తెలుగులో ఆలోచించండి

ఉఫ్… 🙂 కొంచెం మళ్ళీ వెనకనుంచి వస్తాను…. భాష కమ్మునికేషన్ కే….అందులో డౌటు లేదు. దీన్నే, “భాష భావ వ్యక్తీకరణ”కి అని వ్యక్తపరచిచారు. అల్లసాని పెద్దన క్రికెట్ ఆడలేదు. కనీసం చూడలేదు. అందుకని ఆ “భావాలు” బహుశా ఆనాటికి ఆయనకి తెలీదు. సచిన్ టెండూల్కర్, తెలుగువాడయ్యి, మాటకారి అయ్యుంటే, మలక్ పేట్ రౌడీ చెప్పిన ఆ క్షణంలోని తన ’భావాన్ని’ ఎలా వ్యక్తీకరిస్తాడు!? అదీ భాష!! తెలుగు టీచరుగారి చెప్పినది కూడా భాషే!! కానీ తెలుగు టీచరుగారిదే భాష కాదు. ఆవిడ ఓ ఇరవై సంవత్సరాల తర్వాత టెండూల్కర్ గారి ’తెలుగు’ గొప్పదనం మళ్ళీ పిల్లలకు నేర్పిస్తారు.

భవానీ గారు తమ వ్యాఖ్యలో చెప్పిన సెంటర్ షాక్ ని ఇప్పుడు మీరు తెలుగులో ఆలోచించి చెప్పాలి గాని, “మధ్య స్థాణత్వం” టైపులో అనువదించ కూడదు. అనువదిస్తే – ’సెంటర్ షాక్’ అనేది ఇంగ్లీషు వాడిది గాను, తెలుగులో ఆలోచన ముందుకు సాగనట్టుగాను ఉంటుంది. ఐతే – ఇది వ్యాపారంలో ’అమ్మేవాడు’ పెట్టుకున్న పేరు కాబట్టి, చాక్లెట్టు కంపెనీలు, తెలుగులో పేర్లు పెట్టి అమ్మాలి అని చెప్పడం మూర్ఖత్వం. సో ఆలోచన అటు పోనీయకండి. ప్లీజ్! 🙂

అనువాదం కూడా తెలుగులో వ్యక్తీకరించడమే!! కానీ, అనువాదం ఎన్నటికీ తెలుగు “ఆలోచన” అవ్వకపోవచ్చు. అందుకని, నా “తెలుగు భాష”  అనే భావంలో, కేవలం పురాతన కాలంలో ఉన్న ఆలోచనలని మాత్రమే నా ఘనతకి వాడుకోవాల్సి వస్తుంది. కానీ, ఇవ్వాళ్ళ తెలుగులో ఆలోచించుకుంటే, ఈ ఆలోచనలన్నీ తెలుగు వాళ్ళ ఆలోచనలౌతాయి.

అందుకే ఉదాహరణ మార్చి చెప్తాను : ఇప్పుడు సాంఘిక శాస్త్రంలో ఓ కొత్త ప్రతిపాదన నేను తెలుగులోకంలో ఆలొచిస్తాను. అప్పుడు ఖచ్చితంగా నా వ్యక్తీకరణ ఏదైనాగానీ, అది తెలుగు భాషే ఔతుంది. నా “తెలుగు భాష” అవుతుంది. నా తెలుగు వారి ఆలోచన ఔతుంది. అది ’తెలుగులో ఆలోచించడం’ అంటే!!! తెలుగులో ’చెప్పి’నంత మాత్రాన, తెలుగులో వ్యక్తీకరించి-నంత మాత్రాన అది తెలుగుగా భావించబడదు. ఆ విషయం ఆల్రెడీ “భువనవిజయం” లో తెలుసుకున్నారు అని కూడా చెప్పాను….చూసే ఉంటారు.

నిజానికి, తెలుగువాడూ మనిషే…వాడూ ఆలోచించగలడు. ఇప్పటికీ తెలుగు వాడు ’ఇంగ్లీషు’లో ఆలోచిస్తున్నాడు. కానీ, అవసరమైతే, తెలుగులో వ్యక్తీకరించడానికి ప్రయత్నిస్తున్నాడు.

లింగ్విస్టుల్లాగా, చరిత్రకారుల్లాగా అర్ధం చేసుకోకండి. “సంస్కృతి” పురాతన కాలంలో ఉన్నదే అనుకుంటే పొరబాటు. సంస్కృతి ఇవ్వాళ్ళ కూడా ఏర్పడుతోంది.అది చాలా డైనమిక్. ఐతే, ఇప్పటి మన సంస్కృతిలో,  మనం తెలుగులోకి కేవలం అనువాదాలే తెస్తున్నాం. అదీ “కాపీ” అయిపొయేసరికి, తెలుగులో “ఆలోచనల” కోసం పురాతన కాలానికి వెళ్ళటానికి ట్రై చేస్తాం. నిజం చెప్పాలంటే – నా ఉద్దేశ్యంలో సంస్కృతం “ఆలోచించింది” కానీ, తెలుగు ఎప్పుడూ – సంస్కృతం నుంచో, మరో చోట నుంచో అనువదిస్తూనే ఉందీ.

ఈ కారణం వల్లే, తెలుగు సినిమా ఎప్పటికీ హాలీవుడ్ నుంచే నేర్చుకుంటుంది అనే భావం వస్తుంది. విచ్ మే బి ట్రూ…….కానీ దాన్ని బ్రేక్ చేయచ్చు. ఎప్పుడు చేయచ్చు:  నా ఆలొచనని ప్రపంచం “కాపీ” కొట్టినప్పుడు. అంటే, నా ఆలోచనని పురాతన “ఆలోచన” ల్లో వెతక్కోవటం కాదు, ఇవ్వాళ ఓ భావాన్ని చెప్పి, ప్యాకేజి చేసి, ఎగుమతి చేయాలన్న మాట. అలా ఎప్పటికప్పుడు, మనం  “కొత్త” ది తయారు చేస్తూ జనంలోకి తొయ్యాలి.

ఐతే, మా a2zdreams, మొత్తం ఇంగ్లీషులోనే కలలు కంటూ, ఆలోచిస్తూ – “ఎక్కడ్నించి “కొత్త” ఆలొచన వస్తుందీ, ఎక్కడ్నించీ “క్రియేటివిటీ” వస్తుంది? ఏదైనా ఎక్కడో అక్కడ్నించి కాపీ కొట్టకోవడమేగా!” – అంటారు. అతను చెప్పేది పూర్తిగా అసత్యం కాదు. నిజానికి హాలీవుడ్ కూడా కాపీయే కొడుతుంది. కానీ, ఆ “ఆలోచన” పై, గుత్తాద్ధిపత్యం సాధించుకోగలుగుతున్నారు. దాన్ని ’అమెరికన్’ అని ప్యాకేజీ చేసుకోగలుగుతున్నారు. ఎందుకూ? అది వాళ్ళు “ఆలోచించు” కుంటారు కాబట్టి. అనువదించుకోరు కాబట్టి. కానీ, మనలో ఆలోచించేవాడు, ఇంగ్లీషులోకి వెళ్ళి పోతాడు. ఆలోచించలేనివాడు (సారీ – డామినంట్ పారడైమ్లో లేని తెలుగు ఆలోచనవాడు) ఇవ్వన్నీ  “చూసి” నేర్చుకోవాలిట!! మరి తెలుగును కాపేడే వాళ్ళు  ఎవరూ అంటే – 1. ఇంగ్లీషు ఆలొచనని తెలుగులో అనువదించేవాడు, లేదా 2.పురాతన తెలుగునే కాపాడేవాడు. దీన్ని వల్ల – ఎప్పటికీ తెలుగులో “ఆలోచన” ఉండదు. “ఆలోచన లేనిదే అస్థిత్వం లేదు” అనేది నా ప్రతిపాదన.

మహేష్ చెప్పినట్టు – చరిత్ర నిజానికి “వృత్తం” కాదు. మరదేంటీ? దానికి కావాల్సిన వ్యక్తీకరణ – భాషలోనూ, చరిత్రలోనూ దొరకక పోవచ్చు. దానికి కావాల్సిన వ్యక్తీకరణ “ఆటోమిక్ ఫిజిక్స్” లో దొరకొచ్చు. ( “వృత్తం” అనేది – జామెట్రికల్ ఆలోచన!!) ఇప్పుడు ఆటోమిక్ ఫిజిక్స్ లోని, ఆ ఫ్రేమ్ వర్క్, మహేష్ తన సొంతగా ప్రతిపాదించలేడు. ఎందుకని!!?? అతను చదివే ఇంగ్లీషు చరిత్ర పుస్తంకంలో, – ఆ రకంగా ఇంకా ఎవరూ అతనికి చెప్పలేదు. తనంతట తనేఆలోచించుకోవటానికి  బ్లాగ్లోకం మొత్తంలో లేదా డామినంట్ పారడైమ్లో ఎక్కడా ఆటోమిక్ ఫిజిక్స్ లోని ఆలోచనలు ఉండవు!! ఈ గ్యాప్ ని, మనకంటే ముందు పసిగట్టి, ఇంగ్లీషులో ఎవడైనా, ఎప్పుడైనా విజయవంతమైతే – అప్పుడు మహేష్ మనకి అనువదించి చెప్తారు. అంత మాత్రాన మహేష్ “ఆలోచన” లేని వాడు కాడు. కానీ, తనకి కావాల్సిన ఆలోచన “తెలుగు” లో దొరకనప్పుడు, తెలుగులో ఆలోచనలేదు. అనువాదమే ఉంది. ఎప్పటికీ, ఎప్పటికీ మనం “ఇంగ్లీషు” వాడి నుంచే నేర్చుకోవాలి. లేకపోతే, సంస్కృతం నేర్చుకొని, తనూ ఛాందసుడైపోవాలి.

నాకు ఈ రెండు తప్పే అనిపిస్తోంది. నా తెలుగు “ఆలోచించడం” లేదు అనేది నాకు సుస్పష్టంగా కనబడుతోంది.

అందుకే చెబ్తున్నాను : తెలుగులో ఆలోచించండి. ఆటోమేటిగ్ గా – “తెలుగు” అభివృద్ధి చెందుతుంది. (ఏది తెలుగు అనే ప్రశ్న మీద – భాష ’తెలుగు’ అని చెప్పి ఉన్నాను  – అదీ ఒక అంగీకారాత్మక దృక్పదం ఐతే! కాదంటే – భాషని వదిలేసి, ఏది ’తెలుగు’ గా నిర్వచించుకోవచ్చో మీరు చెప్పండి!! కింద కుహనా ’ఒబమా’ యిజం లో అస్థిత్వం గురించిన నా వ్యాఖ్య చూడండి.)

తెలుగులో వ్యక్తీకరించినవే తెలుగు కాదు. తెలుగులో ఆలోచించుకున్నవన్నీ తెలుగే! అందుకని, “తెలుగులో ఆలోచించండి”.

ప్రకటనలు
Explore posts in the same categories: Uncategorized

ట్యాగులు:

You can comment below, or link to this permanent URL from your own site.

12 వ్యాఖ్యలు పై “తెలుగులో ఆలోచించండి”

 1. Malakpet Rowdy Says:

  Sorry to go back to square one – thoughts, in general are unstructured and dont have a defined languge – you dont think in English or you dont think in Telugu. You might read something in English or Telugu and store that information in Telugu. But the information in your brain is not same as the thoughts you have – Looks like you are talking more about the information than the thoughts and I guess that is leading to the confusion here


 2. “తెలుగులో ఆలోచించడానికి” “తెలుగు అవసరం” కావాలి. తెలుగు సారస్వతం కావాలి. తెలుగు సందర్భం కావాలి. తెలుగు మేధ కావాలి. తెలుగు “జ్ఞానం” కావాలి. అది మెలమెల్లగా వ్వవస్థలోంచీ జారుకున్నది.

  అలాంటప్పుడు తెలుగులో తెలుగు ఆలోచన చెయ్యాలంటే స్టీము వేస్టేతప్ప కూతరాదు. అందుకే అంగ్లతీరాల్లో తెలుగు ఆలోచనను ఏరుకుంటున్నాం. గ్లోబలైజేషన్ గడ్డపై మనుగడ వెతుక్కుంటున్నాం.

 3. Malakpet Rowdy Says:

  సచిన్ టెండూల్కర్, తెలుగువాడయ్యి, మాటకారి అయ్యుంటే, మలక్ పేట్ రౌడీ చెప్పిన ఆ క్షణంలోని తన ’భావాన్ని’ ఎలా వ్యక్తీకరిస్తాడు!?
  ______________________________________________________

  భావాన్ని ఎలా వ్యక్తీకరించాలా అని అలోచించేలొగా బంతి తగిలి తల పగులుతుంది. అక్కడ జరిగేది సెకన్లో వందవ భాగంలో ఆలోచన రావడం, వెంటనే దానిదారిలోంచి తప్పుకోవడం జరిగిపోతాయి. ఆ ఆలోచన తెలుగూ కాదు, మరాఠీ కాదు – అది కేవలం ఆలోచన. అలగే ఒక నెల వయసుగల పసిపిల్లాడికి తెలుగు రాదు – అయినా సరే ఆలోచనలమి తక్కువ ఉండవు. “హెలెన్ కెల్లర్” అంధ, బధిర మహిళైనా ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చిందో కదా! అత్యధిక శాతం అలోచనలకి మాట్లాడే భాషతో సంబంధం ఉండదు. ఆ అలోచనని పక్కవాడికి ఎలా చెప్తాము అన్న విషయంలో భాష గురించిన చర్చ అవసరం అవుతుంది. పక్షులకు, జంతువులకు ఒక భాష అంటూ లేకపోయినా ఆలోచనలకేమి తక్కువ?

 4. Malakpet Rowdy Says:

  అల్లసాని పెద్దన విషయం – మనం చదివేవి ఆయన అన్ని ఆలోచనలు కావు. తెలుగులో రచనల రూపంలో వ్యక్తపరచిన ఆలోచనలు మాత్రమే. ఉదాహరణకు ఒక చీమ కుట్టినప్పుడు ఆయన పడ్డ బాధ (ఆలోచన) తెలుగూ కాదు, బహుమనీ సుల్తానుల ఉర్దూ కూడా కాదు. కాని ఆ బాధని ఆయన పక్కవాడీకో లేక చదువరులకో వ్యక్తపరిచి ఉంటే అది తెలుగులో.

 5. అబ్రకదబ్ర Says:

  ఆలోచనకి భాషేమిటి సారూ? ఆలోచనని వ్యక్తీకరించటానికి మాత్రమే భాష – తెలుగో, ఇంగ్లీషో, బెంగాలీయో, అరబిక్కో. ఎవడన్నా ‘ఓ భాషలో ఆలోచిస్తున్నాడు’ అంటే అతను అసలు ఆలోచించటం లేదు, ఆ భాషలో మాటల గారడీ చెయ్యటానికి తయారవుతున్నాడు అని అర్ధం.

  ఇంకోలా చెప్పాలంటే – ఏ భాషా రాని వారికీ ఆలోచనలుంటయ్. ఇంకింకోలా చెప్పాలంటే – మనిషికి ముందు ఆలోచనొచ్చింది, తర్వాత అదేంటో పక్కనోడికి చెప్పటానికి భాష(లు) కనిపెట్టాడు. కాదా?

  తప్పు చెప్పానా? లేక మీరన్నదాన్ని తప్పర్ధం చేసుకున్నానా?

  సరే. ‘తెలుగోడికి అసలు సిసలు సొంతాలోచనలు కావాలి – తర్జుమా చేసినవో, తస్కరించినవో కాకూడదు’ అనేది మీ ఉద్దేశమా? ఆ మాట చెప్పటానికి ఇంత డొంకతిరుగుడెందుకు? సూటిగా చెప్పేస్తే పోలా? అదీ, తెలుగు పద్ధతి.

 6. సూర్యుడు Says:

  మీరు ఒక్క ఆంగ్లపదంకూడా వాడకుండా టపాలు వ్రాయండి, అప్పుడు మొదలుపెడదాం తెలుగులో ఆలోచించడం 😉

 7. rayraj Says:

  @అబ్రకదబ్ర:సగం నేను చెప్పిందే మీరు నాకు చెప్తున్నారు. మిగితా సగంలో సొంత ఆలోచనకావాలి “దానికి డొంక తిరుగెడెందుకు అంటారు.” సరే, ఓ పని చేయండి. తస్కరించ కుండా, తర్జుమాచేయకుండా కొత్త ’ఆలోచన’లు ఎలా వస్తాయో చెప్పండి.

  దిస్ ఈజ్ ఎ క్లారియన్ కాల్; పిలుపు; నారా : “తెలుగులో ఆలోచించండి”

  @మలక్ పేట్ రౌడి: భాష కమ్మ్యూనికేషన్ కే! మీరు ఇంకా క్రికెట్ ఆడుతున్నారు.ఆడేటప్పుడు ఎవరూ భాషల్లో ఆలోచించరు.భాషలో, కమ్మునికేషన్లో, ఆలోచనలుంటాయి. మీరు తొందరగా షాట్ కొట్టేసి, అల్లసాని వారి మొదలు, తెలుగువారి ఆలోచనలన్నీ ఎలా వస్తున్నాయో ఆలోచించండి.ఎంత తొందరగా మీరు ఆ చరిత్రలోనుంచి ప్రస్తుతంలోకి వచ్చేస్తే, అంత తొందరగా మీకు ప్రస్తుతంలో తెలుగులో “ఆలోచన” అవసరం అవగతమైపోతోంది.

  @ సూర్యుడు : నా ఆలొచన అర్ధం ఐతే, ఎవరికీ నా పోస్టులో ఆంగ్లం కనిపించదు.తర్జుమా చేయాలనే ఆలోచనే మీకు రాదు.నేనసలు ఆంగ్లం మాట్లడటం లేదు సూర్యుడు గారు; నేను తెలుగే మాట్లాడతున్నాను. కాకపోతే,మీరే నాది తెలుగు కాదు, నాకు తెలుగు రాదు అంటున్నారు.మీరు తెలుగైతే, నేనెవర్ని? నేను తెలుగువాడినేనా కాదా మీ దృష్టిలో?

 8. rayraj Says:

  @మహేష్: ఆంగ్లతీరంలో ఆలోచన బానిసత్వం. నా అస్తిత్వం కావాలి అని అడిగితే? అప్పుడు మీ పరిష్కారం ఏంటి?

  ఐనా మీకో డెఫనిటివ్ స్టేట్ మెంట్ : మొత్తం ప్రపంచం ఆంగ్లం మాట్లాడాలి అని ఎప్పటికీ, ఎప్పటికీ కోరుకోదు; నా భాష బతకాలని కోరుకుంటారు.

  తెలుగు చచ్చిపోవాల్సిందే అని మీరు నిర్ధారించి, అదే “ఆబ్సల్యూట్” అని చెబితే తిరగబడేవారే కాదు, పీకి పాతరేయడానికి కొందరు తయారౌతారు.

  ఇక ఆలోచన :
  నేను మాట్లాడాలి, వాడి భాషలో నేనెందుకు మాట్లాడాలి, ఎందుకు సినిమా చూడాలి, ఎందుకు సాహిత్యం చదువుకోవాలి ,ఎందుకు వాడి ఫుడ్ తినాలి, ఎందుకు నా ఇడ్లీ చచ్చిపోవాలి? ఎందుకు నా భాష చచ్చిపోవాలి? ఎందుకు నా దోసె చచ్చిపోయి, పిజ్జా బతకాలి? ఎందుకు నా అంబలి చచ్చిపోయి కోక్ బతకాలి? కాఫీ బతకాలి?

  చెప్పానుగా మహేష్: తొండ పురుగును తింటుంది అనేది లోకం తీరు కావచ్చు. కానీ, తొండ నుంచి తప్పించుకొని, బతుకు పోరాటం చేసే పురుగు నన్ను రక్షించు అంటే మీరెం చెబ్తారు? ఆ తొండ “అది నా ఆహారం – నాది నా కిచ్చేయ్” అంటే మీరేం చెబ్తారు.

  అందుకే అన్నాను : “పురుగు చచ్చిపోతుంది” అని చెప్పటం – శాస్త్రభాష.అబ్జర్వర్ భాష. కానీ అది నిజం కాదు. దాన్ని మించిన పాజిబిలిటీస్ చాలా ఉన్నాయి.

  బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ అని కూడా ఉంది!! పురుగులు కలిసి తొండను చంపేస్తే!!

  అలా జరగదు అని చెప్పకండి – అది మీలోని, చరిత్ర విద్యార్ధి యొక్క బ్రాహ్మినికల్ ఆటిట్యూడ్ కావచ్చు. శాస్త్రం చెప్పింది అనే నమ్మకం కావచ్చు. పోనీ శాస్త్ర బద్దంగా – చరిత్రలో మిగలనవి – డైనాజార్ల లాంటి పెద్ద పెద్ద మృగాలు ట!

 9. సూర్యుడు Says:

  @ సూర్యుడు : నా ఆలొచన అర్ధం ఐతే, ఎవరికీ నా పోస్టులో ఆంగ్లం కనిపించదు.తర్జుమా చేయాలనే ఆలోచనే మీకు రాదు.

  మీరు చెప్పింది అర్ధమయ్యిందండి. ముందు సొంతంగా ఆలోచించాలి, వినూత్నంగా ఆలోచించాలి. బాగుంది, అలా చించిన తర్వాత తెలుగులో వ్యక్తీకరిస్తే అది తెలుగు, ఆంగ్లంలో వ్యక్తీకరిస్తే (తెలుగువాడు వ్యక్తీకరించిన) ఆంగ్లం.

  “నేనసలు ఆంగ్లం మాట్లడటం లేదు సూర్యుడు గారు; నేను తెలుగే మాట్లాడతున్నాను. కాకపోతే,మీరే నాది తెలుగు కాదు, నాకు తెలుగు రాదు అంటున్నారు.మీరు తెలుగైతే, నేనెవర్ని? నేను తెలుగువాడినేనా కాదా మీ దృష్టిలో?”

  నేనలా అనలేదు, లేకపోతే నా ఉద్దేశ్యమది కాదు. తెలుగులో ఆలోచించాలని ఆంగ్లంలో వ్రాసేస్తుంటే, అలా చెప్పాను. మీరు “తెలుగులో ఆలోచిస్తే అది తెలుగు” అని ఆంగ్లంలో ఆలోచిస్తున్నారు 😉

  ఇంకా మీరు చెప్పదల్చుకుంది నాకర్ధమవట్లేదనుకుంటే వదిలేయండి, ఇంక నాకర్ధంకాదు 🙂

 10. kmcmohan Says:

  మీ అలోచనలన్నీ చాలా Incoherent గా అనిపిస్తాయి నాకు. ఏదో దండ తెగిపోయి పూసలు చెల్లాచెదరుగా నేలను పడి ఉన్నట్లుగా, ఇవన్నీ ఏదో క్రమంలో ఉండేవి… కానీ ఏ క్రమమో తెలియడం లేదన్నట్లు, మీ టపాలన్నీ, కామెంట్లు కూడా. లేక నాకు అర్థం చేసుకోగల శక్తి తక్కువేమో.


 11. ఆసక్తి కరమైన చర్చ. లేవనెత్తిన మీకు అభినందనలు. మాతృభాష కాబట్టి తెలుగంటే కొంచెం ఎక్కువ అభిమానం తప్ప, నాకు అన్ని భాషలూ ఇష్టమే. పైగా మీరంతా డిఎస్క్ట్ చేస్తున్న ఈ బుర్రలో ఏం జరుగుతుందో నాకు పెద్ద అవగాహన లేదు .. ఎవరన్నా సైకాలజిష్టుని సంప్రదించాలేమో .. కానీ, ఆలోచనల్లో కూడా రకాలు ఉంటాయేమోనని నాకనిపిస్తోంది. ఉదాహరణకి ఇంస్టిక్టుకి, అసంకల్పిత ప్రతీకార చర్యకి సంబంధించిన ఆలోచనలకి బహుశా భాష అక్కర్లేదు. కానీ ఇవ్వాళ డౌ జోన్సు ఇండెక్సు ఎగురుతుందా మునుగుతుందా అనే ఆలోచనకి భాష కావాలి (అది వ్యక్తీకరించకపోయినా సరే).


 12. […] భాషకూ , ఇలాంటి ఆలోచనలకు సంబంధం ఉందేమో అనిపిస్తుంది. ఉదాహరణకి రేప్పొద్దున ఎవరైనా నేరేడుపండు లో (నేరేడుపండే ఎందుకు అంటే ఇప్పుడు రోజు అవే కనిపిస్తున్నాయి కాబట్టి) చెర్రీ పండు లో ఉన్న సుగుణాలు ఉన్నాయి అని కనిపెట్టారనుకోండి మనం వెంటనే నేరేడుపండుని “ఇండియన్ చెర్రీ” అని ప్రొజెక్ట్ చేస్తాం.కాలక్రమేణా నేరేడుపండు అన్న పదం మరుగున పడిపోయి ఇండియన్ చెర్రీ అన్నది వాడుకలోకి వస్తుంది. మన భాషలోకి వేరే పదాలు వస్తే ఆనందిచేలా మనం విశాలంగా ఆలోచించాలి అనేవాళ్ళు ఉన్నారు. మనది అన్నపదాన్ని వేరే పదం ఆక్రమిస్తుంటే ఎలా అంగీకరించగలం? మనం ఈ వాతలు పెట్టుకోవడం ఎప్పటికి మానేస్తామో? రేరాజ్ గారు చెప్తున్నట్లు తెలుగులో ఆలోచించాలేమో! […]


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: