రేప్ చేసి, ఓ నిజం తెలుసుకుందాం

కొన్నాళ్ళ క్రితం ఈ కింద జోకు ఒకటి బాగా సర్క్యులేట్ అయ్యింది

The UN has conducted a Worldwide survey. The question asked was:

*****************
“Would you please give your honest opinion about solutions to the food shortage in the rest of the world?”

*****************

The survey was a huge failure because —-

In Africa they didn’t know what ‘food’ meant.
In India they didn’t know what ‘honest’ meant.
In Europe they didn’t know what ‘shortage’ meant.
In China they didn’t know what ‘opinion’ meant.
In the Middle East they didn’t know what ‘solution’ meant.
In South America they didn’t know what ‘please’ meant.
And in the USA they didn’t know what ‘the rest of the world’ meant!

ఇప్పుడు ఈ జోకుని మనం కాస్త రేప్ చేసి, ఓ నిజం తెలుసుకుందాం.

పై వాక్యం ఆ అన్ని దేశాలకీ అర్ధమౌతుంది. ఇంకా మాట్లాడితే, ఈ జోకు కూడా అన్ని దేశాలకీ అర్ధమౌతుంది. కేవలం, ఇది ఆయా దేశాల ఓ నిర్దిష్ట గుణాన్ని గేలిచేస్తున్న జోకు. కానీ, నిజంగా నిర్దిష్టంగా అదే గుణం ఆయా దేశాలు కలిగి ఉంటే, నిజంగానే ఈ జోకు ఎవ్వరికీ అర్ధం గాకూడదు మరి! భారతీయులకి నిజాయితీ అంటే ఏంటో తెలీకపోతే మనం ఈ జోకుకి నవ్వగలమా?

హమ్మయ్య! జోకు అందం చెడదొబ్బాం. తెలియ జేస్తున్న నిజం ఇది:

చూడ్డానికే, ఇంత విభిన్నంగా, ఒకరి విషయం మరొకరికి తెలియనట్టుగా  ఉంటుందిగానీ, ఈ నిర్దిష్టమైన గుర్తింపులు, అస్తిత్వాలు, పోరాటాలు కొన్ని నిర్ధిష్ట అవసరలకే కనిపిస్తాయిగానీ – అందరు మనుష్యులు ఒకటే, అందరి భావనలు ఒకటే. విశ్వ జనీనమైనవే!

అలాగన్నాం కదా అని, ఒక సినిమా సీను ఇలా తీస్తాం –
హీరో , కత్తి తీసుకొని హీరోయిన్‌ చేతిని కస్సుమని కోసేసి, తన చెయ్యి కోసేసుకొని – “నా రక్తం ఎరుపే, తనదీ ఎరుపే” అని ఎలుగెత్తి చాటేసి, ఆ రెండు రక్తాలు కలిపేసి పూసేసి “ఇప్పుడు చెప్పండి, ఏ రక్తం ఎవరిదో. ఈ కులాలు మతాలు డబ్బు ఇవ్వన్ని తప్పు. మనుషులంతా ఒకటే మతం. మానవత్వం; ఒకటే కులం – ప్రేమి కులం”  అనేసి ఆవేశంగా చెప్పేస్తాడు. ఓ సగటు తెలుగు ఆడియన్‌కి (యస్…తెలుగు నిర్మాతలు అలాగే అంటారు…ఆడియన్ – ప్రేక్షకుడు అనే సింగులర్) ఇలాంటి సీన్ తెగ నచ్చేస్తుంది. ఐతే, నిజానికి అన్ని రక్తాలు ఒకటి కాదు. అందుకే ఏ రక్తం దొరికితే ఆ రక్తం అందరికీ ఎక్కించలేం! అందరి రక్తం ఎర్రగానే ఉన్నా, బోళ్డు గ్రూపులున్నాయి! అందరూ మనుష్యులే ఐనా, జన్యు పరమైన తేడాలు, కొన్ని రోగాలు కూడా ఉన్నాయి మరి!

ఐనా, మనుష్యలంతా ఒక్కటే!

దేశాలుగానీ, భాషలుగానీ, ప్రాంతాలుగానీ, మతాలుగానీ, తెగలుగానూ, కులాలుగానీ, వర్గాలుగానీ, రంగులుగానీ, రుచులుగానీ ఎన్ని విధాల విభిన్నత్వం గాంచుతున్నారో, అంత భిన్నత్వం కూడా నిజమే!

ఈ రెండూ నిజాలే నన్నది ఒక నిజం. అంతే గానీ, అదే నిజం కాదు. అదే సత్యం కాదు. అలాగనీ అసత్యమూ కాదు. అందుకనే చివరికి అనిర్దిష్టిత ఆవరించి, భాషని కూసింత మిస్టికల్‌గా పుట్టిస్తుంది. మరో నిజాన్ని ఆవిష్కరించ జూస్తుంది.

రెండు కాంట్రడిక్టరీ నిజాలని, ఓ దానికొకటి గుద్దేస్తే, మదిలో ఓ మెరుపులో ఓ జ్ఞానోదయం ఔతుంది ట!

ఇది ప్రాచ్య తత్వచింతనలో భాగమై, ఎక్కువగా చైనీయులు, జపనీయులలో ఉన్నట్టు, ఇంగ్లీషులో చెబితే చదువుకున్నాను నేను. దీన్ని గేలి చేస్తూ వచ్చేజోకులే, కొన్నిమార్షల్ ఆర్ట్స్ సినిమాల్లో,  గురువు శిష్యుడి నెత్తి మీద ఠపీమని కొట్టడం.

ఎందుకంటె, శిష్యుడిని ఒకదానిపై కాంసెట్రేట్ చేయిస్తూ,  ఠాప్‌మని కౌంటర్‍తో  తనే కొట్టేస్తాడు గురువు!

ఈ ఐడియాకి, చాలా క్లుప్త సాహిత్య రూపాన్నే, హైకూ లంటారు ట. కానీ మన వాళ్ళు పొడి పొడిగా నాలుగు పదాలు పేర్చి, అవే హైకూ లనుకుంటారు ట!

క్లుప్తత కూడా చాలా అవసరం. లేకపోతే భోళ్డు భోళ్డు పుస్తకాలు చదువుతూనే ఉంటామే గానీ అసలు విషయం అర్ధం గాదు. నెత్తిన “జ్ఞానం” మోసేట్టయితే, అది సంస్కృతంలోని శాండల్ వుడ్డైనా , ఇంగ్లీషులోని హాలీ‌వుడ్డైఐనా, తెలుగలో టాలీవుడ్ ఐనా  – అది నెత్తిమీద బరువే. అంచేత, మనం ఎంత చదివాం, ఎంత చూశాం అని గాదు. ఏం తెలుసుకున్నాం అనేది చాలా ముఖ్యం మరి!

విశ్వజనీనమైన విషయం అందరం తెలుసుకుంటాం. తెలిసినా, తెలీనట్టు మాట్టాడుకుంటాం. తెలీకపోయినా, తెలిసినట్టే మాట్టాడతాం. తెలిసీ తెలియక మాట్టాడతాం. మాట్టాడలేమో అనుకొని మాట్టాడతాం. మాట్టాడకూడదని తెలియక మాట్టాడతాం. చివరికి, మౌనంలోనూ మాట్టాడతాం.

మీరేమంటారు?

ప్రకటనలు
Explore posts in the same categories: Uncategorized

One Comment పై “రేప్ చేసి, ఓ నిజం తెలుసుకుందాం”


  1. ఎప్పట్లానే మీ బ్రాండుతో బాగుంది…:)

    హైకూల గురించి నేనెప్పటికీ అనుకునేది ఇదీ –

    డాబా మీద పడుకుని
    మధ్యాహ్నపు సూర్యుణ్ణి చూస్తూంటే
    కళ్ళు పోయినాయి……

    సాహిత్యంలో పడుకుని
    హైకూలని చదూతూంటే
    ఉందనుకున్న మతీ పోయింది…

    పొరపాటున సూర్యుడు, హైకూలు ఒకటనుకునేరు…..అనుకోకూడదు ట!

    క్లుప్తత గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఇక్కడ స్థలం సరిపోదు ట!…తరువాత ఎప్పుడన్నా నా బ్లాగులోనే ట!


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: