“ఏకీకృతం చేసే ఏకభాష” ఓ !dea!; భావం = idea

కిందటి పోస్టులో అబ్రకదబ్రగారన్నారు :

…”మొన్నా మధ్య ఓ పుస్తకంలో ఓ ఇంటరెస్టింగ్ అవిడియా చదివా. అదేమంటే: అమెర్కా దానంతటదే కుదేలయే తరుణం తొందర్లోనే ఉందనిన్నీ, అందుకోసమే చైనావాడు కాచుక్కూర్చున్నాడన్నీ (అంటే తక్కినోళ్లు కూర్చోలేదని కాదు). అమెరికాకి వలసొచ్చే వివిధ దేశాల ప్రజల వల్ల, అక్కడ ఆంగ్ల ప్రాముఖ్యత తగ్గిపోటం వల్ల, మొత్తానికి దేశాన్ని ఏకీకృతం చేసే ఓ భాష లేకపోటం వల్ల అవిడియాలు అందరికీ అందుబాట్లోకి రాక, వచ్చినా వాళ్లలో వాళ్లకి అంగీకారం లేక, మొత్తానికి దేశం అధోగతి పడుతుందని; అప్పుడు చైనావాడు దెబ్బతీస్తాడనీ …. కథనం. ఇందులో సాధ్యాసాధ్యాలు, నిజానిజాలు ఏమో కానీ, ఈ ‘ఏకీకృతం చేసేటటువంటి ఏక భాష లేకపోటం’ అనేది మనదేశాన్ని వెనక్కి నెడుతుందా అన్నది నా ప్రశ్న. మీ సమాధానం? “

నా సమాధానాన్నే పోస్టు చేసేయలని, నేపథ్యం చెప్పి ఇక్కడ పెడుతున్నాను.

——————————————————————

వాడెవడో ఛాందసుడులా ఉన్నాడే 🙂

కొందరు భారత దేశాన్ని కృశించిపోతున్న ఓ గొప్ప పురాతన సంస్కృతి అనుకుంటూ వచ్చారు, అలాగే అనుకుంటున్నారు. ఇప్పుడు అదే పోకడని, అమెరికాకి విస్తరించి విశ్లేషిస్తున్నట్టున్నారు. “ఏకీకృతం, ఏకభాష” ఉండాలనేది, భిన్నత్వంలోని ఏకత్వాన్ని తెలుసుకోలేని/తెలుపలేని ఓ ఆలోచన/ఓ వ్యక్తీకరణ. [కొన్ని మతాల్లో కూడా ’ఏకభాష’ రిఫరెన్సెలేవో వస్తాయిట కూడా లెండి]

అమెరికాకీ మనకీ, అట్టే తేడాలేదండి. దేశాలుగా – రెండూ కూడా విభిన్న జాతుల సమాగమం. కనీసం ఓ రెండువేల ఏళ్ళుగా మనం నశిస్తూ, కృశిస్తూ ఉంటే, మనలని ఎలాగోలా ఉద్దరించాలని కృషించే వాళ్ళూ ఉన్నారు. అలాగే, అమెరికాకి ఉంటారు లెండి 🙂 చూడండి, ఇందులో కూడా, భవిష్యత్తులో మనం మెల్లిగా అమెరికాను చూసి నేర్చుకుంటాం; వాళ్ళు మాత్రం, ఈ విభిన్న జాతుల సమాగమాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? అని ఆలోచించే దిశలో, ఇండియాని బాగా స్టడీ చేసినా చేస్తారు.

ఒక మౌలికమైన తేడా కనపడుతుంది; ఓ జాతిగా, భారతీయులకి ప్రపంచంపై ఆధిపత్యాన్ని సాధించాలనే కోరిక, చరిత్రలో లేదేమో. తమకు దొరికే లాభాన్ని అందిపుచ్చుకోవాలని మాత్రం, నిశ్శబ్దంగా భారతీయులందరూ భూగోళమంతా వలసవెళ్ళారే గాని, ఆధిపత్యాన్ని మాత్రం కోరలేదేమో; బహుశా కోరగూడదు కూడానేమో. ఆ విధంగా ఆలోచించినప్పుడు, అమెరికా “కుదేలవ్వటం” అంటే, ఎందులో? ఏ విషయంలో?

రెండో తేడా ఇది: మనలోకి అసిమిలేట్ అయ్యే కొత్త ప్రజల ’వలస’ అనేక కారణాల వల్ల ఒక దశలో ఆగిపోయింది.{బంగ్లాదేశునించీ, పాకిస్తాన్ నుంచీ వచ్చే వలసలు కాదు. ఒకరకంగా వాళ్ళంతా అవిభాజ్యమైన భారత ఉపఖండంలో పాతమనుషులే} ఇప్పుడు అలాంటి వలస మళ్ళీ ప్రారంభం ఔతోంది/అవ్వాలి. ఆ అసిమిలేటివ్ కల్చర్‌ని, పునరిద్ధరించుకోవడం మనకి చాలా అవసరం. ఇదంత కష్టం కూడా కాదు. ప్రజలు వలస రాలేదన్నమాటే కానీ, మనలో ఇప్పటికీ భిన్న సంస్కృతులను సమన్వయ పరచి ఇముడ్చుకోగల సద్గుణం ఉన్నది. (దాన్నే కాపీ కొట్టడం అని కూడా అనొచ్చు 🙂 ) ఈ సమాచారవిప్లవ యుగంలో, ప్రజలే వలస రావాల్సిన అవసరం లేకపోవడాన, దాని రూపురేఖల్లో మార్పులొచ్చాయి. కానీ, ప్రజలే వలస వస్తే, మనకీ ఓ సంపూర్ణత్వం వస్తుంది; మన కళ్ళ ముందు పుట్టి పెరిగిన అమెరికన్ కల్చర్‌లోనూ, ఆ అసిమిలేటివ్ లక్షణం ఉండే ఉంటుంది. ’దాన్ని పసిగట్టి కాపాడుకోవాలి’ అని నేను అనొచ్చుగానీ…దాని గురించి ఆలోచించ వలసిన అవసరం వాళ్ళకి ఉందేమో అందాం 🙂

మూడోది: అమెరికాకి అందరూ ఎందుకు వలసవెళ్ళారు? భారత దేశానికి అంతకు ముందు అందరూ ఎందుకు వచ్చారు? మూఢాచారాల బ్రతుకుల కోసమై, ఎవ్వరం ఎక్కడికీ వెళ్ళం. వ్యక్తిగత పురోగమనం (ఆర్ధికపరమైనదే కానవసరం లేదు) ఉన్న చోటికై, మానవుడు దారి వెతుక్కొని మరీ వెళ్తుంటాడు. మానవాళి పురోగమనానికి మార్గదర్శకులు కాగల కొందరు, ఈ వ్యక్తిగత అభిలాషని సమిష్టి పురోగమనానికి వాడతారని నా ఉద్దేశ్యం. మీరేమంటారు?

మరి కొన్ని తోక పాయింట్లు కూడా పెట్టకుండా వదల్లేకపోతున్నాను.

౪. మన ’దేశాని’కైతే ఏకంగా (!?) మూడు మూడు ఏకభాషలు ఏకీకృతం చేస్తున్నాయి. ఇంగ్లీషు, హిందీ, సంస్కృతం (in terms of the ideas that we hold and spread)

౫. మనం ఇన్ని భాషల్లో కొట్టుకు ఛస్తున్నా, భారత ఉపఖండం మొత్తం అంత: స్సూత్రంగా కొన్ని భావాలు ఒకటే ఉన్నాయే!! సో మచ్ సో దట్, మహేష్ ’తెలుగువాడికి సొంత ఆలోచన అసలు మొదటి నుంచీ లేదు’ అని చెప్పారు. గుర్తుందా!? అంటే, మొత్తానికి మొత్తం అన్నీ అసిమిలేటడ్ భావాలే! కాని, భాష ఒక్కటే ’సొంత’ది! అలాగని తెలుగువాళ్ళు వెనకబడ్డ వాళ్ళు మాత్రం కాదు! ఇక్కడ చూడండి: మనందరం ఒకే భాష కాకపోయినా, ఏకీకృతం అయ్యాము – భావాలతో! సొంత భావాలు లేకపోయినా, ’సొంత’ భాషలు మాత్రం బతుకుతున్నాయి. ఈ రెండు వెనుకబాటుతనానికి ఏ విధంగానూ కారణం కాలేదే!

౬.ఖచ్చితంగా, కొత్త భావాలు వ్యాప్తి చెందటానికి , కేవలం ఒక ’భాష’లో వ్యాప్తి చెందటానికి మధ్య సమయాభావం (టైమ్ ల్యాగ్) ఉంది. కానీ, ఆ టైమ్ ల్యాగ్, ఆయా భాషీయుల వెనుకబాటుతనానికి కారణం ఔతుంది అని చెప్పలేం. ఐతే, కొత్త భావాలు ఏఏ భాషల్లో వ్యాప్తి చెందుతాయో, ఆయా భాషీయుల జీవనశైలిగానీ, జీవనప్రమాణాలుగానీ, కళారూపాలుగానీ “సనాతనం”గా – నిత్యనూతనంగా వెలుగొందే సంభావ్యత హెచ్చు. అందుకనే, తెలుగులో కొత్త భావాల వ్యాప్తికి ప్రాముఖ్యత నిస్తున్నాం. అంతే.

ఐనా, ఎంత కాదన్నా, అమెరికాకి ఇంగ్లీషు ఏకభాష కాకపోతుందా? కనీసం మనలాగా ఐనా!? అందుకని అసలు ఏకభాషే లేదు అనేది కూడా తప్పే. ఏకభాష ఉన్నాలేకపోయినా, ఏకీకృతం చేసే “భావాలు” ఉంటాయి. భాష భావ వ్యక్తీకరణకే నని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఏకీకృతం చేసే “భావా”లకి, ఒక బాహ్యరూపమే – “భాష”. ఇలా చెప్పకుంటే, వాడి పాయింటు చెల్లదు. ఆయా భావాలు మరో బాహ్య రూపంలో ఏకీకృతం చేయగలవు.

ఏదేమైనా, “ఏకీకృతం చేసే ఏకభాష” – పాయింటు బావుంది, పుస్తకం పేరు?

ఇంతకీ, తెలుగువాళ్ళని ఏకం చేసేది, తెలుగు భాషే అని ఒప్పుకున్నారా!?అఫ్‌కోర్స్, నేను ’తెలుగు సినిమా’ అంటే, ’తెలుగు భాష’లో తీసిన సినిమాగా అనుకున్నాను గాబట్టి, భాషగురించి, ఐడియాల గురించి ఆలోచనలు చేస్తుంటానండి. ఐతే, ఆధిపత్య ధోరణీలేని అభివృద్ది అంటే ఏంటి!? అన్న ఒక ప్రశ్న ఉదయించింది. అటు పిమ్మట ఎలా చెప్పాలో, ఏం చెప్పాలో తెలీన ఒక సంధిగ్ధత – స్తబ్తత ఆవరించేశాయి.

’చాలా రాశారు. ఖచ్చితమైన సమాధానం ఏంటి? ’ అని అడుగుతారేమో, అది ఇది : “ఏకభాష లేకపోవడం మనదేశాన్ని వెనక్కి నెట్టదు.”

Although it might look contradictory to the a deterministic statement i gave you to ponder on, long time back, remember:

@అబ్రకదబ్ర : ఖచ్చితమైనా సమాధానం ఇస్తున్నాను – “ఇండియాలో ఇంగ్లీషుతో మాత్రమే మనషి అభివృద్ధి చెందగలడు.”

ఇంకో తోక :” అదే ఇండియా కి స్ట్రాంగ్ పాయింట్ కూడా అయ్యి, ఇవ్వాళ్ళ ఐటి రంగంలో ఈ మాత్రం కాసేపు వెలిగాము ” (ఆరిపోతున్నామేమో తెలీదు!);(విశ్లేషణ ఇక మీరే చేసుకొనమనివదిలేస్తున్నాను.)

And this post is just to see how both the statements stand togather for me, in their contexts.  [unrelated: ఈ మధ్య పై వాక్యం చెప్పిన రెడ్డి రాకున్నా మళ్ళీ మొదలాడాల అన్న పోస్టుకి చాలా హిట్లొచ్చాయి. కారణం తెలీలేదు]

————————————–
కొద్ది రోజుల క్రితమే నేను ఒక విషయం తెలుసుకున్నాను. మీతో పాటు, దాన్ని అందరితో పంచుకోవాలనుకుంటున్నాను.

“భాష ముఖ్యోద్దోశం భావ వ్యక్తీకరణ” అనేవారు మహేష్.

ఐతే, నేను భావం = feeling,emotion లాంటి సంకుచిత అర్ధంలోనే ఎక్కువగా అర్ధంచేసుకునేవాడిని. మీరు తెలుగు కథల గురించి చెప్పినప్పుడు, “భావోద్రేకాలు” రగిల్చే కథలు, కాకరకాయాలు అన్నట్టు చెప్పారు చూశారు, అప్పుడు కూడా నాకు అదే అర్ధం స్ఫురిస్తూ ఉండేది.

ఐతే, భావం = idea, concept అన్న అర్ధాలతో కూడా వాడవచ్చుట; idealismకి తెలుగు పదం ’భావవాదం’ట!

అంటే, మీరు స్ట్రింగ్ థియరీని బేస్ చేసుకొని కథ రాసినా, స్ట్రింగ్స్ అనే ’భావాన్ని’ – ’idea’ని రగిల్చినట్టే ట!!! “భావం” అంటే ఆలోచన కూడా!

భావ వ్యక్తీకరణ అన్నప్పుడు, ‘సమస్తం కలుపుకునే అంటున్నాను’ అని మహేష్ ఎప్పుడో చెప్పాశారనుకోండి. (లాంగ్వేజ్ స్టూడెంట్ కదా) ఐనాగానీ, ఇది మాత్రం నాకు కొత్త విషయమే.

And there still remains the question, మన భాషలో అన్ని భావాలూ ఎందుకు వ్యక్తీకరించ బడట్లేదు? ఎందుకంటే, అన్ని భావాలు పుట్టట్లేదు. అది అసాధ్యం కూడా. కనీసం అన్ని రకాల భావాలు మన భాషలో చర్చించ బడట్లేదు. అందుకే, “తెలుగులో ఆలోచించండి” అని నా సమాధనంగా చెప్తుంటాను. అందులొ కొత్త భావాలు, భావవ్యక్తీకరణల మధ్య రసాయన చర్యలో, న్యూక్లియార్ ఫిషన్సో, ఫ్యూజన్సో జరిగి చాలా లైవ్లీగా భాష మారుతూనే ఉంటుంది. కొంత మాక్రోస్కోపిక్ లెవల్లో, భాష కంటిన్యుటీ కనపడి,  “భాష”గా  గుర్తించపడుతూ ఉంటుంది.

ప్రకటనలు
Explore posts in the same categories: Uncategorized

3 వ్యాఖ్యలు పై ““ఏకీకృతం చేసే ఏకభాష” ఓ !dea!; భావం = idea”

 1. sri Says:

  మీగురించి ఒక నాలుగు ముక్కలు చెప్పండి. ఊరూ, పేరు,చదువు, చేసేపని, ఉండెది ఇండియానా లేక అమేరికా నా మొ||. బ్లాగులను సిన్సియర్ రాసే మీరు ఇటువంటి వి ఎవి ఎక్కడా చెప్పంకుండా రేరాజ్ అని ఒక పేరు పెట్టుకొని మేధోపరమైన విషయాలను చర్చిస్తుంటె ఎలా జావాబివ్వాలో/చర్చలో పాల్గొనాలో అర్థం కాదు


 2. చాలా రోజుల తరువాత. రేరాజుగారూ ! ఎలా వున్నారు?
  భాషలెన్నో వున్నా భావ దాస్యం లేనంత వరకు యే దేశ ఐక్యతకు భంగం వాటిల్లదు. అమెరికావాడి గ్రీన్ కార్డ్, సిటిజెన్ కార్డ్ అనే ఇంజెక్షనిజంతో యే దేశ మూలాలున్నా ఆక్కడి పాటే పాడుతాడు ఏదే శంనుంచొచ్చినా .
  ఇన్ని భాషలున్నా భారత్ కు గానీ.ఏకీకృత భాషలేనంత మాత్రాన అమెరికాకుగానీ ఏదో అయిపోతుందని
  వూహించే పరిస్తితులేమీ లేవు.
  As you said…

  (అమెరికాకి అందరూ ఎందుకు వలసవెళ్ళారు? భారత దేశానికి అంతకు ముందు అందరూ ఎందుకు వచ్చారు? మూఢాచారాల బ్రతుకుల కోసమై, ఎవ్వరం ఎక్కడికీ వెళ్ళం. వ్యక్తిగత పురోగమనం (ఆర్ధికపరమైనదే కానవసరం లేదు) ఉన్న చోటికై, మానవుడు దారి వెతుక్కొని మరీ వెళ్తుంటాడు. మానవాళి పురోగమనానికి మార్గదర్శకులు కాగల కొందరు, ఈ వ్యక్తిగత అభిలాషని సమిష్టి పురోగమనానికి వాడతారని నా ఉద్దేశ్యం.)..True.

  .మహేష్ గారన్నట్లు భాష వ్యక్తీకరణ కే కదా! ఇంగ్లీషు లిపివున్నా షార్ట్ హ్యాండ్ లిపి వాడుకలోకొచ్చింది .. ..అభినందనలతో …శ్రేయోభిలాషి …నూతక్కి

 3. rayraj Says:

  @శ్రీ: ఎలాగేముందండి? జస్ట్ చర్చించేయడేమే!
  ఐనా ’మేథోపరమైన’లాంటి పెద్ద మాటలొద్దు.
  అలాంటి మాటలంటే,
  మా మాస్ మెంటాలిటికీ మంట.

  మనసులో మాట – మా ఆయనతో తంట
  మా ఇంటో వంట – మతమంటే తంతా
  ఇలాగేదో మాట్టాడుకుందాం. అందులో ఇదోటి. అంతే.

  @నూతక్కిగారు, బావున్నానండి. మీరు కుశలమని తలుస్తాను.థాంక్యూ.


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: