గేమ్స్ ఇండియన్స్ ప్లే – ప్రివ్యూ :p

“మనకి సెల్ఫ్‌రెగ్యులేషన్ లేదు” అంటూ, మన రోడ్ల మీద, డ్రైవింగ్ బిహేవియర్ మీద నోటికొచ్చినట్టు సోది చెబుతున్నాడు. అదేనండీ చేతికొచ్చినట్టు రాస్తున్నాడు!

ఎక్కడ?  –  Games Indians Play: Why We Are the Way We Are అనే పుస్తకంలో. 
ఎవడ్రా వాడు? – V.Ragunathan;
వాడెవడు? – ఇరవై ఏళ్ళు IIMA లో ప్రొఫెసరుగా పనిచేశాడు. ING Vysya Bank లో ప్రెసిడింట్‌గా చేశాడు. ఇప్పుడు GMR గ్రూపులో పనిచేస్తున్నాడు.

వెల్! ఐతే! చేతికొచ్చినట్టు బరికెయ్యటమేనా!? నేనూ బరుకుతా, బరహాలో! ఏమనుకుంటున్నాడో!!!.    –   పుస్తకం కొనకుండానే గిరాటేసాను.

ఏం చెయ్యనూ?  కొందామనే అనుకున్నా; అలవాటుగా మధ్యలో ఓ పీజీ యధాలాపంగా తీసి, రెండు పేజీలు చదివాను. శుద్ధ ఇండియన్ ఇంగ్లీషు కదా, సాఫీగా,చకచక చదువేసుకునే  లాగానే ఉంది. ఎటొచ్చీ, అందులో క్రక్సు ఏంటంటే, “మనకి సెల్ఫ్ రెగ్యులేషనుగానీ, సెల్ఫ్ డిసిప్లైన్ గానీ లేవు” అని చెప్పడంలా అనిపించింది. మే బీ ఎనదర్ ఇండియన్ బాషింగ్ ఆఫ్టర్ ఆల్! అనుకున్నాను.
(Offtrack : తెలుగు అనుమానం: సెల్ఫ్‌రెగ్యులేషన్ – స్వీయనియంత్రత; సెల్ఫ్‌డిసిప్లైన్ – స్వీయక్రమశిక్షణ !?)

సరే – గూగుల్ కొట్టా, వాడి సైటుకెళ్ళా –  : http://www.vraghunathan.com/books.html 

ఆశ్చర్యం!!! వాడి ఫోటో పక్కనున్న కాప్షన్ :
A glorious past is not  a consolation for a sorry present.

మ్యాన్! వీడెవడో మనలాగనే మాట్లాడుతున్నాడు.
“We gave zero to the world. Thereafter, we have given zero to the world.”

నిజానికి ’వీరి’ పుస్తకం వెనుక రాసి ఉన్న విషయం ఇది :
“రేషనాలిటీ మరియు ఇర్రేషనాలిటీ, స్వార్ధం మరియు నిస్వార్ధం, పోటీ మరియు సహకారం,  సహాయసంపత్తి మరియు మోసం – ఇలాంటి విషయాల మీద మనకున్న అభిప్రాయ దృక్కోణాలని (యాటిట్యూడ్స్ ని) అన్నిటినీ తన స్కానర్లో పెట్టారు రఘునాధన్ గారు. ఆయన ఈ విషయాలు గురించి ఓ నీతిచంద్రిక రాయలేదు. గేమ్‌ థియరీని, బిహేవియరల్ ఎకనమిక్స్‌నీ కలిపి, భారతీయుల “భారతీయత” గురించి అర్ధంచేసుకునే ప్రయత్నం చేశారు. స్వలాభాపేక్షే ప్రతి మనిషి యొక్క లక్ష్యం. ఐనా కూడా,  మనకే గనక కాస్త సెల్ఫ్ రెగ్యులేషన్ ఉంటే, మంచితనానికి మనమూ మరి కొంచెం అవకాశం ఇస్తే,  సహకారంతోనూ, సంయుక్త ప్రయత్నంతోనూ ఇంకొంచెం శ్రమిస్తే, మనం – వ్యాపారవేత్తలం, రాజకీయనాయకులం, బ్యురోక్రాట్లం, మనమేదైనా సరే  – మరికొంత లాభపడతాం.”

ఆసక్తికరంగానే ఉంది! కదూ! దీనికంటే, తరువాత చదివిన ఈ ఇంటర్వ్యూ  యొక్క ఆరంభ వాక్యాలు, నా ముందస్తు జడ్జిమెంటుని మరికాస్త కరిగించాయి.

అక్కడ ఇలా ఉంది :
ఈ పుస్తకంలో రఘునాథన్ ఓ మొక్కజొన్న పంట రైతు గురించి చెప్పారు. ప్రతి ఏటా ఆ రైతు బోళ్డెన్ని అవార్డులు గెలుచుకున్నాడు. విలేఖరులు అతని విజయరహస్యం ఏంటి అని అడిగినప్పుడు, తన పంటని మిగిలిన రైతులతో పంచుకోవడం వల్లే తన ఈ గెలుపు అని ఆ రైతు అభిప్రాయపడ్డాడు. ’పక్క పొలాల రైతులూ అదే ప్రైజు కోసం పోటీదారులైనప్పుడు, తన మంచి విత్తనాలను వారికి ఎందుకు ఇచ్చాడబ్బా!’ అంటూ ఆశ్చర్యచకితుడైన విలేఖరికి , ఆ రైతు ఇచ్చిన సమాధానం : “గాలిలో పరాగరేణువులు ఒక పొలం లోంచీ, మరో పొలంలోకి ఎగిరి వెళ్తాయి. పక్క పొలంలో రైతు నాసిరకం విత్తనం వాడితే, క్రాస్-పాలినేషన్ వల్ల నా పంట నాణ్యత కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. నా పంట బాగుండాలంటే, పక్కవారి పంటనూ నేను బాగు చేయాలి”

ఇదింకా బావుంది కదూ! ఇంటర్వ్యూలోనూ ఆయన వాడిని కొన్ని ఉదహారణలు నాకు చిర్రెత్తిస్తున్నా, నాకు ఆయన చెబ్తున్న విషయం అర్ధమౌతున్నట్టే ఉంది.

 “This may seem to be a caricature, but if I am exaggerating certain features, it is because I want to draw attention to them.” అని ఆయన అన్నప్పుడూ,

 ” My question about why Indians are the way they are is a rhetorical one — it is an expression of my frustration. But my attitude towards India is like that of a parent towards a beloved child who needs correction. You don’t love that child any less; it is because of your love that you want to bring about change. I hope these ideas will encourage some introspection about how to make things better.” అన్న ముగింపువాక్యంలోనూ, నా చిర్రుబుర్రులైతే  కొంత శాంతించాయి లెండి. మీకెలా ఉంటుందో నాకు తెలీదు.

పుస్తకం చదివితే, రివ్యూ రాయండి. రాసేసి ఉంటే, ఆ లింకివ్వండి. తెలుగు గూగ్లింగ్లో, అంతా “సుధా రఘునాధన్” పేరే ఉంది తప్ప, ఈయన పేరూ లేదు, ఆ పుస్తకం పేరూ లేదు!

నాకున్న భిన్న అభిప్రాయాల గురించి, నేను పుస్తకం చదివినప్పుడో, మరెప్పుడో మళ్ళీ రాస్తాను. ముందు మీరూ పుస్తకం చదవండి.రివ్యూ రాయండి. ముందు కనీసం ఆ ఇంటర్వ్యూనైనా తప్పక చదవండి.

పుస్తకం మీద నాకు చిరాకు రావాడానికి ఇంకా వేరే కారణాలూ ఉన్నాయి లెండి. దీనికి ముందుమాట రాసింది నారయణ మూర్తి.  అదివరలో ఓ సారి, ప్రకటనలు వేసుకుంటున్న CNBC , నారయణ మూర్తిని చూపించి, బ్యాక్‌గ్రౌండ్లో ఓ పాటేసేది 

 – I Don’t like this face: I just Don’t like this face  అనో ఏదో  🙂

ప్రకటనలు
Explore posts in the same categories: పుస్తాకాలు/రచన రివ్యూలు

ట్యాగులు: , ,

You can comment below, or link to this permanent URL from your own site.

3 వ్యాఖ్యలు పై “గేమ్స్ ఇండియన్స్ ప్లే – ప్రివ్యూ :p”


 1. ఈ పుస్తకాన్ని గడచిన రెండేళ్లుగా చదువుదా………………………..మనుకుంటూనే ఉన్నా తప్ప చదవలేదు. మీరేదో పుస్తకంలో గుజ్జునంతా మా బుర్రల్లోకి ఎక్కించేస్తారేమో, ఇక కొనడం చదవడం తప్పేయి అని మీ శీర్షిక చూసి సంబరంగా వచ్చాను. మీరేమో ఇంకెవరైనా చెబుతారని చూస్తున్నారు!! 😦

 2. Sharma (maverick6chandu.wordpress.com) Says:

  Your review is good. But the book is not so frustrating. 🙂 That is good one.
  Your sense of selecting the words is good boss. Peppy. Keep it up.
  Sharma

 3. rayraj Says:

  @అరుణమ్: చదివాక రివ్యూ ఇవ్వడానికి తప్పకుండా చూస్తాను.కానీ టైమ్ పడుతుంది.అందుకే, పాత పుస్తకమే ఐనా, “ప్రివ్యూ” అన్నాను. 🙂

  @Maverick:థాంక్స్!
  మీ “Being honest when no one is seeing” చదివాను. బావుంది. హైద్రాబాద్ టేల్స్ కీ, ఈ పోస్టుకీ ఉన్న కాంట్రాస్టు మేవరిక్ సార్ధకనామమే ననిపించింది. 🙂 ఆ పోస్టు మీరే రాశారా!?
  ధర్మ కథలు అని నేను రాసిన ఓ మూడు పోస్టులున్నాయి. చదవమని చెబుతామనిపించింది.

  అలాగే, ఈ పుస్తకం చదివేశానన్నారు గాబట్టి, ఓ రివ్యూ వేసేస్తే, అరుణగారూ, నేనూ రెడిగానే ఉన్నాం చదవటానికి. 🙂 (తెలుగులో రాయలి సుమా!)


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: