ఓ సస్పెన్స్ థ్రిల్లర్; ఇంకో సైకో థ్రిల్లర్

మొదటిది:

మొన్నీ మధ్య ” స్క్రీన్‌టాలెంట్” అనే బ్లాగులోని, “కవచం” స్క్రిప్ట్ చదివి అభిప్రాయం చెప్పమని ఆ బ్లాగరి నా బ్లాగులో కామెంటారు. ఆ స్క్రిప్టనండీ, కధ అనండీ – అది నాకు నచ్చింది. మీరూ చదివి మీకు తోచిన అభిప్రాయాలు రాయమని అభ్యర్ధిస్తున్నాను. ఏదో చేసెయొచ్చు అన్న ఫీలింగు వస్తోంది….కానీ అదేంటో ఎలాగో ఇంకా తెలీలేదు. మీ అభిప్రాయాల్లోనించి, అదేదో వెలుపలకొచ్చి వికసిస్తుందని నా ఆశ.

రెండోది :

ఈలోగా, నాకూ ఓ యధార్ధ ఘటన నుంచి ఓ మంచి సైకో ధ్రిల్లర్  రాయగలమని/ తీయగలమని అనిపించింది.

20 మంది యువతులను చంపేసిన ఓ 46 ఏళ్ళ సీరియల్ కిల్లర్ వాస్తవ కధ! వణుకుపుట్టించే అసలు విషయం చెప్పనా! వాడు 20 ఏళ్ళు టీచరుగా పనిచేసి, ఆ ఉద్యోగం వదిలేసాడు.

న్యూస్ లింకు ఇది.   (ఈ న్యూస్ చదివి, దానికింద ఓ పిచ్చి డాక్టరి కామెంటు చూడండి! “పోలీసులు ఏం చేస్తున్నారు? నాకు తెలుసు వాళ్లంతా తాగుబోతు వెధవలు” అంటూ వాపోతున్నాడు. సీరియల్ కిల్లర్ టీచరండి బాబూ 🙂 )

ఈ సినిమాని తమిళులకో, తమిళ సినిమా ప్రేమికులకో ఇచ్చేస్తే, రియలిస్టిక్ సినిమా అని చెప్పి ఓ ఛండాలపు రోతపుట్టే (నేటివిటీలో) సినిమా చేస్తారు. తమిళులు, తమిళ సినిమా ప్రేమికులు ఇష్టపడేది “నేటివిటీ” కాదు బాబూ, అదింకో ’సైకో ఇష్య్యూ’ . ఏదేమైనా, అది నా టేస్టు కాదు. ఈ న్యూసు ఓ సినిమా/కధ ఎలా ఔతుందో తేల్చుకోలేకపోతే చెప్పండి, ఓ పెద్ద పోస్టు వేసి చెప్తాను.

నా ఆలోచనలు ఇలా ఉన్నాయి:
౧.హంతకుడి-హతుల కోణంలో,సైకో థ్రిల్లర్లా తీయడం ఒక ఆలోచన; ఇక అప్పుడు హీరో ఉండడు; భయపెట్టడమే ముఖ్యోద్దేశ్యం.
౨.(లేదా) దర్యాప్తు కోణంలో నుంచి ఎత్తుకుంటే, సినిమాలో హీరో లేకపోయినా, ’హీరోయిక్’ పాత్రలను పెట్టి , సైకో-కం-క్రైం ధ్రిల్లర్‌గా మలచటం ఇంకో ఆలోచన.

ప్రకటనలు
Explore posts in the same categories: Uncategorized

4 వ్యాఖ్యలు పై “ఓ సస్పెన్స్ థ్రిల్లర్; ఇంకో సైకో థ్రిల్లర్”

 1. అబ్రకదబ్ర Says:

  దీన్ని మించిన సైకో(?) కథ రెండు నెలల క్రితం అమెరికాలో వెలుగు చూసింది. ఇందులో హత్యలేవీ లేవు, కానీ ఛిద్రమైపోయిన మూడు జీవితాలున్నాయి. బహుశా మీరా వార్త చదివే ఉంటారు. లేకపోతే ఈ లింక్ చూడండి. ఆ మధ్య ఆస్ట్రేలియాలో ఇంతకన్నా దారుణమైన సంఘటన బయట పడింది. మనుషులు ఇలా ఎలా మారతారో!

  ఇక – మీ ఆలోచన దగ్గరికొస్తే, నా ఉద్దేశమేంటంటే, ఆ కథని దర్యాప్తు కోణంలోనే తీయాలి. సినిమా అనేసరికి తీసేవాళ్లకి కొంత సామాజిక బాధ్యత ఉండాలనేది నా అభిప్రాయం (ముఖ్యంగా, ఇండియావంటి దేశాల్లో – ప్రేక్షకులు తేలిగ్గా సినిమాలవల్ల ప్రభావితమయ్యే చోట్ల). సైకో కిల్లర్ కోణంలో భయానక చిత్రం తీయటం ద్వారా అనుకోకుండానే ఆ పనులకి హీరోయిజాన్ని ఆపాదించుకునే జనాలు – ముఖ్యంగా యువత – చాలామంది ఉంటారు. అందుకే దర్యాప్తు కోణంలోనుండి తీయటం మెరుగు.

  (నా ‘ఆరోప్రాణం’లో నేను చేసిన పనేమిటన్న అనుమానం మీకొస్తే – దాని reach చాలా పరిమితం, అది చదివే వంద/రెండొందల మందికి ఆ మాత్రం విచక్షణ ఉంటుంది కాబట్టి ఫరవాలేదని నా నమ్మకం)

  మూడో కోణం – నాకు తట్టింది – ఒక టీచర్ అలా ఎందుకయ్యాడు అన్న విషయమ్మీద కథ కేంద్రీకరించటం. అంటే – తన వృత్తిని అమితంగా ప్రేమించే ఒక టీచర్ క్రమ క్రమంగా ఒకరకమైన ట్రాన్స్‌లోకి వెళ్లిపోయి హంతకుడుగా మారటం. స్టూడెంట్స్‌ని బెత్తంతో కొట్టే దశ నుండి మరణదండన వేసే దశకెళ్లటం, etc. అఫ్‌కోర్స్, ఇవన్నీ చాలా తెలివిగా తీయాల్సిన విషయాలు. లేకపోతే ఉపాధ్యాయ సంఘాలు కేసులేసే అవకాశముంది.

  చివరగా నా కథ గురించి:

  That movie some people are referring to seems to have the protagonist being revealed as the antagonist in the end. That’s where the similarity ends between my story and the movie. There are countless other films with the same point. నేనో చిన్న పాయింట్ పట్టుకుని పాఠకుల్ని తప్పు దిశలో ఆలోచించేలా చేసి, చివర్లో ‘అర్రె. ఇదా సంగతి’ అనుకునేలా చెయ్యాలనుకున్నాను. I was toying with the unreliable narrator concept. Did I succede?

 2. rayraj Says:

  You have succeeded. అందుకే బావుంది అని చెప్పాను.క్లైమాక్సులో, ప్రతి వాక్యం యొక్క రెండో అర్ధం స్ఫురించేస్తుంది.ఎక్కడన్నా తప్పు చేశారా చూద్దామని పైపైన మళ్ళీ రెండోసారి కూడా చూశాను. ఏమీ దొరకలేదు.

  కాపీ కొట్టారని వాళ్లన్నారని ఫీలవుతున్నారా? పర్లేదండీ! “సిక్త్‌సెన్స్” కాదు కాదు, “పోకిరి”లో పూరి జగన్నాధ్ కూడా ఇదే స్టైల్ ఎంచుకున్నాడు. కాబట్టి వాళ్ళలాగా నేను కాపీ అనను. ఐనా చెప్పానుగా, మీరు తెలుగులో ఏం చేసినా, అది కాపీయే అనబడుతుంది. దానికి చాలా కారణాలున్నాయని,అవి నేను చెబుతూనే ఉన్నాను.మీరెప్పటికో అప్పటికి అది అర్ధం చేసుకుంటారనే ఆశ (డిగ్రెషన్ కదా! సరే!)

  ఇది ఖచ్చితంగా మీ ఒరిజినల్ ప్రయత్నమనే నమ్మాను. ఒకవేళ మీలో సైకో ఉన్నా,వాడు చాలా సున్నితంగా ఎక్స్‌ప్రెస్ చేసుకొని తృప్తి చెందుతున్నాడన్నాను.;)
  (మళ్ళీ డిగ్రెస్ అయ్యాను.)

  నిజంగా అది ఊహాజనితమైన కథే!మంచి ఉదాహరణే! మీరెంచుకొన్న విషయంలో మీరు కృతుక్రుత్యులూ అయ్యారు.ఇక జనాలకి ఎందుకు నచ్చింది, నచ్చలేదు అనేది, “అదృష్ట”మండి 🙂

 3. lekhari Says:

  సస్పెన్స్ థ్రిల్లర్ స్క్రిప్ట్ అదిరిపోయిందండీ,ఇంటర్వల్ వరకూ బలే ఉత్కంఠగా నడిచింది కానీ ఇంటర్వల్ తరవాత ఏమైందో ఆ సస్పెన్స్ మీరింకా విప్పలేదు,”కవచం” స్క్రిప్ట్ చాలా బాగుంది.ఇంటర్వల్ తరవాతి స్టోరీ కూడా వీలైనంత తొందరలో చదవాలని ఉంది.రెండో భాగం..అంటే..క్లైమ్యాక్స్ ఎప్పుడు ఆశించవచ్చు??

  రెండోది సైకో థ్రిల్లర్ కాబట్టి నేను చదివే ధైర్యం చెయ్యలేకపోయాను.”కవచం”లాంటి సస్పెన్స్ కథలు ఇంకేమైనా ఉంటే అవి కూడా పోస్ట్ చెయ్యగలరు. 🙂 🙂

 4. rayraj Says:

  @lekhari:పొరబడ్డారు. అది రాసింది నేను కాదు. అతడినే/ఆమెనే అడిగినా, అతను రాయకపోవచ్చు. ముందే చెబితా, ఇక సినిమా ఎవరు చూస్తారు? 🙂


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: