గిది సైకో చరిత్రా?

నిజం చెప్పు తీ –
గీ పాగల్ గాడు, చౌబీస్‌ఘంటే పన్జేస్తడా?
లేక పీపాల్ పీపాల్ పీకాల్దంకా వోడ్కా తాగుతడా?

కొడకా, నీ కాన్‌‌గిరి నా కెరకేలేగనీ
గప్పుడసలేం జెప్పినవ్?

*డి కొ** ఏం జెప్పిండు రా?
విలన్లు హీరోలు గిట్టలేరు
జస్ట్ పరేషానీలుంటయ్
గా ఎమోషన్లవొయ్
ఒక్కొక్కడు ఒక్కొక్క తీర్ల
చంపుతరు
గాకుంటే చస్తరు
అని జెప్పిండు గందా

మరి గిప్పుడేం జూపినవ్
థూ నీ బతుకు****
పాగల్‌‌‌గాన్ని వెట్టి
మర్డర్లన్ని జెయ్యించి
గాడు రాక్షసుడని
వీనితోని చంపించి
సిస్టం అంటావ్?
బొంగేం గాదు.
నీ స్టోరీల ’విలన్’ ఉన్నడు.
గంటే, నువ్వు పెద్ద
ఫండమెంటలిస్టువన్నట్టు
పాగల్‌గానికంటే డేంజరన్నట్టు
సంజయిందా?

సౌండింగ్ సూపరుందని
సంస్కృత శ్లోకాల్ బెట్నానంటే
సెలక్షను సెన్సిబుల్‌గుంది
ఏందిరవైయ్యని షక్‌‌జేసెటోడ్ని
గిప్పుడైతే గీడికి
దిమాక్ లేదేమోనని
సోచాయిస్తున్నా

చూసేటందుకు మంచిగుందిలే గానీ
బిడ్డా!భద్రం కొడకా!
ఎవ్వర్నైన మోసం చెయ్
ఖుద్‌కో ధోకా మత్‌దే
గదే నీ పతనం
నాకేం బై
నువు పడిపోయినా చూసి నవ్వుతా
నువ్వు ఎగిసిపోయినా చూసి నవ్వుతా

ప్రకటనలు
Explore posts in the same categories: Uncategorized

6 వ్యాఖ్యలు పై “గిది సైకో చరిత్రా?”

 1. manju Says:

  bhale baagundi mi kavita…-:)

 2. Meher Says:

  Loved it! ముఖ్యంగా చివరి స్టాంజా 🙂

 3. స్నేహ Says:

  చివరి స్టాంజా చాలా బాగుంది

 4. rayraj Says:

  @ manju, Meher, స్నేహ: Thank you!

 5. Sri Says:

  ఏడ్చినట్టుంది మీ తెలంగాణ యాస భాష. ఎందుకు చంప్కతింటవ్ – నీకొచ్చిన మంచి తెల్గుల రాయలేవా? రాని తెలంగాణ యాసతొ ఎందుకు తండ్లాడుతున్నవ్. నీ రాతలు ఇక్కడి యాసను నువ్వెక్కిరించినట్టుంది – hope you understand.

 6. rayraj Says:

  @Sr: మ్ మ్ ..నాకు ఏదైనా యాస అంటూ వస్తే ఇక ఇదే. ఇదైనా మెయిన్ స్ట్రీమ్ లోంచి కాస్త పట్టిందే. I understand your point. I take your advice and will try to avoid.

  ఐతే, I want to make a point – seemingly unrelated but yet related. తెలంగాణాకి ఓ శిష్టభాష / మర్యాదకరమైన భాష ఉంటుంది కదా. దాన్నొదొలేసి “బజారుకీడుస్తా”, “బొందపెడతాం”, “ఖబడ్దార్”, “మక్కెలిరగదంతం” లాంటి మాటలు అంత ఆత్మగౌరవాన్ని పెంచవు. అఫ్‌కోర్సు, అదంతా రాజకీయనాయకుల సమ్మోహనాస్త్రాలని తెలుసు. కానీ ఆ యాసలోనూ “సాధారణ విషయాల” మీద చర్చలు మంచిగా, మర్యాదగా, రాతపూర్వకంగానో, ఆడియో వీడియో రూపకంగానో జనబాహుళ్యానికి అందజేస్తే, తెలంగాణంపై గౌరవాన్ని పెంచవచ్చు. దీని గురించి మీ లాంటి వాళ్ళూ ఆలోచించాలి.


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: