నేషనల్ జాగ్రఫిక్ – ఇప్పుడు తెలుగులో

ఔనుట! నాగ చైతన్యతో తీసిన యాడ్ ఇపుడే చూశాను.

టివి ప్రోగ్రామ్స్ రాసిన రోజు ’ఇలా జరగదు’ అని చెప్పడానికి కారణం నా బ్రాహ్మినిల్ ఆటిట్యూడ్ అనుకొని సరిపెట్టుకోండి. 🙂

ఇలా వెర్నాక్యులర్లోనూ ఈ  చానెల్ తీసే ఆలోచన ఎవరికి వచ్చిందో? వారి అంచనాలేమిటో తెలుసుకోవాలని కుతూహులంగా ఉంది. ఇలాంటి ఓ ఛానెల్ రావటం చాలా ఆనందదాయకం.(ఇది ’తెలుగులో ఆలోచించడం ’ కాకపోయినప్పటికీ.)

అసలీ చానెల్‌కి తెలుగు భాషలో రాసేవాళ్ళెవరౌతారో? తొక్కలో తెలుగు సాహిత్యాభిమానులైతే  కష్టమే. లేక నాన్-తెలుగు ప్రోగ్రామ్ మానేజర్స్‌ని, కాకా పట్టేసి పొట్టపోసుకొనే కూటివిద్యగాళ్ళైతే, ఇంకా దారుణంగా ఉంటుంది.

తెలుగు వచ్చిన వివధశాస్త్ర ప్రొఫెసర్లు ఇకనైనా తెలుగులో వివధ రకాల విషయాలపై బ్లాగుల్లో రాస్తూ ఉంటేనన్నా, అలాంటి పొట్టకూటి ఉద్యోగులు కాపీకొట్టి పదజాలం నేర్చుకుంటారు/పాపులరైజ్ చేస్తారు- ప్రాచుర్యంలోకి తెస్తారు. అలా ఇంగ్లీషులో తెలుగువారు ముందే తెలిసేసుకున్న భావజాలాలకి, తెలుగులో పరిపుష్టమైన పదజాలం పుట్టి, ప్రజల నాలుకలపై నలిగితే, సాహిత్య/సినమాలికీ కొత్త వ్యక్తీకరణలు దొరకవచ్చు.

’ఏందే ఎట్టాగ ఉంది ఒళ్ళు,  చట్టిలో సరుకంతా నింపుకెళ్ళు’ అన్నంత అలవోకగా, ఆ కొంగొత్త వ్యక్తీకరణల రసానుభూతి పొందే మార్కెట్టు సైజు ఉంది అని నమ్మి, దాన్ని అందుబాటులోకి తెచ్చుకున్ననాడు, తెలుగు సినిమాలో కమెర్షియల్ ఎలిమెంట్స్ నిర్వచనం మారిపోతుందని, తద్వారా తెలుగు సినిమా మారుతుందని నా నమ్మకం.

ప్రకటనలు
Explore posts in the same categories: Uncategorized

One Comment పై “నేషనల్ జాగ్రఫిక్ – ఇప్పుడు తెలుగులో”

  1. అబ్రకదబ్ర Says:

    మీ నమ్మకాలేమో గానీ మొన్నా మధ్య ఓ పుస్తకంలో ఓ ఇంటరెస్టింగ్ అవిడియా చదివా. అదేమంటే: అమెర్కా దానంతటదే కుదేలయే తరుణం తొందర్లోనే ఉందనిన్నీ, అందుకోసమే చైనావాడు కాచుక్కూర్చున్నాడన్నీ (అంటే తక్కినోళ్లు కూర్చోలేదని కాదు). అమెరికాకి వలసొచ్చే వివిధ దేశాల ప్రజల వల్ల, అక్కడ ఆంగ్ల ప్రాముఖ్యత తగ్గిపోటం వల్ల, మొత్తానికి దేశాన్ని ఏకీకృతం చేసే ఓ భాష లేకపోటం వల్ల అవిడియాలు అందరికీ అందుబాట్లోకి రాక, వచ్చినా వాళ్లలో వాళ్లకి అంగీకారం లేక, మొత్తానికి దేశం అధోగతి పడుతుందని; అప్పుడు చైనావాడు దెబ్బతీస్తాడనీ …. కథనం. ఇందులో సాధ్యాసాధ్యాలు, నిజానిజాలు ఏమో కానీ, ఈ ‘ఏకీకృతం చేసేటటువంటి ఏక భాష లేకపోటం’ అనేది మనదేశాన్ని వెనక్కి నెడుతుందా అన్నది నా ప్రశ్న. మీ సమాధానం?


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s


%d bloggers like this: