తెలుగు బ్లాగింగ్‌తో డబ్బెలా చేసుకుందాం?

బ్రాడ్‌బ్యాండ్ కనెక్టెవిటీ సమస్యలు ఉన్నంత కాలం, తెలుగు బ్లాగింగ్ కంటెంటు పెరగటమూ కష్టమే! ఉన్న కంటెంట్‌కి సందర్శకులూ తక్కువే. కనెక్టివిటీ అనేది ఒక ఇంఫ్రాస్ట్రక్చర్ సమస్యే అయినా కూడా – విత్తు ముందా, చెట్టు ముందా అన్నట్టుగా, కంటెంట్ ముందా? ఇంఫ్రాస్ట్రక్చర్ ముందా?అనే సమస్య అంత తొందరగా తేలే వ్యవహారం కాదు.

తెలుగులోనూ కంటెంట్ దొరుకుతుంది అని తెలిస్తే, ఇంటర్నెట్ వాడకం మరింత పెరగవచ్చని, అది తమ బ్రాడ్‌బాండ్ కనెక్టివిటీ వ్యాపారాన్ని పెంచుతుందని ఓ పక్కన సర్వీసు ప్రొవైడర్లు భావించవచ్చు.  మరో పక్కన, ఎలాగూ వాడకందార్లు లేరు కాబట్టి, తెలుగు కంటెంట్‌లో బిజినస్ మోడళ్ళు అవసరం లేదు అని సైటు ఓనర్లు భావించవచ్చు. అందుకే, రీడిఫ్‌, భారత్ మాట్రిమొనీ లాంటి వారు, భారతీయ ప్రాంతీయ భాషల్లో ( వర్నాక్యులర్) లో సైట్ల ఆవశ్యకత లేదని, కనుచూపుమేరలో అవసరం రాకపోవచ్చని కూడా భావించారు. అలాంటి ఆలోచన వల్లే కావాచ్చు, సర్వీస్ పోర్టల్స్‌ని వేటినీ మనం దేశీభాషల్లో చేసుకోవటం లేదు. ముందు వీటి గురించి కొద్దిగా రాస్తాను.

మనదేశంలో బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ల సమస్య వల్ల, ఇంటర్నెట్టు వ్యాపారమే జరగదని ఊదరగొట్టేసే వారికి ఒక చక్కటి సమాధానం IRCTC టికెట్ బుకింగ్ సర్వీసు.ఇలాంటి సర్వీసునే “క్లియర్‌ట్రిప్” వాళ్ళు., మిగిలిన ప్రయాణ సర్వీసుల బుకింగ్‌లతో కలిపి, ఇంటర్‌ఫేసులో అదనపు సౌకర్యాల అందించి, మెరుగైన ఉదాహరణగా నిలిచారు. అలాగే రెడ్‌బస్.ఇన్ అని, ఎర్రబస్సుని తలపించే ఓ సైటు, ప్రైవేటు బస్సులకే బుకింగ్ చేస్తోంది. అది మరో విజయగాధగా చెప్పుకుంటున్నారు. కొన్ని మాట్రిమొనీ సైట్లు కూడా బాగా విజయవంతం అయ్యాయి.

ఇంకో ఉదాహరణ: బ్యాంకు ఋణాలతో కొనబడ్డ వాహనాల వేలంపాట సర్వీసు ; బ్యాంకులు జప్తు చేసుకొన్న ఋణవాహనాలను గిడ్డంగుల్లో నిలుపుతాయి. ఆ వాహనల వివరాలను కొన్ని వేలంపాట వెబ్సైటుల్లో పొందు పరుస్తాయి. ఆసక్తి ఉన్నవారు, ఆయా గోడౌన్సుకు వెళ్ళి, వాహానాలను కళ్ళతో చూసుకొని, పరీక్షించుకొని, నిర్ణీత సమయంలో వెబ్సైటు వేలంపాటలో పాల్గొంటారు. దీని వ్యాపార గణాంకాలను నేను చూడలేదు గాని, ఈ వ్యాపారం జోరుగానే సాగుతోందని నా అంచనా.

[ ఇంకో విషయం : “భాష” అనేది ఎంత అనవసర విషయమో నాకు ఈ వాహనాల వేలంపాట వ్యాపారంలో బాగా బోధపడింది.(నా తెలుగు చర్చలకంటే ముందే సుమీ! ) వాటిని కొనుగోళ్ళు చేసి, మార్కెట్టులో లాభానికి అమ్ముకుందుకు గానూ, ఓ బ్రోకరు-వ్యాపారి ప్రయత్నిస్తాడు. అతనికి ఇంగ్లీషురాదు. అసలు చదవడం, రాయడం అనేవి “ఎకడమిక్‌” విద్యలు కానే కాదు. ఓ నాలుగైదు భాషల్లో మాట్లాడతాడు. ఏ భాషలోను “స్వఛ్ఛత” లాంటి మీరోజువారి కాంసెప్టు ఉండదు. కానీ, అతను ఈ ఒక్క వేలంపాట సైటు , ఈ-మైయులు సౌకర్యమూ వాడగలడు. వ్యాపారం చేయగలడు! ]

చెప్పొచ్చేదేంటంటే, ఇలా వినియోగదారుడికో (B2C), వ్యాపారానికో(B2B) పనికొచ్చే, వాల్యూ ఎడిషన్ ఉన్న సర్వీసెస్‌కి భారతీయులైతేనేమీ, తెలుగువాళ్ళైతేనేమీ, తొందరగానే అలవాటు చేసుకుంటారు. (ఇట్స్ బ్రెడ్ విన్నర్! అదే “తెలుగు”లో బ్రెడ్ విన్నింగ్ ఉందా!!! లేదు! అందుకే అది చచ్చిపోతోంది.)

ఒన్‌ఇండియా లాంటి వాళ్ళు, ఎప్పటికైనా దీనికి డిమాండ్ ఉందని నమ్మి ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి కంటెంట్ బిజినస్లో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది. అంటే గల్లీ గల్లీకీ ఉండే ఇరానీ కేఫుల్లాగా చాలా వెబ్సైట్లే ఉన్నా, కాస్త ఎంచ దగ్గవి, నిజంగా జనాలు విచ్చేసేవి తక్కువే.  అసలు ఈ కంటెంట్ బిజినస్ మోడల్‌కున్న అతి పెద్ద ఉపద్రవం ఏంటంటే : ఆల్రెడీ ప్రాంతీయ కంటెంట్ బిజినస్లో ఉన్నవాళ్ళుగానీ దీనిమీద దృష్టిపెడితే, ఇలాంటి సైట్లు, బ్లాగోద్యమా లూ అన్నీ మూసుకుపోతాయి. ఉదా : ఓ 300 బ్లాగర్లకు జీతాలిచ్చేసి, పోస్టులెయ్యించేసి, కావాల్సిన ఓ సోషల్ మీడియా నెట్వెర్కు స్థాపించుకుందాం అనే ఎదవైడియా, ఏ “ఈనాడు” లాంటి కంటెంట్ బిజినస్‌గాళ్ళకో వస్తే, ఇదంతా పెద్ద కష్టం కాదు. మల్టీమీడియా కంటెంటుతో సహా పెట్టేసుకోగలరు. అప్పుడు కూడలిలో పేరుమోసిన బ్లాగర్లు “ఈనాడు”కి తరలి వెళ్ళటం పెద్ద విచిత్రమూ కాకపోవచ్చు. ఇలా జరిగిన రోజు :

“ఓహో తెలుగులో సెన్సిబుల్ మనుష్యులున్నారా” అని వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళు,మరింతగా విదేశీ బానిసలైపోగలరు (స్వతహాగా వీళ్ళకి తెలుగులో ఏవీ గొప్పవి ఉండవు. వీళ్ళ ఇంటలెక్ట్యుయల్ లెవెల్‌కి తగ్గ “విషయం” తెలుగులో ఉండదు. ఈ పాయింటునే నేను చాలా సార్లు ప్లే చేస్తూ ఉంటాను. అందుకనే, “తెలుగులో ఆలోచించండి” అని చెప్తూ ఉంటాను. అది వేరే విషయం.). “తెలుగులోకానికి బుద్ది లేదంతే; ఛీ! మనమింతే! మనకి రాదంతే!” లాంటి వాగుళ్ళు కట్టిపెట్టి, ఈ “లేమి” ని అవకాశంగా మార్చుకొని ముందడగు వేయడానికి, అభివృద్ది చెందటానికి “ఆలోచించండి”. ఇది వ్యాపారానికి నాంది అవ్వాలి. దీని వల్ల తెలుగులో డబ్బులు రావాలి. అప్పుడే, తెలుగు నిలుస్తుంది.

ఒక్కసారి ఆలోచించి చెప్పండి. పైన ఉదహరించిన సర్వీసుల ఇంటర్ఫేసులు తెలుగులో ఉండటం వల్ల, జనాలు వచ్చి ఆయా సర్వీసులు తెలుగులో పొందుతారా పొందరా? నా భయం: అవి పెరగవేమో!! అక్కడ కూడా తెలుగు సినిమాల్లాగా మాసు- క్లాసు డివిజన్ని తెచ్చే ఆలోచనలే మీ బుర్రలకొస్తాయి. “తెలుగులో ఉండే పెళ్ళి సైట్లో మన అబ్బాయి బొమ్మో, అమ్మాయి బొమ్మో పెడితే, మరీ సత్తెకాలపు మనుష్యులు అనుకుంటారేమో! ” అని భావిస్తారు. ఎందుకంటే, ఇంకా అనుకరించ తగ్గదీ, అనుసరించ తగ్గదీ ఇంగ్లీషులో ఒక అడుగుముందులోనే ఉందిగా!!! దాన్ని అనుకరిస్తూనేగా మనం ఈ సర్వీసులని తెలుగులో పెట్టేది!! క్యాచ్ మై పాయింటూ!!!! అందుకనే, “తెలుగులో ఆలోచించ” మనటం!

ఇప్పటికైనా మించిపోయింది లేదు : అనేక రకాల వాల్యూ ఎడిషన్ ఉండే సర్వీసెస్‌కి తెలుగు ఇంటర్ఫేసుతో మీరు సైటు పెట్టుకొని, బ్యాకెండులో ఒకే ఇంఫ్రాస్ట్రక్చర్ నడిచే ఐడియాలు చెయ్యండి. (పుస్తకం. నెట్‌ని దృష్టిలో ఉంచుకొని ఓ ఉదాహరణని కాస్త కిందన ఇచ్చాను.)

బ్రాడ్‌బాండు సమస్య తీరనంత కాలం, తెలుగు బ్లాగింగ్ సమాజం, ఆంధ్ర నుంచి పెరగటం కష్టం. కాబట్టి, నోస్టాల్జియా ఎఫెక్టులో కొందరు తెలుగు బ్లాగింగ్ చేసినంత మాత్రాన అది సర్వులకు ఉపయోగపడదు. కావాల్సిన సర్వవిషయాల మీద బ్లాగింగ్ చేసుకునే సామాజిక ధోరణిలోకి వెళ్ళదు. ఐతే, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. గర్భగుడిలోనే ప్రవేశంలేని రోజుల్నించి, దేవుడికి లిప్‌టులిప్‌ కిస్సులిచ్చే భక్తి సంస్కృతిలోకి మనం మారాము (సాయిబాబా దయ అది!). మీరు ఊహించని మార్పులు జరుగుతూనే ఉంటాయి. మీరు ఆపలేరు. “మడి”కట్టుకొని గెలవలేరు.

ఏం చెయ్యాలి? :
౧. ప్రభుత్వం మన భాషలో సేవ చెయ్యాలి లాంటి నినాదలు చేస్తే చేశారు : ముందు మనం ఇంటర్నెట్టులో “తెలుగు”లో వ్యాపారాత్మకంగా అందించగల సేవలు ఏమిటన్న విషయం ఆలోచించండి. తెలుగు వాడకం పెరుగుతుంది. తెలుగు మార్కెట్టూ నిలుస్తుంది. (తెలుగు అనే మార్కెట్టు ఉంచుకోవడం కూడా అవసరమే! అది ఒక మార్కెట్ సెగ్మెంటేషన్ కాబట్టి.)

౨. బస్సుల మీద నంబర్లు తెలుగులో ఉన్నా లాభం లేదు. ఎందుకంటే, చదువురానివాడికీ అర్ధమయ్యేది ఇంగ్లీషు అంకెలే కాబట్టి! అలాగే నేను పైన ఉదహరించినట్టు, తెలుగులో మీరు సేవలందించక పోయినా, ప్రజలు ఇంటర్నెట్టు వాడకం నేర్చేసుకుంటారు. ఆ తరువాత మీరు అదే సర్వీసులని “తెలుగులో” అందిచుదాం అని ఆలోచించడం దండగ! అది తిరోగమనమే అయితీరుతుంది. ఇవ్వాళ్ళే, అలాంటి సర్వీసులని తెలుగులో పొందటం అలవాటు చేస్తే, తెలుగూ నిలుస్తుంది. సొంత ఆలోచనలూ వస్తాయి. మీ ఐడియాస్‍ని ప్రపంచమూ కాపీ కొడుతుంది.

౩. ఇక మరీ బ్లాగ్లోకంగానే చెప్పాలంటే: ( పేపరు తిప్పండి)

ప్రకటనలు
Explore posts in the same categories: బ్లాగుల గురించి

పేజీలు: 1 2

ట్యాగులు: ,

You can comment below, or link to this permanent URL from your own site.

11 వ్యాఖ్యలు పై “తెలుగు బ్లాగింగ్‌తో డబ్బెలా చేసుకుందాం?”

 1. satish Says:

  మొత్తానికి తెలుగు బ్లాగ్ ల ద్వారా ఎలా సంపాదించాలో చెప్పలేదు మీరు.

 2. రవి చంద్ర Says:

  చాలా మంచి విషయాన్ని లేవనెత్తారు. తెలుగు బ్లాగులను మానెటైజ్ చెయ్యడానికి ఇదే సరైన సమయం. నేను తెలుగు బ్లాగును ప్రారంభించినప్పటి నుంచీ నా మిత్రులకి పరిచయమైతే చేస్తున్నాను. కానీ వాళ్ళని ఒక తెలుగు బ్లాగు ప్రారంభించేటట్టు మాత్రం చెయ్యలేకున్నాను.


 3. బావున్నాయి ఐడియాలు కానీ …


 4. ఏమిటో, నాకు ఒక్క ముక్కా అర్థం కాలేదు!

 5. rayraj Says:

  @satish: ప్రస్తుతానికి తెలుగు బ్లాగులతో డబ్బు చేసుకోలేరు. అలా జరగాలి అంటే, ముందు తెలుగు బ్లాగులు రాసేవాళ్ళ సంఖ్య, చదివేవాళ్ళ సంఖ్య – అంఖ్యాకంగా పెరగాలి. నా చర్చ దీనికి కేటాయించింది. మీ ప్రొఫైల్, బ్లాగులు పై పైన చూశాక, మీకు ఓ పొడగాటి పోస్టు వేసే ఆలోచనొచ్చింది. కాస్త నా బ్లాగు ఫాలో ఔతూ ఉండండి. ఈ టాపిక్ మీద నా వెనకటి రెండు పోస్టులూ చదివారా?

  @శరత్: ’కానీ…’ అంటూ వదిలేశారే! నాకు మీ భావం తెలీలేదు. మీ మనస్సులో ఉన్నదేదో బ్లాగులోనూ ఆలోచించండి.

  @sUryuDu : ఆ నవ్వు వెటకారామా! ఎందుకండి అంత వెటకారం? పోనీ మీ బ్లాగులో రాసి చెప్పండి.(నా బ్లాగుకు పింగ్‌బాక్ వచ్చేలాగా.)

  @రవి చంద్ర: రైట్ టైమంటున్నారు? మొన్న మరో పెద్దాయన, ’నా మోహం! ఈ ట్రాఫిక్కు సరిపోదు’ అని చెప్పివెళ్ళారు చూడలేదా!? ఇప్పుడు మానిటైజ్ అవ్వవు.కానీ మానిటైజేషన్‌కీ ఐడియాస్ కావాలి అంటున్నాను. వాటిని క్లియర్‌గా దృష్టిలో పెట్టుకొని పోతే, ఆటోమేటిగ్గా తెలుగు బ్లాగింగ్ వృద్ది చెందుతుంది అని చెబ్తున్నాను. ప్రస్తుత వ్యవస్థ మనకి కండ్యూసివ్‌గా లేదు గాబట్టి, మనం ఆఫ్‌లైన్లోనుంచి బిజినస్‌ని బ్లాగుల్లోకి లాగాలి అంటున్నాను. మీ ఆలోచనలూ బ్లాగులో రాస్తే, ఓ ముక్క దయచేసి ఇటుపడేయండి.

  @మహేష్: కనీసం కొన్ని “ముక్కలు” ఏరి, ఇవి అర్ధం గాలేదు అని చెబితే , ముక్క ముక్కకీ పోస్టు వేయడానికి నేను రెడీ. కనీసం మీకు ఏది, ఎందుకు అర్ధంగాలేదు తెలుసుకోడానికి నాకు కొంచెం క్లూ ఉండాలి కదా!పోనీ, మీ డౌటు నవతరంగానికి సంబంధించిన ఒక్క పేరా గురించే అనుకోనా!?

 6. Mauli Says:

  monitise enduku avvali?

  ee rojullo kooda telugu vrase vallu, chadivevallu undatam adrustam anukontunnam. ee stage lo monitise gurinchi aasha padavachuna?

 7. rayraj Says:

  @మౌళి:ఆశ పడలేం. కానీ ఆశ పెడితే, ఇంకా చాలా మంది తెలుగులో రాసేవాళ్ళూ,చదివే వాళ్ళూ ఉంటారు.

  అసలు తెలుగు చదివేవాళ్ళూ, రాసేవాళ్ళూ ఎందుకు తక్కువైయ్యారు? తెలుగు తిండి పెట్టక,అందరూ ఇంగ్లీషు మీద పడ్డారు కాబట్టి.అందుకే తెలుగుతో డబ్బు సంపాదించుకునే మార్గాలు ఉండాలి.ఇప్పుడైతే,ఇది సాధ్యం కాకపోవచ్చు. చర్చ ముందుకెళ్ళలేదు కాబట్టి, ఎలా సాధించవచ్చు అనేది కామెంటులో చెప్పలేను కాబట్టి, కొన్నాళ్ళోపిక బట్టి, చూస్తూనే ఉండండి. రాయగలిగితే మీరూ రాస్తూ ఉండండి.


 8. రేరాజ్: చాలా ఆలోచనాత్మక వ్యాసం. నాకు చాలా నచ్చింది.

  “..అంటే, ఇప్పుడు “ఇంటర్నెట్టులో తెలుగు వెలుగుతోంది” అనే ప్రచారం మాత్రం కాదు. అది నిజానికి నెగటివ్ ప్రచారం..” 🙂 – నెగటివ్ ప్రచారమో కాదో తెలీదుగానీ, ఇకముందు అలా చెయ్యడం అనవసరం.

  మీరీ వ్యాసాన్ని రెండు పేజీల్లోకి సర్దారు. ఇక్కడ వ్యాఖ్యానించినవాళ్ళలో కొందరు రెండో పేజీని చూళ్ళేదేమోనని నా సందేహం. ఆ పేజీ ఉన్నట్టు సరిగ్గా తెలీడమే లేదు మరి! రెండు పేజీలుగా పెట్టి వ్యాసానికి అన్యాయం చేసారు.

 9. Mauli Says:

  తెలుగు ఫామిలీస్ లో కంప్యూటర్ ని ఫోన్ కనెక్షన్ లాగా వాడకం ఎప్పటికైనా జరిగేనా? తెలుగు వాళ్ళ టైం అంత న్యూస్ పేపర్ తోనే సరిపోతుంది. ఇంకా బ్లాగ్స్ చూసేంత టైం వాళ్ళకి ఎక్కడ ఉంది. గ్రేట్ ఆంధ్ర, ఆంధ్ర విలాస్ లాంటి వాళ్ళు లేదా ఆంధ్ర లో ఉన్న ఏదైనా బిజినెస్ లు తెలుగు బ్లాగ్స్ కి సపోర్ట్ చెయ్యాలి. గూగుల్ కాదు అని నా అభిప్రాయము. మన రాష్రం లో ఉండే బిజినెస్ లు మనకు పే చెయ్యాలి కానీ గూగుల్ ఏం చేస్తుంది?

  తెలుగు బ్లాగేర్స్ సంపాదించడం లేదు అని ఎవరు అన్నారు 🙂 ఈ మధ్య ఈనాడు, జ్యోతి, సఖి ల లో బ్లాగ్స్ గురించి కధనాలు వచాయి..అవి ఎడిట్ చేసి ఇచిన బ్లాగర్ కి చెక్ వచ్చి ఉంటుంది కదా…ఇది ఒక స్టార్ట్ కానీ. ఈ పబ్లిసిటీ పెద్ద యెత్తున జరగాలి.

 10. rayraj Says:

  @Mouli:
  >>తెలుగు ఫామిలీస్ లో కంప్యూటర్‌ని ఫోన్ కనెక్షన్ లాగా వాడకం ఎప్పటికైనా జరిగేనా?
  టెక్నాలజీ, దాని వల్ల వచ్చే లాభాలతో ఇది జరుగవచ్చు.ఉదా : ప్రస్తుతం భారత ప్రభుత్వం ఐపి టెలిఫోనీ అనే ఒక సౌకర్యాన్ని అనుమతించలేదు. దానికీ కొన్ని కారణాలున్నాయి.ఒకవేళ అదిగానీ వస్తే, ఇంటర్నెట్టు ద్వారా దేశంలో ఏ నంబరుకైనా ఫోను చేసుకోవచ్చు;ఇంటర్నేషనల్ కాల్సు కూడా చేసుకోవచ్చు.అప్పుడు వచ్చే కాంపిటీషన్ వల్ల,దేశంలో ఎక్కడికైనా పది పైసలకి తక్కువగా, ఒక్కోసారి ఖర్చేలేకుండా కూడా ఫోను చేసుకునే అవకాశం రావచ్చు. ఎప్పుడైతే వినియోగదారులుకి లాభదాయకంగా ఉంతుందో, అప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్లను ఫోన్లాగా వాడుకుంటారు.ఆ స్థితిలో బ్లాగుల వాడకమూ పెరుగవచ్చు.అసలు బ్లాగుల రూపమే మారిపోవచ్చు.

  >>మన రాష్రంలో ఉండే బిజినెస్‌లు మనకు పే చెయ్యాలి కానీ గూగుల్ ఏం చేస్తుంది?
  మన దేశ/రాష్ట్ర వ్యాపారులు గూగుల్ వాడికి ఫీజు చెల్లిస్తే,గూగుల్ వాడు మధ్యవర్తిగా ఉంటూ మనకి పే. చేస్తాడు.ఐతే,ప్రస్తుతానికి మన రాష్ట్రంలో ఇలాంటి బిజినస్ పెంచుకోవాల్సిన అవసరం,ఇంకా గూగుల్‌కి ఏర్పడలేదు/ఏర్పరచుకోలేదు.కానీ వాడొస్తాడు.ఈలోగా మనమే ఆ బిజినస్ పెట్టుకోకూడదనే రూలేమీ లేదు కదా!అందుకే, మీరన్న ఆ బిజినస్‌వాళ్ళు కూడా దీని గురించి ఆలోచించి, వ్యూహాత్మకంగా తెలుగు మార్కెట్టును పట్టుకోవచ్చు. ప్రస్తుతానికి వాళ్ళు ’ఆ వాతావరణం ఎలా సాధ్యపడతుందీ, మనకు అంత డబ్బుల్లేవు కదా!’అని డబ్బులొచ్చే బూతు సైట్లే నడుపుకుంటున్నారు.

  >>తెలుగు బ్లాగేర్స్ సంపాదించడం లేదు అని ఎవరు అన్నారు ఈ మధ్య…..
  ఈ రాతల వల్ల వచ్చే సంపాదనని , “తెలుగు సంపాదన”గా నేను భావించను, మీరూ కొంచెం ఆలోచిస్తే, ఇది చాలా చిన్న విషయం అని గ్రహిస్తారు. అసలు తెలుగులో చదివే వాళ్ళే లేనప్పుడు, ఈ బోడి సంపాదన కూడా రాదు! ఆ సమస్య వల్లే, ఈ తెలుగు పుస్తకాలు, సైట్లు, సినిమాలు అన్నీ చాలా లేకి స్థాయి అవసరాలకే పరిమితమైనాయి.నాణ్యత కావాల్సిన వాళ్ళందరూ ఏ సేవనైనా ఇంగ్లీషులోనే పొందుతారు. ఈ డివైడ్ అంత మంచిది కాదు.ఇది మెల్లిమెల్లిగా తెలుగు మార్కెట్టుని మరింత దిగజార్చి క్షీణించిపోయేలా చేస్తుంది.

  @చదువరి: థాంక్యూ! మరిప్పుడెలా? పోనీ కాస్త ప్రజాదరణ ఎక్కువ ఉన్న మీరు,మీకు నచ్చినంత వరకైనా ఓ పోస్టు రాసి, ఈ నా పోస్టుకీ ఓ లింకేసెయ్యండి!! ఏమంటారు!?


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: