’అదృష్టవంతుడిని నేను’

వచ్చే సోమవారం 9.30 pm ఈ టివిలో ఝుమ్మంది నాదం తప్పక చూడండి, ఇప్పటికి రెండు ఎపిసోడ్లు అయిపోయినాయి. మొదటిది నేనూ మిస్ అయ్యాను. సరే! మన సునీతకీ, బాలూకీ – ఇద్దరికీ –  కాస్త అతి ఎక్కువేనని మనకి తెలుసు. కాబట్టి ఆ విషయం లో సర్దుకుబోండి, ఓవరాల్గా బానే ఉంటుంది.

నిన్న అంతే ఓవారాక్షన్తో బాలూని సునీత ఒక ప్రశ్న అడిగింది.
“మొదటి పాట నుంచి మొదలుకొని, నేటి వరకూ మీ జీవితానుభవాన్ని మూడు ముక్కల్లో చెప్పండి” అని.

ఓవరాక్షనుతోనే అయినా, బాలూ ఇచ్చిన సమాధానం చాలా బావుంది. ఇది చాలా కీలకమైన సమాధానం. ఆయన చెప్పింది :

“అదృష్టం  –  కృషి –  అద్భుతం “

’అదృష్టం కలిసొచ్చింది; నేనూ బాగా కష్టపడ్డాను. ఫలితం చాలా అద్భుతంగా వచ్చింది’ అన్నారు.

కృషి ఎప్పుడూ సెంటర్ స్టేజిలోనే ఉంటుంది. అది అత్యంత అవసరమైన, ప్రాథమికమైన వ్యక్తిగత సద్గుణం. కానీ, అటు ఇటూ ఉన్న ఆ “అ” పదాలున్నాయి చూశారూ! వాటిని సరిగ్గా అర్ధం చేసుకోవాలి.

బాలూ ఎంతో సంతృప్తితో చెప్పుకున్నారు.  ’అదృష్టవంతుడినే నేను. అలాంటి అవకాశాలన్నీ నాకే వచ్చాయి. మరొకరికి ఇక రావంతే’ అని.

ఇక్కడొక విషయం గమనించండి. బాలు పాటలు పాడటం మొదలెట్టినప్పట్లో, హార్మోనియం వాయించన వాళ్ళూ, గిటార్లు వాయించినవాళ్ళు, తబలాలు వాయించిన వాళ్ళూ అందరూ తరువాతి యుగంలో జీనియస్సులుగానూ, స్టార్ మ్యూజిక్ డైరక్టర్లగానూ గుర్తించబడ్డారు- బాలూతో సహా! అంటే, భవిష్యత్తులో స్టార్లౌతారో లేదో తెలీకపోయినా, ఆ నాటికే వాళ్ళంతా ఒక జీనియస్స్సుల గుంపే!!

మరో సందర్భంలో ఓ సారి పూరిజగన్నాధ్ అన్నాడు. తను ఒక ప్రముఖ దర్శకుడి చుట్టూ అవకాశాలకోసం తిరుగుతున్నప్పుడు, ఆ దర్శకుడు అతనికి ఓ సలహా ఇచ్చాడట. ’ నా చుట్టూ ఇప్పటికే ఓ 42 మంది అసిస్టెంట్ డైరెక్టర్లుగా తిరుగుతున్నారు. నా దగ్గర అవకాశమొచ్చినా, నువ్వు నలభై మూడో వాడివవుతావు. పేపెచ్చు, పేరొచ్చిన నాకు సవాలక్ష ఆబ్లిగేషన్సు. నా దగ్గరుంటే నువ్వు పైకి రాలేవు. నీ టాలెంటుకీ గుర్తింపు రాదు. నీకు నిరూపించికునే అవకాశమూ రాదు. ఎవడైనా సరే! నీ తోటివారిలో ఎవ్వడిలోనైనా స్పార్కు ఉంది అని నువ్వు కనిపెడితే, నువ్వు వాడి దగ్గరెళ్ళి చేరిపో. వాడితో పాటూ నిన్ను పైకి తీసుకెళ్తాడు. అసలు ఆ స్పార్కే నువ్వు గుర్తించ లేకపోతే, ఇక నువ్వు డైరెక్టరయ్యీ వేస్టూ ’
( గుర్తున్న దానికి, నా కవిత్వమూ జోడించి ఉండవచ్చు 🙂 )

ఈ రెండు విషయాలనూ బహు విస్తారంగా చెప్పచ్చు. ఒక విజయంలో చుట్టూ ఉన్న వాళ్ళ పాత్ర నిజానికి మరువ రానిది.

అలాగని ఈ చుట్టూ ఉన్న వాతావారణం “అదృష్టం” గా ఏర్పడేదేనా? లేక, మనిషిగా మనమేదైనా ఈ “అదృష్టాన్ని” ఏర్పరుచుకునే చర్యలేమన్నా ఉన్నాయా!? విధి మనకు తోడుగా నడవాలంటే, మనుష్యులు ఏమన్నా చెయొచ్చా!?

Are the discerning readers making the connection of this post with the immediately preceding post!? Or Am I over estimating the readers?

ప్రకటనలు
Explore posts in the same categories: Uncategorized

20 వ్యాఖ్యలు పై “’అదృష్టవంతుడిని నేను’”

 1. thikamaka Says:

  రేరాజ్ గారు ఈ కార్యక్రమాన్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.


 2. […] తన బ్లాగు లో ఝుమ్మంది నాదం గురించి ఒక టపా వ్రాశారు. అందులో వారు సునీత మరియు […]

 3. అబ్రకదబ్ర Says:

  సూటిగా, క్లుప్తంగా – బాగుందీ పోస్టు. నిజమే, it’s important to be in the right place at the right time. అది లేనిదే ఎంత కృషి, ప్రతిభ ఉన్నా ఉపయోగం ఉండదు. అంతమాత్రాన, అదృష్టమే అన్నిట్నీ నడిపిస్తుందనీ కాదు.

 4. sri Says:

  రేరాజ్ అసలు పేరు ఎక్కడా చెప్పకుండా తనను తాను చాల పెద్ద ఇంటలెక్త్యూల్ అనుకుంటాడు. అయ్యగారు తన ఫోటొను అందరికి చూపిస్తూ రాస్తె ఆయాన కూడా ఒక 100 టపాలకి జనానికి మొహం మొత్తుతాడు. ఇతనా అని పాఠకులలో కొంతమంది ఆయనకి అబిమాన,వ్యతిరేక వర్గాలు తయారౌతాయి. అప్పుడు మొదలౌతుంది కొత్త గా ఎమైనా రాయల/చేయలనే అనే తృష్ణ. కాని కొత్తగా ఎమీ ఉండదు చెప్పటానికి. ఆసమయానికి వీరి శైలి కూడా పాత పడి పోతుంది . బాలు గారు 30సం|| ఇటువంటి సంధర్భాలను అధిగమిస్తూ ముందుకు దూసుకేళ్లాడు. ఆయానను ఈ రేరాజ్ వంక పేట్టటమా?

 5. Sri Says:

  I agree with you. Even I felt that it was a kind of PPD “Paraspara Dabba”

 6. rayraj Says:

  @చిన్ని sree : Cho chweeet Of you. Welcome! Do something. I have not tasted Popularity yet.

  (Am I sounding like Ramu here! :)) )
  And hey, you missed the whole point, again.

  @పెద్ద Sri: Thank you, for agreeing and thus clarifying my ’శ్రీ’ confusion. But I was also trying to make the point which అబ్రకదబ్ర said, and a little more to it.

  @అబ్రకదబ్ర: Rt! but Now my question is: How do we know which is the right place and right time? And assuming we know, is there any way to “create” this right place and right time!?

  @thikamaka : Actually, I think you are not at all “thikamaka” and know what you want! Thanks for the post with the video. Unfortunately, I could not watch it yet.My Office Network does not allow it 😦


 7. “ఒక విజయంలో చుట్టూ ఉన్న వాళ్ళ పాత్ర నిజానికి మరువ రానిది.” నిజం. చుట్టూ ఉన్నవాళ్ళు తోడ్పడితేనే చాలా విజయాలు సాధ్యపడతాయి.

  అయితే, బాలు ఆ సంగతిని గుర్తించలేదనేది మీ ఉద్దేశమైతే.. ఆ ఉద్దేశం సరికాకపోవచ్చు.

 8. rayraj Says:

  @చదువరి:ఛ ఛ భలేవారే. బాలూ తన చుట్టూ ఉన్న మనుషులకే పూర్తి పట్టం కట్టాడండీ బాబు.ఆ విషయాన్నే మనం గ్రహించాలి అంటున్నాను. చుట్టు ఉన్న వాతావరణం చాలా ప్రాముఖ్యమైనదీ అని చెబుతున్నాను.

  ఇప్పుడు మన తెలుగు సినిమా ప్రపంచ సినిమాకే ఆదర్శ ప్రాయంగా చేయాలంటే, అది ఏ ఒక్కరి వల్లో అవ్వదో.దానికి అనేక కారణాలు కలిసి రావాలి.

  కానీ ఒక్కడి వల్లే ఇది సాధ్యపడుతుంది కూడా!
  ఇండియన్ క్రికెట్‌కి ఒక్క టెండూల్కర్ కావాలి.
  ఇండియన్ మూవీకి ఒక్క కమల్ కావాలి.
  అలాగే, తెలుగు సినిమాకైనా! కానీ,దానికి చాలా కారణాలు దోహద పడేలా చెయ్యాలి. ఐనా ఈ రెండో స్టెప్పు గురించి ఇప్పుడే వద్దులెండి. మళ్ళీ రాతలు పెద్దవవుతాయి. 🙂


 9. I watch this programme with out missing. As I am a big fan of Balu sir, I could not miss this programme! I personally know Balu sir! (Distant relative!) He is very much down to earth! He always engages with kids around him keeping them making humor. When I went to my nephew’s marriage, he was invited. There I could see him and sat just by him for at least more than half an hour. There I came to know about him. Even though he is very fat, 😦 🙂 he stands up and greets (namaskaram) with both of his hands to elders. He always just sits and spends time with kids. But the statement మన సునీతకీ, బాలూకీ – ఇద్దరికీ – కాస్త అతి ఎక్కువేనని మనకి తెలుసు hurted me. 🙂 🙂 😥 I know you wrote this just for fun! 🙂 I felt bad on reading that line. 😦 🙂

  We are all very much gifted to hear Balu sir’s songs! God bless him!

  Chandu (www.maverick6chandu.wordpress.com)

 10. Advaitha Says:

  Rayraj garu (guru),
  A very thoughtful post in a cheeky way. Very well written.
  Coming to the content of it, It’s true that our environment shapes us. What Balu, or anyone who is at the ‘top’ of the game, or has achieved noticeable success in public life has repeatedly said, was that certain factors have helped them, like luck, environment or a certain person etc. However, what they DON’T mention (and I have yet to see anyone do this, probably there is a bit of an ego that ‘I’ have achieved it?) is that they weren’t looking for it. A lot of folks take this as an example from someone they admire and start looking for the same factors that helped their ideal image of that person, to come into their own life and help nourish their talents (or give them a break!). This, they call luck or time and most of them constantly bitch about it’s lacking, or the delay in it’s happening. A number of times, most of them end up not receiving it. in my humble opinion , it happens because they stop loving themselves, for who they are and concentrate on their abundant inner talents and start looking outward for an external factor to come and give them their ‘push’.

  The inherent talents of a person (which might be different from the talents that they are consciously aware of!) will certainly come out, one way or another , at some point. Even without a conscious effort their true talents are nourished by different factors, sometimes by joy, sorrow, pain and suffering or on a higher octave, enlightenment, sat-saangityam, etc.
  We say Balu is a great singer. No doubt about it. However, he is equally talented in acting and dubbing. Maybe he would have been an extraordinary actor if he was in that field? Maybe he would have been equal to kamal (in recognition to being an actor. i know he is recognized as a decent actor now). Or maybe he would have been diligent worker if he was working at a bank? maybe we all ARE getting those breaks and ‘adbhutam’s at the end, but just coz our focus is on something else, something that we ‘think’ we are good at, than understanding what we are good at? just may be, we all have been recognized?


 11. అదృష్టం కనిపించనిది. అంటే కారణాలు బయటికి కనిపించనివ్వకుండా తోసుకొచ్చే అదృశ్యశక్తి. దానికే కర్మఫలం అని పేరు. ఎవరి విజయమైనా పూర్వజన్మపుణ్యఫలమే. అది లేనివాళ్ళు ఎంతకృషి చేసినా, వాళ్ళవెంట ఎంతమంది ఉన్నా ఏమీ లాభం లేదు. ఆ కోణం నుంచి SPB అన్నది 100 శాతం కరెక్టే. అయితే మనం యౌవనంలో ఉన్నంతకాలమూ కృషిని అవసరమైనదాని కంటే (దాని పరిమితులు తెలుసుకోకుండా, దాని యొక్క వాస్తవ సామర్థ్యానికి మించి దాన్నుంచి ఫలితాల్ని ఆశిస్తూ) చాలా ఎక్కువ నమ్ముకుంటాం. అలా నమ్మమని చెబుతారు మన చుట్టూ ఉన్నవాళ్లు కూడా. కానీ వయసు మీదపడ్డాక మన జీవితాన్ని ఇతరుల జీవితాలతో పోల్చి చూసుకున్నప్పుడు వాళ్ళకీ, మనకీ ఎక్కడో… ఎక్కడో ఏదో అవ్యక్తమైన తేడా ఉందనిపిస్తుంది. ఆ తేడా పేరే అదృష్టం.

 12. rayraj Says:

  ఐతే అమెరికనులూ, హాలీవుడ్డీయూలూ, లేదా మైకేల్ జాక్సన్ లాంటివాళ్ళు – వీళ్ళంతా యావత్ భారతీయులకంటే ఎక్కువ పుణ్యం చేసుకొని పుట్టడం వల్ల, వాళ్ళు/వాడు ఏ భారతీయుడికీ అందనంత/SPBకీ అందనంత – విజయాన్ని సాధించారంటారా!?ఒకవేళ, ప్రపంచాధిపత్యాన్ని సాధించ గలిగే సినిమాలు తెలుగువాళ్ళు తీయలేరు (వారంత పుణ్యాత్ములు కాదు) అని మీరు నమ్మితే, ఇక నేను ఏమీ చెప్పలేను.

  “అదృష్టం – కనిపించనది” అంటే ఒప్పుకుంటాను. కనిపించకుండా పనిచేసిన కారణాలన్నింటినీ అదృష్టంగానే భావిస్తాను. “అదృష్టమూ కర్మఫలమే” అని గుర్తిస్తే : “కొన్ని కర్మలద్వారా ఈ అదృష్టాన్ని కూడా ఫలంగా పొందవచ్చు. ఆ అదృష్టం అనేది చుట్టూ ఉన్న వాతావరణంలో పనిచేసేది గాబట్టి, ఫలానా ఫలితాలకు ఎలాంటి వాతావరణం కావాలో, అలాంటి వాతావారణాన్ని కర్మలద్వారా ఏర్పరుచుకునే కృషి చేయవచ్చు” అనేది నా భావన.

  ఐనా, “ఈ జన్మలోని కృషికి, మరు జన్మలో సైతం ఫలితాన్ని పొందగలవు ; ఈ కృషిని మరుజన్మలో కొనసాగించి ఫలితమందగలవు. అందుకని కృషి కఠోరంగా ఉన్నా వెనకాడక ప్రయత్నించు” – అని “కృషి” కే పట్టంగట్టిన మరో కాంసెప్టది. నిజానికి, అసలు ఫలితాన్నే ఆశించని “కృషి”కీ లేక కర్మకీ, మరు జన్మకూడా ఎందుకూ!!?? అది కూడా అక్కర్లేదు.:)

  అందుకనే, మరో కోణంలో అదృష్టం – కర్మఫలమూ ఒకటి కాదు. అదృష్టం కలిస్తొస్తే, కర్మలూ ఆటోమేటిక్గా కరెక్టుగానే ఉండాలి. :))

  just see this too:


 13. రేరాజ్ గారూ మీరు యధావిధిగా పొరబడ్డారు. అదృష్టం అంటే కేవలం తానెంచుకున్న వృత్తిలో విజయం సాధించడమే కాదు, వోల్మొత్తంగా ఆ మనిషి జీవనగమనాన్ని నిర్దేశించేది. జాక్సన్ ఒక అంతర్జాతీయ తారగా ఎదిగాడు నిజమే, కానీ అతని జీవ్తం అతి విషాదమయం.
  రైట్ ప్లేస్, రైట్ టైం .. ఇది ఎవరికి వారు నిర్ణయించుకోవలసిందే.
  అలాకాక, ఒక గొప్ప సృజనాత్మకత ఎలా పుడుతుందీ అనేది కనక మీ ఆసక్తి అయితే మిహాలీ గారు రాసిన క్రియేటివిటీ, అమ్రియూ ఫ్లో అనే పుస్తకాలు చూడండి.

 14. Ramana Says:

  హాలివుడ్ తొ పోల్చుకోవదం మనం మానుకోవాలి. మన సంస్కృతి వారి సంస్కృతి వేరు.
  తెలుగువాది మెప్పు పొందదానికి మైకేల్ జాక్సన్ లాంటి వాళ్ళు తెలుగులొ ఏ ప్రయత్నము చేయలేదుకద. ఆది వారికి అవసరము లేదు కూడా. వారి దేశంలొ లభించే (లేదా ఇంగ్లీష్ తెలిసిన/అర్థమయ్యె అభిమానుల) గుర్తింపే వారికి చాలునని భావించారు.
  బాలూకు అమెరికన్ల గుర్తింపు అవసరము లేదు. బాలూ లాంటి గొప్ప కలాకారుదు తెలుగువారికే సొంతం.

 15. rayraj Says:

  @కొత్తపాళీ:
  ధన్యవాదాలు. కొత్త విషయాన్ని తెలిపినందుకు, రెండోది: ’యధావిధి పొరబడే నా పోస్టు’ నూ చదివినందుకు.
  ” వోల్మొత్తంగా ఆ మనిషి జీవనగమనాన్ని నిర్దేశించేది!” – ఔనండీ. ఇలా అనుకుంటెనే బావుంది.
  ఐతే : అలా నిర్దేశించబడే అదృష్టంలో ఇంతవరకూ “ఓ బాలసుబ్రహ్మణ్యంలాంటి వాడు మైకేల్ జాక్సన్ అంత గొప్పవాడు అదృష్టవశాత్తుగా ఐనా ఎందుకవ్వలేదు? ” అనేది ప్రశ్న. ఒకే! మీ దృష్టిలో మైకేల్ జాక్సన్ అదృష్టవంతుడు కాదండీ, పోనీ రబీంద్రనాథ్ ఠాకూర్ అదృష్టవంతుడేనా!? ఐతే, శ్రీశ్రీకో, మరొకరికో ఇలాంటి అదృష్టం ఎందుకు పట్టలేదు అనేది ప్రశ్న!!

  తెలుగు సినీ గాయకులందరికీ బాలూ రోల్ మోడల్ అవ్వగలిగే స్థాయిలో ఉన్నాడు – అదృష్టవంతుడు. హాలీవుడ్‌నే రోల్ మోడల్‌గా చూస్తున్నారు – మరి అదీ ఆ దేశ అదృష్టమేనా!?

  Can you make the whole world to look upto Telugu World for Answers? Just like we look upto US today!? If you say, NO, please excuse me. I need someone who is ready to think at that level and make everyone think in that direction.

  దీనికే ఓ వాతావరణం కావాలి. ఎలాంటిది? :
  మీరు చెప్పిన పుస్తకంలోని ఆలోచనలు తెలుగులో జరగక్కర్లేదా!!?? వాళ్ళు రాసింది చదువుకొని బట్టీకొట్టేస్తే చాలా!!?? అప్పుడు ఆ ఆలోచన తెలుగువాళ్ళ సొంతం ఎప్పటికీ అవ్వదు సార్! అది తెలుగు వాతావారణంలో పుట్టి పెరగదు. ఈ విషయాన్ని నేను చాలా చాలా సార్లు చెప్పాను. If i propose today an earth shattering theory in atomic physics in Telugu, it well never be understood!!! It will never ever see the day of light! And hence I have to necessarily go into English. This further deprives the development of thoughts in Telugu and the ramifications of such deprivation are many. And I have also tried to explain in many ways that creativity is not an outcome of just thoughts in Literature! Many times, its a prodcut of thoughts generated in Science or to be more precise – from Searching the Truth; (Not in terms of the way we believe it, either from a Religious Text Book or a Science Text book or Literature! but from a summation of those varied thoughts); Hence, the requirement of an environment; In another context, it is also called an “ecosystem” and thus it has many such names.

  So if you create an ecosystem – such a one that the whole world is looking up for answers, in the evolving thoughts of Telugu language – we actually are creating a thinking telugu society. And somewhere there in it, serendipity strikes in a fashion that might take the Carnatic Music (Completely with a different Telugu name and format) may take over the whole world!!! Or something like that!!!

  @Ramana : మీ ఫస్టు లైనూ, నా లైనూ ఒకటే! కానీ, ఆ తర్వాతే మనకి తేడా వస్తుంది.

  మీకు హాలీవుడ్ సినిమాలు గొప్పగా చూడటం ఇష్టం. మన వరకూ వచ్చేసరికి, మీకు తెలుగు అనిపించే ఓ పంచె సినిమానో, ఓ నులక మంచం సినిమానో, లేక ఓ ఎంకి సినిమానో, ఏదో అలా మీ దృష్టిలో “తెలుగు సంస్కృతి” ఏదో, అది కావాలి. అంతేనా!!??

  బాలూకి అమెరికన్ల గుర్తింపు అవసరం లేకపోవచ్చు. కానీ, నాకు కావాలి. నా తెలుగు సినిమా గుర్తింపు ప్రపంచమంతా రావాలి. తెలుగు సినిమాని ప్రపంచం అంతా గంగవెర్రులెత్తి చూడాలి. యూ హావ్ ఎనీ ప్రాబ్లెం!!!??

  బాలూ లాంటి గొప్ప కళాకారుడు తెలుగువారికే సొంతం. ఔను, కానీ మైకేల్ జాక్సన్ ప్రపంచం మొత్తానికి సొంతం. వాడి ప్రతిపాటనీ తెలుగులో తీశారు. వాడి ప్రతి స్టెప్పునీ చిరంజీవి చేశాడు. తెలుగునాట కూడా బోళ్డుమంది మైఖేల్ జాక్సన్ ఫ్యాన్సు ఉన్నారు. దాన్ని చూసి కొంతమంది “సంస్కృతి చచ్చిపోతోంది. భరతనాట్యంకి గుర్తింపు లేకుండా పోతోంది” అని కూడా ఏడ్చేవాళ్ళు ఒకప్పుడు. ఇవ్వాళ కూడా అలాగే బయటి సంస్కృతినే నేర్చుకుంటున్నాం. కొందరు భయస్తులు పాత సంస్కృతిని కాపాడుకోవాలనే తపిస్తున్నారు గానీ, మనదైన ఓ సంస్కృతినీ అభివృద్ధి పరుస్తునే ఉందాం అని గానీ, అభివృద్ది చెందినదేదో ఒకదాన్ని మన సంస్కృతిగా గుర్తించడంగానీ చేయడం లేదు. అలా ప్రతిసారీ, హాలీవుడ్ ఏం చేస్తే, అదే మనమూ చేస్తున్నాం. పైగా అలాగే నేర్చుకోవాలి అని కూడా చెబ్తున్నాం.

  కంపేరిజన్ నేను చెయ్యలేదు. తెలుగువాళ్ళమే చేసుకున్నాం మాష్టారు!కళ్ళు తెరిచి చూడండి. నా నెక్స్టు పోస్టులో ఇచ్చిన నవతరంగం లింకుకి వెళ్ళి చూడండి.

 16. Bhaavana Says:

  మీరు కొంచం ఫాంట్ సైజు పెంచరా ప్లీజ్, పెంచక పోతే మరి నాలాంటి వాళ్ళను దురదృష్టవంతుల్ని చేసేస్తున్నారు మీ సైట్ చదవనివ్వకుండా.. చాలా కష్టం గా వుంది అంత చిన్న ఫాంట్ చదువుతు ఆ కాంటెంట్ ను అర్ధం చేసుకోవటం రెండూ ఒక్క సారి జరగాలి అంటే … ప్లీజ్ అండ్ థ్యాంక్స్

 17. rayraj Says:

  @Bhaavana: థాంక్యూ. మీరు చెప్పిన సూచన తప్పకుండా ఆచరిస్తాను. ఈ టెంప్లేట్ తీసుకున్నప్పుడే, కామెంట్లలోని ఫాంటు చాలా చిన్నగా ఉందని గమనించాను. కానీ,ఏదో అలా ఐపోయింది.

  ఒక మాట చెప్పండి: మీకు పోస్టులొ ఫాంటు కూడా చిన్నగానే ఉందా? మీరు ఫైర్‌పాక్సు వాడతారా లేక ఎక్స్‌ప్లోరరు వాడతారా!?

 18. Ramana Says:

  రేరాజ్ గారు మీరు పొరబడ్డారు. హాలివుడ్ సినిమాలు గొప్పగా చూడడం నాకిస్టమని నేను చెప్పలేదు. నాకు లేని అలవాట్ల గురించి వివరణ ఇచ్చుకోవాలంటే కాస్త కష్టమే. మీకూ తెలుసు తెలుగులొ టైపు చెయ్యడం ఎంత కష్టమో.

  తెలుగు సినిమాకు గుర్తింపు రావలనే మీ సదుద్దేశం హర్షించ తగ్గది. కానీ “యూ హావ్ ఎనీ ప్రాబ్లెం!!!??” లాంటి పద ప్రయోగాలు అవసరమని నేను భావించడం లేదు. సుధీర్గ తెలుగు సినీ చరిత్రలొ ఆణిముత్యల్లాంటి సినిమాలు కోకొల్లలు. మరి వాటిలొ ఎన్నింటి
  పేర్లు అమెరికన్లకు తెలుసు? గంగవెర్రులెత్తడం అటుంచి మన సినిమాలపట్ల వారికి అభిరుచి కలిగించడం అసాధ్యం. వారికి మన భాష మరియు మన సంస్కృతి పట్ల అంతగా ఆసక్తి లేకపొవడంలొ తప్పేమీ లేదు. మరి అలాంటి గుర్తింపు కోసం మనం అర్రులు చాచడం ఎంతవరకు సబబు?

  మీరు చెప్పిన విషయం ….

  ” మనదైన ఓ సంస్కృతినీ అభివృద్ధి పరుస్తునే ఉందాం అని గానీ, అభివృద్ది చెందినదేదో ఒకదాన్ని మన సంస్కృతిగా గుర్తించడంగానీ చేయడం లేదు.”

  ఈరెండూ పరస్పర విరుద్ధాలు. మొదటిది మంచిదే. కానీ అభివృద్ధి చెందినదేదో ఒకదాన్ని మనం మన సంస్కృతిగ ఎందుకు గుర్తించాలి? ఆసంస్కృతి మనకు ఎంతవరకు వర్తిస్తుంది? మనసంస్కృతిని మనము అభివృద్ది చేసుకొవడమే సబబు.

 19. rayraj Says:

  @Ramana : ఐతే ఓ స్టీరియో టైపులో బంధించి తొందరబడి ఎటాకు చేశానా 🙂 క్షమించెయ్యండీ! అది మీకు కాదు; జవాబులో ఉదహరించిన స్టీరియో టైపు మనుష్యలకే! ఆ పద ప్రయోగం వాళ్ళనే చాలా గట్టిగా కొడుతుందేమో! మీరు అలాంటివారు కాదు గాబట్టి, అది మీకు గాదు. ఓకేనా! 🙂

  >>గంగవెర్రులెత్తడం అటుంచి మన సినిమాలపట్ల వారికి అభిరుచి కలిగించడం అసాధ్యం.
  దాన్ని సాధించడమే ధ్యేయంగా చెప్పుకున్నాను గాబట్టి, నా మాటలు కొంచెం వింతగానే అనిపిస్తాయి.

  >>మరి అలాంటి గుర్తింపు కోసం మనం అర్రులు చాచడం ఎంతవరకు సబబు?
  ఓ విధంగా మీరూ రైటే! దానికి నా దగ్గర సమాధానం లేదు. అందుకే, దీని తర్వాత నేను ఇంగ్లీషులో వేసిన పోస్టును చదవమన్నాను. నా దృష్టిలో అది సబబే! మీరు వద్దన్నా కద్దానా చివరికి మనం అలాంటి గుర్తింపుకోసమే అర్రులు చాస్తున్నాము.

  >>ఈరెండూ పరస్పర విరుద్ధాలు.మొదటిది మంచిదే- సరే!! కనీసం మొదటిదాని గురించైనా ఆలోచిద్దామా?

  కాదూ, ఆ రెండో ప్రశ్నకూడా సమాధానం చెప్పితీరాల్సిందే నంటారా, వినండి:పాశ్చాత్య సంస్కృతిని అనుకరిస్తున్నా కూడా, మనదైన కొత్త సంస్కృతి ఏర్పడుతునే ఉంటుంది.అది కేవలం మనవైన జీవన విధానాలుగానే ఉంటాయి. ఇందులోనూ కొన్ని మంచివీ ఉంటాయి. కొన్ని చెడ్డవీ ఉంటాయి. ఎప్పటిలాగానే, మంచివి అనుకున్నవి మన సంస్కృతిగా చెప్పుకోవాలి.

  మన సంస్కృతి అనంగానే అందరికీ గుర్తురాని ఏరియాలోంచి ఓ ఉదా ఇస్తాను. హర్షద్ మెహతా స్కాం జరిగే వరకూ, “బద్లా” అనేది ప్యూర్లీ ఇండియన్ సిస్టం. దాని తరువాత, సడన్గా మనం “విదేశాల్లో ఐతే, అలా ఉంటుంది తెలుసా!?” అనుకుంటూ “ఫ్యూచర్స్” అనే ప్రక్రియను తెచ్చుకున్నాం. దాంతో హిందిలో “బద్లా” అనే పదం ఎగిరి పోయింది(ఆ అర్ధంలో); అందరం ఇప్పుడు “ఫ్యూచర్స్” అనే వాడుతున్నాం. (అలాగే వాడాలి కూడా అంటాను నేను. అది వేరే విషయం); కానీ, ప్రపంచం మొత్తం అందుకోడానికి ప్రయత్నిస్తున్న STP అనే సెటెల్మెంటుకు, ఒక్క అంగలో చాలా దగ్గరగా వచ్చేశాం. ఆ తర్వాత ఈ ప్రక్రియలో ఏర్పడ్డ చాలా ఆలోచనలు నిజానికి మనవైనవి ఉంటాయి. ఉన్నాయి. కానీ, అవేవీ ఇప్పుడు హిందీలో ఉండవు!! ఇంగ్లీషులోనే ఉంటాయి. అందుకని, మీకు అది మన సంస్కృతిగా గుర్తింపుకు రాదు!

  పోనీ, “మిస్సుడు కాల్కొట్టు” అనేది మనదైన సంస్కృతే! అది give me a buzz అని కాదు. కాకపోతే అది ఓ గొప్ప సంస్కృతిగా మనం ఫీలవ్వలేకపోవచ్చు! ఏదో చేతికొచ్చిన ఉదాహరణలు కొట్టాను. వేరే ఉదాహరణ ఎప్పుడన్నా మళ్ళి బ్లాగుల్లో చెప్తూనే ఉంటాను.

  ఔనూ, ఇంతకు ముందు మీతో ఎప్పుడన్నా సంభాషించానా!? మీరు నా బ్లాగు ఇంతకు ముందెన్నడైనా చదివారా?

 20. subhadra Says:

  Over action is the middle name of Sunita. Balu was his usual self. Good program in general. Enjoyed listening to some of the old songs.


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: