ఎవరిదీ ఆధునిక తెలుగు భాష?

చేతన్ భగత్ వెర్రి వెధవా లేకా విదూ వినోదా చూద్దామని బుడుగాయ్ చదువుతున్నాను. అటు పిమ్మట రీసెంట్ పోస్టులు చదివాను. బావున్నాయి.

వాటి మధ్యలో కవిత్వం గురించి వేసిన పోస్టులో, కామెంటుగా వేసిన ఓ లింకు, చూపవలసిన పిడియఫ్ఫుని కాక, ఆంధ్రజ్యోతి, జనవరి 4 ’వివిధ’కి తీసుకెళ్ళింది. అందులో ఎన్ మనోహర్ రెడ్డి  రాసిన “ఎవరిదీ ఆధునిక తెలుగు భాష?” అనే వ్యాసం చదివాను.

ఆ వ్యాసం మీద మీ వ్యాఖ్యలు చెప్పండి. మనోహర్ వాదనలో నిజం ఎంత? అబద్ధం ఎంత? దీని ద్వారా మనం తెలుసుకోవలసింది ఏమిటి?

ప్రకటనలు
Explore posts in the same categories: బ్లాగుల గురించి

ట్యాగులు:

You can comment below, or link to this permanent URL from your own site.

8 వ్యాఖ్యలు పై “ఎవరిదీ ఆధునిక తెలుగు భాష?”


 1. మనోహర్ రెడ్డి, గిడుగూ గురజాడల గురించి భాహ్మణ వాదులు అన్నట్లు గా మాట్లాడారు. ఆయన దానిని నిరూపించటానికి వారి రచనల నుంచీ కోట్ చేస్తే బాగుండేది. ఆయన వాదనకి సాక్ష్యాలని చూపించ వలసింది

 2. Surfizen Says:

  ఆధునిక తెలుగుభాష – ముఖ్యంగా మీడియా/ పత్రికల భాష ఒకప్పుడు కోస్తాప్రాంతానికి చెందిన బ్రాహ్మణుల కుటుంబభాష అనే వాదన వాస్తవమే. అందులో అబద్ధమేమీ లేదు. అయితే ఆ వాస్తవం మీద ఇప్పుడు తిరుగుబాటు, కంప్లెయింట్ చేయడం అనవసరమేమో ! అది మిగతా మాండలికాల కంటే వినడానికి బావుంటుంది. అందరికీ అర్థమవుతుంది. ఇన్ని దశాబ్దాల తరువాత దాని మీద పునరాలోచన అక్కరలేదు. ఎవరో ఒకరు పూనుకొని స్టాండర్డ్స్ ఏర్పరచకపోతే జాతి ఎలా ముందుకెళుతుంది ? ఆ పని ఈ దేశంలో బ్రాహ్మణులు చేసారు. బయటివాళ్ళయిన ఇంగ్లీషువాళ్ళ స్టాండార్డ్స్ ని అంగికరించిన మనకి మన తోటివాళ్ళయిన బ్రాహ్మణుల స్టాండర్డ్స్ ని అంగీకరిస్తే తప్పేంటి ? దళితవాదాలు దళితులకే తప్ప నాన్-దళిత్స్ కి ప్రామాణికం కావు.

 3. budugoy Says:

  రేరాజ్ గారు, ఆయన చెప్పిన వాదం చాన్నాళ్ళుగా నడుస్తున్నదే. అన్నిట్లో లాగే మంచిని గ్రహించి చెడును వదిలేయాలి. మంచిదా కాదా అన్న విషయం పక్కన పెడితే రెండు జిల్లాల భాష మిగిలిన ఆంధ్రజిల్లాల మీద రుద్దబడిందన్న మాట నిజం. ఒక సింపుల్ ప్రశ్న అడుగుతాను.
  సపోజ్ మీ పదో తరగతి తెలుగు పరీక్షలో ఎవరైనా అబ్బాయి మొత్తం తెలంగాణ యాసలోనో లేదా మొత్తం నెల్లూరు/స్రీకాకుళం యాసలోనో రాస్తే, కోస్తా భాషలో రాసినన్ని మార్కులు వస్తాయ?
  ఉదాహరణకి.. ఒక రాజు కలడు అనే బదులు ఒక రాజుంటుండె.

  ఏదేమైనా ఈ వాదం ప్రతిపాదికన మాకు మా రాష్ట్రం కావాలి మా రాష్ట్రభాష వేరు అనడం మాత్రం సిల్లీ.

  ఇక ఈ వాదం ఒకే ఒక ప్రతివాదంతో వీగిపోతుంది. గురజాడ, గిడుగు ఇద్దరూ కృష్ణా,రాజమండ్రి జిల్లాల వారు కాదు. వాళ్ళకే అలాంటి స్వార్థ చింతన ఉంటే ఏ విజయనగరం భాషో/శ్రీకాకుళం భాషో రుద్దబడిఉండాలి. ఏమంటారు?


 4. తను చెప్పినవి కొత్త విషయాలుకాదు. కేవలం పునరుద్ఘాటించాడు అంతే.
  http://parnashaala.blogspot.com/2009/07/blog-post_05.html
  http://parnashaala.blogspot.com/2009/07/blog-post_12.html


 5. I would really like to know what Mr *would be Dr* Manohar Reddy was smoking when he wrote that

 6. rayraj Says:

  బిజీగా ఉన్నాను.ఏదో ఇక్కడ చెప్పాలనే కదా నేనూ విషయాన్ని తిరగదోడింది.అది బయటికి వస్తుంది.కొంచెం వెయిట్ చెయ్యాల్సిందే;మనసులో ఎంత తొందరగా ఉన్నా, మరెన్నో personal/professional విషయాలు తొందరబెడుతున్నాయి.

  @మహేష్: మీ రెండు పోస్టులూ గుర్తున్నాయి.వాటికి అప్పట్లో రెస్పాండయ్యాను కూడా.

  ఓ పోస్టులో “36ను ఎలా నేర్పిద్దా”మని ప్రశ్నించాను!
  “అందరం కలిసి ఆలోచించాలి” అన్న రోజు సంతోషించాను.
  నాకు కావాల్సింది మరో రకమైన “కడుపునిండిన తెలుగు భాష” అని కూడా చెప్పాను.


 7. Probably it’s all true. But language by itself is not a stand-alone entity. Social circumstances play a vital role in shaping and preceding language matters. The Brahmins were among the very few literate communities of Andhra Pradesh in ancient times. They were the traditional Gurus to the rest of the Hindus. Even at home, they are understood to be discussing various subjects and Shatras. Also, they were pioneers in almost aevery written branch of knowledge in India as well as Andhra. Owing to all these activities, a highly cultured and polished variety of Telugu had evolved in that community over a long period of time. When the Telugu jaathi entered the threshold of modern era, we were left with little choice but to adapt and accept the Brahmin Telugu.

  But basically, I believe, the Brahmin Telugu was a religious speak. So, the religious language of the ancient Telugu Brahmins seems to have gradually evolved into the secular linguga franca of the modern Telugu masses and media. Consider for instance, a few modern Telugu words frequently used by media :

  1. ఎద్దేవా చేయడం – (to ridicule) Actually, this is the starting phrase of a Vedic Mantra యత్ దేవాః etc.

  2. ప్రత్యామ్నాయం – (alternative) Actually, it means a counter-rule to a main rule in DharmaShaastra. For example, if you can’t donate a cow to a Brahmin, you can donate a few coins to him in stead of the cow. Here, the coins are called ప్రత్యామ్నాయం.

  3. ఆర్థికం – (Financial) It actually means something related to ధర్మ, అర్థ, కామ purushaarthas.

  4. ఆధ్వర్యం – (under the aegis of) it actually means the position of the chief priest in a yajna.

  You can find hundreds and thousand like this in the modern Telugu. Thus, we are all speaking, writing and broadcasting in the home language of the ancient Telugu Brahmins. No doubt on that count. But I find nothing wrong in it. After getting educated, every Hindu gets brahminized to some or other extent. I see no escape from this social process

 8. rayraj Says:

  @Abhishek, sorry for the delay in approving the commment. I was offline for a while.

  Your comment is interesting and i sort of agree on this.

  I have tried to explain this phenomenon in a diffrent post. The words like Badla are substituted by Futures.Who do you blame for this!? Domination of the West which is shaping our financial system today? Blame them for shaping our lives and lifestyles in the way we are now!? I don’t care if they are blamed. The point is: By blaming, we can not take over the role of shaping the systems of the world. Can we!?

  Essentially, the world is designed and developed by think tanks. And the think tanks, supported by the econo,political powers, will see their ideas implemented in the world.


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: