“తిరుగులేని దేవుడు తిరుమలరాయడు”

వ్యాఖ్యల కంటిన్యూషన్లో :

@Mohd Javed:
Thank you. The point is well made in just one line. great !

@akasaramanna: The reverse question is incorrect as the basic premises will undergo a change as explained by Javed.
కధలను విశ్లేషిస్తూ, ప్రతి కథకీ తనదైన ఓ వ్యాకరణం ఉందంటారొకాయన. ’రాముడు సీతకి పెనిమిటి’ – ఈ వాక్యం కరెక్టు.’సీత రాముడుకి పెనిమిట’ – గ్రెమెటికల్లీ ఈ వాక్యమూ కరెక్టే, కాని సీతారాములు గురించి తెలిసాక, రెండో వాక్యం ఎందుకు కరెక్టుగాదు అన్న ప్రశ్నే ఉండదు కదా! సుమారుగా మన పరిస్థితి అదేనన్నమాట. నేను హిందువును గాబట్టి, ఇటు నుంచి ప్రశ్నించుకోవటం సబబు.

@praveen: ఆస్తికుల కోరికలని ఈడేర్చటంలో దేవుడు బిజీగా ఉన్నాడు. ఇప్పుడు నాస్తిక డిమాండ్లు చూడమంటే ఎలా? ( ఇది జోకు. నవ్వి వదిలేయాలి)

@sri: నేనేదో తెలుగు ఐడెంటిటీ, ఇండియన్ ఐడెంటిటీ అంటుంటే మీరేంటండీ నా ఐడెంటిటీ మీద బడ్డారు? 🙂 About పేజిని చూడండి. ఐనా, ఉత్త ’శ్రీ’ అని రాస్తే, మాకు మాత్రం మీ వివరాలు ఏం తెలుస్తాయి? ఇప్పటికి నాలుగు ’శ్రీ’ లొచ్చారు నా బ్లాగుకి!  ఆ వివరాలన్నీ అక్కర్లేదు. మీకు ఎలా అనిపిస్తే అలా రాయండి. చిరాకేస్తే, పబ్లిష్ చెయ్యనంతే కదా 🙂 ఇంకోటి  – నేను ఫ్రొఫషల్ రచయితను కాదు. ఈ రాతలతో డబ్బు సంపాదించటం తెలీక! డబ్బుకై రాయవలసి వస్తే, జాబ్ “ప్రెజర్” అయిపోయి, “ప్లెజర్” మాయమైపోతుందన్న భయం! ఇంతకీ చేయి తిరిగిన రచయితలా రాస్తున్నానంటారా!? థాంక్యూ.

@anon: I thought it could be my  silliest post ever,  when i was publishing it. రాజకీయలగాళ్ళకు తెలుసు, చేస్తోందే రాజకీయమని. దేవుని భక్తులకీ రాజకీయమంతగా పట్టదు. then, where am i driving at? ఆ క్లారిటీ మీ కామెంటుతోనే వచ్చింది. నిప్పులో నెయ్యి వేసినవారు మీరే! థాంక్యూ.

>> ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు
చెప్పుకోలేం. అలా అన్ని కాన్వర్సులూ సాధ్యం కాకపోవచ్చు. పైన ఆకాశరామన్నకు చెప్పినట్టుగానే.

>> మీరు చెప్పింది రాజకీయం.
Nope. ఏది రాజకీయం? ఏది దైవ భక్తి? అన్న క్లారిటీ కోసం ప్రయత్నించాను.

>> ఎవరికి వారు తమ తమ మతవిశ్వాసాలకు ఆచరించటం తో పాటు, ఇంకొకడి మతంపై బురద చల్లకుంటే చాలు.
ఈ “పరమత సహన”మే మిమ్మల్ని “సెక్యులరిస్టు”లా భావించుకునేలే చేస్తోంది తప్ప,  హిందువులా జీవించనివ్వడం లేదు.

>>అందరూ ఒకరే ఐనపుడు, హిందూ పేర్లనే వాడుకోవచ్చు కదా, అల్లా అనే ఎందుకు అనాలి?
ఇద్ది అసలు పాయింటు. అల్లా అనేది “హిందూ పేరు” కాదని ఎందుకు భావిస్తున్నారు మిత్రమా? రాముడు, శివుడూ, షిర్డీసాయిబాబాలను హిందూ దేవుళ్ళలా భావించగలిగినప్ప్డు, అల్లాని ఎందుకు హిందూ పేరుగా చూడలేకపోతున్నారు? ఎన్ని దేవుళ్ళున్నా అంతా ఒకటేనని తెలిసీ, కొందరినే “హిందు దేవుళ్ళు”గా ఎందుకు భావిస్తున్నారు? “దేవుడు”లో అందరినీ ఎందుకు కలపటం లేదు!?

*************************

“తిరుగులేని దేవుడు తిరుమలరాయడు”

కొండమీంచి కిందికి వస్తున్నప్పుడు కనపడే బోర్డుల్లో ఇదొకటి. నాకు గుర్తున్నంతలో లైను అదే. దీని మీనింగ్ ఏంటి? నేను నెక్స్టు వెళ్ళబోతున్న శ్రీకాళహస్తిలో శివుడు బేకార్ గాడనా? కాణీపాకంలో వినాయకుడు వేస్టనా? అలమేలుమంగాపురాలు, గోవిందరాజుదేవాలయాలు ఇక వెళ్ళక్కర్లేదనా? మరి బాలాజీ చాలా “ఫవర్‌ఫుల్ గాడ్” కదండీ. ఆల్రెడీ దర్శించేసుకున్నాం గా! :))

సరే పై ఎక్జాంపుల్ బాలేదు.అద్వైత శంకరులు శివానందలహరిలో  శివుడిని “ఆల్ పవర్ ఫుల్ గాడ్” చేస్తారు ఇలా :

సహస్రం వర్తంతే జగతి విబుధా: క్షుద్రఫలదా:
న మన్యే స్వప్నేవా తదనుసరణం తద్కృత ఫలం
హరి బ్రహ్మాదినామపి నికటభాజా మశులభం
చిరం యాచే శంభో శివ తవ పదాంభోజ భజనం

ఎట్‌లీస్టు, నాకు చెప్పినవాళ్ళైతే ఇలాగే చెప్పారు – హరి బ్రహ్మాదులకు సైతం దొరకని నీ పదాంభోజ భజనాన్ని ఇవ్వయ్యా అంటున్నాంట! మరి దీన్నేమంటారు? ఇప్పుడు శంకరులు శివుడిని ఓ మెట్టు ఎక్కువ పైన బెట్టి, మిగితా దేవుళ్ళని సబ్ ఆర్డినేట్ చేశాడా? అసలు  ఇంకో ప్రైమరీ క్వెశ్చనూ వేసుకోవచ్చు. అద్వైతం చెప్పిన ఆయన, అన్ని స్తోత్రాలెందుకు రాశాడు? అని.కానీ ఇప్పుడొద్దులెండి.

ప్రతివాళ్ళకీ ఓ ఇష్టదైవం ఉండొచ్చు. ఇక – నువ్వంతటోడివి, ఇంతటోడివి, నీ అంతటోడు లేనే లేడెహె, నీవు తప్ప ఇతప్పరంబెరుగ మన్నింపగదే, కావవే, సంరక్షించు భద్రత్మకా! అంటూ ప్రార్ధిస్తాం. భజిస్తాం – మన భక్తిలోనే! అంత మాత్రాన వాళ్ళ మధ్య శంకరులు భేదం సృష్టిచ్చినట్టు కాదు గదా! దీన్ని సెట్ చేసుకోవడానికే మనలో చాలా మంది బుర్రలు పగలుగొట్టుకున్నారు – కొట్టారు – కుంటున్నారు.

మరదే విధంగా,  నిరాకార నిర్గుణ  పరబ్రహ్మ – అల్లా అంటూ మస్జిద్‌లో కూర్చుని ఎందుకు ఉపాసించటం రాలేదు? ఎందుకు అది “హిందూ పేరు” కాలేదు? అదీ ప్రశ్న. అదీ నేనాలోచిస్తోంది. చాలా సింపుల్ ఆన్సర్ – మనకి ఎవ్వరూ అలా అల్లాని అలవాటు చెయ్యలేదుగాబట్టి. ఇప్పుడు చేసుకుంటే సరి!

అలా ఎందుకు అలవాటు చేసుకోవాలి? ఇందులో ఏదో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది, ఎవరినో ఇంప్రెస్ చెయ్యాలని చూస్తున్నానంటారు కదా? 🙂  అది నాకర్ధంకాకపోయినా, కాసేపు నాకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉందనుకుందాం. ఒకే.

మరి ఏ వెస్టెడ్ ఇంట్రెస్టు “తిరుగులేని దేవుడు తిరుమలరాయడు” అని చెబుతోంది?
మరి ఏ వెస్టెడ్ ఇంట్రెస్టు “హరి బ్రహ్మాదినామపి నికటభాజా మశులభం, శివ పదాంభోజ భజనం” మనిపిస్తోంది?
మరి ఏ వెస్టెడ్ ఇంట్రెస్టు షిర్డీ సాయిబాబా గుళ్ళు కట్టిస్తోంది? ఏ వెస్టెడ్ ఇంట్రెస్టు షిర్డీసాయి అష్టోత్తరాలని , స్తోత్రాలని రాస్తోంది!? ఖచ్చితంగా ఇవి అతి ప్రాచీన సనాతన సంప్రదాయం కాదు. తర్వాతే ఎవరో రాశారు. ఎందుకు రాశారు? మీకు వేరే ఏ కాంప్లికేషన్సు తెచ్చుకునే ఉద్దేశ్యం లేకపోతే, ఇది ఆయా స్తోత్రాలను రాసిన వారి భక్తే అని ఒప్పుకు తీరాలేమో?.

నిజానికి ఇన్ని షిర్డి సాయబాబా గుళ్లుకి కారణం భక్తే అంటే నేనమ్మను. It might have some thing to do with Endowment Act about which i have no idea.  కానీ, సాయిబాబా గుడికి వెళ్ళటం మానను. మరి ఆయన కాళ్ళుపట్టుకొని ఎన్ని వేడుకోళ్ళు వినిపించాలి? నిర్లజ్జగా దేబిరించుకునేది దేవుడి దగ్గరే కదా! వెస్టెడ్ ఇంట్రస్టుతో దేవుడిని ఎవడో సృష్టించినా, భక్తుడికి మాత్రం భగవంతుడు కావాలి! చిట్టచివరికి భగవంతుడూ భక్తుండుంటేనే ఉంటాడు!ఎనివే, మనం ఎటో పోతున్నాం.

వెనెక్కొస్తే, అల్లాని ప్రార్ధించుకోవటం భక్తిలో భాగమే. ఐతే, ఇది హిందువులందరికీ ఎందుకు  అంటగట్టడం? అని అడిగితే, – ఏ కారణం వల్ల  శివుడు, విష్ణువు, గణపతి, షిర్డీసాయిబాబాలందరిని ఒకే రకంగా కొలవటం మనకి అంటగట్టారో/ లేక అలవర్చుకున్నామో ,  అదే కారణంతో ఇప్పుడిది అంటగట్టాలంటాను. లేదా ఏ కారణం వల్ల ఇది మనకి అంటగట్టలేదో / లేక / గట్టలేకపోయారో తేల్చుకుందాం అంటాను.

మనం ముస్లింగా పుడితే,  అనేకత్వం వైపు పయనిస్తామేమో!
మనం హిందువుగా పుడితే, ఏకత్వం వైపు పయనిస్తామేమో!
లేక –
అనేకత్వంతోటి మమేకమైపోతేమేమో!

come out anon! Tell me my friend. What makes you a hindu? and అల్లా అంటే భగవంతుడికే మరో హిందూ పర్యాయపదంగా ఎందుకు భావించలేకపోతున్నావు !?(న్నారు – నో డిస్‌రెస్పెక్ట్).

************
 ఎవడి మతాన్ని వాడు ఫాలో ఔతూ  ఉండమనేదే నా సలహా. ఈ చర్చంతా కూడా, అలా ఆచరిస్తున్నందు వల్లే.

ప్రకటనలు
Explore posts in the same categories: Uncategorized

5 వ్యాఖ్యలు పై ““తిరుగులేని దేవుడు తిరుమలరాయడు””

 1. xyz Says:

  “come out anon! Tell me my friend. What makes you a hindu? and అల్లా అంటే భగవంతుడికే మరో హిందూ పర్యాయపదంగా ఎందుకు భావించలేకపోతున్నావు !?(న్నారు – నో డిస్‌రెస్పెక్ట్).”

  He he he he (imagine this as ROTFL)

  Do muslims agree if we name the one the only GOD as “Rama”, just check once? (no disrespect)

 2. rayraj Says:

  ఓరినా xyzడూ, ఈ ప్రశ్న ముస్లింలను అడగకూడదు. అది ఎక్స్‌ప్లైన్ చేశాను.
  పోనీ మీ తసల్లీ కోసం: ” వాళ్ళు ఒప్పుకోరని తెలుసు. ఎందుకో కూడా తెలుసు.”

  ఐనా ఇది ఒకళ్ళ ఒప్పుకోలుతో సంబంధించిన విషయం కాదు. బహుళంగా అన్ని దేవుళ్ళలోనూ ఉన్న మీ దేవుడు , ’అల్లా’ అని మీ చేత పిలుపించుకోడానికి ఎందుకు భయపడుతున్నాడు? అది ప్రశ్న.

  మీరు ఊహిస్తున్న ముస్లిం స్వయంగా మీరే!. నేను హిందువునవ్వటం వల్ల మిమ్మల్ని “సహిస్తున్నా”.

  “ముందు నీ సంగతి చెప్పేడవ్వోయ్. మళ్టిపల్ దేవుళ్ళుంది నీకు గదా? నీ దేవుడు ఎందుకింత కురచగా ఉన్నాడు?”

  “నా దేవుడు అల్లా అని కూడా పిలుపించు కుంటున్నాడు.”

  @all: మళ్ళీ “ఈ ప్రశ్న ముస్లిం నడుగు” అని కామెంట్ వేస్తే ప్రచురించను.

 3. manohar ch Says:

  “వాడిమతం వాడిది, మనకు వాడితో పని గానీ వాడి మతం తో కాదుగా , వాడు ఏ మతం ఐనా చేరాల్సింది పరమపదానికేగా” అన్నది చాలామంది ఆలోచన.ఈ తరం లో ఎవరూ మతం తో విభేదించడం లేదు, ఎందుకంటే ఏ మతమూ ఎక్కువ కాదు,ఏ మతమూ తక్కువ కాదు.తమకు ఇష్టం వచ్చిన మతాన్ని అవలంబించడమూ తప్పుకాదు. ఐతే ఈ అవలంబించడమనేది ఆ మత సిద్ధాంతాలు నచ్చి ఐతే సమస్యే లేదు.అలా ఐతే మత మార్పిడి అనేదే ఉండదు.
  ఈ టైటిల్ మీరు అందరినీకలిపి చెప్తున్నారా లేక కేవలం హిందువులకే చెప్తున్నారా అనేది నాకు అర్ధం కాలేదు(క్షమించండి). ఒకవేళ అందరినీ కలిపి చెప్తే అప్పుడు జావేద్ గారికి మీరు చెప్పిందేమిటి, ఇస్లాం లో చెప్పారు కాబట్టి ఆ మతానికి ఒక్కడె దేవుడు అంటే మెచ్చుకున్నారు, నాకర్ధం కాలేదు. అవతవాళ్ళ పరిధులూ పరిమితూలూ బాగానే చెప్పారు. ఐతే మీకు సనాతన ధర్మంలో ఒక్కడే దేవుడు అని చెప్పలేదా, లేక మీరు గమనించలేదా? ఒక్కడే దేవుడు కాబట్టే ప్రతీదాన్నీ దేవుడి ప్రతిరూపంగా భావించారు,కొలిచారు, కాలక్రమంలో కనపడే భౌతిక రూపాన్ని కూడా ఆపాదించి ఆరాధించడం వల్ల పలు మూర్తులుగా పూజించడం జరిగింది. ఈ పరిమితిని (basic premisis of sanatana dharma)మీరు మర్చిపోయారనుకుంటాను.అలా చూస్తే మనకూ ఒకడే దేవుడు, మన basic premesis కూడా will undergo a change కాబట్టి మీ టపానే తప్పనాలా? అప్పుడు నేను కూడా జావేద్ గారిలాగే హిందువులు కూడా ఒక్కదేవుడినే పూజించాలని చెప్పారు, కాబట్టి ఒంకొకరిని పూజిస్తే వాళ్ళు హిందువు కాదు అని చెప్పాలా?
  ఏ మతం లో ఐనా దేవుడు ఒక్కడే అది హిందూ అయినా,ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా. ఉన్నది నేనొక్కణ్ణే అన్నాడు కృష్ణుడు, నేనే అన్నిరకాలుగా ఉన్నానన్నాడు,నేనే అన్నిపనులూ చేస్తానన్నాడు. రోగాన్ని బట్టి మందూ,భోజనం కావాలి అలాగే ఎవరి మనః ప్రవృత్తిని బట్టి వాళ్ళు అరాధించగల రూపంలో ఆరాధించుకోవడానికి మహర్షులు మార్గం ఏర్పరచారు. వివేకానందులు చికాగో లో ఒక మాట అన్నారు గుర్తుందా.
  Unity in variety is the plan of nature, and the Hindu has recognized it. Every other religion lays down certain fixed dogmas and tries to force society to adopt them. It places before society only one coat which must fit Jack and John and Henry, all alike. If it does not fit John or Henry he must go without a coat to cover his body. The Hindus have
  discovered that the absolute can only be realized, or thought of, or stated through the relative, and the images,crosses, and crescents are simply so many symbols – so many pegs to hang spiritual ideas on. It is not that this help is necessary for everyone, but those that do not need it have no right to say that it is wrong. Nor is it compulsory in
  Hinduism.

  తిరుగులేని దేవుడు తిరుమలరాయుడు గురించి మీరు అన్నారే అది మీకు తెలియక అన్నారో, లేక బుద్ధిపూర్వకంగానే అన్నారో నాకు అర్ధం కాలేదు. ఎందుకంటే స్వయంభూ క్షేత్రాల్లో ఆ దేవుడిని తప్ప ఇంకొకరిని అరాధించకూడదు కూడా,
  మీరు చదువుతానంటే మీకు ఒక కధ చెప్తాను, నిజంగా జరిగింది అంటారు.
  ప్రతాపరుద్రుడికి రోజూ ఒక బంగారు శివలింగానికి అభిషేకం చేసి దాన్ని ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం అలవాటట.ఐతే ఒకసారి అహోబిళ క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉదయం పూజకి శివలింగం తయారు చేస్తే పూజ మొదలుపెట్టేసరికి అది నరసింహ మూర్తిగా మారిందట. కంసాలిని తిట్టి మళ్ళి మళ్ళి తయారు చేయించాడు, ఎన్నిసార్లు చేయించినా అదే నరసింహ మూర్తి. అప్పుడు ఆయనకి తెలిసి వచ్చిందట, (ఎవరో చెప్తే) ఈ క్షేత్రం లో నరసింహ మూర్తిని తప్ప అన్యం ఆరాధించడం కుదరదు, అంతా ఆ నరసింహ స్వరూపమే అని. అప్పుడు ఆ నరసింహ స్వరూపాన్నే తీసుకుని కొండ పైకి వెళ్ళి పూజ చేస్తే ఆ మూర్తి లోనుండి పరమశివుడు ఆవిర్భవించాడు.
  ఈ కధ మీరడిగిన తిరుగులేని తిరుమలరాయుడు కి సమాధానంగా పనికొస్తుందేమో చూడండి.
  ఇక మీరన్నట్లే అద్వైతం చెప్పిన వాడు మళ్ళి ఆరుమతాలు ఎందుకు స్థాపించాలి , అన్ని స్తోత్రాలు ఎందుకు రాయాలి అన్నదానికి అద్వైతం అన్నదాన్ని కొంత జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలని నా అభిప్రాయం.అద్వైతం అంటే అంతా ఒక్కటే రెండవది లేదు అని కదా. అంటే మనం ఎవరిని ప్రార్ధించినా అది ఆ ఒకే మూర్తిని అని అనుకోవచ్చుగా. అలాంటప్పుడు ఆయన చేసిన స్తోత్రాలు మనబోటి వాళ్ళకి అద్వైతం అంటే సరిగ్గా చెప్పడానికేమో కావచ్చుగా.?”ఏకశ్శబ్దః సమ్యక్ జ్ఞాతః” అన్నది కూడా ఈ విశయాన్ని ధృవపరుస్తుందని నా అభిప్రాయం. దానర్ధం ఒక్కటి నేర్చుకో చాలనా,లేక ఎన్ని నేర్చుకున్నా అన్నీ ఉన్న ఆ ఒక్కదాన్ని తెలుసుకోవడానికి సాధనాలు,అది బాగా తెలుసుకో అనా?
  కలుపుకుపోవడం అంటే కనపడకుండా పోయేంతగా కాదేమో , ఆలోచించండి…. నిజానికి ఎవరూ ఎవరినీ కలుపుకుపోలేదు(నిజంగా నిజం) . మీరన్నట్టు కలుపుకు పోయి ఉంటే ఈ పాటికి మీరన్నట్టు అల్లా భజనలు, క్రీస్తు హారతులు వచ్చేసేవి. మన మానాన మనం బతుకుతుంటే వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళ పద్ధతులూ,మన పద్ధతులూ ఒకటి కాదు, కొంచెం సర్దుకుని చోటిచ్చారు, కలుపుకుపోయింది సంఘంలో మాత్రమే. అందరూ ఎవరి మానాన వాళ్ళు బతికారు. కొంతమంది అధికారం ఉంది కాబట్టి మేం చెప్పినట్టే బతకాలి అన్నారు. మొత్తంగా అలా కుదరలేదు. ఇప్పటికీ ఎవరి మానాన వాళ్ళమే బతుకుతున్నాం. ఏమంటారు?

 4. rayraj Says:

  కొంచెం బిజీ అయిపోతున్నాను. As usual, ఓ seperate postతో వస్తాను.It might take two days.

  ఈ లోగా, మీకు క్లారిటి కోసం:
  >>ఈ టైటిల్ మీరు అందరినీ కలిపి చెప్తున్నారా లేక కేవలం హిందువులకే చెప్తున్నారా అనేది నాకు అర్ధం కాలేదు(క్షమించండి).

  – టైటిల్ కాదు. ప్రశ్న: What makes you a hindu? అల్లా = దేవుడు. అంతే! ఐతే, అది హిందూ భగవంతుడుకి, దేవుడికి పర్యాయపదం ఎందుకు కాలేదు? అది హిందూ పేరు ఎందుకు కాలేదు?

  తెలిసో తెలీకో దీనికి “మీ” సింగిల్ లైన్ సమధానం, ఈ లాంగ్ కామెంటులోనే చెప్పారు. ఐనా, మరింత క్లారిటీ కోసం – పైన మీ వాక్యంలో ’నాకు అర్ధం కాలేదు’ అని ఉన్నందుకు :
  – హిందువుగా హిందువులనే అడుగుతున్నాను. అంటే – ప్రశ్నకి బేసిక్ ప్రిమైజ్ సనాతన ధర్మమే!

  కావలంటే – గత రెండు మూడు టపాలు మళ్ళా చదువుకొని , అప్పుడు ఇంకా ఏమన్నా అడగదలుచుకుంటే అడిగే సమయం ఉంది.

 5. manohar ch Says:

  మరి ఆ సనాతన ధర్మం లో దేవుడు ఒక్కడే అని ఉన్నది కదా, ఇంకా ఏ పేర్లతో పిలవాలి అన్నది మహర్షులు నిర్ణయించారు. నేను అడుగుతున్నది అదే, ఒక పక్క ఎవడిమతాన్ని వాడు ఆచరించమనే నా సలహా అంటున్నారు. మళ్ళీ పక్క మతం లో దేవుడిని పిలిచే పేరుతో నీ దేవుడిని ఎందుకు పిలవకూడదు అంటున్నారు. నేను అర్ధమ్ కాలేదన్నది అదే. ఇప్పుడు అలవాటు చేసుకోమంటున్నారు, ఎందుకు అని అడుగుతున్నాను. అలవాటు చేసుకోవడమంటే కొత్తగా మొదలుపెట్టడమేగా, మరి ఆ పని ముస్లిమ్‍లు చేసినా ఒకటే కదా, వాళ్ళూ ఇప్పుడూ కొత్తగా మొదలుపెట్టచ్చు తప్పేముంది, కానీ మీరు బేసిక్ ప్రెమిసిస్ ,ఏదేదో అంటూ దానికి పుల్‍స్టాప్ పెట్టేసారు. మీరు హిందువు అయినంత మాత్రాన హిందువులనే అడుగుతాననడం సరి కాదేమో, మీరు హిందువు, మీకు అల్లాని కలుపుకు పోవాల్సిన అవసరం ఏమొచ్చింది. నేనూ హిందువునే కాబట్టి సాటిహిందువు అయిన మిమ్మల్నే అడగాలి. కలుపుకుపోతే వచ్చే నష్టమేంటి అని అడుగుతున్నారు, కలపకపోతే వచ్చే నష్టమేంటి అనే దానికి కూడా సమాధానం చెప్పండి కొంచెం. అసలు చెప్పాలంటే అల్రెడీ చాలామంది హిందువులు దర్గాలకీ వెల్తారు, బాబాల దగ్గర తాయెత్తులూ కట్టించుకుంటారు. నిన్న నేనన్న ఎవరిమానాన వాళ్ళు బతుకుతున్నారు అన్న దాని అర్ధం ఒకరకంగా ఇది కూడా , పక్కింట్లో హిందువు ఒక దర్గా కి వెల్తే వాడినేమీ కత్తులతో పొడిచి చంపెయ్యట్లేదే, వాడివల్ల మతం నాశనమౌతుందని ఆపసోపాలు పడట్లేదే, వాడికి అందులో గురి కుదిరింది ,ఎవరైనా భగవంతుడే కదా అందుకే వెల్తున్నాడు అనుకుంటాం అంతే. అప్పుడు మీరడిగిన “అల్లా అంటే భగవంతుడికే మరో హిందూ పర్యాయపదంగా ఎందుకు భావించలేకపోతున్నావు ” అన్న ప్రశ్నకి అర్ధం హిందువు దేవుడు అనే ప్రతి చోటా అల్లా అని రాస్తేనే అల్లాని భగవంతుడిగా భావించినట్టా, ఇంతమంది భగవంతుడిగా భావించకుండానే దర్గాలకూ, బాబా ల దగ్గరికి వెల్తున్నారా? కొంచెం క్లారిఫై చెయ్యగలరు.

  అల్లాని గానీ, దేవుడిని గానీ, ముస్లిం లను గానీ కించపరచే ఉద్దేశ్యం నాకు లేదు, కేవలం రేరాజ్ గారికి చెప్తున్న సమాధనం మాత్రమే.


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: