పరువు ప్రతిష్టల సంస్కృతి

సిసిలీ, స్పెయిన్‌లో బాస్క్ పర్వతాలలాంటి చోట్ల, పెద్దగా సారవంతమైన భూములుండవు. ఇలాంటి కొండప్రాంతాలలో, ఈ “పరవు ప్రతిష్టల సంస్కృతి” పుట్టి పెరుగుతుంది అంటూ చెప్పుకొచ్చారు. రాళ్లగుట్టలు, కొండప్రాంతాలు, వ్యవసాయానికి అనువైనవిగావు. కాబట్టి, గొర్రెలను, మేకలనూ పెంచుకునేవారు. దాంతో ఎక్కువగా గొర్రెకాపురులయ్యేవారు. వ్యవసాయం చక్కగా సాగే రైతుప్రాంతాల సంస్కృతికీ, గొడ్లకాపరుల చుట్టూ ఎదిగే సంస్కృతికీ తేడా ఉంటుంది. రైతు యొక్క జీవనోపాధి, సంఘ సహాయ సహకారాలతో ముడివడింది. ఏ దొంగో రాత్రికి రాత్రే, పంటని దొంగలిస్తాడనే భయంలేదు. ఉన్నపళంగా జీవనోపాధిని కోల్పోతానన్న అసహనం ఉండదు. అదే గొడ్లకాపరి విషయం అలా కాదు. అతను ఒంటరి వాడు. ఎప్పుడెవడొచ్చి ఏ గొర్రెనెత్తుకోపోతాడో అనే భయం అనుక్షణం వెన్నాడుతుంది. జీవనోపాధి కోసం, వాటి రక్షణ అత్యవసరం. అందుకుగానూ, తాను ఏ మాత్రం బలహీనంగా కనబడకూడదు. ప్రతి మాటలోనూ, చేతలోనూ తన బలం ఋజువౌతుండాలి. పల్లెత్తుమాటైనా, తన పరువు ప్రతిష్టలకు భంగం. తన ప్రపంచంలో, పరువు ప్రతిష్టలే జీవనోపాధి. అదే ఓ వ్యక్తికి ఉండే సొంత ఆస్థి.

 “”ఓ యువ గొర్రెకాపరి కీర్తిప్రతిష్టలు ఇనుమడించే కీలకమైన ఘట్టం, మొట్టమొదటిసారి గొడవ పడటం” అంటాడు ఎత్నాలజిస్ట్ జేకె కాంబెల్ (JK Campbell). గ్రీసులో గొర్రెకాపరుల సంస్కృతిని వివరించాడు.”ఈ గొడవలెప్పుడూ పబ్లిగ్గానే జరుగుతాయి. కాఫీ హోటళ్ళలోనో, రచ్చబండవద్దో, లేదా గొర్రెలూ మేకలూ, ఏ మేర వరకూ మేయవచ్చు, అన్న పాయింటుతోనో బోళ్డు గలాటాలైపోతాయి. హద్దుదాటిన గొడ్డుపై రాయి విసరటం అటుంచి, కాస్త అదిలించినా సరే, కయ్యానికి కాలు దువ్వేస్తుంటారు.”

 మరి అప్పలేచియన్‌లో ఇలా ఎందుకుంది? ఎందుకంటే, ఇక్కడకొచ్చిన మొదటి వలసదారుల సొంత దేశాలలో, ఈ సంస్కృతి ఉంది. అమెరికన్ బ్యాక్‌స్టేట్సుగా పిలవబడే, పెన్సిల్వేనియా వాయవ్యం, వర్జీనియా, వెస్ట్ వర్జినియా, కెంటకీ, నార్త్ క్యారలీనా, సౌత్ క్యారలీనా, నార్త్ అలబామా, జార్జియా లాంటి ప్రదేశాలకి, ప్రపంపంచంలోనే పేరుమోసిన “పరువు ప్రతిష్టల సంస్కృతుల” నుంచీ, వలసదారులు వచ్చిచేరారు. వీళ్ళంతా “స్కాచ్-ఐరిష్”. అంటే స్కాట్‌లాండ్, ఉత్తర ఇంగ్లాడు, ఉత్తర ఐర్లాండులోని ఉల్‌స్టర్‌లాంటి చోట్ల నుంచి వచ్చారు.

 బార్డర్‌లాండ్స్(సరిహద్దు భూములు)గా పిలవబడే ఈ ప్రాంతాలు, ప్రభుత్వాలకి సుదూరంగా, చట్టరహితమైన ప్రాంతాలుగా జీవించాయి. పొరుగు దేశాలతో వందల ఏళ్ళు యుద్ధాలతోనే గడిపేసాయి. అలా హింసలో మునిగితేలిన ప్రజలు, ’వంశగౌరవం, పరువు, ప్రతిష్ట’ అంటూ కుంటుంబ బంధాలకీ, రక్తసంబంధాలకీ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. చుట్టూ ఉన్న భయంకర హింసాయుత వాతావరణంలో మనుగడ సాధించటానికి, అదో మానవ ప్రతిక్రియ. ఇలాంటి వీళ్ళు, ఉత్తర అమెరికాకి వలసవచ్చినా, interior భూములుకే ఎక్కువగా ఆకర్షితులయ్యారు. తమ పాత ప్రపంచంలోని సంస్కృతిని, తిరిగి కొత్త ప్రపంచంలో స్థాపించుకొని, ఆనందగా జీవించడానికి,  ఈ ’సుదూర, చట్టరహిత, భయంకర’ భూములు చాలా అనువుగా కనిపించాయి.

 “ఈ అమెరికన్ బ్యాక్‌కంట్రీ, వారి బ్రిటీష్ బార్డర్‌లాండ్ జీవనాన్ని తలపించింది” అంటాడు చరిత్రకారుడు డేవిడ్ హ్యాకెట్ ఫిషర్ (David Hackett Fischer). తన ’అల్బియన్‌’స్ సీడ్’ (Albion’s Seed) లో ఆయన ఇలా వివరిస్తాడు :

 “దక్షిణ మెట్ట ప్రాంతాలని “డిబేటబుల్ ల్యాండ్స్” అనొచ్చు. ఎందుకంటే, ఈ ప్రాంతాలకి ప్రభుత్వాలుగానీ, చట్టాలుగానీ ఏర్పడలేదు. అందుకే సరిహద్దుభూముల నుంచీ వచ్చిన వలసదారులు, మిగిలిన వారికంటే తొందరగా ఈ ప్రాంతంలో ఇమిడిపోయారు. వాళ్ళ కుటుంబవ్యవస్థకీ, యుద్ధనీతికీ, భూములపై దృక్పదానికి, ’పని’-’పవర్’ లాంటివాటిపై ఉన్న ఐడియాలకీ, వ్యవసాయ-గొర్రెకాపరి ఎకానమీలకీ, ఇది చాలా అనువైన వాతావరణం. ఈ  ప్రాంతాలకి వీళ్ళ సంస్కృతి ఎంత బాగా సరిపోయిందంటే, మిగిలిన జాతులూ (ethnic groups), వీళ్ళ సంస్కృతినే కాపీ కొట్టేవాళ్ళు. అలా ఉత్తర బ్రిటీషు సరిహద్దుప్రాంతాల ఇథోస్, ఇక్కడ ఆధిపత్యం సంపాదించాయి. వీళ్ళ సంఖ్యాబలం కూడా కారణమవ్వచ్చు గానీ, ఈ ప్రమాదకర ప్రాంతానికి సరియైన  జీవనవిధానం అనుకొని, జనాలే ఎక్కువగా  ఎంచుకున్నారు”

అలా, ఈ ప్రాంతంలో “పరువు ప్రతిష్టల సంస్కృతి” విజయవంతంగా స్థాపించబడటమే, ఈనాటి అమెరికన్ సౌత్‌లోని, విభిన్నమైన నేరప్రవృత్తికి కారణంగా భావిస్తున్నారు. దేశంలోకెల్లా ఇక్కడ మర్డర్ రేటు ఎక్కువ. కానీ, “మగ్గింగ్” లాంటి వింతనేరాలు తక్కువే. సామాజిక శాస్త్రవేత్త John Shelton Reed ఇలా రాసాడు: “సౌత్‌లో జరిగే హత్యలకి ఓ ప్రత్యేకత ఉంది. హంతకుడు చంపబోతున్నాడన్న విషయమేకాక, కారణం కూడా హతుడికి (ఎక్కువగా హతురాలుకీ) ముందే తెలుసు. హత్యకారణాలపైన,  హతులకీ-హంతకులకీ మధ్య, ముందే  మంచి అవగాహన ఉంటుంది. గణాంకాలను బట్టి, మరో మంచి విషయం కూడా తెలుస్తోంది. వాదులాటలూ, అక్రమ సంబంధాలూ గనక తప్పించుకుంటే, సదర్నర్ (Southerner) కూడా ఇతర అమెరికన్లంత సేఫే! బహుశా, మరింత సేఫేమో! “

దక్షిణప్రాంతంలో పేరుమోసిన పత్రకారుడు హాడింగ్ కార్టర్ (Hodding Carter), యవ్వనంలో జ్యూరీగా పనిచేసాడు. ఆయన చెప్పిన, ఆనాటి ఓ కథని రీడ్ ఇలా వర్ణిస్తాడు:

 “ఓ కేసులో ముద్దాయి,  కోపిష్టి-జెంటిల్మాన్. ఈ ముద్దాయి ఓ ఫిల్లింగ్ స్టేషన్ పక్కనే నివసించేవాడు. ఊళ్ళో ఖాళీగా ఉన్న అలగా జనంతో పాటు, అందరూ ఈ ఫిల్లింగ్ స్టేషన్‌ దగ్గర చేరి, బాతాఖానీ కొడుతుండేవాళ్ళు. వీడి కోపం సంగతి తెలిసినా, కొంతమంది ఆకతాయులు వాడిని హేళన చేసేవారు. సూటుపోటి మాటలతో వేధించేవారు. చూసి చూసి చిరాకు పెట్టిన ముద్దాయి, గన్నులోని రెండు బుల్లెట్లు, ఒకడి బుర్రలోకి దించాడు. మరొకడి మూతిమీదిచ్చిన ముష్టిఘాతానికి, వాడు శాశ్వతంగా మూగవాడయ్యాడు. ఇంకోడి మెడకాయ విరిచేశాడు…..వోటింగు పెడితే, జ్యూరీలో కేవలం కార్టర్ ఒక్కడే ముద్దాయిని నేరస్తుడన్నాడు! మిగిలిన సభ్యులు, “వాళ్లని చంపకపోతే, వాడు మగాడే కాదు!” అంటూ వదిలేశారు.

కేవలం “పరువు ప్రతిష్టల సంస్కృతి”లో మాత్రమే :
౧. జరిగిన అవమానంకి, హత్య చేయడం సరియైన సమాధామేనని ఓ వ్యక్తి భావిస్తాడు.
౨. అలాంటి పరిస్థితులలో, ‘హత్య’ నేరమే కాదని న్యాయనిర్ణేతలు భావిస్తారు

సంస్కృతులను బట్టి జనాలని జనరలైజ్ చేయాలంటే, కొంచెం జంకుతాం. దానికి ఓ మంచి కారణం ఉంది. జాతి,తెగల వివక్షలకు ముందు, ఇలాంటి స్టీరియోటైపు రూపాలే తయారౌతాయి. జాతిచరిత్రకి, మనం బందీలం కాదని నమ్ముతాం.

కానీ, చిన్న నిజం ఏంటంటే, పంతొమ్మిదవ శతాబ్దంలో,  కెంటకీలోని హర్లాన్‌లాంటి చోట్ల ఏం జరిగిందో తెలియాలంటే, మనం భూతకాలానికి వెళ్ళాలి. ఒకటో రెండో తరాలు అనుకునేరు. మూడూ నాలుగు వందల సంవత్సరాల వెనక్కి, మహాసముద్రాల అవతల వారి సొంత దేశాలకి వెళ్ళి, అప్పటి ఆ భౌగోళిక పరిస్థితులలోని జీవనశైలిని అర్ధం చేసుకోవాలి. “పరువు ప్రతిష్టల సంస్కృతి” అనే ఈ హైపోధిసిస్ -పెరిగిన వాతావరణమో, తల్లిదండ్రుల వాతావరణమో కాక, తరతరాలుగా, ముత్తాతల ముత్తాతల ముత్తాతలు ఎలా పెరిగారు అనేది, నేటి మనిషి మీద ప్రభావం చూపిస్తుంది – అని చెప్తుంది. ఇదింకా మొదలే! ఇంకా దగ్గరగా పరీక్షిస్తే, ఇది మరింత వింతైన, బలవత్తరమైన కారణంగా కనబడుతుంది.

ప్రకటనలు
Explore posts in the same categories: పుస్తాకాలు/రచన రివ్యూలు

ట్యాగులు: , ,

You can comment below, or link to this permanent URL from your own site.

One Comment పై “పరువు ప్రతిష్టల సంస్కృతి”

 1. చక్రి Says:

  రాజూ,

  మందులొ మాటలాడుకోటానికి మంచి టాపిక్ మొదలెట్టావ్.

  ఈసారి మావాళ్ళందరికి జ్ఞానొదయం చేసి… “ఆలోచనల్ని ముందుకు” తీసుకెళ్తా.

  స్పయిల్ స్పొర్ట్ అనుకోకుంటే చివరికి రాయల సీమ కథకు లింక్ పెడతావు కదూ?

  చక్రి


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: