దేవ్ ఆన్ డ్రగ్స్: Dev-D

ఈ కధలో  – ఓ కన్ఫ్యూజ్డ్ అసమర్ధ మగ పాత్ర (దేవ్) , మూడు స్ట్రాంగ్ స్త్రీ పాత్రలు నాకు కనబడ్డాయి.

దేవ్ – ఓ పంజాబీ. చిన్నతనం నుంచి వాడు, సాధారణ విధంగా మనుష్యలను “అర్ధం” చేసుకోలేడు. ముఖ్యంగా ప్రేమ అన్న విషయంలో కాస్త కన్ఫ్యూజన్ జాస్తి. తల్లితండ్రుల ప్రేమని తెలుసుకోలేడు. ఇలాంటివాడికి, చిన్నప్పుడె “పారో” మంచి స్నేహితురాలు. బాగు పడతాడని తండ్రి లండన్ పంపించినా, పెద్దగా మానవ సంబధబాంధవ్యాలు లేని వీడు, పెద్దయ్యాక కూడా లాప్ టాప్ లో, ’పారో’ తోనే చాటింగ్ చేస్తుంటాడు. ఇండియాకు వచ్చి, ఓ పక్క పారోని ప్రేమిస్తూనే, ఇంటికొచ్చిన “రసిక”తో ఆల్మోస్ట్ రసకందాయంలో పడబోయిన, ఓ నిలకడలేని మనస్తత్వం వీడిది. పారో గురించి కుంటికూతలు వినటం వల్ల, పంటచేలో పరుపును ఏర్పాటు చేసిన పారో “ప్రేమ”ని అనుమానిస్తాడు. అవమానిస్తాడు. పిమ్మట తన కుటుంబానికి తగవు పొమ్మంటాడు. ఆ తర్వాత తన చేతుల్తో తనే పోగొట్టుకున్న అవకాశానికి వగచినా, తన అహంకారాన్ని చంపుకోలేడు. అలా తన తప్పును తనే క్షమించుకోలేక, తాగుడికి బానిస అయ్యి, రోడ్డున పడతాడు. డానీ బోయల్ సహాయంతో అనురాగ్ కశ్యప్ (దర్శకుడిగా పలు పాత్రల ద్వార) అందించిన డ్రగ్స్ కి అలవాటు పడతాడు.

పారో – వ్యక్తిత్వం ఉన్న మనిషి. తనకేది కావాలో తెలుసుకొని సాధించుకోగల సత్తా ఉన్న మనిషి. ఈ పాత్ర ఎంత హైపర్ యాక్టివ్ అంటే- అల్మోస్ట్ టు ది పాయింట్ ఆఫ్ హిస్టీరియా. తన గురించి కారుకూతల కూసిన వాడిని ఉరికిచ్చి ఉరికిచ్చి కొడుతుంది. తను ప్రేమించిన మనిషి కోసం ఏదైన అందించగల ఓ స్త్రీ మనస్తత్వం. ఆ ప్రేమని అర్ధం చేసుకోలేని మగతనపు అనుమానాన్ని, అవమానాన్ని, తొందరగానే దిగమింగేసి, తల్లిదండ్రుల చూపించిన సంబంధం –  పిల్లల తండ్రైనవాడిని – పెళ్ళి చేసేసుకుంటుంది. కధలో “రసిక”కి అన్నయ్యే ఈమె భర్త. తనతో జీవిస్తూ కూడా,  దేవ్ ఫోన్ చేస్తే వెళ్తుంది. అతని బట్టలతో సహా ఉతికి, సరిగా ఉండమని చెబ్తుంది. ఆ క్షణంలో – “ప్రేమ ను చేద్దామని” – దేవ్ అడిగితే, సిద్దపడ్డా కూడా , మునుపు ఇదే దేవ్ కోసం పంటచేలో పరుపు వేసిన పారో తిరిగి రాలేదు. ఎందుకంటే, ఇప్పుడు తన మనసు భర్తదే, తన కోరిక భర్తతోనే! ఇప్పటి ప్రేమలో కోరిక లేదు. ఈ నాన్-రెస్పాన్స్ ను, వ్యత్యాసాన్ని గమనించిన దేవ్ ఈ సారి కూడా పారోతో కలవలేడు. మనసులేని చోట ప్రేమని చేయలేడు. పారో వెళ్ళిపోతూ కూడా, మంచి అమ్మాయిని చూసుకొని జీవితం సాగించమంటుంది. అక్కడ మాటల సందర్భం లో, పెడమాటలకి పెడ సమాధనం ఇస్తే, మళ్ళీ దేవ్ తన అసమర్ధతకి తనే కుచించుకుపోతాడు.ఆ క్రోధాన్ని ఆమె మీద క్షణికంగా చూపినా, తిరిగి తాగుడికి బానిసైపోతాడు.

“రసిక” – ఓ ఢిల్లీ అమ్మాయి. ఊళ్ళో ఆడపిల్లకన్నా ఫాస్ట్ అన్నమాట. తనకి పెళ్ళి సంబంధంగా చూడబోతున్న దేవ్ తో, మొదటి పరచియంలోనే రాసక్రీడకి సిద్ధపడగల అమ్మాయి. కానీ, దేవ్ చివరి నిమిషంలో నిరాకరిస్తాడు. పారో ప్రేమకి ఇది విరుద్ధమౌతుందనేమో! “రసిక” దేవ్ ని ఇష్టపడుతుంది. కానీ, డ్రగ్ అడ్కిక్ట్ ఐన దేవ్, తిరిగి డిల్లీలో “కలవటా”నికే కలిసినప్పుడు, దేవ్ అసలు రంగు తెలుసుకుంటుంది. కేవలం కార్యం కోసమైతే, “రసిక” కూడా దొరకదని ఛీ కొట్టి వెళ్ళిపోతుంది.

చందా – అసలు పేరు అది కాదు.  డ్రగ్ సప్లైయర్ కమ్ ఫ్రెండ్ ఒకడు, దేవ్ ని రోడ్డు నుంచి చందా దగ్గరకి తీసుకుని వచ్చేనాటికి మాత్రం, ఆ అమ్మాయి పేరు అదొక్కటే కాదు. పలు రకాల కస్టమర్లని ఆమె పలురకాల పేర్లతో, భాషలతో ఆనందింప చేస్తుంది. (అసలు పేరు నాకూ గుర్తులేదు.)  కానీ చందాగా పేరుమార్చుకున్న ఆమె గతం తెలియాలి.

మంచేదో చెడోదో తెలీని కన్ఫ్యూజ్డ్ ఢిల్లీ టీనెజి అమ్మాయి చందా, ఓ అబ్బాయిని ప్రేమించింది. ఆ ప్రేమలో అతనితో సరదాగా సరసాలు పోతుంటే, దాన్నీ మొబైల్ కెమరాలో బంధిస్తాడు ఆ ప్రియుడు. స్కూలుకి వెళ్ళేలోపు, ఊరుమొత్తం పాకిపోతుంది ఆ యమ్మెమ్మెస్.  పరిణామంగా, తల్లిదండ్రులు ఆమెని కట్టడి చేస్తూ, యూకె తీసుకెళ్ళిపొతారు. అక్కడ ఓ రోజు కన్నతండ్రి “అది ఏం చేస్తోందో దానికి తెలిసే చేసింది వాడితో” అంటాడు. తండ్రివయ్యుండీ దాన్ని ఎలాగ చూడగలి గావని తిరిగి ప్రశ్నిస్తే, ఆ తండ్రి సమాధానం చెప్పలేక,  షూట్ చేసుకొని చచ్చిపోతాడు. తల్లి కూడా సపోర్ట్ చేయకపోగా, ఎవరికో కట్టబెట్ట చూస్తుంది. ఊళ్ళో మనుష్యులు తనని తప్పు బడుతుంటే, సహించలేక తిరిగి డిల్లీ పారిపోయి, జీవన పయనంలో “చందా” గా అవతారమెత్తుంది.

“చంద – దేవ్” లు పరస్పర గతాలను తెలుసుకున్నప్పడు చందాకు కావాల్సిన “ఓదార్పు”ను, నిజమైన ప్రేమతో కూడిన ఓ ఆలింగనాన్ని, చందాకి దేవ్ అందిస్తాడు.  తనకు తెలియకుండానే బహుశా మొట్ట మొదటిసారి  దేవ్, “ప్రేమను అందించడం” , ఇక్కడ తెలుసుకున్నాడు. చందాని మురికి కూపం నుంచి బయటకు లాగినా, ఆమెని స్వతంత్ర్యంగా అదే వృత్తి  చేసుకోమని సూచిస్తూ, అక్కడ్నించి వెళ్ళిపోతాడు.

తాగుబోతుగా యాక్సిడెంట్ చేసి, కేసులపాలై,  కుంగిపోయిన తండ్రి మరణానంతరం- డబ్బులిచ్చే మనిషికూడా లేక, పూర్తిగా రోడ్డున పడిపోతాడు. ఒకస్థాయిలో ఇప్పటికైనా చావునుంచి తప్పిచ్చుకోవాలని గ్రహించినా, సరియైన జీవన లక్ష్యం దొరకదు. ఓ రోజు అకస్మాత్తుగా మళ్ళీ చందాని కలిసినప్పుడు, ఈ సారి చందా వాడికి స్నానం చేయించి, బాగు చేయిస్తున్నప్పుడు,  దేవ్ తనకి తను గ్రహిస్తూ అంటాడు : “చందా నువ్వు చెప్పింది నిజం. నేనెప్పుడూ పారోని ప్రేమించలేదు. నేను ఆమెని సరిగా చూడను కూడా లేదు” ;  ఆ తర్వాత మాటాల్లో చందా, “దేవ్” వదిలి వెళ్ళిన ఉంగరాన్ని తన వేలికి చూపిస్తుంది. ప్రేక్షకుడికి, దేవ్ కి మాత్రమే తెలిసిన నిజం ఏంటంటే, ఆ ఉంగరం దేవ్ “పారో” కోసం కొన్నది. కానీ, దేవ్ ఆ విషయం చందాకి చెప్పడు.

దేవ్, చందా ఇద్దరూ కలిసి కొత్త జీవనం సాగిస్తారు.
_____________________________
సినిమాలో :
1. రసిక బస్సులో ఛీ కొట్టి వెళ్ళంగానే, దేవ్ చెవులోని హెడ్ఫోన్స్ విసురుగా తీసేయ్యంగానే, మ్యూజిక్ బ్లాస్ట్…పాట మనకి వినబడతుంది….నాకైతే భలే నచ్చింది. సినిమాలో పాటలన్నీ చాలా వెరైటీగా ఉన్నాయి. ఈ కొత్తదనం నాకు నచ్చింది.(అన్నీ సినిమాలు ఇలా తీస్తే మాత్రం కష్టం)
2.సినిమా రియలిస్టిక్ ఉంటుంది. అంటే, ఆయా సందర్భాలలో చుట్టూ వాతావరణం అలాగే ఉంటుందన్నట్టే ఉంటుంది. పాత్రలు కూడా రియలిస్టిక్ గానే ప్రవర్తిస్తాయి…బారింగ్ ప్యూ డ్రమెటైజేషన్స్…విచ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఎ మూవీ.
౩.అస్సలు నచ్చనది : లైటింగ్ ; పాత్రల మనసుల్లో చీకట్లున్నాయి అని, స్క్రీనంతా చీకటి చేసే ఈ స్టైయిల్ నాకు కొంచెం చిరాకు. ఇంతే పాత్రల చీకటికోణాలని చాలా వెలుగులో చూపిస్తాడు కరణ్ జోహర్ ( గే అయ్యుండి వాడికి ఇంత చీకటి లేదు మరి మనసులో!!) మొన్న “లక్ బై ఛాన్స్ ” లో కూడా చక్కటి లైటింగ్ ఉంది. ఎన్నో పాత్రల్లో మాలిన్యం ఉన్నా, సినిమాలో ఎక్కడా మాలిన్యం లేదే! లైటింగ్ తో సహా!!
ఈ సినిమాలో కూడా మాలిన్యం లేదు. ఎక్కడా చూపించకూడని విషయాలు చూపించినట్టుగా నాకైతే లేదు. కానీ, కొన్ని ఫాళ్ట్స్ ఉన్నాయి. అనుకున్నది సాధించే యత్నంలో డైరెక్టర్ల ప్లాట్లు అప్పుడప్పుడు తప్పుతాయి. ఈ పాట్లని (ఒకోసారి పర్వెర్షన్ ని) నేను “అర్ధం” చేసుకొని వదిలేస్తాను. ఉదా:
అ. పారో తన నగ్న చిత్రం పంపించడానికి , తనని తానే ఫొటో తీసుకొని, వేరే ఊరు వెళ్ళి, డెవలప్ చేయించి, దాన్ని స్కాన్  చేసి మరీ పంపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ లో పారో వాయిస్ దేవ్ తో, తన పాట్లు చెప్తుంది. అది, దేవ్ కోసం ఆ అమ్మాయి తెగింపు. పడ్డ కష్టం. అలాగే అర్ధం చేసుకుంటే బెటర్. లేకపోతే, ఈ రోజు అమ్మాయి వెబ్ కామ్ లో చూపించేయొచ్చు, డిజిటెల్ కామ్ తో తీసి, అప్లోడ్ చేసేయొచ్చు!!! ఈ కధాకాలంలో జరగాల్సిన విధానం అదే అని నా ఉద్దేశ్యం. యమ్మెమ్మెస్ స్కాండల్ తీసిన వీడికి ఆ మాత్రం తెలీదా!?
ఆ. చందా క్యారెక్టర్ నిజానికి ఆమెకున్న తెలివితేటలకి, ఇంగ్లీషు చదువుకి అదే వృత్తిలో దిగాల్సిన అవసరం లేదు. ఏ కాల్ సెంటర్లోనో, సేల్స్ గర్ల్ గానో, మార్కెటింగ్ ఎక్స్క్యూటివ్ గానో కూడా తన జీవితం మొదలెట్టుండొచ్చు. దీన్ని కన్విన్సింగ్ గా చెప్పడానికి,  కోడిగాడిలాగానో, పరచూరిలాగానో కాస్త క్రైమ్ పెంచి స్టోరీ రాసుకోవచ్చు. దానికంటే ఇదే బెటర్ కదా! పైగా – ఆ క్రైమ్ ఉంది అని డైలాగ్స్ తోనే చెప్పించేస్తాడు పరోక్షంగా. అందరూ అలా అవ్వరు. ఐనావాళ్ళ మీద ప్రత్యేకంగా జాలి అవసరమా అనేది నాకున్న వేరే ప్రశ్న.
ఇ. దేవ్ , చందాని వదిలేసి ఎందుకు వెళ్ళాలో నాకు అర్ధం కాలేదు. వాడు సరిగా డెవలప్ అయ్యుంటే, పారోను వదులుకుంటాడా!?
ఉ. చందా ఊరునుంచి తన తల్లికి ఫోన్ చేసి అడుగుతుంది.” నువ్వెలా చెప్తే అలాగే ఉంటాను. నన్నిక్కిడ్నించీ తీసుకెళ్ళిపో అమ్మా…” అని ; తల్లి వింటున్నా కూడా ఫోన్ ఎత్తదు. ఇది నాకు అస్సలు అర్ధం కాని విషయం. నా దృష్టిలో ఎలాంటి తల్లైనా, కూతురు రహస్యాన్ని కడుపులో దాచుకొని కాపాడుకునేది. సో, ఈ తల్లి ప్రవరనని ఇలా ఎందుకు చూపించాల్సి వచ్చిందో నాకైతే అంతు చిక్కలేదు. ఆ సీన్ లేకుండా, చంద తనంతటే తనే పారిపోయినట్టు తీసినా, నాకు పెద్దగా ఇబ్బందిగా లేదు మరి!

చందా తిరిగి ప్రశ్నించిన వెనువెంటనే, తండ్రి షూట్ చేసుకోవడం – చాలా బాగా తీసాడు అనిపించింది.ఇక్కడ ఏ మాత్రం ఇంబాలెన్స్ వచ్చిన, అసలు కన్విన్సింగ్ గా ఉండేది కాదు. నిజానికి అక్కడ విషయం తండ్రి ఎందుకు చూసాడు అని కాదు……..కోపంలో కూతురి ప్రవర్తనని దిగజారుడుతనంగా అభివర్ణించడం “తప్పు”……….ఇదే తండ్రి, తన కూతురు-అల్లుడు చాటుగా సరసాలు ఆడటం గమనించుకొని నిజానికి మురిసిపోడా!!

ఇది సమాజం తయారు చేసిన విలువల సమస్యలు కావు.ఇవి వ్యక్తిగత లోపాలు. దానికి సిసలైన ఉదాహరణ – “దేవ్ ఆన్ డ్రగ్స్” – ఓ సారి అనుమానంవల్ల, ఓ సారి అన్యమనస్కం వల్ల, మరో సారి అవమానం వల్ల….అని సార్లు అసమర్ధుడిగా మిగిలింది దేవ్……..వాడి మనస్సు వల్లే!

డ్రగ్స్ మీద ఉంటే బుర్ర ఏం పని చేస్తుంది? తనలోని తప్పును క్షమించునే సమయం, గొప్పదనం ఎప్పటికి దొరుకుతుంది?

“ఏంటీ….మీరు డ్రగ్స్ వాడారా? ” అని అడక్కండి. అదేదో వేరే సినిమాలో మాట :

” అగర్ నషా షరాబ్ మే హోతా, తో బోతల్ భీ నాచ్తీ! ” 🙂

బైదవే ఇవ్వాళే వచ్చిన ఓ ఫార్వార్డ్ మెయిల్ :
    పూసిన ప్రతిపువ్వు పరిమళించదు
    నవ్విన ప్రతి అమ్మాయి ప్రేమించదు
    ప్రేమించిన ప్రతి అమ్మాయి పెళ్ళి చేసుకోదు
    విశ్వదాభిరామ ఈ అమ్మాయిలు ఇంతేరా మామ…
 
    ఇట్లు
    మీ
    Telugu Consultancy Services

ప్రకటనలు
Explore posts in the same categories: సినిమా రివ్యూలు

ట్యాగులు:

You can comment below, or link to this permanent URL from your own site.

7 వ్యాఖ్యలు పై “దేవ్ ఆన్ డ్రగ్స్: Dev-D”

 1. vinay chakravarthi Says:

  poem baagundi


 2. ఈ దేవదాసు నవలా నాయకుడికీ లేక మిగతా దేవదాసులకీ ఎలా విభిన్నమో చెప్పకపోవడం వెలితిగా ఉంది. అ తేడా చెబితేగానీ అనురాగ్ కాశ్యప్ ఆలోచన అర్థం కాదు.

 3. hare krishna Says:

  రసిక బస్సులో ఛీ కొట్టి వెళ్ళంగానే, దేవ్ చెవులోని హెడ్ఫోన్స్ విసురుగా తీసేయ్యంగానే, మ్యూజిక్ బ్లాస్ట్…పాట మనకి వినబడతుంది….

  “ek hulchal si” song cinema mottanike highlight

 4. a2zdreams Says:

  మీ రివ్యూ చదివి హిందీ, హిందీ సినిమాలు పరిజ్ఞ్జానం లేని నేను ఈ డి.వి.డి కొన్నాను. వీకెండ్ లోపు చూస్తా ..

 5. rayraj Says:

  @a2zdreams:అమ్మో! ఏంటి – బాగోపోతే నన్నూ అనురాగ్ తో కలిపి తిడదామనా! 🙂 పర్వాలేదు, చెండాడేయండి.

  “కిక్” సినిమా నాకూ నిజంగా నచ్చింది. కాపీ కొట్టకుండా కొత్త ఆలోచనలు ఎక్కడ్నించి వస్తాయి అన్న మీ ఫ్రశ్న నా బుర్రను తొలిచేసింది. చాలా రాస్తున్నాను. చదువుతూ ఉండండి. మధ్య మధ్యలో డైగ్రెస్ ఔతుంటాను. ఎలాగూ స్ట్రైట్ సమాధానం లేదు -ఎప్పుడో మీరే పట్టేసుకొంటారు అని నా నమ్మకం. కేవలం ఆ ఒక్క విషయం మీదే, త్వరలో పోస్టు వేయడానికి ట్రై చేస్తాను.

 6. ravikanth Says:

  thaguduku banisavadam enduku

 7. rayraj Says:

  డిప్రెషన్‌లో ఉన్న మనిషికి ఏదో ఒక ఎస్కేపిస్ట్ ఔట్లెట్ ఉండాలనే నా ఉద్దేశ్యం. ఒక్కొక్కొరికి ఒక్కొక్కటి ఔట్‌లెట్. ఏది వ్యసనంగా మారినా, దేనికి బానిసగా మారినా, జీవితం కష్టమే. ఇక్కడ వీడు తాగుడికి బానిసయ్యాడు.

  మీరు ప్రశ్నించారో వ్యాఖ్యానించారో అర్ధంగాకపోయినా, మీ వ్యాఖ్యని లేట్‌గా చూసి ఎప్రూవ్ చేస్తున్నందుకు, ఇంత బదులిచ్చాను. స్పెసిఫిక్‌గా ఏదన్నా విషయం చర్చించదలుచుకుంటే, తిరిగి కామెంట్ వేయండి.


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: