సూక్ష్మఋణాల పెట్టుబడిదారీతనం

సూక్ష్మఋణాలు పెట్టుబడిదారీ విధానమే. అదేంటి ఇలా యూ టర్నిచ్చారు అంటూ ఆశ్చర్య పడిపోకండి.

సూక్ష్మఋణంలో సూక్ష్మం లో – చిన్నవ్యాపారాల పెట్టుబడులు/ వాటికి అప్పులు అని నేను చెప్పినప్పుడే ఇది చెప్పినయ్యింది. నాలుగైదు పేరాల తర్వాత ఎక్కడో ’ఇది  ఆధిపత్య ధోరణీలోనో, పెట్టుబడీదారి విధానంలోనూ పుట్టిన ఆలోచన కాదు’ అని కూడా చెప్పాను. ఆ పాటికే ఈ కాంట్రడిక్షన్‌ని అర్ధం చేసేసుకునుంటే, ఇక ఇప్పుడు అడగకూడదు కదా. కానీ, ఇప్పడు ఇలా  రెండు విరుద్ధ వ్యాఖ్యలు రైటేనని ఎలా చెప్తారు? ఐతే అదవ్వాలి లేతే ఇదవ్వాలి అని మంకుబట్టు పడితే, దానికి నేను సూటిగా సమాధానం చెప్పలేను. ఇది ఎందుకు పెట్టుబడీదారీ ఆలోచన కాదో అర్ధం చేసుకోటానికి,  ఇంకొంచెం సోది రాస్తాను. దానిలో విషయం పట్టేస్తుందని నా ఆశ.

మరొక్కసారి మనం ఓ విషయంలో క్లారిటి పెంచుకుందాం. అప్పు ప్రభుత్వం ఇచ్చిందా, ప్రైవేటు వాడిచ్చాడ అన్నదానితో, “అప్పు” రూపం ఏమీ మారిపోదు కదా? “అప్పు” ఎప్పుడూ పెట్టుబడీదారి ఆలోచనే! పెట్టుబడి ఎవడు పెడితేనేంటి? చిట్టచివరికి సరప్లస్/ లాభమే దాని లక్ష్యం – అవసరం. ఐతే, మనమేమీ ఇప్పుడు ’మానవ మారణహోమాన్ని సృష్టిస్తున్న ’అప్పు’ని మట్టుబెట్టాలి’ అని అడగటం లేదే? అప్పే వద్దంటే, మన బతుకులూ బుగ్గైపోయేవి. పోనీ ’మానవ మారణహోమాన్ని సృష్టిస్తున్న “డబ్బు”ని మట్టుబెట్టండి’ అనటం లేదే? ఎప్పుడైతే  “డబ్బు”ని ఒప్పుకున్నామో, అప్పుడే మనం ఈ ఆర్ధిక వ్యవస్థని ఒప్పేసుకున్నాం. కానీ ఇప్పుడు అంత ఫండమెంటల్ చర్చలు చేసే స్థాయి నాకు లేదు.  పైపెచ్చు, నేను అంత సిద్ధాంతాల మనిషని కాదు.

ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం.

చక్కెర చెయ్యాలంటే, చెరకు పంటని కోసిన ఒక్కరోజులో రసం పిండేసుకోవాలి. సో, మన ముందిప్పుడు కనీసం రెండు మార్గాలున్నాయి.
1. పంట ఎక్కడ పండితే అక్కడికి వెళ్ళి, కోసేసుకొని, వెంటనే పిండేసి చక్కర చేసేసుకొని, ఆ చక్కరని రవాణా చేసేసుకోవడం. కాకపోతే ఈ టెక్నాలజీ ఎవ్వడూ కనుక్కోలేదు!

(ఇది జోకు. నవ్వొస్తే నవ్వండి. లేకపోతే వదిలేయండి. కానీ, ఇలా వెంటనే పిండేసి, ఫిళ్టర్ చేసి, పెద్ద మూకుడులో పోసి, కాచేసి, ’చెరకు బెల్లం’ చేస్తారు. దీన్ని మనం చక్కెర అనం. కానీ గుప్తుల కాలంనాటికే “గ్రాన్యులేటడ్ షుగర్” తయారు చేసిన ఘనత మనదేనిని  చదివా. మరి అది సాయిబాబా ప్రసాదంలో వాడే పటిక బెల్లమా? ఆ రోజుల్లో కానీ, ఈ రోజుల్లోకానీ ఈ  షుగర్ ఎలా చెశ్తారు?  నాకు తెలీదు)

2. చెరకు బాగా పండే ప్రాంతంలో ఓ చక్కర కర్మాగారాన్ని నిర్మించుకొని(పెట్టుబడి పెట్టి), దాని చుట్టూ మనకి కావాల్సినంత / లాభాలు రావాల్సిన స్థాయిలో చెరకు పంటని పెంచుకోవడం.

రైతులంటే, ’నారు పోసినవాడు నీరు పొయ్యెకపోతాడా’ అనుకుంటారేమో, చెరకు ఫ్యాక్టరీవాడు అంత తొందరగా చేతులెత్తయ్యలేడు. వాడికీ పంట దిగుబడి వస్తుందో లేదో తెలీదుగానీ, వాడికి “x” క్వింటాళ్ళ చెరుకు కావాలంటే, చుట్టూ “2x” క్వింటాళ్ళ పంటైనా వేసి ఉండాలి లాంటి లెక్కలుంటాయి. అంచేత, ఇప్పుడు చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో చెరకు పంట వేసేలా చేసుకోవాలి. అదీ తనకే అమ్మేలా చూసుకోవాలి. చుట్టూ చూస్తే, ఈ రైతులకి తింటానికే డబ్బుల్లేవు! వాళ్ళని ఎలా ఒప్పించండం? అందుకని ఫ్యాక్టరీ ఓనరుకి, ఇంత అవస్థలోనూ మరో బ్రహ్మాండమైన ఐడియా వచ్చేసింది. బ్యాంకుల దగ్గరకు వెళ్ళి, “నేనింత లాభాలని ఆశించి వీళ్ళ పంటను ఖచ్చితంగా కొంటాను గాబట్టి, ఆ దైర్యంతో ఈ రైతులకి అప్పులిచ్చేయ్” అంటాడు!  కానీ ఇలా సజావుగా సాగితే స్టోరిలో మజా ఏముంటుంది? బ్యాంకులు కాదంటే, “రైతులకు అప్పులివ్వని బ్యాంకులు – ప్రభుత్వాలు” అంటూ గలాటా కూడా చేసెయ్యొచ్చు! ఇదంతా చూస్తున్న మరొకడెవడో ఇంకో చక్కర ఫ్యాక్టరీ పెట్టొయ్యొచ్చు , సగం పని ఎలాగూ మొదటోడో చేసేశాడులెమ్మని. రైతులు రెండో ఫ్యాక్టరీకి అధిక ధరకి పంటనమ్మేస్తే, మొదటోడు ఇంత బ్రహ్మాండంగా ఆలోచించి కూడా మట్టికొట్టుకుబోగలడు. అంచేత, ఇంకోడికి మరో ఆలోచన మొదలయ్యింది.

దాని ప్రకారం ఫ్యాక్టరీవాడే  బ్యాంకులునుండి తక్కువ వడ్డీలకీ అప్పులు తెచ్చుకొని, తనకి నమ్మకస్తులైన “మధ్యవర్తుల”కి అప్పులిస్తాడు. ఈ మధ్యవర్తులు చిన్న చిన్న రైతులకి అప్పులిచ్చి, ఈ చెరకు పంట వేసుకోండని ప్రోత్సహించి, ఆ పంటని ఈ ఫ్యాక్టరీకే అమ్ముకునేలా ’చూస్తారు’. ఇక ఈ మధ్యవర్తుల ఫంక్షనింగ్ ఎన్ని రాజకీయ- సామాజిక – ఆర్ధిక కోణాలతో ప్రభావితమౌతుందో మనం ఊహించుకోవచ్చు. కానీ, ఇక్కడ గమనించవలసింది  ఏంటంటే – బ్యాంకుల నుండీ పెద్ద రుణాలని తీసుకొన్న ఫ్యాక్టరీవాడు, వాటిని చిన్న చిన్న రుణాలుగా ఇచ్చి,  మ్యానేజ్ చేసుకుంటాడు. అంత మాత్రన  పేదరిక నిర్మూలనో, వ్యవసాయ రుణాలివ్వాలన్న ఆశయమో ఇందుకు పురిగొల్పటం లేదు. ఇక్కడ ఈ ఆలోచన పూర్తిగా ’పెట్టుబడీదారీ’ ఆలోచనే.

మరో ఉదాహరణ చూద్దాం.

ఓ విత్తనాల తయారీ కంపెనీ, కొందరి రైతులకి విత్తనోత్పత్తికై పంటలెయ్యండని అప్పులిస్తుంది. ఈ కంపెనీకీ, ఈ పనికి “మధ్యవర్తు”లని ఆశ్రయిస్తుంది. అంటే, బ్యాంకుల నుంచి తెచ్చుకున్న ఋణాలని, కంపెనీ “మధ్యవర్తుల”కు అప్పుగా ఇస్తే, మధ్యవర్తులు వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో ఈ విత్తనోత్పత్తి చెయ్యించి, తిరిగి కంపెనీకే అమ్ముకుంటారు. ఇక్కడ కూడా, ఈ కంపెనీలు ఇచ్చే ఈ రుణాల లక్ష్యాలు పేదరిక నిర్మూలన లాంటి ఆశయలేమీ కావు. ఇది పూర్తిగా ’పెట్టుబడీదారీ’ ఆలోచనే.

ఐతే, ఇవన్నీ ఆలొచనలు. ఓ మహానుభావుడన్నాన్నాడు “don’t believe the map to be the terrain” అనో ఏదో. అలాగ, ఇదే వాస్తవం కాదు. ఈ విత్తనోత్పత్తి వ్యాపారంలో సంభవించగల మరో క్రమం చూడండి: మధ్యవర్తులకి అప్పులిచ్చినా, వాళ్ళు విత్తనాలని పెంచే పనిలో పడకుండా, ఏ ’మిర్చి’ పంటనో హోర్డింగ్ చేసే పనిలో పడతారు. చివరికి, అధిక లాభాలకి ఆ మిర్చిని అమ్ముకొని, విత్తనోత్పత్తి కంపెనీకి అప్పు చెల్లించేసి, చేతులెత్తేస్తారు. మరో పక్క, రాష్ట్రంలో విత్తనాలు కావాల్సినంత ఉత్పత్తి అవ్వటం లేదని మరో గోల కూడా జరగవచ్చు. అలాగ, ఈ ఆలోచనలని ’వాస్తవ స్థితి’గా భ్రమించ కూడదు. అలాగే, ఈ మైక్రో దా’రుణాల’ ఆలోచనను సైతం, పూర్తిగా మోసపూరితమే అనిగానీ, పూర్తిగా ఆశయసాధనకే అనిగానీ కూడా భావించకూడదు.

ఇక్కడ పై రెండు ఉదహారణలూ – వ్యవసాయ సంభంధమైనవి – agri sector;  కానీ, ఈ పోస్టు ద్వారా నేను సాధించదలుచుకున్న లక్ష్యాలు ఇవి:

౧. మైక్రోఫైనాన్సు కూడా అప్పే, ఆ అప్పులు వస్తూత్పత్తికీ, వ్యాపారానికే కావునా, ఇది పెట్టుబడీదారీతనమే. ఐతే, ఇది పేద ప్రజల్లోనూ దాగి ఉన్న సృజనాత్మక వ్యాపారికి కూసంత చేయూతనిచ్చి,  వారికి పెట్టుబడీదారి విధానంలో లాభాలను అందుకునేలా చేసే ఓ ప్రయత్నం. పేదరికంలో కొంత ఆసర కల్పించటమో లేక పూర్తిగా పేదరికం నుంచి బయటపడే మార్గాన్ని చూపే ఓ మార్గం.

౨. కానీ, ఈ ఆలోచన మాత్రం పూర్తిగా పెట్టుబడీదారితనంలోనో, ఆధిపత్యధోరణీలోనో పుట్టలేదు. ఆ తేడాని గుర్తించడానికి వీలుగా, ఓ రెండు ఉదాహరణలను పైన ఉటంకించాను. పెట్టుబడీదారీ ఆలోచనగా ఐతే, అవి ఎలా పుడతాయో, వాటి లక్ష్యాలెలా ఉంటాయో చెప్పాను.

ఐతే, అసలంటూ ఇది పెట్టుబడీదారితనం కాబట్టి, అది తెచ్చే తంటాలు కొన్ని ఉంటాయి కదా. వాటి గురించి వచ్చే పోస్టులో  చూద్దాం (అని అనుకుంటున్నాను)

ఇంకొక్క చివరి మాట.

పైన చెప్పిన ఉదహరణల్లోని “మధ్యవర్తు”లైనా, ఈ సూక్ష్మరుణాల్లో చెప్పుకుంటున్న “స్వయం సేవక బృందా”ల నాయకులైనా, మన సమాజంలోని వారే అన్న విషయం మరిచిపోగూడదు. అంచేతే వ్యవస్థలు సమూలంగా మారిపోతాయని నాకైతే అనిపించందు. గూండాగిరి చేస్తూ, అప్పులిచ్చి వసూలు చేసుకునే వాడినే  ఈ పాత్రనూ పోషించమంటే, వాడు మళ్ళీ అలాగే వ్యవహరిస్తాడు. అందుచేత, ఈ బృందాల ఏర్పాటు వాటి మ్యానెజ్‌మెంటు అనేది ఆయా దేశ ప్రాంత రాజకీయ సామాజిక ఆర్ధిక స్థితిగతులననుసరించి భిన్నరీతులును కలిగి ఉండాలి.

పైన ఉదహరణల్లోని మధ్యవర్తులే, వాళ్ళ వాళ్ళ ఊళ్ళల్లో స్థానిక నాయకులు / రాజకీయ నాయకులు కూడా అవ్వొచ్చు. ఇలాంటి వారికి,  బ్యాంకులు నుండి అప్పు ఇప్పిచ్చినా, పర్యవసానం ఇదే. ఇలాంటి నాయకులే స్వ్యయం సేవక బృందాలని తయారు చేసి, సూక్ష్మరుణ సంస్థల నుంచి అప్పు పుట్టించినా, వ్యవహారం ఇంతే. అలాగని వీళ్ళంతా దొంగవెధవలే అనీ అనలేం. వీళ్ళల్లోనూ నీతి నియమాలున్న వారు ఉండే ఉంటారు. కానీ, మార్పు కోసం ప్రయత్నిస్తున్నప్పుడు, సూక్ష్మరుణాల వితరణ మెకానిజంలో ఇలాంటి వారిని రానివ్వకుండా, ఆయా సంస్థలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరేమో, ఇలాంటి వాళ్ళుంటేనే అప్పు తిరిగి చెల్లించాలనే భయం ఉంటుందని నమ్మొచ్చు; ఇంకొందరేమో, వీళ్ళ అండ చూసుకొని అప్పులు ఎగవేస్తారు అని భావించవచ్చు. మరికొన్ని చోట్లైతే, వీళ్ళున్న చోట ’సహాయం’ కావలిసిన జనం భయపడి, అప్పు కోసం కూడా ముందుకు రారు. ఇలా ఎన్ని రకాలుగానో సీన్లుంటాయి. అన్ని ఒక్కగాటన కట్టేస్తాం – జస్ట్ ఈ కాంప్లెక్సిటీని అర్ధం చేసుకునే ప్రయత్నంలో. కానీ, సూక్ష్మరుణ సంస్థలకీ ఇందులో లాభార్జన ఉందిగాబట్టి, ఇలాంటి అన్ని సీనరియోలనీ ఎదొర్కొంటూ అవి వ్యాపారం చేసుకుంటాయి. ఐతే, ఈ ఋణవ్యవస్థ యొక్క ప్రాధమికోద్దేశానికే సమూలంగా ఎసరు బెట్టేంత ఎక్ససెస్ జరుగుతున్నప్పుడు, ఏదో ఒకటి జరిగి తీరాల్సింది. వాటి ఆధిపత్యాన్ని నిలువరించాల్సిందే. దాని గురించి కూడా చెప్పుకుందాం.

ప్రకటనలు
Explore posts in the same categories: Uncategorized

One Comment పై “సూక్ష్మఋణాల పెట్టుబడిదారీతనం”

  1. asuryudu Says:

    సరళంగా చెప్పండి సార్, సూక్ష్మ ఋణాలు మంచివా? కాదా? అయితే ఎలా? వీటిని ప్రోత్సహించాలా? వద్దా? సూక్ష్మ ఋణాలు పెట్టుబడిదారీ విధానమైతే ఏంటి, కాకపోతే ఏంటి?

    ఓలుమొత్తమ్మీద మనకేంటి? 🙂

    How are we impacted by this whole thing?

    ~సూర్యుడు


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: