తకం  అనుకోండి అంటూ ఏ స్టార్ హోటాళ్ళలోను, మరి పలు ప్రదేశాలలోనో, కనీసం గవర్న్మెంట్ నడిపే విమానాల్లో, అధమంలో అధమం ఎపిటూరిజమ్ బస్సుల్లోనో ఎందుకు “తెలుగు” పుస్తకాల గురించి మీరు ఇవ్వలేదు! ఇచ్చుంటే అబ్రకదబ్ర అలా అందరిని అడిగివారా!!!!
……………….(ఇంకా చాలా చాలా ఉన్నాయి; ఉంటాయి)……………………………………………….

నేనొక్క విషయం చెప్పనా – చచ్చిపోయింది “ఆలోచన” ; బతికున్నది – “అనువాదం”; ’ఆలోచన లేనిదే మనుగడ లేదు’ – మీ శేఖర్ కపూర్ కాపీ కొట్టింది ఓ ఫేమస్ ఫిలాసఫిల్ స్టేట్మెంట్ – ” ఐ థింక్ దేర్ ఫోర్ ఐ యామ్ ” ; భారతీయ – కాదు,  ప్రాచ్య తత్త్వచింతన దీన్ని ఎప్పుడో దాటి ముందుకు వెళ్ళిపోయింది మహేష్……కనీసం మళ్ళీ ఆ ఆలోచన పధాల గుండా వెళ్దాం – ఈ సారి “మాట్రిక్స్” మరో ఫలితం ఇవ్వచ్చు.

మళ్ళీ చెబుతున్నాను; తెలుగు ఆలొచిస్తేనే తెలుగు మనుగడ ఉంటుంది. ముందు కావాల్సింది కొత్త “ఆలోచనలు”; అవి వస్తే, పుస్తకాలు వస్తాయి; అమ్మకాలు వస్తాయి. కొత్త ఆలోచన లేని చోట – ఎవరి అభిరుచికి తగ్గ పుస్తకాలు వాళ్ళకి దొరికేలా ఎలా చేస్తాం! అసలు “అభిరుచు” లను ఎలా తయారు చేస్తాం!  – అదిగో అక్కడే డామినంట్ పారడైమ్ ని ఎదిరించాలని ప్రయత్నించి,  విఫలం ఔతున్నాం. అమెరికన్ ఆధిపత్యాన్ని ఎదిరించి, వాళ్ళను అణచి, మన తెలుగు గెలుస్తుందనుకుంటున్నారా!!!! లేక వాడు చేసినవన్నీ మనం చేయగలమా! మాల్స్ లో పెడుతున్న పుస్తకాల షాపుల బిజినస్ మోడల్స్ తెలిసే మాట్లాడుతున్నారా మీరు! ఎన్ని కోట్ల జనాభాలో ఎంత మంది ఫాఠకవర్గం ని అంచనా వేసి వాళ్ళు ఆ మోడల్ ఎంచుకున్నారో ఆలోచిస్తునారా! మన పది కోట్లలో తెలుగుచదువుతున్న మనుష్యుల మార్కెట్ ఎంత!

“చరిత్ర పునరావృతం ఔతుంది” అని చరిత్రకారుని భాష!….ఆలోచిస్తే………ఇంత వరకు చరిత్ర పునరావృతం అవ్వలేదు సుమీ!…..మరి పునరావృతం ఔతుందని ఎందుకు చెప్పాడు ఆ చరిత్రకారుడు…………………మీరే ఆలోచించుకోండి!
____________________________________________________________

P.S. పబ్లిషర్ ఎవరన్నా చదువుతుంటే :
నా పరుష పదజాలం ఒకసారి ఇలా కుదిపి, తట్టి లేపడానికి మాత్రమే సుమీ! చాలా మంది మనలో పబ్లిషర్స్, కేవలం కొన్ని ఉత్తమ లక్ష్యాలతో మాత్రమే పబ్లిషింగ్ లో దిగారు అని నాకు తెలుస్తునే ఉన్నది. కాబట్టి వ్యక్తిగతంగా తీసుకొని కలత చెందవద్దు; తెలుగు వాణ్ణి తిట్టుకొని నష్టపోవద్దు; మీరే ఆలోచించాలి; మీరే తెలుగును నిలబెట్టుకోవాలి అనేది నా అభిమతం; పోతే, నేను చెప్పే ఐడియాలు “అన్నీ ఒరిజినల్” అని మాత్రం నా ఉద్దేశ్యం కాదు; ఆల్రెడీ చెప్పాను – అంత సృజనాత్మకత ప్రదర్శించలేకే “రేరాజ్” రివ్యూస్ అని  🙂 ;

వ్యాపారంలో ఉన్నవారికి వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. మిగిలిన వారి కోసం చెబ్తున్నాను- ఆలోచనలలో వైవిధ్యం (డైవర్సిటీ) అవసరం; ప్రతి ఆలోచన కావాల్సిన ఫలితం ఇవ్వదు; అప్పుడే మనం ర్యాండీ కోమిసర్ లాంటి, యండమూరి “విజయానికి ఐదు మెట్లు” పుస్తకాలలోంచి, ఛాలెంజ్ లాంటి సినిమాలలోంచి స్ఫూర్తి  పొందాలి; ముందుకు అడుగేయాలి.

మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ కి ముందు సుమారు ఓ 80 ప్రోటో టైప్స్ చేసారుట! మనకి అలాంటి కంపెనీలు లెవ్వు కాబట్టి, మనం ఓ 80 కంపెనీలు ముంచిన పర్లేదేమో! మన ప్రభుత్వం ఖచ్చితంగా అందుకు సహకరిస్తుంది అని నా నమ్మకం 🙂

ప్రకటనలు
Explore posts in the same categories: బ్లాగుల గురించి

ట్యాగులు:

You can comment below, or link to this permanent URL from your own site.

12 వ్యాఖ్యలు పై “I think, therefore I am”

 1. rayraj Says:

  ఏమర్ధంకాలేదండి కిరణ్ గారు! టైటిలా! –

  René Descartes most famous statement is: Cogito ergo sum (English: I think, therefore I am; OR I am thinking, therefore I exist), …

  దాన్ని కాంటెక్స్ట్ కొంచెం వేరే ఐనా – దాన్ని మార్చుకున్నాను అంతే!
  “ఆలోచన లేకపోతే అస్తిత్వం లేదు” అని మార్చైనా పోనీ!

  కాపీలు కొట్టి కొట్టీ మన సమాజం కుళ్ళి పోయిందండీ! సొంత ఆలోచన లేదు; అన్నీ అక్కడలా ఉన్నాయి కాబట్టి, ఇక్కడా అదే పరిష్కారం అంటారు; అంతే గానీ, మరి ఆ పరిష్కారం వాడేమి ఆలోచించుకొని తెచ్చుకున్నాడో, ఎలా ఆ పరిష్కారానికి వచ్చాడో ఆలోచించుకోరు;

  మన సమస్యలకి మనమే పరిష్కరించుకుంటే దానికి చాలా విరుగుడు ఉంది. ఓ ఫేమస్ మ్యానేజ్ మెంట్ గురూ ఓ చిన్న విషయం చెప్పి, దానికి బోళ్డు రీసెర్చ్ అంటగట్టి మరిన్ని కోట్లు, పేరు గడించాడు; వాడేంచెప్పాడో తెలుసా – కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి డిస్ట్రిబ్యూషన్ MNC స్టైల్లో ఉండ కూడదు; “ముంబై డబ్బావాలా” లాగా ఉండాలి అని.
  ఒక్క సారి మళ్ళీ కళ్ళు తిప్పి చూడండి : ఆ మాటలో నిజం తెలుస్తుంది.పెద్ద పెద్ద కంపెనీలు దాన్ని ఆచరిస్తున్నాయి అని తెలుస్తుంది.అలాగే మన వాళ్ళు అలాగే ఏళ్ళ తరబడి చేసుకొచ్చారు అని తెలుస్తుంది.

  కాకపాతే, ఆ వ్యాపారాల్లో మనం ఇంటలెక్ట్యుయాలిటీ చూడలేక, చూపించలేక “మనవైనవి” అలాంటి పద్దతుల్లో అన్నీ అమ్మే ప్రయత్నం చేయలేకపోతున్నాం. పై పెచ్చు అలా అమ్ముడైనవాటిమీద చాలా చిన్న చూపు కూడాను! అప్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి?- అది వేరుగా చెప్పుకుందాం; దానికి పుస్తకంలో “విలువ” కనపడాలి – దాన్ని ఎలా సాధించాలి అనేది – చదువరి(Erratta:This is supposed to be Duppala Ravi of Chaduvu fame – మీరు చదివారా? ) గారు మరో వ్యాసం సంపాదించాక తిరగమో(రా)త వేద్దాం అనుకుంటున్నాను.

  oops!అర్ధమైనట్టుంది – 🙂 హా! నా రచనలు పబ్లిష్ అవ్వాలనే కోరిక నాకు లేదండి 🙂 తెలుగువారి రచనలకు డబ్బు ఎలా? తద్వారా తెలుగు ఎలా బతకాలి ఇలాంటివి నా ఆలోచనలు;

  ప్రభుత్వం తెలుగుని రక్షిస్తుందని నాకు ఆశ లేదు.అసలు ప్రభుత్వం రక్షించాలన్న కోరిక లేదు; రక్షిస్తే మంచిదేననకోండి; కానీ, ప్రజలే ఎలా దాన్ని కాపాడుకోవచ్చు అనేది నా ఆలోచనలు! అంతే!
  ఓపెన్ సోర్స్ సిస్టమ్స్ లాగా, తెలుగును కాపాడుకోవచ్చండి; దాన్ని సంస్కృతంలాగా చట్రాల్లోకి ఇరికించకూడదు అని నా ప్రగాఢ విశ్వాసం.


 2. రేరాజ్ గారూ, ఫ్రెండ్‌షిప్ కొద్దీ అడుగుతున్నా..What exactly are you saying? Of course, it is confusing as usual!

 3. rayraj Says:

  నిజాయితీగా – ఇందులో గందరగోళం ఏమిటో నాకు తేలీటం లేదు; కానీ మిమ్మల్ని తప్పు బట్టను; ఐ విల్ ఫైండ్ ఎ బెటర్ వెంటింగ్ అవొకేషన్! 🙂

  ఇక ప్రొఫెషన్ – చెప్పలేను 🙂 ఐనా ఇది మరీ డామిజింగ్ క్వశ్చన్! నా ఉద్యోగంలో నేను బానే రాణిస్తున్నాను; ఆ పనులు పక్కన బెట్టి ఈ పన్లో బడ్డాను; ఇప్పుడు ఏలాగూ నా పనులు నన్ను పిలుస్తున్నాయి; త్వరలోనే, ఓ పెద్ద పాజ్.సో యూ విల్ హావ్ వన్ డౌన్ ఇన్ యువర్ రీడింగ్ లిస్ట్.

  ఐనా మీరు వచ్చి చదివారు చూడండి – ఐ లైక్ దట్! థాంక్యూ! 🙂 ఇందులో విషయం ఉంది – ఇవి “ఒరిజినల్ థాట్స్” 🙂 నమ్మితే చదవుకోండి.


 4. Good thought process…! I agree with you.
  మన ప్రభుత్వాల నుంచి ఏమీ ఆశించొద్దండీ..!

  “మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ కి ముందు సుమారు ఓ 80 ప్రోటో టైప్స్ చేసారుట! మనకి అలాంటి కంపెనీలు లెవ్వు కాబట్టి,…”
  నాకెప్పుడూ ఒక డౌటు…, మన IT మాఫియా / బాడీ షాపింగ్ కంపెనీలు ( విప్రో, ఇన్ఫోసిస్, టిసియస్ ,…) మనదైన ఉత్పత్తులు ఎందుకు చేయవూ అని..!


 5. తెలుగులో ఈ మధ్య భావజాల సాహిత్యంతప్ప ఆలోచనల,భావన సాహిత్యం తక్కువయ్యిందనుకుంటాను. కొత్తపాఠకుడి జీవితానికి అన్వయించుకోదగ్గ ఆలోచనలున్న పుస్తకాలూ కరువయ్యాయి. దీనికి తోడు సరైన అమ్మకపు వ్యూహాలు. చదివేపాఠకుడ్నికూడా కొనడానికి సిద్ధం చెయ్యలేని నిస్పృహా నిండుకున్నాయి. ఈ స్థబ్ధతని బద్ధలుకొట్టాలి. ఒక ప్రయోగం చెయ్యాలి. తెలుగు పుస్తకం సత్తాను నిరూపించాలి.

 6. rayraj Says:

  that’s it! bang on it! – ప్రాబ్లెం తెలుగువాడిలో లేదు! అమ్మేవాడిలోనూ, రాసేవాడిలోనే ఉంది!పోతే – అసలు స్కూల్లో తెలుగు నేర్పకపోతే ఎలా-అంతే గదా సమస్య! వాళ్లు కనీసం ఐదో తరగతి దాకా నేర్పుతాం అన్నారుగా; మరి అక్కడ్నించి వాడిని తెలుగులో పుస్తకాలు చదివించే బాధ్యత ఎవరిది! రాద్దాం, అమ్ముదాం అనుకున్న వాళ్ళది – అంతేనా కాదా! సో, దాన్ని బతికిద్దాం అనుకుంటే, ఎంత మార్కెటింగ్ స్పిరిట్ తో ముందుకు దూకాలి పబ్లిషర్సు?

 7. Yogi Says:

  Ray Raj,

  Just for fun..

  You gotta master the art of replying to comments. Example, is the comment is “!” then you gotta reply – “!!”

  That punches the lights out 🙂

  As I said earlier, just for fun 😀

  Yogi


 8. పసందైన ఆలోచనా తరంగాలు. బాగున్నాయి రేరాజ్ గారు


 9. @రేరాజ్:

  మీకు అనంతమైన ఆలోచనలున్నాయి. అద్భుతమైన ఆలోచనా పటిమ, అనేక విషయాల్లో సగటు మనిషికి విభిన్నమైన దృక్పధం ఉంది. (‘కుమార్’ పేరుతో ఒకాయన వ్యాఖ్యలు రాస్తాడు. ఆయనకి బ్లాగంటూ లేదు కానీ ఉంటే బాగుంటుందని నా కోరిక. ఆయనకీ మీకూ ఆలోచించే విధానంలో చాలా పోలికలు కనిపిస్తాయి నాకు).

  మళ్లీ సంగతిలోకొద్దాం. పైన కుమార్ గారి ప్రస్తావన తెచ్చా కదా. ఏక్కడో పోలికలు తగిలాయని రాశా కానీ, అది నిజానికిక్కడ అనవసరమైన పిడకల వేట. ఇలాంటి పిడకల వేటలు మీ టపాల్లో, కామెంట్లలో బోలెడు సాగుతుంటాయి 🙂 అవి అసలు విషయానికి లంబకోణలో పోతుంటాయి. మీ పాఠకుడు ఒక చోట మొదలెట్టి, ఆ పిలకలన్నీ పుచ్చుకుని చదువుకుంటూ వెళ్లి ఎటెటో తిరిగి మళ్లీ వెనక్కొచ్చి మళ్లీ వెంటనే మరో పిలక పుచ్చుకెళ్లి .. చివరికొచ్చేసరికి సొమ్మసిల్లిపోతుంటాడు. ఈ గందరగోళంలో అసలు మీరేం చెబుతున్నారో అర్ధం కాకుండా పోతుంది.

  క్లుప్తంగా: మీతో సమస్య విషయం లేకపోవటం కాదు, విషయం మరీ ఎక్కువ ఉండటం. ఇంతకు ముందో సారెప్పుడో అన్నాను – మీవి random thoughts అని. వేరే ఉద్దేశం కాదు. ఎప్పుడేది తడితే అది రాసేస్తున్నారు మీరు. అది కొంచెం తగ్గించి ప్రధాన విషయమ్మీదనే కేంద్రీకరించి రాస్తే చదివే ఆసక్తిగల వాళ్లు చాలామందే ఉన్నారు. ప్రయత్నించగలరా?

 10. Sarath 'Kaalam' Says:

  కరెక్టే. నాకు ఇష్టమయిన వృత్తి ఏంటొ తెలుసా. పుస్తకాలన్నీ ఓ వ్యానులో వేసుకొని అమ్ముతూ – రచిస్తూ – చదువుతూ – తిరుగుతూ పోవడం. అది రిటైర్మెంటులో వీలవుతుందో ఏమో.


 11. సమస్య బహుముఖమే అయినా, దాన్ని address చెయ్యడానికి ఎక్కడో ఒక దగ్గర మొదలెట్టాలి. అందుకే ఉన్న పాఠకుల్ని consolidate చేసుకునే మార్కెటింగ్ వ్యూహం ముఖ్యం. కొణతం దిలీప్ గారూ నేనూ ఈ విషయంలో కొంత ఆలోచించి ఒక ప్రయత్నం చేద్ధామన్న ఆలోచనలో ఉన్నాము. మీకు ఆసక్తి ఉంటే…


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: