డబ్బు చేసుకుందాం రా!

కీ.శే. ధీరుబాయ్ అంబానీకి, వార్టన్ బిజినస్ స్కూలు వారో అవార్డిచ్చారు. అప్పటి ప్రసంగంలో ఆయన ఇలా చెప్పారు. ’భారతదేశంలో  ప్రతి విషయానికి ఓ దేవుడు ఉన్నాడు. ప్రతి పనీ దైవానికి సంబంధించిందే! అందుకే, ధనానికీ సంపదకీ కూడా “లక్ష్మీదేవి” ని దేవతను చేశారు. కానీ, మధ్యలో ఎక్కడో “వెల్త్ క్రియేషన్” – “సంపద సృష్టించడం” అనేదాన్ని, భారతీయిలు చిన్న చూపు చూశారు’ అని.

పొద్దులోనూ అదే జరిగింది. ఇంటెర్నెట్టుతో తెలుగువాళ్ళు ( అంటే తెలుగులో ఉండే “అంతర్జాలం” నుంచి) డబ్బులు ఎలా చేసుకోవాలో “ఆలోచించటం” మొదలు పెట్టి అర్ధంతరంగా మానేశారు. ఇక్కడ పాయింటు – ఆలోచన మొదలెట్టినవాళ్ళు ముందుకెళ్ళారా లేదా అన్నది గాదు; తెలుగులోకంలో ఇలాంటి “ఆలోచనలు” ముందుకెళ్ళాయా లేదా అన్నది. క్యాచ్ మై పాయింటూ!? ఇదే ఆలోచనని కొంచెం ముందుకు నేను తీసుకెళ్తాను. చదివి మీ అభిప్రాయం చెప్పండి.

ముందు ఒక్క విషయం. వ్యాపారానికి “రహస్యం” అవసరమే. కానీ, వ్యాపారపరమైన “ఆలోచనలు”, తెలుగులోనూ ఉండటం అవసరం అంటాను. కాబాట్టి ఎంత వరకూ వ్యాపారరహస్యమో, ఏది వ్యాపారాత్మక ఆలోచనో,  తేడా తెలుసుకోవడం “వ్యాపారదక్షత” కలిగినవాళ్ళకి తెలుస్తుంది. తప్పటడుగు వేసి, ఓ అవకాశం చేజార్చుకున్నా,అది “నేర్చుకోవడం” అవుతుంది. తప్పడడుగులూ వేసే ధైర్యం ఉండాలి. ఆ తరువాత సొంతనడకనీ అలవర్చుకోవాలి.

సృజనాత్మకత కూడా అంతే! ఒకోసారి, అలాంటి తప్పటడుగే, ఓ కొత్తదారిని చూపిస్తుంది. సక్సస్ ఫార్ములాలు వదిలేయండి. ఓడిపోవటానికీ “సిద్ధ”పడండి. (అంటే ఓడిపోదాం అని నిశ్చయించు కోవటం కాదు. ఓడిపోతే, ఏది పోతుందో ముందే తెలిసి ఉండటం; ఏది మిగులుతుందో, ఏ తరగని ఙ్ఞానాన్ని పొంది, ముందుకు వెళ్ళగలమో తెలుసుకోవడం).

ఇక వ్యాపార ఆలోచనలోకి వద్దాం. ’పొద్దు’లో చెప్పినట్టు, మీ సైటుకి గానీ, బ్లాగుకు కానీ వేలల్లో, లక్షల్లో విజిటర్లు వస్తేగానీ ఆ ఉచిత అడ్వర్టైజింగుల నుంచీ డబ్బురాదు. అంటే, ఇక్కడ మూడు విషయాలు గమనించాలి.
౧. ఇంటర్నెట్టులో తెలుగులో చదివే  (సదరు అంతర్జాలంలో),  తిరిగే జనాభా చాలా ఉండాలి.
౨. అలాంటి జనాభాలోంచి, మీ సైటుకీ చాలా మంది రావాలి.
౩. అలా వచ్చిన వాళ్ళు, ఆ అడ్వర్టైజ్‌మెంట్లు చూసి, వాటిని క్లిక్కుకొట్టి కొనటమో, లేదా మరేదన్నా ఓ “చర్య”నో చేయాలి.

అప్పుడు, ఆ ప్రకటనదారు, ఎన్ని క్లిక్కులు కొట్టారో లెక్కగట్టి, సదరు బ్లాగు యజమానికో, సైటు యజమానికో డబ్బులిస్తారు.

ఇక్కడ “చర్య” అంటే, ఆ ప్రకటన తాలూకూ “క్లిక్కుకొట్టి,  కొట్టుకివెళ్ళటం” కావచ్చు, లేదా ఓ వస్తువుని “కొనుగోలుచేయటం” కావచ్చు;
అలాగే, ఆ కొట్టు అంతర్జాలంలోనూ ఉండొచ్చు, బాహ్యప్రపంచంలో  రోజూ మనం వెళ్ళే కొట్లూ కావచ్చు. 

టివీలోనో, రేడియోలోనో, పేపర్లోనో ప్రకటన ఇస్తే, అది సర్వజనులకూ తెలుస్తుంది.అందులో ఆ ప్రకటన కొందరు విన్నా, కన్నా,  ఎందరికి దానిపై ఆసక్తి ఉందో తెలుసుకోలేము. ప్రకటనకు ఎంత ఖర్చుపెట్టినా, దాని వల్ల అసలు లాభమున్నదీ లేనిదీ ప్రత్యక్షంగా తెలియదు. అందుకని, ఇంటర్నెట్టులోని ప్రకటనలను, ఇందుకు భిన్నంగా చేయడానికి ఇష్టపడతారు. ఆ ప్రకటనను చూసి, ఆసక్తి కలవారే క్లిక్‌కొట్టే విధంగా చేయగలగాలి. అక్కడ్నించీ, వస్తువు/సర్వీసు యొక్క అమ్మకందారు, అలా ఆసక్తి కనబర్చిన వారి వెంటబడొచ్చు.  ఇంకొందరైతే, దానిపై ఆసక్తి ఉండేవారికే ఇష్టమైన “కంటెంట్”ని,  సైట్లో/బ్లాగులో పొందుపర్చి, వచ్చిన విజిటరు క్లిక్‌కొట్టే అవకాశాన్ని పెంచుకున్నామని తలుస్తారు. (అక్కడే పప్పులో కాలు కూడా వేస్తారు. అది మళ్ళీ ఎప్పుడన్నా చెప్పుకుందాం.)

పై మూడు పాయింట్లలో, తెలుగువారిగా మనకుండే సమస్యల కొన్ని చెప్తాను.

౧. తెలుగులో చదివే జనాభానే తక్కువగా ఉందని కొందరంటారు. పోనీ, వాళ్ళ సంఖ్య పెద్దదే అనుకున్నా, అందులో “ఇంటర్నెట్టులో తెలుగు” చదివేవారు ఎందరుంటారు!? వీళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వీటికి కారాణాలు అనేకం. వాటిగురించి ఒక్క పోస్టులో చర్చించలేం. కానీ, ఒక్క విషయం.  నేను చెబ్తున్నట్టుగా, తెలుగులోగానీ ఆలోచించడం మొదలెడితే, ఈ సంఖ్యని జామెట్రికల్ ప్రోగ్రెషన్లో పెంచుకోవచ్చు.

౨. జనాలు మీ సైటుకే, లేక  మీ బ్లాగుకే ఎందుకు రావాలి అనే విషయంలో ఎవరి వ్యూహాలు వాళ్లవి. వాటిగురించి ఓ పోస్టులో చెప్పలేం. 

ఇక్కడ సినిమాలకీ, సైట్లకీ, టివీలకీ, పుస్తకాలకీ ఉన్న సాపీప్యత ఒకటి గుర్తుచేస్తున్నాను. ఎప్పుడైతే, “తెలుగులో” జనాభా తక్కువ ఉంటుందో, అప్పుడు ఉన్నంతలోనే పోటీ పెరిగి, చివరికి దీన్ని “మాస్, క్లాస్” అని విభజించి, చీపువార్తలతో, సంచలనాత్మక విషయాలతో జనాభాని ఆకట్టుకుంటారు. ఈ రకమైన కంటెంటు వల్ల ఎప్పటికీ తెలుగు మార్కెట్టు క్షీణిస్తునే ఉంటుంది. (అలాంటి తెలుగువల్ల పొట్టగడవదు. అందుకని సహజంగానే అది క్షీణించి పోతుంది.) కేవలం ప్రాంతీయతత్త్వాన్ని పోషించి, పొట్టపోసుకునే కొన్ని స్వలాభేపేక్షులు మాత్రం “తెలుగు”ను వాడుకుంటారు. అందుకనే చాలా సార్లు చెప్పాను. అలా బతికి ఉన్న తెలుగు బతికినట్టుకాదు. చచ్చినట్టేనని. అది కూడా అర్ధం చేసుకోండి.

’మొదటి పాయింటులోని – ఇంటర్నెటులో తెలుగు చదివే/రాసే జనాభాని పెంచుకోగలిగితే,  మార్కెట్టు సైజు  పెంచగలం’ అని ఎవరూ సరిగా ఆలోచించటం లేదు. దానికీ కారాణాలు అనేకం. అందులో ముఖ్యమైనది,మన జాతి మొత్తం కూరుకుపోయిన “అమెరికాని/ఆంగ్లేయుడిని అనుకరించు” అన్న ఓ ఆలోచన. ముందు ఆ ఆలోచన కలగజేస్తున్న నష్టం ఏమిటో గ్రహింపుకు వస్తే, అందులోంచి బయట పడితే, సగం ముందుకెళ్లగలం. (అంతేగానీ, ’అమెరికాని అనుకరించటం’ అనేది ఓ ’ఆలోచన’గా విస్మరించవలసినది కాదు ; “కాల్చేయాల్సిన, మాడ్చేయాల్సిన” ఆలోచన కాదు అని మనవి).  తెలుగు మార్కెట్టు పెంచుకునే విధానం: చరిత్రలోని గొప్పలు చెప్పుకోవడం ఒక్కటే కాదు.భవిష్యత్తులో ఈ మార్కెట్టు ద్వారా సృష్టించబోతున్న “అవకాశాలు”. క్యాచ్ మై పాయింటూ!?

పోనీ ఇంకో విధంగా చెప్తాను. మొన్నీమధ్య CNBC లో నెక్స్ట్‌జెన్ అంటూ, పారిశ్రామికవేత్తల పిల్లలు ఆయా వ్యాపారాలని ఎలా నడుపనున్నారు అంటూ ఓ కార్యక్రమం సిరీస్ చేస్తూ, ఫ్యూచర్‌గ్రూపు బియానీ కూతురుతో మాట్లాడారు. అప్పుడు ఆ పిల్ల చెబ్తుంది : ’ మేమే కాదు, మొత్తం రిటైల్ రంగంలోనే విఫలమౌతున్న సెగ్మెంట్ – బ్యూటీప్రాడక్ట్స్;  మహా ఐతే, ఓ గోళ్ళరంగు, లిప్‌స్టిక్కూ కొనుక్కెళ్తారేమోగానీ, పెర్ఫ్యూమ్స్‌గానీ, మరే ఇతర బ్యూటీప్రాడక్ట్స్‌ని పెద్దగా కొనటం లేదు. వాళ్ళు కొనేవాటి మీద మాకు లాభాలెలా వస్తాయి? పోనీ, వాళ్ళు బాగా కొనేటువంటి – గోరింటాకు మీద “యాస్పిరేషనల్” ప్రాడక్ట్లు ఎలా చేయాలి? ఇదింకా కొరకుడు పడలేదు ’ అంటోంది.

ఇక్కడే మీరు గమనించాల్సిన విషయం,ఎలాంటి ’ఇండియన్ ప్రాడక్టు’ మీద మీరు “యాస్పిరేషన్” కలిగించగలిగే  స్థితిలో లేరు. ముందు దాన్ని “తొక్కాలి” అంటాను.

ఉదా: కారు కోరుకునేవాళ్ళుంటారు. కానీ, ఓ టాటా ఇండికామ్‌నో, నానోనో యాస్పిరిషనల్ ప్రాడక్ట్‌ చేయగలమా? చేయలేం. ( కారునే ఓ యాస్పిరేషనల్ ప్రాడక్టు కింద చూడకండి. అందులోని సెగ్మెంట్‌గా చూడండి.) ట్రెడిషనల్ ప్రాడెక్ట్స్‌గానో, ఇండిజినస్ ప్రాడక్టుగానో అమ్ముకోజూడటం ఒక ఎత్తైతే, “యాస్పిరేషనల్‌”గా చేయడం మరో ఎత్తు.

అదే పాశ్చాత్య సంస్కృతిలోని ఏ విషయమైనా, మనకి “యాస్పిరేషనల్” విషయమే! మళ్ళీ నవతరంగం విప్లవ్ చెప్పిన ఉదాహరణగానీ, ఇదివరలో నేను చెప్పిన లెట్రిన్ విషయాలుగానీ తిరిగి చెప్పక్కర్లేదు అనుకుంటున్నాను.మరి అలాంటప్పుడు తెలుగు సైట్లనూ “యాస్పిరేషనల్”గా  చేయగలమా లేదా!? ప్రశ్నించుకోండి. “చేయలేం” అని చెప్పేసేవాళ్ళూ ఉంటారు. కానీ, ’ఎందుకు చేయలేం? ఇలా చేద్దాం’ అనేవాళ్ళు కావాలి. వాళ్ళు నిజంగా ’చేసే’వాళ్ళే కానక్కర్లేదు. ఐడియాలున్నవాళ్ళైనా చాలు.

౩. ఈ ప్రకటనలు ఇచ్చేవాళ్ళు ఎవరై ఉండాలి!? ఎవ్వరైనా అవ్వచ్చు. కానీ, ఇది తెలుగు మార్కెట్టునే కాదు, ఆయా వస్తువులకూ మార్కెట్టును పెంచేదిగా ఉండాలి. రెండూ ఒకేసారి సాధించలేకపోవచ్చు. కానీ, ఈ “నిష్పత్తిలో సమతుల్యత” లోపిస్తే, మళ్ళీ మొదటికే మోసం ఔతుంది. ఇక్కడ ’సమతుల్యత’ అంటే అర్ధం – అన్నీ సమానం అనుకోకూడదు : నీళ్ళు పుట్టాలంటే, రెండు హైడ్రోజను అణువులు, ఒక ప్రాణవాయువు అణువు కలవాలి. అంటే అర్ధం – సమభాగాలు కాదుగా!!! సో నిష్పత్తిలో ఉండాలి. అంతేగానీ, అన్ని సమానం అనీ గాదు; డెమొక్రసీ లెక్కలు అంతకన్నాగాదు సుమీ!!! అలా అని, ఏదీ ఎక్కువగాదు. ఏదీ తక్కువగాదు.
(అసలు సమానత్వభావన ఏంటో తెలిసేడిస్తేగా! సర్లెండి ఇది ఇక్కడితో వదిలేద్దాం.)

ఐతే ఇప్పుడు తెలుగుపీపుల్.కాం, గ్రేట్‌ఆంధ్రా.కాం, తెలుగువన్.కాం, ఇలాంటివేవో సైట్లున్నాయనుకోండి; లేదా మన ఈనాడు లాంటి సైటేననుకోండి – అవి ప్రకటనలు బానే సాధిస్తాయి. అలాగే చాలా సార్లు ’డబ్బుకోసం గడ్డికరుస్తాయి’. ఈ దిగజారుడుతనం ఏంటయ్యా అని అడిగితే, “ప్రత్యామ్నాయమేది?” అంటూ ప్రశ్నిస్తాయి. (మన సినిమా వాళ్ళ లాగే! ) మరి బ్లాగ్లోకులు ఇష్టపడే సైట్లు, అంటే: కూడలి, నవతరంగం, పొద్దు, పుస్తకం.నెట్, ఈమాట లాంటివి ఎలా బతికి బట్టకట్టగలరు!?

(గమనిక:
౧. మొదటిరకం సైట్లు నేను చూడలేను. అలాగే, గూగుల్ గుంపుల్లో ఇలాంటి చర్చలు జరిగే ఉండొచ్చు. కానీ, నేను వాటినీ చూడలేను. ఎందుకు!? నేను ఆఫీసు ఇంటర్నెట్టు వాడతాను. దానిలో అవన్నీ బ్లాక్ చేస్తారు. మీరు లింకులిస్తే, నేను వీలు చూసుకొని చదువుతాను.
౨. చాలా మంది నాలాగానే ఆఫీసులో చూస్తారన్నది మరో ముఖ్యవిషయం. ఇలాంటివి సర్వేలద్వారా లెక్కల గడతారు. ప్రస్తుతానికి నా ఒక్కడితో వచ్చే నష్టం లేదు. గాబట్టి, మొదటి రకం సైట్లు బానే ఉన్నాయి.  కానీ ఈ రెండో రకం సైట్లు ఎలా బతక్కగలవో నాకు తెలీదు. ముఖ్యంగా చెప్పాలంటే –  “ఈమాట” ఎలా అంత చక్కగా నడుపుతున్నారు అనేది నాకు తెలీని విషయం. సదరు సైటు మనుష్యులు ఇష్టపడితే, ఆ మోడల్ పంచుకోవచ్చు కదా!! )

పై నిచ్చిన పొద్దు లింకులో, avkf, ఇతర వాణిజ్య రిఫరల్సు, నవతరంగం – ఐఎండీబీ ఐడియాలే కాకుండా, “మరి ఈ ప్రకటనల ఇంజనునే మన తెలుగు వారు స్థాపించగలిగితే!?” అనే ఐడియా రాశారు. యాడ్ సర్వర్లేవో మనమే పెట్టుకుంటే బానే ఉంటుంది. ఇండియాలో పేరుమోసిన యాడ్ సెర్వర్ ఒకటీ, అమెరికన్ మార్కెట్‌కే సేవలు చేస్తున్న ఓ రెండు యాడ్ సర్వర్ కంపెనీలు హైద్రాబాద్లోనే స్థాపించారు. కాబట్టి, సమస్య యాడ్ సర్వరు కంపెనీ స్థాపన కాదు. ఉన్న యాడ్ సర్వర్లలోనే, తెలుగు స్పెసిఫిక్గా మార్చుకోవడం ఎలా ? అన్నది సమస్య.  అంటే – ఇలా పడీ పడీ గూగుల్‌కీ, వాటికీ విక్కీకి, అదే వీటికీ, తెలుగులో చేయడం కంటే, :

౧. మన యాడ్ సర్వర్లకే “తెలుగులో” యాడ్స్ చేసి, రెవెన్యూ షేరింగ్ పెట్టుకుంటే బెటర్!
౨. లేదా- తెలుగీకరించిన యాడుకి “ఇంత” చొప్పున డబ్బులొచ్చే మార్గం చూసినా పర్లేదు! ఇప్పటి ప్రథమతరం బ్లాగర్లే ఆ యాడ్‌ తర్జుమాలు చేయవచ్చు!కూసింత డబ్బులూ చేసుకోవచ్చు. ( ఈ యాడ్‌సర్వర్లకే, తెలుగు యాడ్సునీ అంటగట్టించి, వాడి పబ్లిషింగ్ రెవన్యూలో షేరింగ్‌లాంటి ఆలోచనా చేయవచ్చు.)
౩. ఇతర వాణిజ్య రిఫరల్సుకు కావాల్సిన “ఇకోసిస్టం” సృష్టించుకోవడం.
ఉదా: ఇది “మార్తాండ” చేయవలసిన పనన్న మాట.  తమ జిల్లాలోని, ప్రతి పేరుమోసిన వ్యాపారికీ చాలా తక్కువ చార్జీలతో బ్లాగులు రాసిపెట్టడం. అవసరమైతే ఫ్రీగా చేసి పెట్టడం. ఫలాన ఇడ్లీ సెంటరా, లేకపోతే బీసెంటురోడ్డులోని ఫలానా బట్టల కొట్టా, లేకపోతే జగదాంబ సెంటర్లోని జ్యోతిష్యంవాడా అన్న విషయాలని పట్టిచ్చుకోకుండా, ప్రతివాళ్ళకీ ఓ బ్లాగు చేసి పెట్టడం; మెల్లగా పురికొల్పించి, వాళ్ళే చూసుకునేలా చేసి, వారి చేతికిచ్చేయడం. బొఓటి ( బిళ్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్సెఫర్) ప్రాజెక్టులన్న మాట. ఆ బ్లాగులన్నీ, తన “ప్లానెట్‌స్పీక్స్‌”లోనే అట్టి పెట్టుకోవడం – బ్లాగ్‌స్పాట్లాగో, వర్డ్‌ప్రెస్‌లాగానో ఓ స్వంత సోషల్ మీడియా నెట్వర్కుకి నాంది పలకడం అన్నమాట!

అంటే అర్ధం – ఓ బాలమురళికి, ఓ బాలకృష్టకీ, ఓ పుల్లెల గోపీచందుకీ, ఓ కరణం మల్లీశ్వరికి, మీరు సృష్టిస్తున్న సోషల్ మీడియా నెట్వర్కులోనే బ్లాగులు మీరే మొదలుపెట్టండి! ఒక్కసారి ఊహించండి! తెలుగు ప్రజలకి వీళ్ళతో ఇంటరాక్టవ్వాలని ఉండదా!? వాళ్ల బ్లాగులో “తెలుగులో” మాట్లాడుకోవడానికి ఎంతమంది తెలుగు ప్రజలు రావచ్చో ఊహించండి!

“తెలుగురత్న” శివ కూడా దీన్ని ప్రయత్నించవచ్చు. కాకపోతే, అదీ “తెలుగు” ఉన్న డొమైన్‌నేమ్ కావడంతో దాన్ని నేను పెద్దగా చూడలేకపోయాను.

అసలు ఇవన్నీ గాదు గానీ, ముందు బ్రాడ్‌బ్యాండ్ సమస్య గురించి చర్చించాలి. వీలుచూసుకుని దాని గురించి మరో పోస్టు వేస్తాను.

“ధనం మూలం ఇదం జగత్” అన్నారు పురాణ పెద్దలు. (ఎవడన్నాడో ఎవడికి తెలుసు? సంస్కృతంలో ఉంటే ఏదో పురాణంలో ఉన్నట్టే :)) )
“మనీ మేక్సు మెనీ థింగ్సు లోకమందున” అన్నారు తెంగ్లీషు పెద్దలు.
అందుచేత – ఏదేమైనా  – వ్యాపారాత్మక ఆలోచనల గురించి మరీ మొహమాట పడిపోమాకండి. అవి కూడా పంచుకోవడం మంచిదే.

నాకూ అప్పుడప్పుడు కొన్ని ఆలోచనలొస్తాయి. అవి ఇక్కడ పెడతాను. వర్కౌట్ ఔతాయి అనుకున్నవి వాడుకుంటే, ఫీడ్ బ్యాక్‌ను మాత్రం ఖచ్చితంగా పంచుకోండి. చివరికి “మా పక్కింటి షాపువాడితో ప్రయత్నిస్తే ఛీ కొట్టాడు” అన్నంత చిన్న ఫ్యీడ్‌బ్యాక్ అయినా సరే!

ధీరుభాయ్ అంబానీ చెప్పినట్టు మనం “సంపదను సృష్టించడం” మర్చిపోయాము.  ఎందుకంటే, మన “గురువులు” అందరూ ఆధ్యాత్మిక గురువులైపోయిరి! వారు బో(బా)ధ గురువులైరి.  చివరికి, ఆధ్యాత్మికత అంతా కూడా “ఈ తుఛ్ఛమైన ధనాన్ని నేను స్పృశించను నాయనా…….పదికి తక్కువ కాకుండా మావాడికిచ్చివెళ్ళు ” టైపులో జీర్ణించుకుపోయింది. (చచ్చి ఏలోకంలో ఉన్నాడో గానీ, జంధ్యాల మహానుభావుడు.  ఈ లైను, వారి “రెండు రెళ్ళు ఆరు” సినిమాలోది. తెలీనివారు ఈసారి గమనించండి)

అందుకే మనం మళ్ళీ “తెలుగులో ఆలోచించుకోవాలి”

ప్రకటనలు
Explore posts in the same categories: బ్లాగుల గురించి

ట్యాగులు:

You can comment below, or link to this permanent URL from your own site.

8 వ్యాఖ్యలు పై “డబ్బు చేసుకుందాం రా!”


 1. ఎక్కణ్ణించి ఎక్కడీకి లాక్కొచ్చారు సార్!
  డబ్బు సంగతి తరవాత, ముందు బ్లాగులకి ట్రాఫిక్ పెరగాలి .. ఒప్పుకుంటారా? ట్రాఫిక్ పెరిగితేనే గాని ఆ తరవాతి స్టెప్పులు సాధ్యపడవు. బ్లాగులు వార్తా పత్రికలతోగానీ, ఐడిల్ బ్రెయిన్ లాంటి గాసిప్ పత్రికలతోగానీ పోటీ పడలేవు. అంతే కాక ఇప్పటిదాకా – తెలుగు భాష, సాహిత్యం సంస్కృతి – అంటూ జాలంలో జరిగిన కృషి అంతా స్వఛ్ఛందంగానే జరిగింది. సర్వరు స్పేసుకీ గట్రా ఏమన్నా ఖర్చయితే చేతి చమురే పెట్టుకున్నారు, పెట్టుకుంటున్నారు.
  ఇంతెందుకు సార్, తెలుగు బ్లాగులకి సంబంధించి అత్యంత ముఖ్యమైన సైటు కూడలి – ఒప్పుకుంటారా? ఇప్పుటి సంగతి తెలీదుగానీ గత డిసెంబర్లో అడిగితే వీవెను చెప్పిన సమాధానం కూడలి దినసరి సందర్శకులు 300 – 500 మాత్రమే ఉంటారు! ఇట్లాంటి దర్శకుల సంఖ్యతో ఏం వెల్తుని క్రియేట్ చేస్తాము?
  నేను నిరుత్సాహ పడ్డం లేదు, ంఈ అయిడియాలని దిగజార్చడం లేదు. జాలంలో తెలుగు చదివే జనాభాలో కనీసం 10 శాతం బ్లాగులకి క్రమం తప్పని చదువరులుగా తయారు చేసుకోవాలి అని నా ప్రతిపాదన. కానీ అదైనా ఎలా చెయ్యాలో నాకు తోచట్లేదు.
  ఇంకెవరన్నా మంచి ఐడియాలిక్కడ పంచుకుంటారేమో చూద్దాం!


 2. >> “అందులో ముఖ్యమైనది,మన జాతి మొత్తం కూరుకుపోయిన “అమెరికాని/ఆంగ్లేయుడిని అనుకరించు” అన్న ఓ ఆలోచన”

  I object 🙂

  సొంత ఆలోచనలు (తెలుగువారితో సహా) భారతీయులకి బోలెడున్నాయి. ఉదాహరణకి, స్టాంపు పేపర్ల కుంభకోణం చెయ్యొచ్చనేది విదేశీయులకన్నా మనకే ముందు తట్టింది. అలాగే, మోసాలు చెయ్యటంలో వినూత్నమైన పద్ధతులు లెక్కలేనన్ని కనిపెట్టదేదా మనోళ్లు? మరి పద్ధతిగా డబ్బు సంపాదించుకోటానికి కొత్తకొత్త ఐడియాలు ఎందుకు రావు? బహుశా – రవితేజలా చెప్పాలంటే – తప్పులు చేసో, చట్టాలు అతిక్రమించో కోట్లకు పడగలెత్తటంలో ఉండే ‘కిక్కు’ పద్ధతిగా సంపాదించటంలో ఉండదేమో (మోసాలు చేసేవాళ్లు బయటా ఉన్నారు, వాళ్ల ఐడియాలూ మనోళ్లు కాపీలు కొట్టారు/డుతున్నారు. ఐతే మోసాల్లో సృజనాత్మకత చూపించే మహానుభావుల గురించి మాత్రమే ముచ్చటించుకుంటున్నామిప్పుడు) ఈ క్రియేటివ్ విధానాల్లో అవినీతికి పాల్పడే వేలాదిమంది బుర్రలు సరిగా వాడితే ఎన్ని కొత్త వ్యాపారాలు కనిపెట్టగలరో ఆలోచించండి.

 3. suresh Says:

  Let me express in English. I can’t control my emotions .
  Your article is fantastic. An year back I was going through same feelings and suddenly thoughts crushed under ‘recession’ and ‘job protection’. i I had the exact same opinion about ”Telugu on Internet’ and how to break from this jinx. Creating telugu blogs for famous personalities and helping them blog with various tools is got to be the starting point. Bringing them together (and enhanced solution of koodali) is one method of encouraging ‘to be part of the network’. Same tools that helped to generate traffic could be used to analyse the content and generate ‘preset ads’ in the beginning. it is not a tuff solution but needs lot of thought process and obvious means.
  A very nice informative article indeed.


 4. ఫ్రీగా సలహాలూ,ఆదర్శాలూ వల్లెవేసే తెలుగోడు రూపాయి విదల్చాలంటే మాత్రం “అపవిత్రమైపోతాడు”. అదొక ఝాఢ్యం.

  ఒక సంవత్సరం చేతిచమురు ఒదుల్చుకొని వెంకట్ ‘నవతరంగం’ సొంత డబ్బుతోనడిపిన తరువాత,”అయ్యా కొన్ని డబ్బులు కాంట్రిబ్యూట్ చేసి సైటుని నడిచేలా చెయ్యండి” అని అడిగితే “ఛత్! ఇంతేనా నీ నిబద్ధత!” అని వగలుపోయిన తెలుగునోళ్ళు ఎక్కువ. డబ్బులిచ్చిన దాతలు తక్కువ. మళ్ళీ తనే స్నేహితుల సహాయంతో గుడ్ విల్ ఉపయోగించి రొసోర్సెస్ రైజ్ చెయ్యాల్సివచ్చింది.

  ఇప్పటికే కనీసం కంటెంట్ కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళు కొందరున్నారుకాబట్టి అది అలా నడిచిపోతోంది. అక్కడా, ఇది ఇలా ఎందుకు రాస్తున్నారు…అన్ని సినిమాల గురించీ రాయరేమిటి…ఆ హీరో గురించి ఇలా ఎందుకు రాశారు అనే అత్తెసరు ప్రశ్నలు వేసే ఉద్ధారకులేగానీ ఆశయాల్ని అర్థం చేసుకునే పాఠకుల సంఖ్యా అంతంత మాత్రమే.

  మొత్తంగా …అదంతే.

 5. shyam Says:

  First, Alavaatu Cheyaalikadaa. Anduku manchi blog postlanu andariki (to the maximum extent possible) email cheyaandi. Mellaga oka samvatsaramlo valle alavaatu padataaru.


 6. […] గార్లపాటి ప్రవీణ్ గారి వ్యాసం , రేరాజ్ బ్లాగ్ లోని వ్యాసం- తెలుగు బ్లాగులకి మానెటైజ్ చేయడం […]

 7. dr.manda bhaskar yadav Says:

  chalabagundi


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: