Mr.Z..మ్యానిఫెస్టో ఇంకా లేదు గానీ…

Mr.Z:
౧.డోంట్ కోట్ ఫ్రమ్ సంస్కృతం.
బృహన్నల ఉన్నాడు, శిఖండి ఉన్నాడు……..ఆ విధంగా నిజంగా చాలా విషయాలు మన సంస్కృతిగా చెప్పుకోవచ్చు. కానీ దాన్ని కోట్ చేసుకున్న మరుక్షణం – దాంతో పాటు బోళ్డంత వేరే బ్యాగేజి కూడా వచ్చేస్తుంది. అది రాసింది బ్రాహ్మాణులని, అసలు వాళ్ళ వల్లే ఈ వివక్ష అని, బోళ్డంత సమస్య అని వగైరా వగైరా……….ది పాయింట్ ఈజ్ – అది ఎవరు రాసినా, వాళ్ళనే ఈ సమస్యలకు మూలంగా చెప్పుకోవచ్చు!! పైపెచ్చు, సంస్కృతంలో మనకున్న  “ఆలోచన” ని, కొందరు మేధావులు మన ఆత్మగౌరవ సమస్యలకి పరిష్కారంగా వాడారు. దాని వల్ల మనకి వచ్చిన ఓ మైండ్ సెట్ ఏంటంటే, ప్రతి దానికి “మన పురాతన రోజుల్లో బహు వైభవంగా ఉండేది” అని. ఎవడికి తెలుసు ఉందొ లేదో! నాకు తెలిసి దేర్ ఈజ్ నో గోళ్డన్ ఏజ్………….ఇట్ ఈజ్ ఆల్ వెరీ రెలటివ్……..సో దేర్ ఈజ్ నో పాయింట్ ఇన్ “అండర్మైనింగ్” దోస్  ఒరిజినేటర్స్ ఆఫ్ దీస్ ఐడియాస్. బట్ యస్ – ఇవ్వాళ్ళ మనం అలాగే మళ్ళీ రాసుకోవచ్చు. కాబట్టి, చరిత్రలోనో/ పురాణాల్లోనో సమాధానాలు వెత్తక్కండి. మళ్ళీ “కావాల్సిన చరిత్ర” ని రాసే ఆలోచన చెయ్యకండి. ప్లీజ్!

౨. పాశ్చాత్యుల నుంచి దిగుమతి మానేయాలి.
ఎప్పుడైతే మనదైన ఆలోచనలని మనం వదిలేస్తేమో – ఇక ఆలోచన కొనసాగించాడానికి ఆధార భూతమైన “రూపాలు” ఎక్కడ్నించి వెతుక్కుంటారు. అదిగో అక్కడ్నించి మనం పాశ్చాత్యుల ఆలోచనల మీద పడతాం. అందుకే సినిమాలు, కధలు, కవితలు, అన్నీ……. సమస్తం అక్కడ్నించీ మనకి దిగుమతి అవుతాయి. (మీరు చెప్పిన సినిమాలు క్రియేటివ్ కాదు – దిగుమతే! ఇప్పుడు క్రియేటివ్ డైరెక్టర్లు బహు తక్కువ లెండి.)

నతీజా :
మెల్లిగా, మన ఆలోచనలో మనకి మిగిలింది ఏదీ? అనే భయం పుట్టుకొస్తుంది. అప్పుడు – మళ్ళీ సంస్కృత ఆలోచనలో ఆణిముత్యాలు వెతుకుతుంటాం. ( మధ్య మధ్యలో మన “మాస్” నుంచి, సంస్కృతికి సింబల్సు తెస్తాం!! ) ఈ సైకిల్ చాలా కాలంగా జరుగుతోంది. ఈ సైకిల్‍ని బ్రేక్ చేయ్యాలంటే – పాశ్చాత్య ఆలోచనలపై ఆధారం చేసుకుని, కొనసాగించిగా వచ్చిన కొత్త కొత్త ఆలోచనలన్నీ “మన సంస్కృతి” లోకి తీసుకురావాలి.

అవి ఎలా తీసుకొస్తాం!?
ముందుగా అసలు అలాంటివి ఏవి!? అని ఆలోచిస్తే, అవ్వన్నీ మన భాషల్లో లేవు. కాబట్టి, ఇన్‌స్టెంటుగా అవ్వన్నీ “నీవేరా” అని ఈ దేశ ప్రజలకు అందించ లేకపోతున్నాం.

ఇక ఎలా తీసుకొస్తాం!? అన్న పాయింట్ కొద్దాం :
మాష్టారూ, మీరు రాసిన శైలిని బట్టి చూస్తే మీరు అంత అమాయకులు కారు అని తెలుస్తూనే ఉంది. ఎవరు తీసుకురావాలి?

ఈ సమాజ భావన, ఈ ప్రజాస్వామ్య విలువలు, ఈ సామాజిక విలువలు, ఈ కమ్మ్యునిస్టు విలువలు, ఈ సోషలిస్టు విలువలు, ఈ కుటుంబ భావనలు, ప్రేమ భావనలు, మన సంస్కృతి అనే భావన ఎవరు ఏర్పరుస్తే వస్తున్నాయి??

పోనీ – ఈ స్టాక్ మార్కెట్లు, ఇండెక్సులూ, వాటి ఆటుపోట్లూ, అందులో సెంటిమెంట్లూ, ఫండ మెంటల్స్, ఎవరు ఏర్పరుస్తే వస్తున్నాయి???

ఆడిటింగ్ వ్యవస్థ, న్యాయవ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, కంపీనల రెగ్యులేషన్సు, కంపెనీలు, ఉద్యోగాలు, ఉద్యోగుల జీత భత్యాలు, ఫిఫ్ ఫండ్లు, పన్నులు , బ్యాంకింగ్ రంగం, భీమా రంగం, సాంకేతిక రంగం – ఎవరు ఏర్పరుస్తే వస్తున్నాయి????

చివరికి మనం రోజూ దొడ్డికెళ్ళే “డ్రైనేజి వ్యవస్థ” ఎవరి వల్ల వస్తోందీ!????

ఇంకా సమాధానం చెప్పాలా?
 – “ఆలోచనపరుల” వల్ల ఏర్పడుతున్నాయి.

కనీసం ఇక్కడ్నించి,మీరూ ఆలోచించి – కొత్త విలువలు ఎలా “వ్యవస్థీకృతం” చేస్తారో చెప్పండి. 🙂

ఒకటి “ఆదర్శప్రాయం”గా ఉంటుంది. దాన్ని అనుసరించే ప్రజలు “ఉన్నత” వర్గీయులౌతారు. ప్రజలు దాని వెనక బడి ఫాలో ఔతారు. దీన్ని ఏ తత్త్వశాస్త్రం మీకు చెప్పాలి!?
(ఎందుకు మొన్న ఆ కధను తిట్టానో ఇప్పుడన్నా అర్ధమైందా!?; కధలు “కధ”లుగా ఐతే పర్వాలేదు. కానీ అవి “సమస్యల”కి కధలుట!! అప్పుడు ఖచ్చితంగా ఏకి పారాయాల్సిందే. )

ఓ సారి, ఓ  డిఆర్‌డియల్‌ సైంటిస్టుతో కూర్చుని ఓ అనువాదం చదివాను.
“భజ గోవిందం, ఓ  మూర్ఖుడా, భజ గోవిందం – చచ్చేకాలం దగ్గరకొస్తే ఈ డృక్ఙ్ఞకరణాలు ఏమీ రక్షించవు ” అని.
                   ఆయన పగలపడి నవ్వాడు.
 “ఏంటి జోకు?” అని అడిగాను.
                 ఆయన అన్నారు : ” అలాగ శంకరులు జనాలని నాశనం చేసాడు. దాంతో మనవాళ్ళు అన్నీ వదిలేశారు”
( ఆయన ఇంట్లో సత్యసాయి బాబా భజనలు జరిగేవి. సందర్భం కూడా అదే. ఆయన ఎప్పుడూ తనని నాస్తికుడుగా చెప్పుకోలేదు.)

ఇది కాంట్రవర్షియల్ వ్యాఖ్య ఔతుందేమో గానీ :
అసలు ఈ సమస్యకు కారకుడు వివేకానందుడు. దేశాన్ని నిద్రలేపుదామని బయల్దేరి – “నీ ఆధ్యాత్మికతే నీ కున్న గొప్ప ఆస్థి” అని చెప్పాడు. అద్వైతం అన్నాడు. ఇదిగో అక్కడ్నించి బయలు దేరి, ఇవ్వాళ్ళొచ్చి ఇక్కడ బడ్డాం. మనం యంత్రాలు ఎందుకు కనుక్కోలేం అనుకున్నాడో!? మనం కొత్త విలువలు ఎందుకు సృష్టించలేమనకున్నాడో – నాకూ తెలీదు. కానీ, నా ఉద్దేశ్యం ఆ బోడి అద్వైతం నుంచి, నూతన “ఆవిష్కారాలు” సాధిస్తూ పురోగతి సాధిస్తామనుకున్నాడేమో!! అరే – అద్వైతాన్ని సైన్సుకి ఎలా అప్లై చేద్దామని ఒక్కడన్నా ఆలోచించాడా!?? ( మళ్ళీ కనుక్కున్న ప్రతి ఆవిష్కారలకి మాత్రం తగుదునమ్మా అని అప్పుడు, ఫిట్ చేస్తారు.)

ఇక గేస్/ లెస్బియన్సు అంటారా – చెయ్యచ్చు. చాలా చెయ్యచ్చు. ఆ మధ్య  చిరంజీవి చేసాడు ఎయిడ్సు కి – కానీ దాని వెనక “ఆలోచన” మాత్రం మంది కాదు. అది వేరే విషయం.  

బట్ చిరంజీవి చెప్పాడు – “మొన్న ఓ అబ్బాయి ముంబాయి వెళ్తుంటే, ఆ అబ్బాయి తండ్రి,  అతనికి చెప్పిన మాటలివి. ఏం చేస్తావో తెలీదు గానీ ఎయిడ్సు తెచ్చుకోకు. కాండోమ్సు వాడు అని. ఆ మాటలు చెప్పిన తండ్రిని నేను. ఆ అబ్బాయి రామ్ చరణ్ తేజ్” 

రిచర్డ్ గేర్ కూడా వచ్చాడు. శిల్పా శెట్టిని “ముద్దు” పెట్టుకున్నాడు.!! (ఇందులో ఏది మన సంస్కృతికి తగ్గ ఆలోచనో నేను మళ్ళీ చెప్పక్కర్లేదుగా)

ముక్తసరిగా చెప్పటం నాకు రాదు. అందుకే ఈ పోస్టులు. మ్యానిఫేస్టో  రాసే శక్తి నాకు లేదేమో గానీ – ఐడియాలజీ రాసుకోవాలి, ఇంప్లిమెంటేషన్‌కి సాధనాలు వెతుక్కోవాలి. సృష్టించుకోవాలి. అవన్నీ ఆచరణ సాధ్యంగా, విలువలుగా మార్చ గలగాలి.

సమూల మార్పు, సంస్కృతి ప్రక్షాళన నా పదాలు కావు. మహేష్, అబ్రకదబ్రాలు వాడితే మొహమాటానికి ఊరుకున్నాను. అంతే గానీ, “పాత రూపాలను ఊడ్చేయాలి” అని నేనెప్పుడు అనను. ఊడిస్తే వచ్చే కసువు ఏ డ్రైనేజిలో వేస్తారో కూడా ఆలోచించ మంటాను. అలాగే డ్రైనీజిని చీదరించుకుంటే, మీరు కొత్తగా సాధించింది కూడా ఏమీ లేదు అంటాను. సో ఈ సారి డ్రైనీజిని మీరు కనుక్కోవాలి, ఈ సారి దానికి ఓ “కొత్త విలువ”ను  సృష్టించుకోవాలి అంటాను.

ముఖ్యంగా మన మహేష్ తో వచ్చిన సమస్యేంటంటే..ఉదా: “మన సమాజంలో ఎంపతీ లేదు. రెస్పక్టబిలిటీ లేదు.” అంటాడు. దీనికి బోళ్డు శ్లేషార్ధాలు వస్తాయి.

అసలు ముందు “మన సమాజంలో లేదు” అనంగానేనే కాల్తుంది నాకు అది వేరే విషయం 🙂

లేకపోతే ఏం చేయాలి అంటాను నేను? ఇంకోడేమో – ఐతె ఎక్కడున్నాయి అంటాడు?  ఒక వేళ “అది పాశ్చాత్య ప్రపంచంలో ఉంది”  అంటే – కొందరికి అది నచ్చదు. చివరికి నాక్కూడా….ఒక కారణం పైన చెప్పిందే…ఇంకా…ఎందుకంటే

౧. ఎప్పుడైతే మన సమాజంలో ఏదో లేదని అనిపించిందో, అప్పుడు మనం మన సమాజం కోసం ఏదో ఒకటి చేయాలి. అది “మనది” అని “చెప్పి” చేయాలి. అలా “చెప్పకపోతే” వచ్చే నష్టం ఏంటో పైన చెప్పాను.

౨.ఒక వేళ మనం ఏం చెయ్యకుండా, ఊరికే కంప్లైంటు మాత్రమే చేసే టైపైతే – యూ నో ఈవెన్ ఐ గెట్ డిస్గస్టెడ్.

(మహేష్ : డోంట్ జంప్ ది గన్. ఐ యామ్ ఎవేర్ – యూ ఆల్రెడీ టాక్డ్ ఎబౌట్ డూయింగ్ సం థింగ్స్ విత్ యువర్ ఫ్రెండ్ )

Mr.Z, కాబట్టి దీనికి ఎవరు చేయాలి అనేదేమీ లేదు. ఎవరైనా చెయ్యచ్చు. ఏది చేసినా “మనది” అన్న భావం కలిగించేలా చెయ్యాలి. అది ఎలా!? ఆలోచించుకుంటూ, చేసుకుంటూ ముందుకు పోదాం 🙂

ముక్తసరిగా చెప్పాలంటే :  నగుబాటు ఎందుకు!? ఇండియాలో  పిల్లలు ఖచ్చితంగా తల్లిదండ్రుల చెప్పినవి వింటారు. మొహమాటంగానైనా మొదలెట్టాలి. తిండి రుచి చూపించింది మనమే!

“ఏమిరోయ్ మరదలుతో సరసాలా” అంటాడు ఓ తాతయ్య ఓ ఆరేళ్ళ బాబుని పట్టొకొని.

“బావా బావా పన్నీరు బావని పట్టుకు తన్నీరు” అని నేర్పించిందీ “మన సంస్కృతి” లోనే!!

“నీ బావే కదా..ఎప్పటికైనా మొగుడే” అని కూడా “మన సంస్కృతి” లో మాట్లాడారు. ఎవరు చెప్పారు “మన సంస్కృతి” లో పిల్లలతో సెక్సు గురించి మాట్లాడలేదని?

చెప్పానుగా – “రూపాలు” మారుతున్నప్పుడు, ఇంకొంచెం బెటర్‌గా ఎలా చెప్పాలి అని “ఆలోచించ” లేదు. బట్ ఒన్ ధింగ్ – ఈ “బావమరదళ్ళ” ముసలి జోకులు చిన్నప్పుడు నాకు చిరాకు పెట్టేవి.  🙂

ప్రకటనలు
Explore posts in the same categories: Uncategorized

ట్యాగులు: ,

You can comment below, or link to this permanent URL from your own site.

5 వ్యాఖ్యలు పై “Mr.Z..మ్యానిఫెస్టో ఇంకా లేదు గానీ…”


 1. సమస్య గురించి మాట్లాడుతున్నవాళ్ళంతా “కేవలం మాట్లాడుతున్నారు” అని మీకెందుకనిపిస్తుంది? సమస్యకు సమాధానం వెతక్కుండా కంప్లైంట్ “మాత్రమే” చేస్తున్నారు అని ఎందుకనుకుంటారు? Come to me..I will show you how every question I raise is being answered by some one or the other at different levels.

 2. rayraj Says:

  మహేష్…నోట్ దిస్ :
  (మహేష్ : డోంట్ జంప్ ది గన్. ఐ యామ్ ఎవేర్ – యూ ఆల్రెడీ టాక్డ్ ఎబౌట్ డూయింగ్ సం థింగ్స్ విత్ యువర్ ఫ్రెండ్)

  >>”కమ్ టూ మి….”
  యస్ ఐ వజ్ కమింగ్ టు యువర్ బ్లాగ్ టు సీ ఇఫ్ యు ఆర్ గివింగ్ సమ్ ఆఫ్ దోస్ ఆన్సర్స్……..
  ఎందుకంటే… ఆ సమాధానాలన్నీ “మనవి” ;
  “మనవి” అన్న ఆత్మగౌరవం, ఉత్సాహం, ఆశ్చర్యం, ఆనందం కూడా దక్కిస్తారేమో అని 🙂

 3. Z Says:

  క్రియేటివ్ డైరెక్టర్లు అని నేను వ్యంగ్యంగా వాడానండి బాబు ! 🙂 మీరేమో దానికో పారాగ్రాఫ్ కేటాయించారు !

  నేను మహాభారతం మనకి ఆధారం అన్న ద్రుష్టితో చెప్పలేదు ! ఒకవేళ అది కథే అని మీరు నమ్మినా, అది ఎప్పుడో, చాలా కాలం క్రితం రాసిన ‘కథే’ అయ్యుంటుంది కదా ! అంటే ఎప్పటినుంచో ఉన్నాయి ఇలాంటివి, ఇవి కొత్త పోకడలు కాదు ( సహజ గే ల గురించి) మన సమాజంలో అని చెప్పటానికి ఆ ఉదాహరణ తీసుకున్నాను ! బహుశా మీరు అద్వైతం ప్రసక్తి తెచ్చింది కూడా అందుకే అనుకుంటాను ! 😀

  మీరు చెప్పింది ఈ సారి నాకు కొంచెం అర్థమయ్యింది !

  ఇకపోతే,”పాశ్చాత్యుల నుంచి దిగుమతి మానేయాలి.” — నేను అంటున్నది ఏమిటంటే,
  సినిమా ఒక పెద్ద మాధ్యమం,ఇలాంటి ‘క్రియేటివ్’ డిరెక్టర్లు(వ్యంగ్యం అని గుర్తించగలరు !) అలాంటి సినిమాలు తీయకుండా, ఆపలేము కదా, అలాగే మన టీవీ(ఎంటీవీ, ఈటీవీ దగ్గర్నుంచి) ఛానళ్ళు ప్రసారం చేసే చెత్తని ఆపగలమా ? ( నా బుర్ర కి ఎలా అన్నది అస్సలు తట్టట్లేదు, మీకేమైనా తెలుసేమో అని … అడిగాను ! )అంతెందుకు, వస్త్ర ధారణలో వచ్చే కొత్త పోకడలు ఆపగాలుగుతున్నామా?
  మీ ప్రతిపాదన ఎలా చేయవచ్చో, నా దగ్గర కూడా సమాధానం లేదు ! ఇది మీరు అన్నట్టు,సమాజం మొత్తం చేయాలి అనే ప్రాతిపదిక కన్నా, ప్రతి వ్యక్తీ తనకు తానూ పాటించే విలువ అవుతుంది అని చెప్పవచ్చు !

  చిన్న అభ్యర్దన: ఇంగ్లీష్ మాటలు రాసేటప్పుడు, దయచేసి ఆంగ్ల లిపిలోనే రాయమని మనవి.అది తెలుగులో రాయటం వల్ల, చదివేందుకు నాబోటి వాళ్ళకి(ఎవరైనా ఉంటే?) కొంత ఇబ్బందిగా అనిపించవచ్చు ! 🙂

  “మరదలుతో సరసాలా”-అంటున్నారు గనక,
  ఆ వయసులో కలిగే ఆకర్షణలు, పాటించవలసిన విలువల గురించి, విపులంగా, ‘నగుబాటు’ లేకుండా విలువలు నేర్పటం చేస్తున్నారు అని మీరు అంటే, నేనేమి చెప్పగలను ? నాకు తెలిసి,చాలా మంది తల్లితండ్రులు పిల్లలతో చర్చింట్లేదనే అనిపించింది ! మళ్ళీ, ఇలాంటివి అందరి దృష్టికి, చేయాల్సిన పనుల జాబితాలో రావాలంటే, ప్రసార మాధ్యమాలు నడుంకట్టాలి ! who is to bell the cat? ఇవి అంతులేని ప్రశ్నలే లెండి ! ఇక్కడితో ఈ చర్చను ముగిస్తాను !

  “ఈ “బావమరదళ్ళ” ముసలి జోకులు చిన్నప్పుడు నాకు చిరాకు పెట్టేవి. 🙂 ”
  ముసలి జోకులా :-)) !

 4. rayraj Says:

  రెండే ముక్కలు:
  ౧. ఆ చెత్తను ఆపలేం. కానీ మనం చేసే కొత్త ఐడియాలన్నీ, మనం ప్రపంచానికి తోయగలం. కాబట్టి, ఇలాంటి బ్లాగింగు ప్రపంచంలో, తెలుగులో కొత్త కొత్త ఆలోచనలు చేయాలి. సాహిత్యం పుట్టాలి. పాలసీలు పుట్టాలి. కొత్త కొత్త విషయాలు, వాటిపై ఐడియాలజీసు, చర్చలు జరగాలి. దీన్ని చదువుకోవడానికి మరింత మంది ప్రజలు తెలుగులోకి(తెలుగువాళ్ళన్నా) రావాలి. అలా ఇక్కడ్నించి ఐడియాస్ ని రివర్స్‌లో పైకి ఎక్కించగలం. నాకు చాలా నమ్మకం. కనీసం తెలుగు సినిమాలు, టివీలకైనా ఎక్కించగలం. ప్రస్తుతానికి అది కూడా దిగుమతే..వెర్నాక్యులర్ కంటెంటే…చాలా ఘోరంగా ఉంది. కాపీ పేస్టుకు ఛాన్సు లేదు కదండీ 🙂
  ౨.నేడు పిల్లలతో చర్చించటం లేదు. నిజమే. కానీ, ఓ టైములో ఈ భావాలన్నీ కుటుంబంలోనే ఎక్కించే వాళ్ళము. కాబట్టి మనం పిల్లలతో చర్చించలేమని అనుకోవద్దు. Subtleగా ఐనా, చేయగలం. (అంటే, అలా పిల్లలకి ఇంట్లో ఎక్కించడం పాత ఐడియానే అని…….మీ బృహన్నల ఉదాహరణలా…:) )

 5. Z Says:

  “అలా ఇక్కడ్నించి ఐడియాస్ ని రివర్స్‌లో పైకి ఎక్కించగలం. నాకు చాలా నమ్మకం. కనీసం తెలుగు సినిమాలు, టివీలకైనా ఎక్కించగలం. ”
  మీ నమ్మకం చూస్తుంటే, ముచ్చటేస్తోంది !!! good luck ! 🙂


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: