గోల మీద గోల

ఇది అబ్రకదబ్రాగారీ గులాబీ గోల  పైన నా కామెంట్ అన్న మాట :

దీన్ని ఆపటం ఎవ్వరి తరం కాదు. “నిషిద్ధం” కొద్ది కాలం పరిష్కారం అవ్వచ్చు గానీ, మనం ఇంకో మంచి పరిష్కారం ఆలోచించుకోవాలి. ఇదీ సమాజంలో వస్తున్న మార్పు. వాళ్ళ జీవితం వాళ్ళది అన్నట్టుగా ఉండదు. ఖచ్చితంగా అది మన జీవితాల మీద ప్రభావం చూపిస్తుంది.

ఇన్-బార్న్‌ గా కొందరి కుంటే, అక్వైర్డ్‌గా కొందరికి వస్తుంది.  కొందరు ఆడవాళ్ళతో, మగవాళ్ళతో ఇద్దరితోనూ ఆనందించగలరు. కానీ సమాజ కట్టుబాట్లకై,  ఏదో ఒకే జెండర్‌తోనూ కాపురం చేయగలరు. ఈ విషయంలో నాకు అమెరికా వాళ్ళ వాలిడేషన్ అక్కర్లేదు. మన దగ్గర కూడా అంకెలు బానే ఉన్నాయి అని మహేష్ చెప్పారు కాబట్టి, నా అబ్జర్వేషన్‌ని కాసేపు నమ్మి, తరువాత శాస్త్రీయంగా నిరూపించుకోండి.

నా బ్లాగులో తమాయించుకున్నాను. ఇక్కడ క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. మగ/ఆడ మధ్య కూడా అనైతిక సంబంధం లేకుండా మనుష్యులు జీవించగలరు. మరీ అంత ఆపుకోలేని కోరికలు కావు ఈ కామవాంఛలు. కానీ వాటిని ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి? అని అడిగితే దానికి ఓ సామాజిక లక్ష్యం ఉంది అంటాను.

“సమాజం” అన్న ఆలోచన మనిషి ఎలా చేసుకున్నాడు? ఎందుకు చేసుకున్నాడు!?

అలాగే, ఇప్పుడు మనుష్యులు మళ్ళీ ఈ విషయం గురించి ఆలోచించుకోవాలి. విలువలు ఏర్పరుచుకోవాలి. ఇప్పటి వరకు ఉన్న విలువలని ఎలా ఆచరణ సాధ్యం చేసుకున్నామో, అలాగే తిరిగి ఆచరణ సాధ్యంగా  సాధించుకోవాలి. ముఖ్యంగా దీనికి కావాల్సిన మార్పు ఏంటంటే:

౧.  పాశ్చాత్యుల నుంచి ఓ రెడీ మేడ్ ఆలోచన దిగుమతి చేసుకోవటం మానేయాలి.

(అది సినిమాల్లోనా, టివిల్లోనా, బ్లాగుల్లోనా, సైన్సులోనా అనేది నాకూ తెలీదు. ఎక్కడో అక్కడ ముందు అది జరుగుతుంది అని ఆశిస్తున్నాను. “తెలుగులో ఆలోచించండి” అని మొత్తుకునేదే అందుకు.)

౨. ” దీనికి ఆల్రేడీ మా వాళ్ళు ఎప్పుడో పరిష్కారం కనుగొన్నారు తెలుసా?! ” – అంటూ సంస్కృతం కోట్ చేయడం మానేయాలి.
( రెండూ డిటర్మినిస్టిక్ స్టేట్‌‌మెంట్సే కదూ! )

పరిష్కారం నేనూ ఇప్పుడే ఏమీ చెప్పలేను. ఇట్స్ నాట్ ఎ రెడీ మేడ్ థింగ్. ఎందుకంటే –

“పెళ్ళి” అనేది చూడ్డానికి అన్ని చోట్ల ఉండొచ్చు, కానీ దాని వెనక ఉన్న భావనలలో చాలా చాలా వైవిధ్యాలుంటాయి. కాబట్టి, తిరిగి సాధించుకునే పరిష్కారం – “పెళ్ళి- కుటుంబం” –  అనే వాటికి మారు రూపాలే అవ్వచ్చు గాక, ఐనా అవి ఫ్రెష్‌గా ఆలోచించుకోవాలి అంటాను. వాటి భావనలు మనవైతే, అది మనదౌతుంది. అది మన సంస్కృతి ఔతుంది. ఆ “మన సంస్కృతి” అనే ఆలోచన కూడా మనుషులు నిరంతరం ఆచరిస్తూ పాఠించే ఓ “విలువ”; ఓ కామన్ ఆలోచన కాబట్టి.

హా! ఏమిటో, ఈ గోల నాకే బోరు కొట్టేస్తోంది.

ప్రకటనలు
Explore posts in the same categories: బ్లాగుల గురించి

ట్యాగులు:

You can comment below, or link to this permanent URL from your own site.

6 వ్యాఖ్యలు పై “గోల మీద గోల”

 1. అబ్రకదబ్ర Says:

  మీది విభిన్నమైన ఆలోచనా విధానం. ఐనా మీ ఐడియాలన్నీ ‘ఆవు వ్యాసం’లా చివరికి ఒక దగ్గరికే వచ్చి ఆగుతాయి అనుకునేవాడిని. ఐతే దాని వెనక కారణం ఇప్పుడిప్పుడే కొద్దిగా అర్ధమవుతుంది. సమస్యలేవైనా, అంతిమంగా సంస్కృతి ప్రక్షాళనం ముఖ్యం అంటారు. స్థూలంగా చూస్తే నిజమే కావచ్చేమో.

  ‘పరిష్కారం ఇప్పుడే చెప్పలేను’ అన్నారు. చెప్పగలిగితే మంచిదే కానీ చెప్పితీరాల్సిన అవసరం లేదు. సమస్యలు ఎత్తి చూపేవారే పరిష్కారాలు కూడా చెప్పాలని లేదు. అసలు సమస్యంటూ ఉందని కనిపెట్టటమే పరిష్కారం దిశలో తొలి అడుగు.

  మీ శైలికి భిన్నంగా సాగిందీ టపా (ఉరఫ్ కామెంట్). నాకైతే ఇదే నచ్చింది.


 2. అబ్రకదబ్ర చర్చల్లోనూ మీ స్పందనలోనూ భారతదేశంలోని ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయారు. అదే దర్డ్ జెండర్…హిజ్రాలు. సహజంగానో, సెక్స్ కోసమో లేక ఫ్యాషన్ కోసం గే/లెస్బియన్ అయ్యేవాళ్ళకన్నా వీళ్ళ సమస్యలు ఇక్కడ విస్తృతం. ఇక్కడ “సమూలమైన మార్పు”- “తెలుగు ఆలోచనా” అర్థరహితాలు. Empathy, understanding and helping them to live respectfully are the key issues. అవి మన సమాజంలో తక్కువ…బహుశా లేవు.

 3. అబ్రకదబ్ర Says:

  @మహేష్:

  ఇది మూడో ప్రవృత్తి ఉన్నవారి గురించి చర్చకాదు కదా. అది వేరే సమస్య .. అంటే హిజ్రాలు సమస్యాకారకులని కాదు. వాళ్ల సమస్యలని సానుభూతితో పరిశీలించటం, అర్ధం చేసుకోవటం ఎవరికైనా సమస్య కాదు. అదంతా వేరే పెద్ద చర్చ లెండి.

 4. rayraj Says:

  వాళ్లనెలా మర్చిపోతాం నాయనా!! ప్రతి రోజు చూస్తూనే ఉంటాంగా! మామూలుగా ఐతే వదిలించుకోవచ్చేమో గానీ, ఫంక్షన్సు రోజు మాత్రం అస్సలు వదలరు. పైగా వీళ్ళ ఆశీర్వాదం చాలా మంచిదని కూడా మరో నమ్మకం!

  సరే ఎలాగూ ప్రస్తావన వచ్చింది కాబట్టి:
  వీళ్ళకీ – గే/లెస్బియన్స్ కి మధ్య ఉన్న తేడాని వివరించగలరా?

  ఆ తరువాత:
  >>Empathy, understanding and helping them to live respectfully are the key issues. అవి మన సమాజంలో తక్కువ…బహుశా లేవు.

  వీళ్ళకు లేదనా?సాధారణంగా లేదనా?

  మరి “లేని” ఈ సద్గుణానికి మన సమాజంలో మార్పు ఎలా తెచ్చుకోగలం అంటారు?

 5. Z Says:

  నాకు ఈ కామెంట్ ఉరఫ్ టపా ఎందుకో అర్థం కాలేదు !

  “ఇప్పటి వరకు ఉన్న విలువలని ఎలా ఆచరణ సాధ్యం చేసుకున్నామో, అలాగే తిరిగి ఆచరణ సాధ్యంగా సాధించుకోవాలి. ”

  ఇలా ఎవరు చేయాలి? ఈ విషయం యువతకి ఎవరు చెప్పాలి ? అదీ మనవాళ్ళే తీసే సినిమాల మధ్య ? ఇప్పటికే తల్లి తండ్రులకి ‘మామూలు’ ఆకర్షణల గురించి పిల్లలతో మాట్లాడటమే నగుబాటు కదా !

  “పాశ్చాత్యుల నుంచి ఓ రెడీ మేడ్ ఆలోచన దిగుమతి చేసుకోవటం మానేయాలి.”
  అటు దోస్తానా, కల్హోనహో లాంటి సినిమాల మధ్య? ఇవి మనం దిగుమతి చేస్కోపోయినా, మన మీద దింపడానికి రత్నాల్లాంటి క్రియేటివ్ డిరెక్టర్లు ఉన్నారు కదా !

  (సహజంగా గే/లెస్బియన్ వాళ్ళ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ !)

  ఇలాంటివి చూసి ప్రభావితం కాగలిగే యువత, మనం ఎంత మాట్లాడుకున్నా ఇక్కడ, సమాజం ఇంకా
  గౌరవించేట్టు లేవు కాబట్టి ఈ సంబంధాలు, ఏదో ప్రయత్నిద్దాం, స్త్రీలు, పురుషులు ఇద్దరితోనూ అనుకునే అవకాశం ఉన్న వారి గురించి నా ప్రశ్న !

  క్షమించాలి, కానీ చిరజీవి మానిఫెస్టోలా అంత వివరంగా అనిపించలేదు మీ టపా ! ( లేదా, నాకు అర్థం అయ్యుండకపోవచ్చు ! )

  ఇదో పెద్ద సమస్యా ? మనకున్న సమస్యల్లో అంటే కాదు, విషయం వచ్చింది కాబట్టి ఏదో నా మూడు ముక్కలు !

  మహేష్ గారితో నేను ఏకీభవిస్తాను ! కేవలం వాళ్ళు వేరుగా ఉన్నారని, వాళ్ళని చీదరించుకోవటం మాత్రం నిజంగా మనం బాధపడాల్సిన విషయం ! పెళ్ళయ్యీ అక్రమసంబంధాలు నెరిపే వారి కన్నా, వీళ్ళు మన సంస్కృతికి మచ్చలు అని నేను అనుకోను ! మహాభారత కాలంలో కూడా బ్రిహన్నల లాంటి వారు ఉన్నారు కదా ! అది కొందరికి సహజమనే గుర్తించాలేమో !


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: