పైరసీ మార్కెట్టు – జిందాబాద్

మన సినిమాల్లో 99% కాపీయేనని నా  అభిమతం. అందుచేత, ఈ సినిమా వాళ్ళు, “పైరసీ” అనే మాట పలకడానికి అర్హులు కారు.

ఆదిత్యావాడు ఎంత పోసి కొన్నాడు అన్నది అప్రస్తుతం.నేను వాడి ఉత్పత్తికి ఎంత విలువ కట్టి ఇవ్వడానికి సిద్ధపడుతున్నాను అనేదే మార్కెట్టు. అది గ్రహించారు కాబట్టే, ఆదిత్యా మ్యూజిక్కు సైతం, mp3  పార్మాట్లో ఏకంగా రూ60కి, అరవై పాటలొచ్చేలా, కాంబునేషన్లు అమ్మటం మొదలు పెట్టారు.

పైరసీ సినిమా సిడీల్లోనూ,  మూడు సినిమాలను రూ35కే అమ్ముతున్నారు. గ్రే మార్కెట్లో దొరికే విసిడి ప్లేయర్లు అతి తక్కువ ధరల్లో కనుక్కొని, గుడిసెల్లో సైతం టివిలో సినిమా చూసే ప్రజలు ఉన్నారు మనకు. అంటే – అది ఒక మార్కెట్. అదే నిజం.

అప్పుడు నువ్వేం చెయ్యాలి? నీ ప్రాడక్టు డివరెంషియేషన్ చేసి, ఒక్కొక్క ప్రైస్ బ్యాండులో ఒక్కొక్క ప్రాడక్టుగా అమ్ముకోగలగాలి. అంతే గానీ, ఇలా ప్రతి పిచ్చి  విషయానికీ ఆమరణ నిరహార దీక్షలు చెయ్యకూడదు – సినీ నిర్మాతైనా, లేక పైరసీ సీడీ తయారీదారులైనా!

ఉదా: రణ్ – రామ్ గోపాల వర్మ సినిమా చూడండి. సినిమా రిలీజైన ఆరువారాల్లోపే అనుకుంటాను, అది ఆల్రెడీ స్టార్ ప్లస్లో ప్రసారం చేసేశారు. మార్కెట్లో డివిడీలు, విసిడీలు కూడా రిలీజ్ చేసేశారు. డివిడిలు రూ200 ఉంటే, విసిడిలు రూ100కి పెట్టారు. విసిడిలతో మరో సినిమాని ఉచితంగా ఇచ్చారు. (నిజానికి ఈ ధరలు కూడా నా దృష్టిలో ఎక్కువే, ఆ విషయం వదిలేద్దాం.)

ఇవి ప్రాడక్టు ఎలా డిఫరెంషియేట్ చేసుకొవచ్చు అనే విషయానికి కొన్ని ఐడియాలు. ఇవన్నీ ఉన్నవే, కొత్తవేం కాదు!

౧. డివిడిలో సినిమా మేకింగ్‍కి సంబంధించిన విషయాలనూ, దర్శక నిర్మాతల, ఇతర డిపార్టుమెంటుల పని తీరుల గురించి వ్యాఖ్యానాలను జోడించి ఇవ్వడం ద్వారా, ఓ రకం సినిమా  పిచ్చోళ్ళని ఆకట్టుకోవచ్చు.అప్పుడు డివిడి ధరని కాస్త ఎక్కువ పెట్టినా,  కొని చూసే ఔత్సిహికులు ఉంటారు.

౨. విసిడిలలో ఇవన్నీ లేకపోయినా, మరి కొన్ని చిత్రాలను ఉచితంగా ఇవ్వడం ఒక ఎత్తు.

౩.( లేదా) విసిడిలలోనే, ఆడియో పాటలని జత చేయడం.

౪. పైపెచ్చు, విసిడి ధరలు, పైరసీ మార్కెట్టు కంటే మరీ ఎక్కువగా ఉండకూడదు. పైరసీ మార్కెట్టులో సైతం కంటెంటు పొందటం అందరికీ ఈజీ కాదు. కొందరికి రాదు, తెలీదు. కాబట్టి, కంస్యూమర్ (నాట్ కస్టమర్, ఇఫ్ యూనో వాట్ ఐ మీన్) కన్వీనియంటుగా ఉండటం వల్ల, ఆ ఎక్కువ ధర పెట్టేయడానికి సిద్ధపడగల మార్జినల్ మార్క్ అప్ మాత్రమే ఉండాలి.

౫.ఒరిజినల్ సిడీలనే, ఫుట్ పాతుల మీద అమ్మేవాళ్ళ చేత అమ్మించడం.

ఆ విధమైన సెగ్మెంట్‌కి టాక్సు కలెక్టు చెయ్యలేమేమో అనేది కొందరి భయం కావచ్చు. కానీ అదీ నిరాధారమైన భయం.ఈ సెగ్మెంటు టాక్సుని, వేరే లెక్కలుగా ప్రభుత్వంతో ఏర్పాటు చేసుకొని, నిజాయితీగా కంపెనీలే ప్రభుత్వానికి చెల్లించవచ్చు.లేదా ప్రభుత్వమే ఏకంగా వదిలేయవచ్చు. జస్టిఫికేషన్ కావాలా? ఇది:

చాలా మందికి తెలీని నిజం ఏంటంటె, ఈ ఫుట్ పాత్  వెండర్స్‌కీ అకౌంటింగ్ ఉంటుంది. ఆ వ్యాపారానికి తగ్గట్టుగా, ఓ చిన్ని ప్యాకెట్ సైజు బుక్కులో. అందులో వాళ్ళు కొన్న ధర, పోలీసులకిచ్చిన మామ్మూళ్ళు, ఇతర ఖర్చులు రాసుకుంటారు. అటు పిమ్మట, వాళ్లకి రోజుకెంత మిగిలిందో చూస్తే, వాళ్ళకి మిగిలేదీ తక్కువే! ఇది ఒక సెల్ఫ్-ఎంప్లాయ్‌మెంట్ – లైక్ ఎనీ అదర్ వెండింగ్ యాక్టివిటీ! కూరగాయలో, పూలో, ప్లాస్టిక్కు సామానులో ఎలాగో, ఇదీ అలాగే! రోడ్డు మీద ప్లాస్టిక్కు సామానులు అమ్ముడు పోయినంత మాత్రాన, షాపుల్లో అమ్ముడు పోవట్లా!

అంతెందుకు, ఇంత పైరసీలోనూ డబ్బు చేసుకుంటున్న నిర్మాతలున్నారు!అదే నిర్మాత ఈ మార్కెట్టునీ తన చేతిలోకి తెచ్చుకుంటే మాత్రం, వ్యాపారంలో ఏం నష్టం ఉంటుంది!? ఇట్ జస్ట్ బికమ్స్ మోర్ వాల్యుమినస్ బిజినస్. చేయలేరా! – చేసుకునే వాళ్లని వదిలేయండి. లేదా ఆ వ్యాపారం చేసుకోడానికి, మీ ఉత్పత్తులతో, మీరే ఫెసిలిటేటర్లుగా మారండి.

ఐనా, ఇప్పుడు జరిగేదంతా ఉత్తుత్తి స్టంటు. తెలిసిందేగా, పక్కవాడు పిత్తాడన్నా, “అలా పిత్తడం తప్పు” అనో, “తప్పు కాదో” అనో  “ఉద్యమం” చేసే ఆలోచనలొస్తాయి మనకి!భలే! మనకి ఉద్యమస్పూర్తి  కాస ఎక్కువేమరి!

అందుకే నేను –  జై పైరసీ!
ఫర్ ది వెండర్స్ ఆన్ ది ఫుట్ పాత్!,
ఫర్ సేవింగ్ మై మనీ ఆన్ సం మూవీస్ ఎట్లీస్ట్!.
ఫర్ దోజ్ పైరేట్స్ ఆర్ మై రాబిన్ హుడ్స్!

ప్రకటనలు
Explore posts in the same categories: బ్లాగుల గురించి, సినిమా రివ్యూలు

7 వ్యాఖ్యలు పై “పైరసీ మార్కెట్టు – జిందాబాద్”


 1. RGVకి మార్కెటింగ్ బాగా తెలుసనుకుంటా. Hollywoodలో theatreల నుంచి రావలసిన సొమ్ములో 97% మొదటి 8 వారాలలో వస్తుందంట. Hollywoodలో మామూలుగా సినిమా విడుదల ఐన 17 వారాలకు DVD విడుదల చేస్తారు. ఐతే 97% 8 వారాలలో వస్తోంది కాబట్టి, Disney వారు తమ DVDలు 17 కాకుండా 12 వారాల తర్వాత విడుదల చేయటానికి నిర్ణయించారు. ఇలాంటి నిర్ణయాలు మన సినిమా రంగంలో తీసుకోవటానికి అలాంటి surveyలు చేయటం కుదరదు కదా. అంతా నల్ల ధనమే కదా.


 2. You are views are 100% correct. I do agree with you.


 3. రేరాజు గారూ,మీ విశ్లేషణ బాగుంది.
  పైరసీ క్యాసెట్లూ, సిడిలూ,బ్లాక్లో టికెట్లమ్మడం …నిర్మాతలూ,దిస్ట్రిబ్యూటర్లూ,ధియేటర్ యజమానులూ కుమ్మక్కై ప్రజల
  అత్యుత్సాహాన్ని,వెర్రి వ్యామోహాలనూ సొమ్ము చేసుకునే సంస్క్రుతి మొదొట్లో ప్రవేసపెట్టి, యిప్పుడేమనుకొంటే యేం లాభం. ప్రభుత్వానికంటే ఎక్కువ ఆ రంగంలో వున్న వారికే ఎలా నియంత్రించాలో కూడా తెలుసు.అభినందిస్తూ….మీ గిజిగాడు.


 4. మీరు మంచి మార్కెట్ అనలిస్టే!

  ఓ పాతికేళ్ళక్రితం హేలో ఎగ్ షాంపూ 150 ఎం ఎల్ సీసా 34 రూపాయలకి అమ్మేవారు పెద్ద షాపుల్లో మాత్రమే! యెక్కువ జీతం వచ్చే వుద్యోగులూ, ధనవంతులూ మాత్రమే కొని వాడేవాళ్ళు. షాపువాడు నెలకి ఓ రెండు మూడు సీసాలు అమ్మగలిగితే గొప్పే!

  ఇప్పుడు, నా బ్లాగులో ఇదివరకే వ్రాసినట్టు, చంకలో బిడ్డతో చింపిరిజుట్టు ముష్టి అమ్మాయి, బడ్డీ కొట్టువాడికి రెండురూపాయలు ఇచ్చి, ‘ఆల్ కీరోటివ్వండి ‘ అంటూందంటే, మన మార్కెటింగ్ నిపుణులు యెంత సాధించరో వేరే చెప్పఖ్ఖర్లేదు.

  బై ది వే, నిన్ననే వ్రాసిన నా టపా చదవండి–పైరసీ గురించి.

 5. SIVARAMAPRASAD KAPPAGANTU Says:

  Well Written. Our Cini fellows do not have the sincerety to sell the DVDs in Telugu. Is there a single DVD with Telugu movies. All all copied from VHS tapes on to VCD and then the same CD copied on to DVD thats all. There are no DVD quality Telugu movies. But the price of DVD is more. Why? Answer to that why is piracy. When the cd/dvd sellers to not sell quality product with correct price, technology empowered the consumer to have an alternate source of purchasing the same at the correct price. The CD/DVD fellows should realise this and come down from their mirages and dream world of no piracy world, as they themselves and their greediness is the root cause and source of the piracy.


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: