కుహనా ’ఒబమా’యిజం

ఒక్క దళితుడు వచ్చి ఏకీభవించడమో, వ్యతిరేకించడమో చెయ్యడే…..దళిత తెలుగులే లేరా!________________________________

“అందుకే, మాయావతి ఉద్దేశం అన్ని కులాల,వర్గాల ప్రజలకూ నేతృత్వం వహించే ఒక దళిత మహిళగా ఎదగడమే కావాలి. ”

ఐతే ఇప్పుడు ఓ బ్రాహ్మణనాయకుడు “x”:

“అందుకే, “x” ఉద్దేశం అన్ని కులాల,వర్గాల ప్రజలకూ నేతృత్వం వహించే ఒక బ్రాహ్మణ మహిళ/మగాడుగా ఎదగడమే కావాలి”

అప్పుడది బ్రాహ్మణ లిబరలిజమ్ ఔతుందా!!! ఎవ్వడైనాగానీయండి…..”సో అండ్ సో వర్గం” లిబరలిజమ్ ఔతుందా!!!
___________________________

నన్ను అణచిన వర్గాలతో పోరాడుతూ – అవే వర్గాలని “కలుపుకోవటం” ఏమిటి? నాకు తెలీకడుగుతాను? నేను వాళ్ళని ఇప్పుడిప్పుడే ధిక్కరిస్తున్నాను; ఇంకా పోరాడాలి, అప్పుడు “మార్పు” రావాలి, అంటే –  నేను వాళ్ళని అణచగలిగే స్థితికి ఎదగాలి. అప్పుడు నేను ఆ వర్గాలని అణచాలి…..అప్పుడు కదా నా మీద ఎవడైన ధిక్కరాలైన, పోరాటాలైన…..అప్పుడు చూసుకుందాం ఈ “కలుపుకోటాలు” etc., నేను ఎవరిని కొడదాం అనుకుని వచ్చానో, వాణ్ణే నువ్వు “కలుపుకుపోదాం” అంటే, అసలు నువ్వు నా నాయకురాలివేనా!!!
_________________________________

పోరాడే లీడర్ కావాలి.అంతే కానీ సీటు కోసం కుహనా దళితవాదం చెప్పేవాళ్ళంటే నాకసహ్యం; దళిత లీడర్ అనేవారు, దళితుల కోసమే పోరాడాలి.
__________________________________
ఆ మాటకొస్తే –
మనకి ఫస్ట్ మహిళా ప్రధానమంత్రి కూడా వచ్చేసింది – ఇంకా పెద్ద పెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో కూడా రాలేదు. కానీ మన దేశంలో మహిళల పరిస్థితి ఉన్నతంగా ఉందని మీ కనిపిస్తోందా!!!! మనకి ముస్లిం నాయకులు ఎందరో పెద్ద పెద్ద పదవులనలంకరించారు – మరి మన దేశంలో ఎంతమంది ముస్లింల పరిస్థితి దారుణంగా ఉందో తెలుస్తోందా!! మనకి  బోళ్డు మంది “ఫస్ట్ ST, SC యాజ్ సో అండ్ సో” లు ఉన్నాయి –  ఏం మార్పొచ్చిందీ!!!? ఇంకా “అణిచివేత” ని అనుభవస్తున్నది ఎవరు!?
______________________________

ఒక స్థాయి తరువాత మన గుర్తింపును వదిలేసుకోగలగాలి. అంటే – నేను సైన్సు మనిషిని, నేను రాజకీయనాయకుడిని, నేను భాషవేత్తని – ఇలాంటి ఎటువంటి గిరిగీసుకు పోయే లక్షణాలు మనకి మనం ఆపాదించుకోకూడాదు.అదీ మార్పు; అదీ ఎదుగుదల; ఇది మీకు అర్ధం కాదు. ఎందుకంటే – అది మీ బ్రాహ్మినికల్ ఆటిట్యూడ్;  ఎందుకంటే  ”  “శాస్త్రం” ఘోషిస్తోందండి అది “వృత్తం” అని…….అందుకని అది అలాగే జరుగుతుంది”.
___________________________________

ఫైనల్లీ, నాకు మాత్రం దళిత నాయకులే కావాలి; దళితుల తరఫు నిలచి పోరాడ గలిగే యోధులు మాత్రమే కావాలి. దళితులు ఇంకా లిబరేటడ్ అవ్వలేదు. ఈ “కలుపుకుపోదాం”  అని చెప్పే “కుహనా దళిత లిబరిలజమ్” నాకు అసహ్యం. దీనికి ఓ పేరుబెట్టాలి;
యెస్ –  “కుహనా ’ఒబామా’యిజమ్”
*****************************************************

’మాయ’వతి : “ఐతే, ఇప్పుడు నేను పి యమ్ ఎలా అవ్వాలంటావ్ రా!!!!”
నేను: ” నా సంగతి చూడకుండా నువ్వు పి యమ్ ఐతే ఏంటీ, సి యమ్ ఐతే ఏంటీ? ”
’మాయ’వతి : “పిచ్చోడా, నీ కోసమే – నేను పి యమ్ ఐతే  నేను నీ కోసం బోళ్డు చేస్తా…..నీ కోసం………….(ఓ పెద్ద లిస్టు).”
నా పక్కోళ్ళు -’కొండవలసలు’: ” ఐతే ఓకే – దళిత లిబరిజమ్ కే నా ఓటు”
నేను: “పిచ్చోడా అని చెప్పాక కూడా అర్ధం కాదారా నీకు…..సరే కానీయండి ఫస్ట్ మహిళా దళిత  పి యమ్ చేసుకోండి”

బయటికొచ్చేసాను. గాలి వీస్తోంది. స్వేచ్చావాయువు. ఎదురుకుండా ఓ కృష్ణతేజస్సు

నేను:  “కసిగా ఉందా?”
కృష్ణతేజస్సు : “రగిలి పోతోంది”
నేను: “ఏం చేస్తావ్!!??”
కృష్ణతేజస్సు: “పోరాడతా  – మార్పు వచ్చేదాకా పోరాడతా”
నేను: “ఏ మార్పు కావాలి?”
కృష్ణతేజస్సు: “మా బతుకులు బాగుపడాలి”
నేను: “చాలా రోజుల్నించి బతికే ఉన్నాను; ఈ “బతుకు” బాగుపడటం లేదు. అదేంటో నాకూ తెలీదు. ఐనా సరే – పద పోరాడదాం”
కృష్ణతేజస్సు: “మనకి ఆయుధాలు కావాలి; నా “గురి” తప్పదు.”
నేను: “ఎవరి దగ్గర నేర్చుకున్నావు?”
కృష్ణతేజస్సు: “సినిమాలు చూస్తే తెలీటంలే!”
నేను: “అరే……అది వాడు తీసిన సినిమా యేరా!! ఆ చూపించిన ఆయుధాలకి విరుగుడు వాడిదగ్గరే ఉంది; యాంట్ వైరస్ రాసేవాడే, ముందు వైరస్ కూడా రాస్తాడు”
కృష్ణతేజస్సు: ఐతే ఇప్పుడెలా!?

నేను: కరెక్టు. అదే….”ఆలోచించు” ; ఆలోచన “మొదటి” ఆయుధం. అదే “అసలు” ఆయుధం.

ప్రకటనలు
Explore posts in the same categories: బ్లాగుల గురించి

ట్యాగులు:

You can comment below, or link to this permanent URL from your own site.

10 వ్యాఖ్యలు పై “కుహనా ’ఒబమా’యిజం”


 1. http://parnashaala.blogspot.com/2009/05/blog-post_05.html

  “స్త్రీవాదం, దళితవాదం, తెలంగాణా వాదం లాంటి అన్ని వాదాలూ మొదటగా అణచివేత నేపధ్యంగా ఒక ధిక్కారస్వరంలా మొదలై తమ ఆత్మనిశ్చయ ముద్రల్ని బలంగా చిత్రించి, సమాంతర అస్థిత్వాలుగా ఎదిగాయి.

  ఈ ఎదుగుదల పరిణామక్రమంలో ఈ అస్తిత్వవాదాలు తమ ఉనికిని కోల్పోకుండా ప్రధానస్రవంతిలోకి మమేకం అవ్వడం సహజంగా జరగాల్సిన పరిణామం, ఉదాహరణకు, దళితవాదం కుల వివక్షతకు నిరసనగా తమ సాధికారక ఉనికిని ఎలుగెత్తి చాటడానికి ఉద్భవించినా, దాని అంతిమ లక్ష్యం సమానత్వాన్ని కాంక్షించి,మార్పుచెందిన సమాజంలో భాగమవడం. జీవితమైనా,సాహిత్యమైనా అదే జరగాలి.”

 2. Amma Odi Says:

  >>ఆ చూపించిన ఆయుధాలకి విరుగుడు వాడిదగ్గరే ఉంది; యాంట్ వైరస్ రాసేవాడే, ముందు వైరస్ కూడా రాస్తాడు”
  కృష్ణతేజస్సు: ఐతే ఇప్పుడెలా!?

  నేను: కరెక్టు. అదే….”ఆలోచించు” ; ఆలోచన “మొదటి” ఆయుధం. అదే “అసలు” ఆయుధం.
  అసలు విషయం ఇక్కడే ఉన్నట్లుంది.

 3. కొత్తపాళీ Says:

  “యాంట్ వైరస్ రాసేవాడే, ముందు వైరస్ కూడా రాస్తాడు”

  well said.
  However, I take exception to you calling it Obama-ism. Obama, as far as I know, did not project himself as a black messiah or liberator. He is a leader who happens to be black and he happens to be comfortable with it. That last trait is very different from our caste-based “leaders”.

 4. rayraj Says:

  @కొత్తపాళీ: ఔనండి; అందుకనే ఒబమాయిజం వేరు; ఇది కుహానా ఒబమాయిజం. అది ఆత్మస్థైర్యంలోని బలం. ఇది లేని బలాన్ని “లేమి” తో సాధించాలని
  ప్రయత్నించడం. ( అఫ్ కోర్స్, బలం ఉందో లేదో నేను నిర్ధారణగా చెప్పలేను.నాకు తెలియదు.)

  @అమ్మఒడి: ఔనండీ, నిజమే! అందుకని ఆలోచన మీద కూడా అణిచివేత ఉన్నదని, “oppression on mind” అన్న ఆలోచన చెప్పడానికి ప్రయత్నించాను. కానీ, అంత సఫలీకృతుడిని కాలేకపోయాను.

  @మహేష్:
  అదే పోస్టులో – మీరే అన్నారు : ” @గీతాచార్య: ఇప్పుడు ఏంచెయ్యాలి అన్నది కూడా కొంత ఆలోచించవలసిన విషయమే.” ఆలోచిస్తే మీకేమనిపించింది?
  ********************************
  ఏది ఏమైనా – ప్రధాన స్రవంతిలో కలవడానికి అస్తిత్వమే ప్రతిబంధకం అవ్వకూడదు.ఇది – “తెలుగు వాడు” అనే గుర్తింపైనా!!

  నా అస్తిత్వమే నా లుంగీ ఐతే – ప్రపంచం అంతా జీన్స్ లు వేసుకున్నా, నేను లుంగీని కాపాడుకోవాల్సి వస్తుంది
  నా అస్తిత్వమే నా “పిలక” ఐతే – ప్రపంచం అంతా “క్రాఫ్” చేయించుకున్నా, నేను నా “పిలక”ని ఉంచుకోవాల్సి వస్తుంది.
  నా అస్తిత్వమే నా వెనుకబాటుతనమే ఐతే – నా వెనుకబాటుతనం ఉంచుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో!

  అందుకే , నేను “తెలుగు” వాడి గుర్తింపు “తెలుగు భాష” అనేది అంగీకారాత్మక దృక్పదం ఔతుందా? అని చర్చించాను! అలా ఐన పక్షంలోనూ , తెలుగును స్టాటిక్ గా ఉంచకూడదు; దానిలో ఆలోచనలు చెలరేగాలి; దాని ఆలోచనల ద్వారా అది గొప్ప భాష, గొప్ప సంస్కృతి అవ్వాలి అని చెప్పాను. అందుకని “తెలుగులో ఆలోచించండి” అని చెప్పాను. (We can think in english and yet call ourselves as Telugu.But then, what is Telugu!? – దానికి “అంగీకారాత్మక దృక్పదం” -భాష! )

  ఆఫ్ కోర్స్, అదంతా హాలీవుడ్ కి, టాలివుడ్ ని మార్గదర్శకం చేయాలన్న ఆలోచనలో వచ్చాయి లెండి 😉

  మిగిలిన వాదాలకైనా, ఎటువంటి స్టాటిక్ సింబల్ ఉండకూడదు; నాకు తెలిసి, అలా శాశ్వతంగా ఉండే దాన్ని నేనింకా కనుగొనలేదు. అందుకే మీరు గీతాచార్య తో అన్నమాట అడుగుతున్నాను.ఆలోచిస్తే మీకేమనిపించింది? అస్తిత్వం కోల్పోకుండా ప్రధాన స్రవంతిలో కలిసి ఉండటం ఎట్లా!? ఆలోచించి చెప్పండి.(అది నా తెలుగు సినిమాకి కూడా పనికి రావచ్చు)

  ఐనా ఒక్కమాట – దళితుడు ఇంకా లిబరేటడ్ కాదు. వాడు పోరాడాలి. వాడింకా స్వేచ్చా జీవి కాదు.ఎవరు ప్రధానమంత్రులైనా కానీ, దళితుడు ప్రధానస్రవంతిలోకి
  రావడానికి ఇంకా చాలా దూరంలో ఉంచారు.
  ********************************

  మహిళా ప్రధానమంత్రి కలిగిన మన ప్రజాస్వామ్యాన్ని మనం కించ పరచుకుంటాం; ఎవడో కించ పరుస్తే “ఔనౌను” అనుకుంటాం.
  వాళ్ళు మాత్రం వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని ” ఎవరు ఎవరితో పడుకున్నారు , లేక ఏ రకంగా ఎన్జాయ్ చేసారు?” అన్న పాయింట్ తో రచ్చెకెక్కించినా గొప్పే!!!!
  ఎందుకంటే – మనకి “అభివృద్ది చెందుతున్న దేశం”గానే అస్తిత్వం ఇష్టమేమో!!!!! మనం “మార్గదర్శులం” అన్న ఆత్మస్థైర్యం ఎందుకు తెచ్చుకోరు!!!!

  మాస్ ఆడియన్స్ అంటే అలాగే ఉండాలి!!మాస్ సినిమా అంటే అలాగే ఉండాలి!!ఎందుకంటే మనకి “మాస్” సినిమాలాడతాయి; మనం మంచి “మాస్” సినిమాలు తీయగలం!!!! ఏ ? అమెరికా వాడు తీస్తోంది “మాస్” సినిమాలు కాదా అని అడుగుతున్నాను?? మరి మనం హాలీవుడ్ నుంచి ఎందుకు కాపీ కొట్టి, ఇక్కడ “మాస్” సినిమా తీయాలి!!?? వాడంత తెలివితోనే ఎందుకు తీసుకోకూడదు!!?? ఎందుకంటే – మనం “మాస్” కాబట్టిట!

  అందుకని, ఒకవేళ దళితుడు ఎదిగితే – వాడు కూడా – మార్గదర్శకంగా మాట్లాడాలి!! – అంతేగానీ దళిత అస్తిత్వం కోసం దళితుడిలాగా మట్లాడకూడదు కదా!!!దళితశబ్దానికి భావం మారాలి!!అదీ “మార్పు” అంటే!!దళితుడు గౌరవించబడగలగటం “మార్పు” ఔతుంది. అంతే గానీ “వృత్తాల్లో” చెప్పినట్టు కాదు. అసలు అదంతా ఒక వృత్తమే కాదు. మీకు “బాగా తిరిగిన” కవితలాగా “ఎన్నో” వృత్తాల్లో ఉంది!!! ఇట్ ఈజ్ వెరీ డైనమిక్ అండ్ ఇట్ ఈజ్ ఎ డైనమిక్ స్టెబిలిటీ. బహూశా ఈ కాంసెప్టు చరిత్ర కారులక తెలవదో, తెలిసినా వాళ్ళు చరిత్రకి అప్ప్లే చేయలేదో!?…బైదవే, ఇది కూడా జస్ట్ “ఆలోచన” మాత్రమే సుమా!!

  ఆలోచించుకోండి మహేష్..ఆలోచించుకొని మీకనిపించె ఓ నూతన పరిష్కారం చెప్పండి. అది ఆచరించబడి, ఆశించిన ఫలితం ఇస్తే, కత్తిలా ఉంటుంది. అమెరికాలో అణగారిన వర్గాలు ఉన్నాయి; వాళ్ళు మీ ఆలోచనని కాపీ కొట్టొచ్చు! అక్కడ అమెరికన్ ఇండియన్స్ , మెక్సికన్స్ మీ ఆలోచనని కాపీ కొట్టొచ్చు!!వాళ్ళ అస్తిత్వం ఎలా ఉంచుకోవాలి? కానీ ఎలా ఎదగాలి? అని కష్టపడుతున్నారు.అలాంటి జాతులు ప్రపంచంలోనే చాలా ఉన్నాయి. మీ పరిష్కారం వాళ్ళకీ పరిష్కారం ఔతుందేమో!!

  మీరు ఆలోచించుకోగలరు. ఆలోచించుకోగలవారికి నేను నిర్ధారణ పూరిత “అబ్సల్యూట్”లు,పరిష్కారాలు ఇవ్వనవసరం లేదు.
  *******************************
  అసలే మీరు “నేను” ని తెలుసుకున్నారు! 🙂


 5. “యాంట్ వైరస్ రాసేవాడే, ముందు వైరస్ కూడా రాస్తాడు”
  నిజమే!!!!
  ఒకడుగు ముందుకేస్తే…దళితులే తమని అంటరానివాళ్ళుగా,పంచములుగా చేసి అమానవీయంగా ప్రవర్తించమని కోరారు. ఇప్పుడు ధిక్కారం, దళిత ఆత్మగౌరవం, దళిత రాజ్యాధికారం అని ఘోషిస్తున్నారు. కులం అనే వైరస్ రాసి ఇప్పుడు యాంటీవైరస్ మేమే అంటున్నారు.
  షేమ్ షేమ్ కదా!
  ——————————————————————————————————-
  అణచివేత -ధిక్కారం- మార్పు – (మళ్ళీ)అణచివేతల వృత్తంలో, మార్పు – మళ్ళీ అణచివేతల మధ్యన సామరస్యమైన మనుగడ ఒకటుంది. కానీ సామాజిక అణచివేత తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు ‘మార్పు’వచ్చేస్తే ఆ “సామరస్యమైన మనుగడ” సమయం అతితక్కువుంటుంది.

  ఉదాహరణకు, మండల్ నేపధ్యంలో BC నాయకులు (యూపీ,బీహార్లలో యాదవులు) అధికారంలోకి వచ్చిన తరువాత law and order తీవ్రస్థాయిలో కుంటుపడింది. యాదవుల దౌర్జన్యాలు అత్యంత తారాస్థాయికి చేరుకున్న ఘటనలు కోకొల్లలు. ఈ నేపధ్యంలోనే మాయావతి రాజకీయ బలిమి పెరిగిందనే విషయం ఇక్కడ గమనించాలి. దౌర్జన్యాలకు బలైన దళితులు ఒక తమదైన alternative కోరుకున్నారు.

  అధికారంలోకి వచ్చిన తరువాత మాయావతికి స్పష్టంగా తెలుసు, ఒకవేళ తాను పరిపాలన మీద కాక దళితగౌరవాన్ని దువ్వడంలో సమయం గడిపితే అది దళితగర్వంగా మారి మళ్ళీ చరిత్ర పునరావృతమవుతుందని. తన పార్టీకూడా సమాజ్ వాదీ పార్టీలాగానే తయారవుతుంది, దళితులు యాదవులపోకడలు పోతారు అని. అందుకే తన శక్తియుక్తులన్నీ పరిపాలనా పరమైన streamlining కోసం వెచ్చించింది. “తెహసిల్ దివస్”, “థానా దివస్” అంటూ ప్రజలవద్దకుపాలన తరహాలో మాయవతి తెస్తున్న పరిపాలనా పరమైన మార్పులు దళితులకే కాదు మొత్తం ఉత్తరప్రదేశ్ కు మంచి చేస్తున్నాయి.

  అంతెందుకు మాయావతి దళిత లిబరలిజం మూసలో ప్రయాణిస్తోందనడానికి మరో ఉదాహరణ ఈ ఎన్నికల్లో తను నిలబెట్టిన అభ్యర్థుల కాంబినేషన్. 20 బ్రాహ్మణులు, 20 బీసీలు, 17 దళితులు, 15 ముస్లింలు, 6 మంది ఠాకుర్లు. కాంగ్రెస్ తరువాత ఈ స్థాయి ప్లూరలిజం కలిగిన పార్టీ ఒక బీ.ఎస్.పీ అనేది గణాంకాలు నిరూపించే విషయం.

  దళిత లిబరలిజం అంటే కేవలం “కలుపుకుపోవడం” కాదు. తమ అస్తిత్వాన్ని గౌరవప్రదంగా అంగీకరిస్తూనే మిగతా అందరితో కలిసిపోవడం. ఇక్కడ ఒబామాకూ మాయావతికీ చాలా పోలికలున్నాయి. కాకపోతే మాయావతి అంత “refined personality” కాదు. అందుకే భారతీయ మీడియాకూ, మధ్యతరగతి కళ్ళకూ తనొక క్యారికేచర్ లాగానే కనిపిస్తుంది.

  మన దగ్గర అభిప్రాయాల మీద విశ్లేషణలేతప్ప నిజాల మీద అభిప్రాయాలు తక్కువ. ఇక సమకాలీన చరిత్రను అర్థం చేసుకునే తీరులో మనం చాలా వెనుక. కాబట్టి ఇలాంటి చర్చలు తప్పవు.

 6. rayraj Says:

  @మహేష్: నేనూ మీరూ ఒకే టైములొ కామెంటు రాసుకున్నాం. ఇప్పుడు అందులో సాపీప్యతలు చూడండి.
  ఆఫ్కోర్స్ – ఆ వైరస్ ల గురించి మీర్రాసినట్టుగా నా భావం కాదని మీకూ తెలుసు.

  చర్చలు తప్పవు అని బాధపడకండి. చర్చలు “కావాలి” అని నేను అంటున్నాను. బ్లాగింగ్ ఈజ్ ఎ సోషల్ యాక్టివిటీ! అని ఇదివరలోనే నా అభిప్రాయాన్ని చెప్పాను.

  ఆ వృత్తాల్లో వేరే మార్పు ఉన్నప్పుడు – దాన్ని వృత్తానికి మించిన భాషలో చెప్పాలా వద్దా!!లేక పోతే నాలాంటి మరో తెలుగువాడు దాన్ని ఏలా అర్ధం చేసుకుంటాడు.చూసారా – మీకు “వృత్తం” – అబ్సల్యూట్ కాదు అని తెలిసీ డిటర్మినిస్టిక్ గా అది వృత్తమే అని వాదిస్తున్నారు. అందుకే చెప్పాను. ఇది బ్రాహ్మినికల్ ఆటిట్యూడ్ అని.

  ఆవిడ మంచి పరిపాలన దక్షురాలైతే, దేశ నాయకురాలుగా ఎలా ఎదగాలో కూడా ఆలోచించుకోవాలి కదా అనేదే ప్రశ్న. మీకు ఆవిడ దక్షత మీద విషయపరిఙ్ఞానం ఉన్నప్పుడు, మీరు ఆవిడ దక్షత గురించిన మాటలు చెప్పి, అది ఎలా పలువురికి మార్గదర్శకంమో చెబ్తారా!? లేక ఇది దళిత అసెర్షన్ అంటారా!! పై పెచ్చు- ఓ పక్కన బోళ్డుమంది ఇంకా దళితులుగా వెనుకబడే ఉండగా!!


 7. @రేరాజు: మనిషెప్పుడూ “పూర్తి పటం” చూడలేడు. పూర్ణాన్ని విడివిడి భాగాలుగా లేక పూర్ణంలోని భాగాలుగానే కాకపోతే ప్రత్యేకమైన భాగాలుగా చూస్తుంటాడు. అందుకే ఎప్పుడూ “whole truth” అవగతం కాదు. అందుకు నేను మినహాయింపు అస్సలు కాదు.

  నా (క్షణిక) డిటర్మినిస్టిక్ పంధా గురించి ఇదివరకే ఒక చోటచెప్పాను. ఒక సమయ నిబద్ధతలో నిర్వచించుకోకపోతే పునర్నిర్వచనానికి స్థానం లేదు. అందుకే పునర్నిర్వచనానికి సంసిద్ధత వ్యక్తపరుస్తూనే నేను కొన్ని డిటర్మినిస్టిక్ నిర్వచనాల్ని వెలిబుచ్చుతాను.

  మనం మాట్లాడుకుంటున్న వృత్తం యొక్క కాల పరిమితి కొన్ని శతాబ్ధాలు. బహుశా ఇంకా ఎక్కువేనేమో. ఆ వృత్తానికి ఒక సమయ నిబద్ధత నిర్వచింపబడలేదు. ఆ వృత్తంలోని పోకడలు నేను చెప్పిన థియరెటికల్ ఫ్రేమ్ వర్క్ లోనే ఉండాలన్న నియమం కూడా లేదు. కానీ అర్థమవ్వడానికి ఒక ఫ్రేమ్ వర్క్ సృష్టిస్తాం. అంతమాత్రానా అదే “సత్యం” అంటే ఎలా! ఈ లిమిటేషన్ తెలిసీ మనం నిర్వచించాలి, ఫ్రేంమ్ వర్క్ సృష్టించాలి. నా ప్రయత్నం అదే.

  నేను చూస్తున్న ధృక్కోణం ఒక సైద్ధాంతిక నేపధ్యం నుంచీ ఉదయించింది. దళిత మేధావులు రాజ్యాధికారాన్ని “మార్పు” లో ఒక మార్గంగా ఎంచుకుని ప్రపోజ్ చేసిన ధియరెటిక ఫ్రేమ్ వర్క్ నుంచీ నా విశ్లేషణ సాగింది. కాబట్టి ఆధృక్కోణంలో మాయావతి దక్షతకన్నా, what she symbolizes in this given frame work is more important to me. ధృక్కోణానికి అనుగుణంగా ఉదాహరణలు ఎంచుకుని మన వాదాన్ని బలోపేతం చేసుకుంటాం. అంతమాత్రానే అదే నా “కంప్లీట్ పిక్చర్” అనుకుంటే ఎట్లా? నాకు తెలిసింది, నేను అనుకునేది, నేను ప్రతిపాదించేదీ అదే అనుకుంటే ఎట్లా?

  నేను చరిత్రకొక సిన్సియర్ విద్యార్థిని. సమకాలీన సమాజాన్ని అర్థం చేసుకోవాలనుకునే ఔత్సాహకుడిని. అన్ని నిర్వచనాల్నీ “ఇతిఇతి” అనుకుంటే నా గతి “ఇంతే”. కానీ, ఆ క్షణంలో అర్థమైనదాన్ని “ఇదిఇదే” అని మాత్రం ఖచ్చితంగా అంటాను. లేకపోతే నేను నేర్చుకోవడానికి, నేను నేర్చుకున్నాను అనుకోవడానికీ ఏమీ మిగలదు.

 8. David Says:

  rayraj Says:
  “నాకు తెలీకడుగుతాను? నేను వాళ్ళని ఇప్పుడిప్పుడే ధిక్కరిస్తున్నాను; ఇంకా పోరాడాలి, అప్పుడు “మార్పు” రావాలి, అంటే – నేను వాళ్ళని అణచగలిగే స్థితికి ఎదగాలి. అప్పుడు నేను ఆ వర్గాలని అణచాలి…..అప్పుడు కదా నా మీద ఎవడైన ధిక్కరాలైన, పోరాటాలైన…..అప్పుడు చూసుకుందాం”.
  “నేను వాళ్ళని అణచగలిగే స్థితికి ఎదగాలి. అప్పుడు నేను ఆ వర్గాలని అణచాలి…”.

  I think you don’t know about Newton’s 3rd law. For a force there is always an equal and opposite reaction.

  నువ్వు వాళ్ళని అణచాలి అని అనుకుంటె, వాళ్ళు కూడా నిన్ను అణచాలి అని అనుకుంటారు. So ఇక ఎక్కడ వెచిన గొంగళి అక్కడె వుంటుది.

  Get the inspiration from Buddha, Jesus and Mahatma Gandhi, how to solve issues with love and compassion.

  With hatred you don’t go too far in life. ఒక వెళ నువ్వు వాళ్ళని వొడించావె అనుకొ, వొడిన్వాళ్ళు అలానె వుండరు కదా, వాళ్ళు మళ్ళా నిన్ను వొడించాలని చూస్తారు, It is cyclical. And your thinking reflects that (cyclical).

  In this age of Democracy and Enlightenment you thinking “”నేను వాళ్ళని అణచగలిగే స్థితికి ఎదగాలి. అప్పుడు నేను ఆ వర్గాలని అణచాలి…”. is a crime.

  Liberate thy self and help others to live a happy and healthy life. Amen.


 9. @రేరాజు/డేవిడ్: ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళకు అణచివేతకు గురైనవాళ్ళ చేతుల్లో ఓడిపోవటమే అత్యంత హేయమైన అణచివేత భావిస్తారు. ఉదాహరణకు రిజర్వేషన్ల వల్ల “అన్యాయమైపోతున్నాం” అనే అగ్రకులావాళ్ళు ఎంత అణచివేత “అనుభవించడం” లేదు !

  అణచివేత అన్ని వేళల్లోనూ హింసాత్మకంగా ఉండాల్నిన అవసరం లేదు. ఓకే విధానం యొక్క నమూనాలాగా అవతరించనూ అఖ్ఖరలేదు. దళితుల అణచివేత భౌతికం, మానసికం, సామాజికం,రాజకీయం అంతమాత్రానా దళితులు అధికారంలోకి వస్తే అగ్రకులాలపై ఇవన్నీ అమలు చేస్తారనుకోవడం లేదా అలా ఆలోచించడం దారుణం.

  ఇప్పటిదాకా దారుణమైన అణచివేతకు గురైన దళితులు అధికారంలోకి రావాలనుకునేది తమ మీద జరిగిన దారుణాల్ని అగ్రకులాల మీద perpetuate చెయ్యడానికి అనుకోవడమే పెద్ద కుట్ర. నా వ్యాఖ్యద్వారా నేను ఆ భావాన్ని మీకు కలిగించుంటే నేను పెద్దతప్ప చేసినట్లే.

 10. Sree Says:

  really worthy…. 🙂


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: