మరో చిన్న విక్రమార్క ప్రయత్నం

ఇప్పుడే మళ్ళీ ఓ చిన్న ప్రయత్నం:

౧. (చందమా రావే లాంటి) కొన్ని నోషన్స్ మారినప్పుడు కల్చర్ ఎగిరిపోతుంది.
౨.అలా అని –  “ఇప్పటి కొత్త నోషన్సు అప్పుడే ఉన్నాయి తెలుసా!” అని ఇరికించకూడదు.(కూడదు అనేది డిటర్మినిస్టిక్ – కానీ ఇప్పుడు తప్పదు)  అలాంటి నోషన్సు ఉన్నా లేకున్నా “ఇప్పుడు” ఆ కొత్త నోషన్సు సృష్టించుకోవాలి.
౩.ఇప్పుడు సృష్టించుకునే నోషన్సు – భవిష్యత్తుకి పనికొస్తాయి.( అవి కూడా మారుతుంటాయి)

ఐతే, ఇప్పుడు మనం కేవలం అనుకరిస్తున్నాం గానీ, సృజన చేయటం లేదు.  సొంత కాంట్రిబ్యూషన్సు ఏవీ “మనవి” అన్న పేరుతో లేవు. వాటిని తెలుగులోకి తేవాలి.
వాటిని రూల్సులాగా చెప్పకూడదు. ఏ విషయం గురించైనా చర్చలు, ఆలోచనలు జరుగుతుండాలి. (జరుగుతున్నాయిగా అనుకుంటారేమో! జరగటం లేదు. ఆ విషయం గుర్తించినప్పుడే “ఆలోచనలేని అనుకరణలు”  అని ఎందుకంటున్నానో మీకు తెలుస్తుంది.)

అలా ధింకింగ్ సొసైటీగా తెలుగును భావించినప్పుడే, కళాసృష్టి మారుతుంది. అంతవరకూ, మన సినిమా యొక్క టార్గెట్ ఆడియన్సుకి అందించగలిగే “విషయం” కొన్ని పరిమితులలో ఇమిడిపోతుంది. ఆ పరిమితికి మించిన విషయాన్ని, ఇంగ్లీషు సినిమాకి వదిలేస్తారు. కానీ, ఇంగ్లీషు సినిమా మన మార్కెట్టును వదిలేయదు. ఆ విధంగా, ఆ పరిమితి గలిగిన విషయాలు కూడా మిగలవు. తద్వారా తెలుగులోని “విషయం” మరింత క్షీణిస్తుంది. అందుకని, అలాంటి – పరిమితులులేని విధంగా తెలుగుని తీర్చిదిద్దుకోవాలి. అంటే, ప్రతి విషయమూ తెలుగులో దొరుకుతుండాలి. దానికి మార్గం “అనువాదం” కాదు. అన్ని విషయాల మీద “ఆలోచన”.

ఒక్క ఉదా: చెప్తాను: “మొబైల్ ఫోన్ వాడకం” అన్న విషయం మీద ఇంగ్లీషులో ఆలోచించకూడదు. తెలుగు వాళ్ళం తెలుగులో చర్చించాలి. పరిష్కారం తిరిగి “ఇంగ్లీషు” లోకంలో పుట్టినా, ఆ విషయం గురించిన ఙ్ఞానం తెలుగులోనూ, తెలుగు ప్రజల్లోనూ ఉంటుంది. ఏదో ఒక కథలో,  ఏదో మొబైల్ ఫోనుకు సంబంధించిన విషయం “అర్ధం”కానప్పుడు, తెలుగు పాఠకుడు దాని గురించి ఎలా తెలుసుకుంటాడు?

వాడెలా తెలుసుకుంటాడో అనేది పక్కన బెట్టిన కూడా, వాడు తెలుసుకోలేడేమో అన్న ’అనుమానం’ ఓ తెలుగు కధ పరిధిని తగ్గిస్తోంది అని తెలుసుకోండి చాలు!

పోనీ ఇంకో ఉదా:
ఇంగ్లీషు మీడియంలో పిల్లాడికి ఓ ఎసైన్మెంటిస్తే, వాడు నెట్లో వెతొక్కొని వెళ్ళి “కాపీపేస్ట”న్నా చేస్తున్నాడు. తెలుగులో అసలు అలాంటి ఎసైన్మెంటూ లేదు! ఉన్నా – వాడు తెలుగులో గూగుల్ చేసి తెలుసుకోగలడా!? అక్కడే ఆలోచనలకు అగాధం పడిపోయింది. బట్టీయానికున్న ప్రాముఖ్యత – సొంతగా శోధించి తెలుసుకొని, తిరిగి చెప్పడానికి తగ్గిపోయింది.

ఐతే, తెలుగులో లభ్యమున్నంత విషయపరిఙ్ఞానంతోనైనా, ఈ మార్పు చేయవచ్చును కదా?  అని మీరు ప్రశ్నించవచ్చు. నిజానికి చేయవచ్చు. అందుకని “విద్యావిధానంలో మార్పు” అని తన్నుకోవచ్చు. అలా మనం తన్నుకుంటూ ఉన్నంత సేపు, ఇంగ్లీషు విద్యార్ధికున్న అడ్వాంటేజి, తెలుగు విద్యార్ధికి లేదు.
(గమనిక: దీన్ని అధిగమించేసిన తెలుగువాళ్ళు వెనకబడటం లేదు. దీన్ని అధిగమించ లేని అధిక సాధారణ తెలుగు విధ్యార్ధుల వల్లే, తెలుగు క్షీణిస్తుంది.!! ఇంగ్లీషు అనుకరించ బడుతుంది. అధిగమించిన తెలుగులకి ’కావాల్సిన తెలుగు’ మాత్రం కేవలం ఒక నాస్టాల్జియా!)

మరో ఉదా: కొన్ని గెస్చర్స్ :
చంకలు కొట్టుకోవడం, “అయ్యోరాత!” అని తలకొట్టుకోటం, “ఔనా!” అంటూ బుగ్గన వేలేసుకోవటం,…….
నాకు తట్టని బోళ్డు మనవైన ఎక్స్‌ప్రెషన్సుకి స్మైలీలు కనుగొందాం అని ఎవడు ఆలోచించాలి? తెలుగు వాడే ఆలోచించాలి కదా!!! అది లేనప్పుడు మన భాష, మన ఎక్స్‌ప్రెషన్సు అన్నీ మారిపోవటం లేదు!!!! ఇంగ్లీషువాడి టెక్నాలజీలోకి మన భావాన్ని ఇముడ్చుకోవటంలేదు!?

అంతెందుకూ! కొన్ని బూతులు వాడినప్పుడు చేయిని కదుపుతూ చెప్పే విధానం- మధ్య వేలుని చూపించడంతో రీప్లేస్ ఐపోతోందా లేదా!!

ఆ విధంగా – చివరికి తెలుగులో ప్రకటించే విధానం కూడా మారిపోతోంది. అప్పుడు తెలుగు ప్రత్యేకత ఏముంటుందీ!?

దీనికి నేను చెబుతున్న పరిష్కారం – ” మనం మిడిల్ ఫింగర్ చూపకుండా, చేయి ఊపే చెప్దాం. అదే మన సాంప్రదాయం” అని కాదు.
మన ఎక్స్‌ప్రెషన్సు తగ్గట్టూ మనమూ ఏదో ఒకటి టెక్నాలజీలు చేసుకోవడానికి “ఆలోచించాలి”! నిజానికి అప్పుడే అలా చేయి ఊపడం తరువాతకాలంలో ప్రపంచం అంతా ఫాలో అయ్యే ఫ్యాషన్‌గావచ్చు!

నిజానికి అన్నీ మారిపోతుండగా,ఇప్పుడు ఈ రేంజి విషయేలే “తెలుగుదనం”గా నడిచిపోతోందని గుర్తించండి!!

ఛ! మళ్ళీ ఇక్కడా ఓ మిస్టేకైపోయింది. నిజానికి ఇంత లో-లెవల్ విషయం చెప్పటం నా ఉద్దేశ్యం కాదు. నిజానికి ఇదే అనుకరణని, ఇలాంటి ఉదాహరణలతోనే విప్లవ్ మీకు మొన్న నవతరంగంలో చెప్పారు. దాన్ని హిపోక్రసీ అనుకున్నారు. ఒకవేళ హిపోక్రసీ ఐనా, దాని వెనక కారణం, “ఇంగ్లీషువాళ్ళలా చేయటం రిఫైన్మెంట్” అనే ఆలోచన, గుడ్డిగా అనుకరింఛే స్థాయికి నాటుకుపోవటమే!

పోనీ, ఇంకో ఉదా:

పెళ్ళి యొక్క నోషన్ మన సమాజంలో మారిపోతోంది. కనీసం ఈ విషయం గమనించి, దానికి తగ్గట్టుగా “పెళ్ళి” అన్న విషయానికి కొత్త అర్ధం చెప్పుకోవాలి. ఎందుకంటే “పెళ్ళంటే నూరేళ్ళ పంట! ” అన్న నోషన్‌ని ఇక వాడలేమని గ్రహించండి! ఇప్పుడు ఓ క్రియేటివిటీ ఉన్నవాడు పెళ్ళంటే ఏంటో అంతే అందంగా ఇప్పటికి తగ్గ నోషన్సును చెప్పగలగాలి అంటాను. అంతేగానీ, ఫలాన ఇంగ్లీషు సినిమాలో “పెళ్ళి”కి ఎంత చక్కటి నిర్వచనం చెప్పాడు చూడు! అది తెలుగులో తీద్దాం అనుకోకూడదు. అలాంటి అనుకరణతో – అసలు విషయం మరుగన పడిపోయి, ఇమిటేషనే బయటికి మిగులుతుంది.

అసలైనా, ఇంతెందుకు? మగధీర సినిమాలో ఆ ఫైటుని అలా తీద్దాం అనే ఆలోచన ౩౦౦ సినిమా నుంచి కాపీ కొట్టాడు అని తెలుసుకుంటాం. మరి ౩౦౦ సినిమా తీసేవాడికి ఆ  ఫైటు అలా తీద్దామనే ఆలోచన ఎలా వచ్చింది!!!???  సమాధానం చెప్పండి
( పాత స్పార్టను సినిమాల నుంచీ అనో, వాళ్ళ బుర్రకథల్లోనించీ  అనో చెప్పకండే!!! 🙂 )

ప్రకటనలు
Explore posts in the same categories: Uncategorized

ట్యాగులు:

You can comment below, or link to this permanent URL from your own site.

5 వ్యాఖ్యలు పై “మరో చిన్న విక్రమార్క ప్రయత్నం”

 1. అబ్రకదబ్ర Says:

  >> “వాడెలా తెలుసుకుంటాడో అనేది పక్కన బెట్టిన కూడా, వాడు తెలుసుకోలేడేమో అన్న ’అనుమానం’ ఓ తెలుగు కధ పరిధిని తగ్గిస్తోంది అని తెలుసుకోండి చాలు!”

  Agreed 100%. అందుకే మన తెలుగు కథలు ఎప్పుడూ భావోద్వేగాల చుట్టూనే పరిభ్రమిస్తుంటాయి – అందరికీ అతి సులువుగా అర్ధమౌతాయి కాబట్టి(అది తప్పని కాదు, కానీ ఎప్పుడూ అవేనా?). సరే, ఆ బాధంతా నా టెల్గూ స్టోరీలో ఆల్రెడీ పడిపోయాను కాబట్టి మళ్లీ మొదలెత్తుకోను. బాధ పడేసి ఊరుకోకుండా, ఆ పరిధి పెంచటానికి నాకు చేతనైన యత్నం చేద్దామని నేనో కథ రాశాను (నా రెండో కథ). త్వరలో ఓ తెలుగు దినపత్రికలో వస్తుంది. ఎదురు చూడండి.

 2. rayraj Says:

  ఖచ్చితంగా ఎదురు చూస్తాను.చదువుతాను.

  ఒకప్పుడు తెలుగు కథల గురించి మీరు ఒక మైయిల్ చేసారు. (నేను రిప్లై ఇవ్వలేకపోయాను.ఇవ్వలేను.అదో నియమం/ఇబ్బంది.క్షమించి వదిలేయండి) ఆ దిశగా మీరు అడుగులు వేస్తూ ముందుకి వెళ్తున్నారని అనుకుంటున్నాను.All the best.

  అందరూ కథలు రాయలేరుగా! కొందరికే క్రియేటివిటీ.అందులో కొందరికే విపరీతరాజయోగమూ ఉంటుంది.:) మీకూ ఆ యోగం పట్టాలని కోరుకుంటున్నాను.(మిగిలినవారివల్లే అసలు ఇకోసిస్టం తయారౌతుంది.ఆ ఇకోసిస్టం గురించే నా ఆలోచన)

  ఇంతకీ దినపత్రిక పేరు చెబితే,దాన్నే ఫాలో ఔతాంగా!


 3. ఈ మధ్య కాశీభట్ల గారి “తపన” అనే చైతన్యస్ర్రవంతి శైలిలో రాసిన నవల చదివాను. ఆ నవల ముందుమాటలో రచయిత చెబుతాడు,‘సోమరి పాఠకులను దృష్టిలో పెట్టుకుని రచయిత మీడియోకర్ రాతలు రాస్తే ఎట్లా! అందుకే పాఠకుల మెదడుకి పనిచెప్పే నవల రాయాలనుకున్నాను’ అని. కాబట్టి రాసుకుంటూ పోవడమే.

 4. అబ్రకదబ్ర Says:

  వివరాలు ఫైనలైజ్ అయ్యాక అందరికీ చెబుతాను 🙂


 5. దివ్వెల దీపోత్సవం మీ అందరి జీవితాల
  దివ్యకాంతి నింపాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ…
  ఆశీస్సులనందిస్తూ……మీ యందరి రాఘవేంద్ర


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: