“వెళ్ళితిరై” మీద నా ఐడియా

ఈ మధ్యే నేను “వెళ్ళితిరై” అనే సినిమా చూశాను.

అది అలాగే ఉఛ్ఛరిస్తారో లేదో తెలీదు. ఆ సినిమా టీవీలో వస్తోంది. ప్రకాష్ రాజ్‌ను చూసి, ఆ సీనెందుకోనచ్చి, మధ్యలోంచి చూడటం మొదలు పెట్టినా, సినిమా ఆసాంతం చూసేలా చేసింది.

నాకు ’సినిమా వాళ్ళ కథలు’  తీసే సినిమాలంటే సాధారణంగా చిరాకు. ఏ సబ్జెక్టూ తెలియక, వాడి చుట్టూరా వాడికి జరిగే విషయాలనే సబ్జెక్టు చేసుకొని సినిమా తీసుంటారని, అలాంటి ఏడుపుని చూసే ఉద్దేశ్యం నాకస్సలు ఉండదు. ఇప్పుడు  “సత్యం” లాంటి సినిమా ఉందనుకోండి, ఆ కథలో హీరో నిజానికి సినిమా పాటలు రాసేవాడే కానక్కర్లేదు. ఏ ప్రొఫెషన్లో వాడైనా, ఆ స్టోరీ అలాగే తీయొచ్చు. కానీ హీరో సినిమా పాటలు రాసే వాడెందుకయ్యాడు?
ఒకటి: ఈ సినిమాకి ఏదన్నా ఒరిజినల్‌లో అలా ఏదో ఉండి ఉంటుంది. లేకపోతే, సినిమా తీస్తున్న దర్శకులూ మరీ పాషనేట్ సినిమా దర్శకులవ్వటం వల్ల, సినిమాలోకం తప్పితే మరేమీ తెలీనే తెలీకపోవటం వల్ల. అంటే, పొట్టకోస్తే అక్షరం ముక్కరాదు. సినిమా ముక్కలే వస్తాయన్నమాట!

ఈ కోవలో నాకు ఈ మధ్య నచ్చిన సినిమా ఒకటి- లక్ బై చాన్స్(హిందీ); రెండు: ఈ వెండితెర…సారీ, అదే వెళ్ళితిరై. తమిళం రాకపోయినా బానే అర్ధం ఐపోయింది. ప్లాట్ ఇక్కడ చూడండి.

ప్రకాష్ రాజ్ మోజర్ బేయర్ తో కలిసి నిర్మించతలపెట్టిన మూడు సినిమాల్లో మొదటిది ట. డైరెక్టరు కొత్త ట.

ఈ డైరక్టరు పొట్టకోస్తే ఏం వస్తాయో తెలీదుగానీ, ఇందులోని శరవణన్ పాత్ర మాత్రం కాస్త చదువుకున్నవాడిలా, డిగ్నిఫైడ్‌గా ఉంటూ డైరెక్టరౌదాం అనుకునేవాడన్నమాట. అదీ నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం.

సినిమా మీద మిక్స్‌డ్ రివ్యూస్ కనిపించాయ్. ప్రకాష్ రాజ్ బాగా చేయలేదని భావించినవాళ్ళూ ఉన్నారు. శరవణన్ పాత్ర ఇంప్రాక్టికల్‌గా ఉందేమోనన్న భావాన్ని వ్యక్తం చేసినవాళ్ళూ ఉన్నారు. నాకలా ఏమీ అనిపించకపోయినా, ఈ సినిమా తయారీలో దర్శకుడు, నటనలో నటులే,  వాళ్లకలా అనిపించడానికి ఆస్కారం ఇచ్చారనే నాకూ అనిపిస్తోంది. సెకండ్ హాఫ్‌లో ప్రకాష్ రాజ్, దర్శకుడూ ఇద్దరూ ఎక్కడో పట్టు తప్పారు. పృథ్విరాజ్ నేను చూసినంతలో మొత్తం అంతా బానే చేశాడు.

ఇది నిజానికి ఒక మళయాళ సినిమాకి రీమేక్‌ట! ఐతే, ఆ మళయాళ సినిమానే మరో రెండు ఇంగ్లీషు సినిమాలకి కాపీయేమోనన్నారు. నాకు మాత్రం ఈ సినిమానే ఒరిజినల్ అనిపించింది. కాబట్టి, ఇది ఓకే అనుకుందాం. పోలికలని నిజంగానే “ప్రేరణ” అనుకుంటాను (ఫ్రేం బై ఫ్రేం ఏ సినిమానుంచి కొట్టాడో తెలిసేదాక.)

అలాగే శరవణన్ పాత్రని మళయాళంలో మొహన్‌లాల్ చేశాడు కాబట్టి, పృథ్వీరాజ్ ఈజీగా చేయగలగటమో, దర్శకుడు తీయగలగటమో జరిగింది. ఈ తమిళ సినిమాకి మాత్రం ప్రకాష్ రాజ్ నటన ఆయువుపట్టుగా ఉంటుంది. ఎటొచ్చీ, ప్రకాష్‌రాజ్ పాత్రకు తెలీకుండా, “సినిమాలోని సినిమా” క్లైమాక్సుని  తీసే విధానం బాగుంటూనే-బాగోలేదు. సినిమాలో తీయబడుతున్న ఆ రెండో సినిమా మీద కూడా శ్రద్ధపెట్టి, దాని కథనీ మన ఎరుకలో నడుపుతూ, “దాని క్లైమాక్స్‌కి ఈ సీన్లని” ఎలా కలుపగలడూ అనే ఉత్కంఠత కలిగేలా తీస్తే, ఇంకా ఇంకా బావుండేది. ఈ సారి తెలుగులో మళ్ళీ ప్రయత్నించుకోవాచ్చేమో!

అంటే, “బొమ్మరిల్లు” ని తమిళ్ రీమేక్ చేసినట్టు, “చుక్కల్లో చంద్రుడి”ని తమిళ్ రీమేక్ చేసినట్టు – ఇందులోని బెస్టు పార్ట్స్ అస్సలు చెడకుండా ఉంచుతూనే, కావాల్సిన  “సినిమాలో సినిమా” భాగాలు మాత్రం వేరే తీసుకొని, క్లైమాక్సు మొత్తం మార్చేసుకోగలగాలి. అది ఇంప్రూవైజషన్ ఔతుంది. ఇంకా బాగా తీయొచ్చు.

కాస్టింగ్ ఎవరూ అంటారా! సమస్యే! ఒప్పుకుంటే-  ప్రకాష్ రాజ్ పాత్రని రవితేజ చేతా, శరవణన్ పాత్రని కొత్తవాళ్ళ చేత చేయస్తే ఎలా ఉంటుంది? లేకపోతే శరవణన్ పాత్రని – నవనీత్‌నిగానీ, ఉదయ్ కిరణ్‌నీగానీ, పెట్టి ట్రై చేస్తే!

బైదవే! ఐ రియల్లీ వండర్ హవ్ దే మేక్ ది సేమ్ మూవీ అగైన్ జస్ట్ లైక్ ఒరిజినల్….ఐ యాం టాకింగ్ ఎబౌట్ ది టూ వెర్షన్స్ ఆఫ్ “బొమ్మరిల్లు”, “చుక్కల్లో చంద్రుడు”, హిందీ-తమిళ్ “గజనీ”  ఎట్సెట్రా.

ప్రకటనలు
Explore posts in the same categories: సినిమా రివ్యూలు

ట్యాగులు:

You can comment below, or link to this permanent URL from your own site.

3 వ్యాఖ్యలు పై ““వెళ్ళితిరై” మీద నా ఐడియా”


 1. ఈ సారి నుండి ఇలాంటి మంచి సినిమాల రివ్యూలు వ్రాస్తే నేఱుగా మన నవతరంగానికి పంపేయండి. నవతరఙ్గమ్@జీమెయిల్.కోమ్ – మీ బ్లాగుకు కూడా పాపిలారిటీ వస్తుంది.

 2. mohanrazz Says:

  ఇదే సినిమాని తెలుగు లో “ఒక విచిత్రం” అనే పేరు తో “తెనుగీ”కరించాడు దర్శకుడు తేజ. దారుణంగా బోల్తాపడిందా సినిమా.

 3. rayraj Says:

  సినిమాస్టారుకి తెలీకుండా సినిమా తీసే ఓ తింగరి ఐడియాని తిక్కగా తీస్తే తెలుగువాళ్ళు తిరగ్గొటారు.(అందుకే మనవాళ్ళమీద నాకు నమ్మకం. అది వేరే విషయం)

  ఐతే, ఇలా తెలీకుండా సినిమా తీయడం అనే ఐడియాతో చాలా రకాల సినిమాలున్నాయి. ఓ మిస్టర్ బీన్ సినిమా కూడా చూశాను (కొంచెం తేడాగా). కాబట్టి, నాకు ఆ ఐడియా ఓకే ; కానీ ఎక్సిక్యూషన్నో వెళ్ళితెరై మెరుగు.దీన్ని మరింత మెరుగు పెట్టొచ్చు.

  వెళ్ళితిరైలో గానీ, దాని ఒరిజినల్ అనుకుంటున్నా ఇంగ్లీషుసినిమాల్లోగానీ, ఫేకు సీన్లు ఎలా వాడుకుంటాం ముందే తెలిసిపోతూ ఉంటుంది. అలా కాకుండా, ఫేకు సీన్లుగా తీయబడ్డవీ మరో వైవిధ్యమున్న సినిమాగా నడుస్తూ, ’ఈ సీన్లు ఆ సినిమాలోకి ఎలా జతచేయగలరు?’ అని విధంగా ప్రేక్షకుడికి ఉత్కంఠ రేకిత్తించాలి.చివరికి, ఎంటైర్లీ డిఫెరెంట్ ప్రెజెంటేషన్లో సినిమాలోని సినిమా క్లైమాక్సు వేరుగా ఉండాలి. సుమారుగా చెప్పాలంటే నిన్న నవతరంగంలో ఎడిటింగ్ వ్యాసంలో ’ఒకే ఫేసుని వేరువేరు సీక్వెన్సులలో చూపిస్తే వేరువేరు భావాలు కలిగాయి’ అన్న ప్రయోగంలా ఉండాలి.


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: