సెంచరీలు కొట్టే వయస్సు మాది

ఇది నా 99వ పోస్టు. పేజీలుగా విడగొట్టిన ఈ పోస్టుకి, ఇదే మొదటి పేజి.
పైగా ఇది అబ్రకద్రగారి పోస్టుకి సమాధానం! 🙂
మొత్తం సైజు, ఎప్పటికంటే ఎక్కువ గాదు లెండి.

 రెండవ పేజి మన సినిమా, టెక్నాలజీ, కథలు
అనుకరించిమని చెప్పే బోధనలే మన అసలు సమస్య.
సొంత ఆలోచనతో అస్తిత్వం విస్తరిస్తుంది.
టెక్నాలజీ: బడ్జట్ పరిమితులున్నా సాంకేతిక ప్రగతినీ  సాధించవచ్చు.
కథలు : మనవి కూడా విశ్వజనీయమే! 

మూడవ పేజి : సొంత స్థాయి
సొంత స్థాయిని సృష్టించాలి.
మనం ఛేదించిన లక్ష్యాలని సాధించే దిశగా, ప్రపంచాన్ని పరిగెట్టించాలి.
నియమ నిబంధనలనూ మనమే నిర్ణయించాలి.

నాలుగవ పేజి: అనుకరణ
అన్ని రంగాల్లోనూ అనుకరించడానికే ప్రయత్నస్తున్నాం.
కనుకనే, మనదైనది అనేది ఏదీ మిగలటం లేదు.
చక్కగా అనుకరించటం వస్తేనే, సృజనాత్మక వస్తుందన్న రూలేమీలేదు

ఐదవ పేజి: హెచ్చు-తగ్గులు
సమానత్వభావం నిలబడితే, హెచ్చు- తగ్గులకు స్థానం లేదు.
కానీ, ఇవి ఎలా ఏర్పడుతున్నాయి అనేది అవగాహన చేసుకోవాలి.

ఆరవ పేజి: మార్కెట్టు
చిట్టచివరికి, పోటీ కేవలం మార్కెట్టు ఆధిపత్యానికే ఐతే,
మన సినిమాని సరిగ్గా నిర్వచించుకోవాల్సిన సమయమిది.
“తెలుగు సినిమా”గానూ, అందునా తెలుగంటే, “తెలుగు భాష” అని నిర్వచించుకున్నాను.
కాబట్టి, భాష గురించి కూడా చర్చించాను.

అనుకరణ కాదు. ఆలోచనలు ముఖ్యం. తెలుగులో ఆలోచనలు చెలరేగితే – 
సినిమాలు తీసేవాళ్ళలోనూ, చూసే ప్రేక్షకుల్లోనూ మార్పులు వస్తాయి. చెలరేగే అన్ని రకాల
ఆలోచనల నుంచే, సొంత ఆలోచనలు పుడతాయి.
దాని వల్ల, మనదైన ఓ “స్థాయి”ని సృష్టించవచ్చు.
మనం స్టాండర్డ్స్‌ని ఏర్పరిచి, ప్రపంచాన్ని మనవెనుక పరిగెట్టించవచ్చు.

బ్రీఫ్‌గా ఐతే, అదీ విషయం. టైము చూసుకొని, ఒక్కొక్క లింకునొక్కి  చదువుతూ, పేజీలలోని
పాత పోస్టు లింకులనూ మరోసారి చూస్తే, ఈ సారి భావం సుస్పష్టమవ్వచ్చు.  
మీరే ఇంతకన్నా చక్కగా చెప్పగలరు. అర్ధం చేసుకోగలరని ఆశ.

మన సినిమా,టెక్నాలజీ, కథలు;    సొంత స్థాయి;    అనుకరణ;    హెచ్చు-తగ్గులు;    మార్కెట్టు;

ప్రకటనలు
Explore posts in the same categories: Uncategorized

పేజీలు: 1 2 3 4 5 6

ట్యాగులు:

You can comment below, or link to this permanent URL from your own site.

6 వ్యాఖ్యలు పై “సెంచరీలు కొట్టే వయస్సు మాది”

 1. అబ్రకదబ్ర Says:

  కొంత కన్‌ఫ్యూజన్, కొంత క్లారిటీ – ఎప్పట్లాగే. కానైతే, ఎప్పటికన్నా సూటిగా, స్పష్టంగా ఉందీ భాగభాగాలుగా చిన్నదన్నట్లు నమ్మిస్తూ రాసిన పెద్ద పోస్టు 🙂 అభినందనలు దానికి, ముందుగా.

  ‘అనుకరించటమైనా నేర్చుకోమనండి’ అన్న నా మాట సాంకేతికత వరకు మాత్రమే వర్తిస్తుంది. ఇతరులు కనిపెట్టిన టెక్నాలజీని ఉపయోగించుకోటం అనుకరణ కాదు. అది తెలివిగలవాడు చేసే పని. దాన్ని వాడటం సరిగా నేర్చుకోమని నేనంటున్నాను. వేరేవాడు ఫలానా కొత్త రకం కెమెరాతో ఫలానా యాంగిల్లో ఒక వింత షాట్ తీస్తే మనమూ అదే పని చెయ్యటానికి ప్రయత్నించాలా? ప్రయత్నించితిమిబో, అది మన కథకి అతికినట్టుండాలా లేదా? అదీ – నేనంటుంది. పెట్టుకునే వాతలేవో సరిగా పెట్టుకుంటే మనమూ పులిలానే కనిపిస్తాం. మనవాళ్లేమో వాతలెట్టుకుని కోతుల్లా అగుపిస్తున్నారు. ‘సరిగా అనుకరించండి’ అనేది ఈ విషయంలో. ఇక్కడ సృజనాత్మకతతో సంబంధం లేదు. ‘తెలుగులో ఆలోచించటం’ కూడా అవసరం లేదు. మీరే అన్నట్లు, హాలీవుడ్ సినిమాలూ కాపీలు కొడతాయి – కథాంశాల దగ్గర్నుండి సాంకేతిక హంగుల దాకా. కానీ అతుకులు తెలీకుండా కుట్టటం వాళ్ల ప్రత్యేకత. మనమూ ఆ పని చెయ్యాలి. దీనికే నిబద్ధత కావాలి. ‘హమ్మయ్య, మనమూ చేసేశాం. ఓ పనైపోయింది’ అన్నట్లు చెయ్యకూడదు. త్రివిక్రం శ్రీనివాస్ స్టైల్లో చెప్పాలంటే, ‘బలంగానో, కసిగానో కాదు. శ్రద్ధగా కొట్టాలి’. అప్పుడెప్పుడో మహేష్ అన్నాడు,’చేసేది వెధవ పనైనా అందులోనూ నిజాయితీ ఉట్టి పడాలి’ అని. అద్గదీ – అది ఉట్టి పడ్డప్పుడు మనం ఉట్టికేంటి, స్వర్గానికీ ఎగరొచ్చు.


 2. మానవ ఉద్వేగాలు, అనుభూతులు యూనివర్సల్. కానీ వాటిని పొందే పరిస్థితులు,అనుభవాలూ యూనివర్సల్ కాదు. అవి ప్రాంతానికి,సంస్కృతికి,వేరువేరు సమూహాల ప్రజలకీ వేరువేరుగా ఉంటాయి. When I say our stories, I actually mean saying a universal story in “our context”.

 3. rayraj Says:

  🙂 thanks a ton….for reading it and giving the feed back.

  నిజానికి మీ చక్కటి విశ్లేషణతో విభేదించేది ఏమీ లేదండీ. మీరన్నట్టు వాడి టెక్నాలజీని “వాడుకోవడం” తెలివిగలతనమే!

  కానీ, ఎప్పటికీ టెక్నాలజీ కోసమై వాడి మీద ఆధారపడవలసిన అవసరం లేదు కదా! మనం ముందుకి పోవాలి కదా? దానికి మనం ఏం చెయ్యాలి?

 4. rayraj Says:

  శ్రద్ధని, నిజాయితీని నేను అంగీకరిస్తాను. “నిబద్ధత లేమి” అనేది నేను అంగీకరిస్తాను.
  “చక్కగా చదువుకొని, పొందికగా పరీక్షలో సమాధానాలు రాయాలి నాన్నా!” అనీ, “పనిలో శ్రద్ధ ఉండాలి బాబు” లాంటి సలహాలతో విభేధించేదేమీ లేదు.

 5. అబ్రకదబ్ర Says:

  మనం ఏం చెయ్యాలనేదానికి నాకు తోచిన సమాధానం నా రెండో భాగంలో చెప్పాను (స్టుడియో పద్ధతి రావాలి) అంతకన్నా మంచివి కూడా ఉండొచ్చు. మీరేమనుకుంటున్నారో చెప్పండి.

 6. rayraj Says:

  స్తూడియోలు ఎలాగూ వస్తాయండీ. మీరు కోరుకో అక్కర్లేదు. అవి వచ్చేశాయని కూడా మేరే రాసేశారుగా!
  నిజానికి స్టూడియోలకీ, ఇప్పటి నిర్మాతలకీ ఆట్టే తేడాయేం లేదండి. కాకపోతే, సో కాళ్డ్ ప్రొఫెషనలిజం వస్తుంది. “ఇంగ్లీషు”లో మాట్లాడగలిగేవాళ్ళకీ, ఇక్కడివారికి సైకోఫాంటులవ్వకుండా, విదేశీ సినిమాలకి సైకోఫాంటులైన మరి కొందరికి ఛాన్సులొస్తాయి. అదీ మంచిదే ! కానీయండి.

  మీరు టీవీప్రోగ్రామ్సు ఎలా “కాపీ” అయ్యాయో చెబితే అర్ధం చేసుకున్నట్టుగా లేరు కదా! పోన్లెండి.
  కానీ నేను చెబ్తున్న సమాధానం – ” “తెలుగు”లో ఆలోచించండి”. అంతకన్నా నేను చెప్పలేను. 🙂
  ——————————————————

  @మహేష్ :
  మీ భావం నాకు ముందే అర్ధం అయ్యింది. నా భావమే మీరు పట్టుకోవట్లేదు.
  గల్ఫ్‌వార్‌లో సినిమా తీసినా , అదీ మన కాంటెక్స్టే అంటున్నాను.

  ఇంగ్లీషువాడికంటే ముందే మీరు, “స్పార్టాను యోధులు” అనే “300” సినిమా తీసేసి, ప్రపంచం అంతా అమ్ముకోగల సత్తా మనకీ ఉన్నదీ అని చెప్తున్నాను. అది మూడొందలు లాగా కాకుండా, “మగధీర” లాగానే రాసుకొని తీసినా ఓకే! నిజానికి హీరో గత జన్మలో రాయ్‌గడ్ మనిషి కానక్కర్లేదు! వాడు స్పార్టను యోధుడే అయ్యుండొచ్చు. అప్పుడు కూడా ” ధీర వీర…” అంటూ పాటని పెట్టొచ్చు అంటాను.

  కానీ ఓ “300” సినిమా చూసొచ్చాక, అలాంటి ఫైటుతో సినిమా తీద్దాం అని మాత్రం ఆలోచించ వద్దు అని చెబ్తున్నాను.

  ఇప్పుడు మీ ప్రశ్న – ” ఐతే ఆ “౩౦౦” సినిమాలో ఆ ఫైటు అలా తీద్దాం అనే ఆలొచన వాళ్ళకి ఎలా వచ్చింది? ” అని వేసుకొని, సమాధానం చెప్పండి.

  టెక్నాలజీని కూడా చాలా ర్యాండమ్‌గా వాడుతుంటే, వచ్చే ఎఫ్ఫెక్టుల్లోనుంచి “కొత్త ఆలోచనలు” పుడతాయి. తద్వారా చేతిలో ఉన్న పనిముట్టుని కొత్త ఆలోచనకు తగ్గట్టుగా మారుస్తాం. అది మరో టెక్నాలజీ ఔతుంది.

  నే చెబుతోందేమన్నా అర్ధం ఔతోందా? ఈ ప్రాసెస్ ఒక్క టెక్నాలజీకే వర్తించదు! అన్ని రంగాలకీ వర్తిస్తుంది.


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s